Friday, April 8, 2011

Sweetest Day , స్వీటెస్ట్ డే, తియ్యని రోజు


గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు.... ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (అక్టోబర్ మూడవ శనివారము ) -Sweetest Day , స్వీటెస్ట్ డే, తియ్యని రోజు గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

జీవితం ప్రతిక్షణము సాఫీగా , సజావుగా సాగదు . ఎన్నో ఆనందాల నడుమ అనేక విపత్తులూ తప్పవు . సంతోషానికి నీడగా దు:ఖము ఉంటుంది . ఎన్ని కస్టనస్టాలు , విపత్తులూ ఉన్నా జీవతం సంతోషము , సుఖము , ఆనందాల కలబోతల విలువైన బహుమానము . ఆ బహుమతిని పదిలము గా చూసుకోవాలే కాని ... ప్రతికూలతల్ని గుర్తుతెచ్చుకొని జీవతం లోని తీపిని ఎన్నడూ మరువకూడదు , దూరము చేసుకోకూడదు . జీవితం లో ప్రతి చోటా ఆనందాలు , అద్భుతాలు దక్కుతునే వుంటాయి. అవి మనదగ్గరకు వాటంతట అవే రావు .... మనమే వాటిని వెతుక్కోవాలి , అందుకోవాలి , సంతృప్తిని శోధించాలి , సంతోషాన్ని దక్కించుకోవాలి .
చరిత్ర :
1922 లో ' క్లెవ్ ల్యాండ్ 'లోని ఒహియె లో అక్కడి క్యాండి కంపెనీ ఉద్యోగి అయిన " హెర్బర్ట్ బిర్చ్ కింగ్ స్టన్‌ " స్వీటెస్ట్ డే ని ఆరంభించాదు . జీవతం లో నిరాదరణకు గురైనవారికి కొంత సంతోషాన్నీ పంచాలని కింగ్‌స్టన్‌ భావించాడు . తన స్నేహితుల సహకారము లో అనాధ శరణాలయాల్లోని పిల్లలకు అనారోగ్యము లేదా అంగవైకల్యము గలవారికి , నిరాదరణకు గురియైన ఇతరులకు క్యాండీలు , చిన్న చిన్న బహుమతులు పంచడాన్ని మొదలు పెట్టాడు . అప్పట్లోనే సినీనటుడు ' అన్‌పెన్నింగ్టన్‌ ' క్లెవ్‌ల్యాండ్ న్యూస్‌పేపరు బ్యాయ్స్ కు వారి సేవలకు కృతజ్ఞతగా 2,200 క్యాండి బాక్సులు బహుమతిగా ఇచ్చాడు . అదేకాలము లో మరో తార ' థేడబర ' ఆస్పత్రులలో ఉన్న వారికి , తన సినిమాకు వచ్చిన వారికి 10,000 క్యాండీబాక్సులు పంచిపెట్టింది . ఒక్క దశాబ్దానికే ఈ చిన్ని ఆలోచన కెవ్‌ల్యాండ్ నగరము లో అత్యంత ప్రాముఖ్యాన్ని గడించి అక్టోబరు 3 వ శనివారము స్వీటెస్ట్ డే గా అధికారికం గా ప్రకటించేదాకా ఎదిగింది .

మనల్ని ప్రేమించే వారిని మనము ఎప్పుడూ నిర్లక్ష్యము చేయరాదు . ఆప్యాయతానురాగాలు అవసరం అయ్యేవారికి ఇస్తూఉండాలి . ప్రేమతో చేసే చిన్న పని సైతము ఎంతో ఆనందాన్ని ఇస్తుంది . కొండంత ధైర్యాన్ని ఇస్తుంది . కుటుంబ సభ్యులు , బంధువులు , స్నేహితులు ,సహ ఉద్యోగులు ఎవరైనా కావచ్చు అందరినుంచీ ప్రేమ అన్న " తీపి" ని జీవితానిక్ జతచేర్చాలి . ఆ తీపి ని గుర్తుచేస్తూ , అందిస్తూ , ఆనందిస్తూ ఏట అక్టోబరు లో " స్వీటెస్ట్ డే " ని నిర్వహిస్తున్నారు . తోటి వారిని సంతోషపెట్టేందుకు ఓ అవకాశాన్ని తీసుమునే రోజు స్వీటెస్ట్ డే . జీవన మధురమల్ని మననము చేసే రోజు ఇది . ఒకప్పుడు ఉత్తర అమెరికా లో దురదృష్టవంతులకు ఆనందాన్ని పంచేరోజూ గా పరిగణించే స్వీటెస్ట్ డే - ఇప్పుడు జీవతం లో మనము ప్రేమించేవారిపట్ల ఆప్యాయతను ప్రదర్శించే రోజుగా పరిగణలోనికి వచ్చింది . " రోగ పీడితులు , వయస్సు మళ్ళినవారు , అనాధులపట్ల అభిమానాన్ని చూపే అవకాశము మాత్రమే కాదు , స్నేహితులు , బంధువులు , సహచరుల పట్ల , నిస్సహాయులు , ఇతరులపట్ల ప్రేమను ప్రదర్శిస్తూ జీవిత విలువల్ని పునశ్చరణ చేసుకునే అవకాశము ఇచ్చే రోజే ఈ " స్వీటెస్ట్ డే " అని నిర్వహిస్తారు . క్యాండి అమ్మకాల్ని వృద్ధి పరుచుకోవడానికి ఆరంభించిన కార్యక్రమమని అనేవారూ లేకపోలేదు . ఈ ' స్వీటెస్ట్ డే' మిగతా ప్రదేశాలకంటే డెట్రాయిట్ , కెవ్‌ల్యాండ్‌ , బఫెల్లో వంటి ప్రాంతాలలో ఎక్కువ ప్రాచుర్యము గడించినది . దేశవ్యాప్తముగా ప్రతియేటా ప్రాచుర్యము పొందుతూ వస్తూన్న సెలవు .

స్వీటెస్ట్ డే ఏదో ఒక గ్రూపు , మత పరమైన మనోభావాలతో కూడినదో , కుటుంబ బాంధవ్య ప్రాతిపదికగానో సాగేది కాదు . జీవిత పరమార్ధాన్ని , జీవిత విలువల్ని , ఆ జీవితములో ఉండాల్సిన సంతృప్తిని , సంతోషాన్ని గుర్తుచేసుకునే పండుగ ఇది . మనము ఇచ్చే చిన్న బహుమతి వారిపట్ల మనకున్న శ్రద్ధను తెలియజెప్పే ఓ గొప్ప అవకాశము .

క్యాండి తయారీదారులు అమెరికా సంయుక్త రాస్ట్రాలన్నింటిలో " క్యాండి డే " ప్రకటించడం తో సహా న్యూయార్క్ నగరములో " స్వీటేస్ట్ డే" నిర్వహించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు . అప్పట్లో ఈ వార్తలు వివిధ పత్రికలలో్ ప్రచురితమయ్యాయి. న్యూయార్క్ టైమ్‌స్ అనేక సార్లు రిపోర్ట్ చేసింది . 1927 అక్టోబర్ 10 తేదీ నుంచి స్వీటెస్ట్ వీక్ నిర్వహించారు . మదర్స్ డే , ఫాదర్స్ డే , వేలంటైన్‌ డే ల మాదిరి స్వీటెస్ట్ డే ని జాతీయముగా ఆమోదించాలని కోరుతూ క్యాండి పరిశ్రమ ఓ ఉద్యమాన్ని 1937 సెప్టెంబరు 25 న ఆరంభించిందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది . 1940 అక్టోబర్ 19 న మరో స్వీటెస్ట్ డే నిర్వహించారు . స్వీటెస్ట్ డే కమిటీ పదివేల బాక్సులకు పైగా పంపినీచేయడం ద్వారా ఈ రోజుకు ప్రాధాన్యాన్ని పెంచింది . 26 స్థానిక చారిటీలకు , 225 పిల్లలకు , 1940 అక్టోబర్ 17 న క్యాండీ బాక్సులు పంపిణీ చేసారు . న్యూయార్క్ లోని క్యాధలిక్ బిగ్ సిస్టర్ గ్రూప్స్ కు , జెనిష్ అద్యక్షుడికి కూడా క్యాండీ బాక్సులు పంచి పెట్టేరు . ఏ ప్రయోజనము తో ఈ ' స్వీటెస్ట్ డే ' ని ప్రారంభించినా ఇప్పుడది అత్యంత తీపిరోజు గా పరిణమించింది .

తాము అభిమానించే, ప్రేమించే , వ్యక్తులందరికీ గ్రీటింగ్ కార్డులు , క్యాండీలు , పువ్వులు , చిన్న చిన్న బహుమతులు అందించే దినము గా మారినది . టెక్సాస్ వంటి నగరాల్లో తమకు ఇష్టమైన వారిని బ్రేక్ ఫాస్ట్ కు పిలవడం తో ' స్వీటెస్ట్ డే ' కి శ్రీకారము చుడతారు . వేలంటైన్‌ డే అంతటి ప్రాచుర్యము అయితే గడించలేదుకాని .. చాలా ప్రాంతాలలో ఈ స్వీటెస్ట్ డే పండుగను జరుపుకుంటారు . మిగతా వారికంటే క్యాండీ తయారీ దారులకు ఇది మరింత ప్రత్యేకమైనది . స్వీటెస్ట్ డే ని ఎవరు , ఎందుకు , ఎలా ప్రరంభించినా ఇలా తోటివారిని గుర్తిస్తూ ప్రేమగా బహుమతులులను ఇస్తూ జీవితం 'ఓ మంచి బహుమతి ' అని గుర్తుచేయడం నిస్సందేహము గా తియ్యని కబురే.
  • =========================================

Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .