Wednesday, May 11, 2011

జాతీయ వైజ్ఞానిక దినోత్సవం (టెక్నాలజీ డే),National Technology Day



గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (మే 11.) -జాతీయ వైజ్ఞానిక దినోత్సవం (టెక్నాలజీ డే)- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

జాతీయ వైజ్ఞానిక దినోత్సవం (టెక్నాలజీ డే) - మే 11:

1998 మే 11వ తేదీన భారత్‌ రెండవసారి (మొదటి అణు పరీక్షలు మే 18, 1974లో జరిగాయి) రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ వద్ద అణుపరీక్షలు నిర్వహించింది. అప్పటి నుండి ఈ తేదీన.. జాతీయ వైజ్ఞానిక దినోత్సవం జరుపబడుతుందని భారత ప్రభు త్వం ప్రకటించింది. ఈ అణుపరీక్షలకు ‘ఆపరేషన్‌ శక్తి’ అని పేరుపెట్టారు. ఈ అణు పరీక్షలతో భారత్‌ అణ్వస్త్ర దేశంగా అవతరించింది.
  • =========================================

Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .