Sunday, June 5, 2011

ఎన్టీరామారావు జయంతి , N.T.Ramarao Birthday



గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (.....) ఎన్టీరామారావు జయంతి (N.T.Ramarao Birthday) గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము


విశ్వవిఖ్యాత నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు.. కృష్ణా జిల్లా నిమ్మకూరు లో.. వెంకటరామమ్మ, లక్ష్మయ్య చౌదరి దంప తులకు తేది 28 మే 1923లో జన్మించారు. 1947లో ‘మనదేశం’తో ప్రారంభించి 1982 వరకు దాదాపు 292 సినిమాల్లో నటించారు. పౌరాణిక పాత్రధారణలో ఎనలేని నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మార్చి 29, 1982న ‘తెలుగు దేశం’ పార్టీని స్థాపించి.. తొమ్మిది నెలల కా లంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. ఎన్టీరామారావు తెలుగు జాతికి చేసిన సేవలకు గుర్తుగా.. నవంబర్‌ 1న ‘తెలు గు ఆత్మగౌరవ దినోత్సవం’గా జరపాలని ఆం ధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. వీరి పేరు తో 5 లక్షల నగదు బహుమతితో ఒక స్మారక అవార్డును ప్రతి ఏటా ఒక చలనచిత్ర రంగ ప్రముఖుడి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది.

  • =========================================

Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .