Thursday, May 12, 2011

త్యాగరాజు జయంతి , Tyagaraju Birth day celebrations



గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (.....) -త్యాగరాజు జయంతి- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

త్యాగరాజు జయంతి---మే 04 .
మే 4, 1767వ సంవత్సరం.. వైశాఖ శుద్ధ షష్టి నాడు ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగయ్య జన్మించారు. తల్లిదండ్రులు సీతయ్య, రామబ్రహ్మం. గురువు శొంఠి వెంకట రమణయ్య. 72 మేళకర్త రాగాలలో త్యాగయ్య కృతులను రచించాడు. 2400 కీర్తనలు రచించారని పరిశోధకుల ఉవాచ. జగనానందకారక (నాటరాగం), దుడుకుగల నన్నే దొర కొడుకు బ్రోచురా (గౌళ), సాధించనే మనసా (అరభి), కనకన రుచినా (వరాళి), ఎందరో మహానుభావులు (శ్రీరాగం) అనే అయిదు కీర్తనలు ‘ఘనరాగ పంచరత్న కీర్తనలు’గా ప్రసిద్ధిగాంచాయి.

‘నౌకాచరిత్ర’ ప్రహ్లాద భక్త విజయం అనే యక్షగానాలు.. వీరి ఇతర రచనలు. త్యాగరాజ కీర్తనలు లేకపోతే.. కర్ణాటక సంగీతమే లేదన్నంతగా.. వీరి కీర్తనలు పం డిత పామర జనరంజకమయ్యాయి. వీరి పూర్వీకులు కర్నూలు జిల్లా కంభం తాలూ ాలోని కాకర్ల గ్రామం నుండి తమిళ నాడులోని తిరుచానూరుకు తరలి వెళ్లారు. కాకర్ల అనే గ్రామ నామమే వీరి ఇంటిపేరుగా మారింది. ఈయన పరాభవ సంవత్సరం, పుష్య బహుళ పంచమి (జనవరి 6, 1847) నాడు మరణించారు. తిరువయ్యూరులోని వీరి సమాధిపైన బెంగళూరు నాగరత్నమ్మ అనే సంగీత విద్వాంసురాలు 1925లో దేవాలయం కట్టించింది.1940 నుండి ప్రతి సంవత్సరం దేశమంతటా పుష్య బహుళ పంచమి నాడు త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుగుతాయి.
  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .