Sunday, June 5, 2011

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ దినము , Amnesty International day



గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (మే 28) ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ దినము ( Amnesty International day) గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము


ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఏర్పాటు: ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల కోసం పోరాడేందుకు మే 28, 1961న ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌’ పునాదులు పడ్డాయి. బ్రిటీష్‌ న్యాయవాది పీటర్‌ బెనెన్సన్‌ రాసిన ‘ది ఫర్గా టెన్‌ ప్రిజనర్స్‌’ అనే ఆర్టికల్‌ ఈ రోజున అన్ని ప్రముఖ పత్రికల్లో ప్రచురితమయ్యింది. తరువాత ఇదే ఆయనను ఆమ్నెస్టీ ఇంటేర్న షనల్‌ను ఏర్పాటు చేసేందుకు పురికొల్పింది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉంది. 150 దేశాల నుంచి 11 లక్షల మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. మానవ హక్కుల అణిచివేత, మానవహక్కుల దుర్వి నియోగానికి వ్యతిరేకంగా జరిగే పోరాటా లకు మద్దతునివ్వడం, మానవహక్కుల దుర్వినియోగాన్ని ప్రపంచం దృష్టికి తీసుకు రావడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశ్యాలు. ఈ సంస్థకు 1977లో నోబెల్‌ శాంతి పురస్కారం లభించింది.
  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .