Wednesday, June 8, 2011

సాగర దినోత్సవం , worls Ocean Day


  • https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh5GruZEqSGgjkUlSTQTr-bZIR0NZxlUT2JWwgp5NCQdPqpZTnfOaaq8ExNQMMZkGlrn0W2n8FDy5QQ6AiiaN3wgWBgidCz2gbHRM_lV_E2oUXuNxEBOu8GTX2_F2uipuBVeOPtxTEonAy2/s1600/Seashore-Coconut+tree.jpg

గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (june 08) -ప్రపంచ సాగర దినోత్సవం - గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

మానవజీవితం నీటితో ముడిపడి ఉన్నది . జీవులు ఉద్భవించింది , పరిణమించింది నీటి ఆదారముగానే . జీవుల శరీరము లో 70-80 శాతము నీరే ఉంటుంది . సముద్ర సంపదను తన ఆర్ధిక ప్రగతికి పునాదిగా మార్చుకున్నాడు మనిషి . నేడు ఒక అంచనా ప్రకారము ప్రపంచ జనాబా లో 25% సముద్రతీర ప్రాంతాలలోనే నివశిస్తున్నారు . నీరులేనిది జీవుల మనుగడ ఉండదు .. . ఏప్రాణీ బ్రతకదు .

సముద్ర జలం వల్ల లబ్దిపొందుతూ వచ్చిన మానవుడు ఆ జాలకు తాను కలిగిస్తున్న నష్టం గురించి గాని , సముద్రజలాలలో వస్తున్న మార్పు గిరించిగాని అంతగా పట్టించుకోవడంలేదు . తన చర్యల వల్ల కాలుష్యము అధికమై భూతాపము పెరిగి ధృవాలలోని మంచు కరిగిపోతుందని , సముద్రమట్టము పెరుగుతుందని గమనించిన తర్వాత మానవుడు మేల్కొనక తప్పలేదు . నాటివరకు పర్యావరణమంటే అడవులు , నదులవరకే అనుకుని వాటికి సంబంధించిన అవగాహన మాత్రమే కల్పిస్తున్న అంతర్జాతీయ సంస్థలు సముద్రజలాల గురించి ప్రజలకు తెలియజప్పాల్చిన అవసరాన్న్ని గుర్తించాయి .

1992 లో బ్రెజిల్ లోని రియో డి జనీరోలోధరిత్రి సదస్సు జరిగింది . ఆ సందర్భముగా సముద్రాలమీద అవగాహన పెంచాలని నిర్ణయించారు . నాటివరకు తుఫాన్‌ లును మాత్రమే చూసిన తీర ప్రజలకు 2005 లో వచ్చిన సునామీ ... అది సృష్టించిన బీభత్సం తర్వాత ఇక సాగర దినోత్సవం ద్వారా సముద్రాలమీద ప్రజల ఆలోచనలను మార్చాల్సిన అవసరము ఉందని తీర్మానించుకున్నారు . 2008 లో ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మాణము ద్వారా 2009 నుండి ప్రపంచ సాగర దినోత్సవ నిర్వహణ ప్రారంభమైంది . నాటినుండి ప్రతియేటా జూన్‌ 08 న " సాగరదినోత్సవం " గా జరుపుకుంటున్నారు .



సముద్ర విశిష్టత :
భూగోళము మీద మూడింట రెండు వంతులు మేర సముద్రము ఆవరించివుంది . విస్తారమైన ఉప్పునీటి భాగాన్నే సముద్రమంటారు . మానవులు వినియోగించే అధిక శాతం ప్రోటీన్లు సముద్రజీవులైన చేపలు , రొయ్యలు మొదలగు మత్స్యసంపద ద్వారా వస్తున్నదే. వాతావరణంలో మార్పులను మానవ నివాసానికి అనుకూలముగా మారుస్తున్నది సముద్రాలే. మానవులకు నీటివనరులను అందించే వర్షాలు కురిసేది సముద్రజలాలు నీరు ఆవిరవడంవలనే . గాలి వీస్తున్నది , ఉష్ణోగ్రతను నియంత్రిస్తున్నది సముద్రాలే . మనిషి సహజవాయువు , ముడిచమురు నిక్షేపాలును సముద్రగర్భము నుండే పొందుతున్నారు . సముద్ర జీవులను ఆహార , ఔషధ తయారీ లో వినియోగించడం జరుగుతుంది .

వ్యాపారపరం గా 90 శాతము ప్రపంచ వస్తురవాణా జరుగుతున్నది సముద్రం ద్వారానే . ప్రపంచదేశాల మధ్య జరిగే వార్తారవాణాలో 50 శాతము పైన సముద్రము లోపల వేసిన కేబుల్స్ ద్వారానే జరుగుతున్నది . సముద్రం నుండి ఏర్పడే అలలనుండ్ విద్యుత్ తయారుచేయబోతున్నారు .

ఓషన్స్ - సీస్ (Oceans and Seas):
మనం సముద్రాలను ఓషన్స్ (మహాసముద్రాలు ) అని , సీస్ (సముద్రాలు ) అని పిలుస్తుంటాము . భూమి మీదైతే సరిహద్దులను గీసుకుని ఖండాలు , దేశాలు గా విభజించి గుర్తించేందుకు వీలుంటుంది . ... కాని సముద్రజలాల మీద అటువంటి సరిహద్దులు గీసే అవకాశం లేదు . పైగా ఈ జలాలన్ని మొత్తం కలిసిపోయి కనిపిస్తుంటాయి. అయినా ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్‌ వారు జలభాగాన్ని మొత్తం ఐదు మహాసముద్రాలు గా విభజించారు . మహాసముద్రాలను సముద్రాలుగా విభజించవచ్చును . మహాసముద్రాలు తీరప్రాంతానికి బాగా దూరంగా వున్న విశాలమైనవైతే , తీరాన్ని ఆనుకుని వున్న లోతు తక్కువగా వుండే నీటిభాగాన్ని సముద్రాలు అంటారు . ఈ సముద్రాలకు సమీప భూభాగం పేరును పెడుతుంటారు . మనదేశానికి తూర్పున ఉన్న బంగాళాఖాతం , పశ్చిమాన ఉన్న అరేబియా సముద్రము . . . హిందూమహాసముద్రములోని భాగాలే . ఇలా తీరప్రాంతాన్ని అనుసరించి మొత్తం 100 సముద్రాల పైనే ఉన్నాయి . వీటికి తోడుగా చుట్టూ భూమి కలిగివున్న ఇతర సముద్రాలు సుమారు 4 వరకూ ఉన్నాయి . సమీప భూమిని బట్టే కాక సముద్రజలాల రంగును బట్టి , ఇతర బౌగోళిక అంశాల్ని బట్టి కూడా సముద్రాలకు పేరులు పెట్టబడ్డాయి. ఉదాహరణకు అరేబియాకి పశ్చిమగా కనిపించే ప్రాంతం రెడ్ సీ అని పిలవబడగా , ఇతర ప్రాంతాలలో ఎల్లో సీ , వైట్ సీ అనేవి ఉన్నాయి . జపాన్‌ సీ , చైనా సీ , కరేబియన్‌ సీ , నార్త్ సీ అంటూఅనేకం ఉన్నాయి . ఇవేకాక సముద్రభాగాలను ' బే(bay)' అని , జలసంది (Straight) , నదీసాగర సంగమ ప్రాంతం , లగూన్‌ లు అంటూ పలు చిన్నచిన్న ప్రదేశాలు గానూ పిలుస్తారు . ఇవన్నీ ఆ ప్రాంతంపు సముద్రపు లోతు , లవణీయతలను బట్టి పెట్టిన పేర్లు .

సముద్రం లోతు (సముద్ర అఖాతం):
సముద్రం లోతు ఒక్కోక్క ప్రదేశములో ఒక్కోలా ఉంటుంది . మహాసముద్రాల సరాసరి లోతును 3000 మీటర్లుగా అంచనా వేయగా , సముద్రాలలోతు 1250 - 1400 మీటర్లు గా లిక్కకట్టేరు . ప్రపంచములో నేటివరకు కనుగొన్న అత్యంత లోతైన సముద్ర ప్రాంతం " మేరియానా ట్రెంచ్ " ఇక్కడ సముసముద్రం లోతు దాదాపు 11 కిలోమీటర్లు . ఇంతలోతున్న ఈ మహాసముద్రాలలోమి ఉపరితలము నుండి లోపలకు పై ఎత్తున ఉన్న 200 మీటర్ల మేర మాత్రమే సూర్యకాంతి చొచ్చుకు పోగలుగుతుంది . దాని కిందంతా చిమ్మచీకటే . కన్ను పొడుదుమున్నా కానరాని ఆ లోతు సముద్రాన్నే ''సముద్ర అఖాతము ''అంటారు .

ఆటుపోట్లు :
మహాసముద్రాలైనా , సముద్రాలైనా వాటికుండే ప్రత్యేక లక్షణం నిరంతర చలనం . సముద్రజలాలు ఒక్క క్షణము కూడా నిలకడగా ఉండవు . నిరంతరం ఏర్పడే అలలు , అంతుచిక్కని లోతు సముద్రజలాల ప్రత్యేకతలు . సూర్య చంద్రుల ఆకర్షణ శక్తి వల్ల సముద్రపు నీరు పైకి లేస్తుంది . అలా లేచిన నీటిని భూమి ఆకర్షణ శక్తి తనవైపు ఆకర్షిస్తుంది . అందువల్ల ఆ నీరు క్రమంగా ఒక అల రూపం లో సముద్రతీరం వైపు సాగుతూ వస్తుంది .

  • మహాసముద్రము -------------- విస్తీర్ణము (చ.కి.మీ.)---------------గరిష్టలోతు (అడుగులు).
  • పసిఫిక్ -----------------------15,55,57,000--------------------35,827.
  • అట్లాంటిక్ ---------------------7,67,62,000----------------------30246.
  • హిందూ-----------------------6,85,56,000----------------------24,460,
  • దక్షిణ (అంటార్కిటిక్ )------------2,03,27,000----------------------23,737,
  • ఆర్కిటిక్ ----------------------1,40,56,000----------------------18,456,
మహా సముద్రాలలో సముద్రాలు :
ఐదు మహాసముద్రాలతో కలిసి మొత్తం 100 నుండి 110 సముద్రాలను గుర్తించవచ్చును . వీటిలో అట్లాంటిక్ లో అత్యధికంగా 40 , ఫసిఫిక్ లో 33 , ఆర్కిటిక్ లో 17 , అంటార్కిటిక్ లో 11 , హిందూమహా సముద్రము లో 9 ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి . ->
ఆంటార్కిటిక్ మహాసముద్రం :
  1. బెల్లింగ్ షాసెన్‌ సీ ,
  2. అముండ్ సెన్‌ సీ ,
  3. రాన్‌ సీ ,
  4. వెడ్ సీ ,
  5. స్కాటియా సీ .
ఆర్కిటిక్ మహాసముద్రం :
  1. బేరెంట్స్ సీ ,
  2. బ్యూ ఫోర్డ్ సీ ,
  3. చుక్చీ సీ ,
  4. తూర్పు సైబేరియన్‌ సీ ,
  5. గ్రీన్‌ ల్యాండ్ సీ ,
  6. కార సీ ,
  7. లాష్టివ్ సీ ,
  8. వైట్ సీ ,
  9. లాబ్రడార్ సీ .
పసిఫిక్ మహాసముద్రం :
  1. సెలెబెస్ సీ ,
  2. కోరల్ సీ ,
  3. తూర్పు చైనా సీ ,
  4. ఫిలిప్పిన్స్ సీ ,
  5. సీ ఆఫ్ జపాన్‌,
  6. దక్షిణ చైనా సీ ,
  7. తాస్మాన్‌ సీ ,
  8. సులు సీ ,
  9. ఎల్లో సీ ,
హిందూమహాసముద్రం :
  1. బంగాళా ఖాతం ,
  2. అరేబియన్‌ సీ ,
  3. అండమాన్‌ సీ ,
  4. లక్కదీవ్ సీ ,
  5. మన్నార్ సీ ,
  6. ఓమన్‌ సీ ,
  7. ఎర్రసముద్రము ,
  8. పర్షియన్‌ గల్ఫ్ ,
  9. బర్మా సముద్తం ,
అట్లాంటిక్ మహాసముద్రం :
  1. నార్త్ సీ ,
  2. మధ్యదరా సముద్రం ,
  3. డెడ్ సీ ,
  4. కాస్పియన్‌ సీ ,
  5. కరేబియన్‌ సీ ,
  6. గల్ఫ్ ఆఫ్ మెక్షికో ,
  7. సర్గాసో సీ ,
సాగర సంపద :
సాగర జీవసంపద విశేషమైనది . సాగరం లో దొరికే జీవ సంపద లో ప్రధాన స్థానము చేపలదే . తరువాత తాబేళ్ళు, తిమింగళాలు , సీల్సు , మున్నగునవి . సముద్రతీనాన్ని ఆధారముగా చేసుకొని లభించే పక్షిజాతి అనేకము . ఇవి కాక కోరల్స్ , మత్యాలు నిచ్చే ఆల్చిప్పలు మున్నగునవి . సముద్రం లో పనికిరాని పదార్ధము లేదు . ఆల్గే వైద్యపరం గా వాడుతారు . సముద్రాలలో గ్యాస్ లబిస్తుంది . ఎన్నో ఆయిల్ రిఫైనరీలుకు ముడి చమురునూ తీస్తున్నారు .

  • =========================================

Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .