Friday, April 22, 2011

ఐక్య రాజ్య సమితి ప్రగతి పథకం(యు.ఎన్.డి.పి) దినము , United Nations Development Program Day



గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (నవంబర్‌ 22) -ఐక్య రాజ్య సమితి ప్రగతి పథకం-యు.ఎన్.డి.పి- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

ఐక్య రాజ్య సమితి ప్రగతి పథకం-యు.ఎన్.డి.పి(యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం) ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ , యు.ఎన్‌. సాధారణసభ తీర్మానం ద్వారా నవంబర్‌ 22, 1965న ఏర్పడింది. యు.ఎన్‌.డి.పి., సాంకేతిక సహాయ విస్తరణా కార్యక్రమం (), ఐక్యరాజ్యసమితి ప్రత్యేకనిధి() విలీనం ద్వారా ఏర్పడింది.

ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం వైజ్ఞానిక, పూర్వ పెట్టుబడుల సహకారానికి సంబంధించిన అతి పెద్ద బహుళ సంస్థ. ఐక్యరాజ్యసమితి వైజ్ఞానిక సహాయ కార్యక్రమాలకు కావాల్సిన నిధులను సమకూరుస్తుంది. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో వుంది.
  • =========================================

Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .