15-05-1803వ సంవత్సరంలో.. తల్లిదండ్రులు హెన్సీ, కాల్వేలీ కాటన్ దంపతులకు ఇం గ్లాండ్‌లో జన్మించాడు ఆర్ధర్ కాటన్. 18 ఏళ్ళ వయసులో భారత్‌కు వచ్చిన కాటన్ ఉద్యోగార్ధం మద్రాస్ చేరాడు. ఈస్టిండియా కంపెనీ.. కాటన్‌ను దక్షిణ ప్రాంతానికి చెరు వుల శాఖ ఇంజనీర్‌గా నియమించింది. ఈ యన హయాంలోనే కావేరీ నది ఎగువ ఆన కట్ట, దిగువ ఆనకట్ట నిర్మించ బడ్డాయి. 19వ శతాబ్దంలో ఆంధ్ర ప్రాంతంలోని దుర్భిక్ష పరిస్థితులకు నీటివనరులను సద్వినియోగం చేసుకోకపోవటమే ప్రధాన కారణమని ఆంగ్ల ప్రభుత్వానికి విన్నవించాడు. ధవళేశ్వరం వద్ద గోదావరి పై ఆనకట్ట నిర్మించాలని సంకల్పిం చాడు. 1847లో గోదావరి ఆనకట్ట నిర్మాణం ప్రారంభమై 9 అడుగులు పూర్తయిన తరు వాత వరదలు వచ్చి 22 గజాలు కొట్టుకొని పోయింది. సెలవు పై వెళ్లిన కాటన్ 1850 జూలైలో తిరిగి వచ్చాడు. మేజర్ హోదా నుం డి కల్నల్ హోదా లభించింది. 1852 మార్చి 31 నాటికి గోదావరి ఆనకట్ట పూర్తి చేయిం చాడు. మ ద్రాస్ ప్రభుత్వం కాటన్‌ను ప్రశం సించి మద్రాసు రాజధాని చీఫ్ ఇంజనీర్‌గా ఉన్నత పదవి కల్పించింది. 1860లో ఇం గ్లాండ్ వెళ్లిన కాటన్‌కు విక్టోరియా రాణి ‘సర్’ బిరుదునిచ్చింది. 1899 జూలై 4న కాటన్ మరణించాడు.
- =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .