Wednesday, April 20, 2011

World Head injury Awareness Day , ప్రపంచ తల గాయాల ప్రమాదాల అవగాహన దినము



గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (.మార్చి 20 న .) World Head injury Awareness Day గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పక ధరించండి , కారు నడిపేటప్పుడు సీటుబెల్ట్ తప్పక పెట్టుకోండి . ఇది ప్రతి రోడ్ సిగ్నల్ దగ్గర మైక్ లో చెప్పే విషయాలు . కాని దీనిని పట్టించుకునే వారి సంఖ్య బహు తక్కువ . ఫలితమే రోడ్డు ప్రమాదాలు .. అందునా ద్విచక్ర వాహనాలు ప్రమాదానికి గురైనప్పుడు తలబాగానికి గాయాలవుతాయి.
శరీరములో మిగిలిన భాగాలకు గాయం తగలడం వేరు , మెదడుకు గాయం అవడం వేరు . మెదడు కీలకమైన భాగము . శరీరములో అన్ని అంగాలూ కీలకమే అయినా ఆ కీలక అంగాలన్నిటినీ నియంత్రించేది మెదడే. కేంద్రీయ నాడీవ్యవస్థలో అతిముఖ్యమైనది మెదడు . అందుకే ఆ మెదడును రక్షించేందుకు చుట్టూ కపాల నిర్మాణము ఉన్నది . అంతటి గట్టి కపాల రక్షణ ఉన్నప్పటికీ మెదడు కి దెబ్బలు తగులుతునే ఉంటాయి. తలకు గాయాలై ఆస్పత్రి పాలయ్యేవారి సంఖ్య అమెరికాలో ప్రతియేటా 14 లక్షల వరకు ఉంటుంది . అందులొ దాదాపు 50 వేలమంది కోలుకోలేక మరణిస్తారు . ఒకవేల కోకుకున్నా ఏదో ఒక అంగవైకల్యముతో జీవితం గడిపేవారు సుమారు 3-4 లక్షలమంది ఉంటారు . ఇక ప్రపంచ వ్యాప్తం గా చూసినపుడు తలకు గాయాలవుతున్నవారి సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటుందో ఊహించుకోవచ్చు . కాబట్టి తలకు ఉన్న ప్రాముఖ్యత , దానికి గాయం అవకుండా కాపాడుకోవలసిన అవశ్యకత అన్ని వయసులవారు తెలుసుకోవాలి . ఈ విషయము ప్రజలందరికీ తెలియజెప్పి ... మీ తలను జాగ్రత్తగా కాపాడుకోండి ... తలకు గాయం తో శాశ్విత వైకల్యము పొందకండి అనే సందేశముతో తలకు గాయాలు అనే అంశం పై ప్రపంచ పజలందరికీ అవగాహన కల్పించే లక్ష్యముతో ప్రతియేటా " మార్చి 20 వ తేదీన " - " వరల్డ్ హెడ్ ఇన్‌జురీ ఎవేర్నెస్ డే " గా జరుపుకుంటారు .

అప్రమత్తత :
తలకు గాయం ఏ వయసు వారికయినా అవ్వవచ్చు . పసిపిల్లలను ఉయాలలోనుండి పడినా , పసిపిల్లలు పడుమునే మంచము కోడు కి తల తగిలినా . . మంచం మీదనుండి కిందకి పడినా తలకు దెబ్బ తప్పక తగులు తుంది . ఆటలు ఆడుకునే వయసు లో పిల్లలకు తలకు గాయాలయ్యే ప్రమాదము ఎక్కువ . అపార్ట్ మెంట్ బాలకనీ సరియైన రక్షణ లేనపుడు పడిపోయే ప్రమాదము , ఇంటి మెట్లు కి గ్రిళ్ లేనపుడు పడిపోయే ప్రమాదము వల్ల తలకు గాయాలవుతాయి . స్కూల్ పిల్లలు ఒకరినొకరు నెట్టుకోవడం వల్ల , పొరపాటున స్కూల్ లో బల్లకో , గోడకో , బ్లాక్ బోర్డ్ కో తల తగిలి గాయాలవవచ్చును . ఆటలలో బంతో , బ్యాట్ తోనో , కాలేజీ స్టూడెంట్స్ ఘర్షణలవల్ల నో , గచ్చు పై జారి పడి నేలకు తలతగలడం వల్లనో , నీరసము వల్ల , బి.పి.వల్ల కళ్ళు తిరిగి పడినపుడు తలకు గాయమడం ... ఇలా ఎన్నోకారణాలు వలన తగిలే గాయాలు ఒక వంతు అయితే ... ప్రయాణాలలో వాహనాలు ప్రమాదాలు వలన గాయాలు అవడం ఇంకోవంతు ... ప్రమాదకరమైనది .

మెదడు బద్రం :
మెదడులోని ఏదో ఒకబాగము దెబ్బ తింటే ఆ భాగము శరీరం లోని ఏ ప్రాంతాన్ని నియంత్రిస్తుందో ఆ భాగము దెబ్బతింటుంది . ఫలితముగా
  • మాటలో స్పస్టత కోల్పోవచ్చు ,
  • అడుగులు వేయడం లో ఇబ్బంది యేర్పడవచ్చును ,
  • జ్ఞాపక శక్తి ని కోల్పోవచ్చును ,
  • కంటిచూపు మందగించవచ్చును ,
  • మనిషి వ్యక్తిత్వము లో మార్పులు రావచ్చు ,
  • పిచ్చెక్కినట్లు ప్రవర్తించవచ్చు ,
  • స్ప్రుహ కోల్పోవచ్చు ,
  • కోమాలోనికి జారుకోవచ్చు .
మెదడుకి దెబ్బవల్ల కేవలం బ్రతికివుండి , ఏపనీ చేయలేక మంచం లో శాశ్వితం గా పడి వుండాల్సిన పరిస్థితి రావచ్చు . ఇటువంటి వారినే " బ్రెయిన్‌ డెడ్ " గా వ్యవహరిస్తారు .

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రాధమికంగా కావలసిన జాగ్రత్తలు :
  • ప్రయాణము లో అప్రమత్తం గా ఉండడము ,
  • ప్రయాణము లో హడావిడి తగదు ,
  • మరుసటి నాటి ఉదయము సుదీర్ఘ ప్రయాణము అవసరము అనుకున్నాప్పుడు రాత్రి నిద్ర చాలినంత పోవాలి ,
  • వెళ్ళేముందు ఏదోఒకటి తినాలి .. ఆకలి తో డ్రైవింగ్ చేయకూడదు .
  • మెలకువగా ఉండాలంటే బాగా కెఫైన్‌ గల పానీయాలు అవసరమని భావించకూడదు .. వాటి ప్రభావము తగ్గినంతనే నిద్రలోకి నెట్టెస్తాయి .
  • డ్రైవింగ్ లో అప్రమత్తం గా ఉండాలి , మనసు ఎక్కడో విహరించకూడదు .
  • ప్రతి రెండు గంటలకు ఒకసారి విరామము అవసరము . తూలుతున్నట్లు అనిపిస్తే ఏదో కాస్త తిని అవసరమనుకుంటే కొద్దిసేపు నిద్ర పోవాలి .
  • దూరప్రయాలలో ఇంకొకరి సహాయము తో డ్రైవింగ్ షేర్ చేసుకుంటే మంచిది .
  • సరి అయిన సిగ్నల్స్ లేనిదే వాహనాలను క్రాస్ చేయరాదు , ఓవర్ టేక్ చేయరాదు .
  • డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్‌ లో మాట్లాడడము మంచిది కాదు .
  • డ్రైవింగ్ సమయములో ముందు ఆల్కహాల్ తీసుకోకూడదు ... మత్తులో పడి ప్రమాదాలు జరుగుతాయి .
  • వాతావరణము అనుకూలము గా లేనప్పుడు తక్కువ స్పీడ్ లో ప్రయాణించాలి .
  • బయలు దే్రే ముందు వాహనము కండిషన్‌ లో వున్నది లేనిదీ తనికీ చేయించుకోవాలి ,
  • ట్రాఫిక్ నిబందనలు , ట్రాఫిల్ సిగ్నల్స్ తూచా తప్పకుండా పాటించాలి .
తలకు గాయాలవకుండా మనవంతు జాగ్రతాలు చేపట్టాలన్నదే ఈ దినోత్సవం లక్ష్యము .

  • మూలము : వికీపెడియా లో ఇంగ్లిష్ వ్యాసము అనువాదము .



=========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .