ప్రేమికుల రోజు ... అదే valantine Day ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 14న జరుపుకుంటారు . ఈ రోజు ముందు వేలంటైన్ వీక్ అని (ప్రేమికుల వారము ) అని జరుపుకునే ఆచారము ఉన్నది . వేలంటైన్ వీక్ లో మొదటి రోజు గులాబీ దినోత్సవం (Rose day) ని జరుపు కుంటారు .వేలంటైన్ డే సెలబ్రేషన్స్ రోజ్ డే తోనే ప్రారంభమౌతాయి.ప్రేమకు చిహ్నం గా ఎవరైనా గులాబీలను ఇచ్చిపుచ్చుకుంటారు.ఈ వారము మాత్రము కొత్త ప్రేమికుల హవా కనిపిస్తుంది .
The Valentine's Day Week:
- 07 Feb Rose Day
- 08 Feb Propose Day
- 09 Feb Chocolate Day
- 10 Feb Teddy Day
- 11 Feb Promise Day
- 12 Feb Kiss Day
- 13 Feb Hug Day
- 14 Feb VALENTINE'S DAY
పై విధము గా వారమంతా అనందము గా జరుపుకుంటారు . ఇదంతా విదేశీ సంసృతి అయినా మన దేశమంతా బహుళ ప్రచారము చెంది అంటువ్యాధిలా ఒకరి నుండి ఒకరికి వ్యాప్తిచెందుతూ ఉన్నది .ఈ రోజు కొత్త ప్రేమికులు , ప్రేమించి వివాహమైన వారు గులాబీ పువ్వులను ఒలరికొకరు ప్రేమపూర్వకము గా ఇచ్చుకుంటారు . ప్రేమికుల రోజున గులాబీలు తోపాతు ..గిఫ్టులు కూడా ఇచ్చిపుచ్చుకుంటారు.
గులాబీలు
- ప్రేమ, వాత్సల్యం, స్నేహం లాంటి సున్నితమైన భావాలతో గులాబీలు కొన్ని వేల సంవత్సరాలుగా ముడిపడి ఉన్నాయి. అలోచనలపరంగా గులాబీలు సౌందర్య దేవతతోనూ, ప్రేమదేవతతోనూ సన్నిహిత సంబంధాలను కలిగి ఉండేవి. ఆ తరువాత ఈరాస్ అనే ప్రేమ దేవతతో చేర్చబడి గులాబీల పేరు అల్లుకపోయింది.
- గులాబీ పేరులను సమాధులపై పరచడానికీ ఉత్సవ సమయాలలో అలంకరణకు రోమన్లు ఉపయోగించేవారు. యుద్ధ భూమి నుండీ విజయాన్ని సాధించి వెనుతిరిగి వస్తున్న సేనానులరధాలను అలంకరించేందుకు కూడా గులాబీలను వారు వాడేవారు.
- క్రెస్తవ మత ప్రచారం విస్తృతంగా జరగడంతో గులాబీ ' వర్జిన్ మేరీ ' పువ్వుగా మారింది. ప్రార్థనా సమయంలో కాథలిక్కులు వాడే రోసరి పూసలమాలకు ఆ పేరు వర్జిన్ మేరీ సెయింట్ డోమినిక్కు ఇవ్వబడిన మాల కారణంగా వచ్చింది.
- చాలా శతాబ్దాలుగా గులాబీలను మందుల తయారీకూ, అత్తరుల తయారీకూ వాడడం జరిగింది. 17వ శతాబ్దంలో గులాబీల నుండి సుగంధ తైలాన్ని తయారుచెయ్యడంలో మనిషి విజయాన్ని సాధించాడు. ఒక పౌండు అత్తరు(సుగంధ త్తెలం) తయారీకు సుమారు 10,000 పౌండ్ల గులాబీ రేకులు కావలసి వస్తాయి.
- ప్రాచీన కాలపు రోమన్ (ప్రస్తుతం ఇటలీ) మహిళలు గులాబీ రేకులు తమ చర్మాన్ని యవ్వనత్వంతో నింపగలవని నమ్మేవారు. గులబీల సువాసనను ఆలివ్ తైలానికి చేర్చి పన్నీరు (
- రోస్ వాటర్ )ను వారు తయారుచేసేవారు. ఈ రోజు మనకు పన్నీరు అపారంగా దొరుకుతోంది. అప్పుడప్పుడు కంటిని శుభ్రపరుచుకునేందుకు కూడ దీనిని వాడుతుంటారు.
- గులాబీలలో ఆకర్షణీయమైన విషయం బహుశా దాని అందం, రంగు, సువాసన అయి ఉంటుంది.
- =========================================
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .