గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (మే 17 )
ప్రపంచ టెలీకమ్యూనికేషన్ల దినం (World Telecommunications Day)- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము
మొదటి అంతర్జాతీయ టెలీగ్రాఫ్ యూనియన్ ఒప్పందాన్ని 17-05-1865 లో పారిస్‌లో ఆమోదించారు. ఈ ఒప్పందం గౌరవార్ధం అప్పటినుండి ప్రతియేటా అంతర్జా తీయ టెలీకమ్యూనికేషన్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మార్చి 10, 1876 చరి త్రలో ఓ మైలురాయి. ఈ రోజు అలెగ్జాండర్ గ్రాహంబెల్ తాను రూపొందించిన టెలీఫోన్ ద్వారా మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మా టలు ‘కమ్ హియర్ వాట్సన్, ఐ వాంట్ యూ!’. యూరోపియన్ కమిషన్ అంచనాల ప్రకారం మానవ ఉపాధి అవకాశాల్లో 60 శా తం వరకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో టెలీ ఫోన్ రంగం పై ఆధారపడి ఉండడం విశేషం.
- =========================================
Visit My Website - >
Dr.seshagirirao.com/
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .