Sunday, June 5, 2011

జేమ్స్‌బాండ్‌ జయంతి ,James Bond



గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (.....) జేమ్స్‌బాండ్‌ జయంతి (James Bond) గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము.


జేమ్స్‌బాండ్‌ పాత్ర సృష్టికర్త.. ఇయాన్‌ లాంకస్టర్‌ మే 28, 1908 లో ఇంగ్లాండ్‌లో జన్మించాడు. తొలినాళ్ళలో రాయిటర్స్‌, టైమ్స్‌, సండే టైమ్స్‌ పత్రికల్లో పనిచేశాడు. ‘ఫీల్డ్‌ గైడ్‌ టు బర్డ్‌‌స ఆఫ్‌ వెస్టిండీస్‌’ అనే పుస్తకాన్ని రాశాడు. అంతేకా కుండా పక్షి శాస్తవ్రేత్త కూడా అయిన జేమ్స్‌ బాండ్‌.. తన నవలలోని ‘జేమ్స్‌బాండ్‌’ పేరు డిటెక్టివ్‌ పాత్రకు బాగుంటుందని.. ఆ పేరే పెట్టాడు. ఈయన రచించిన నవల ఆధారంగా ఇంగ్లీష్‌లో డిటెక్టివ్‌ సినిమాలు తీశారు. ఇయా న్‌ ఫ్లెమింగ్‌ నవల ఆధారంగా.. 1962లో ‘డాక్టర్‌ నో’ అనే డిటెక్టివ్‌ సినిమా వచ్చింది. 1962 నుండి ఇప్పటివరకు దాదాపు 25 కు పైగా జేమ్స్‌బాండ్‌ చిత్రాలు విడుదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందిన పాత్ర ‘జేమ్స్‌బాండ్‌’.
  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .