Thursday, April 21, 2011

ప్రపంచ కవితా దినోత్సవం , world Writers Day



గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (మార్చి 21 న ) -ప్రపంచ కవితా దినోత్సవం(world Writers Day)- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

కవిత్వము లేని భాష లేదు . కవిత్వము పుట్టని ప్రాంతం లేదు . కాబట్టి ప్రపంచములోని నలుమూలలా ఉన్న కవితా వైవిధ్యాన్ని అర్ధము చేసుకుని , కవితా మాధుర్యాన్ని చవిచూసే లక్ష్యము తో కవితా దినో్త్సవం యేర్పాటు చేసారు .

"రవి కాంచనిచో కవి గాంచునే " అన్నది లోకోక్తి . . అంటే సూర్యుడి కన్నా కవే గొప్ప అని . సూర్యుడు ప్రత్యక్షదైవము , ఆయన కిరణాలు అన్నివైపులకు వ్యాపిస్తాయి . అయినా ఆ శక్తి వంతమైన కిరణాలు ప్రసరించలేని ప్రదేశాలు వుంటాయి. వాటి గురించి రవి కి తెలీదు . అటువంటి ప్రదేశాల గురించి కూడా కవి వర్ణించగలడు . అతడి ఊహాశక్తి పరిధి అంత విసృతమైనది . అందుకే కవులన్నా , కవిత్వమన్నా ప్రపంచవ్యాప్తం గా ఎంతో గౌరము ఉన్నది . ఆ గౌరవాన్ని తెలియజేసేందుకు ప్రపంచమంతటా ప్రతిసంవత్సరము మార్చి 21 వ తేదీన " కవితా దినోత్సవం " జరుపుకుంటునారు .

కవిత్వము ఎంతో పురాతనమైనది . కవులను గౌరవించే సాంప్రదాయము మన దేశములోనూ ఉంది . ప్రతి రాజూ ఒక ఆస్థానకవిని నియమించుకుని గౌరవించేవాడు . ఇక శ్రీకృష్ణదేవరాయలు కాలములో ఏకంగా అష్టదిగ్గజాలే ఉన్నారు . అనేకమంది భారతీయ రాజులు కవి పోషణ లక్షణము గా తీసునేవారు . అటువంటి విశి్ష్ట సాంప్రదాయం మనకు అనాధిగా ఉన్నా ఐరోపాలో మాత్రము 18 వ శతాబ్ధము వరకు లేదు . ఆ శతాబ్దములో రోమన్‌ కవి ' విర్రీన ' పేరున అక్టోబర్ లో కవితా దినోత్సవాన్ని తొనిసారిగా జరిపారు . నాడు ఆ ఉత్సవం అక్టోబర్ నెలలో జరిగింది . అప్పటినుండి ఐరోపా వారిని అనుకరిస్తూ ఇతర ప్రదేశాలలో కూడా కవితా దినోత్సవం జరపడం మొదలైనది . ఐక్యరాజ్యసమితి విభాగమైన యునెస్కో తన 30 వ సమావేశాన్ని 1999 లో పారిస్ లో జరిపింది . ఆ సందర్భములో మార్చి 21 తేదీని ' ప్రపంచ కవితా దినోత్సవం ' గా జరపాలనే తీర్మానము చేసారు . ఆ నాటి నుండి ప్రతి ఏటా ప్రపంచ కవితా దినోత్సవాన్ని జరపుతున్నారు .

ప్రపంచ భాషావైవిధ్యాన్ని కవిత్వము మాత్రమే వెలుగు లోకి తీసుకురాగలదు అని యునెస్కో భావించింది . భావవ్య్క్తీకరణకు కవిత్వమే తగిన సాధనము . అందువల్ల కవ్త్వానికి ప్రోత్సాహము ఇస్తే భాషలు బతికివుంటాయని యునెక్సో తన విశ్వాసాన్ని ప్ప్;రకటించింది . అన్ని ప్రాంతాలలో అన్ని భాషలవారూ కవిత్వాన్ని రాయడం , చదవడం మొదలు పెడితే భాషకు విసృత ప్రచారము లభిస్తుంది .

కవిత్వము మీద శ్రద్ధ , ఆసక్తి పెంపొందింపజేసేందుకే ఐక్యరాజ్యసమితి పాఠశాల స్థాయినుండి విశ్వవిస్యాలయ స్థాయివరకు భాషాపాఠ్యాంశాలలో కవిత్వభాగాలను పెంచమని సూచించింది . పిల్లలలో ఆసక్తి పెంచేందు కు అన్ని స్థాయిలలో కవితా క్లబ్ లను ఏర్పాటు చేయమంటున్నది . భావయుక్తం గా కవిత చదివే పిల్లలను ప్రోత్సహించి తీర్చిదిద్దమని సూచనలు ఇస్తుంది .

  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

1 comment:

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .