చిత్తడినేలలు అనే పదం విన్నవారే తక్కువ . ఇక ఆ చిత్తడినేలల ప్రాముఖ్య గురించి తెలిసిన వారు బహు తక్కువ . దాను ఫలితమే అతి వేగంగా అంతరించిపోతున్న చిత్తడినేలలు , భౌగోళికపరంగా , జీవ వైవిధ్య పరంగా చిత్తడినేలలు ఎంతో కీలకమైనవి . సముదర తీరప్రాంతాలలొనైనా , నదుల ప్రాంతాలలొనైనా సంవత్సరం లో అధిక కాలము నీరు నిలిచివుండి , తోతు తక్కువగా ఉండే ప్రదేశాలను చిత్తడి నేలలు గా పిలుస్తారు . మంచినీటి , ఉప్పునీటి సరస్సులు , మడ అడవులలు కలిగిన సాగర సంగమ ప్రాంతాలు , బురద కయ్యలు , ఉప్పునీటి కయ్యలు , ప్రవాహాలు కలిగిన ప్రాంతాలు వంటివన్నీ చిత్తడి నేలల కిందకే వస్తాయి .
జలవనరులు మానవాళి మనుగడకు ఎంతో కీలకం . అందుకే మానవ సంస్కృతి నదీ తీరాలలోనే విలసిల్లినది . సింధు , గంగానది , కృష్ణానదీ , గోదావరీ నదీతీరాలలోనే విలసిల్లినది . నేడు మహానగరములు గా భాసిల్లుతున్న కలకత్తా , ముంబయి , చెన్నై , టొకియో, న్యూయార్క్ వంటివన్నీ జలవనరుల ఆధారముగా ఎదిగినవే , అన్ని దిక్కులనుండి అక్కడికి ప్రజలను ఆకర్షించడానికి మూలము ఆ నగరాల ఆర్ధికసంపద అయితే , ఆ ఆర్ధిక సంపదను అందించినది ఆ ప్రాంతాలలో ఉన్న చిత్తడి నేలలే . ఒక ప్రాంత ఆర్ధికవ్యవస్థలో చిత్తడి నేలలు కీలక పాత్ర వహిస్తాయి. సముద్రతీరం లో ఉన్న చిత్తడినేలలు ఆ ప్రదేశానికి స్థిరత్వాన్నిస్తాయి . అలల తాకిడికి ఆ ప్రాంతం దెబ్బతినకుండా రక్షిస్తాయి . నదులప్రాంతం లో అయితే చిత్తడినేలలు వరదముంపుల నుండి రక్షిస్తాయి . చిత్తడినేలలు అనేక వందల రకాల మొక్కలు , జంతువులకు మెరుగైన ఆశ్రయాన్నిస్తాయి .
చేపలు , రొయ్యలు వంటి అనేక నీటిజాతులకు గుడ్లు పెట్టేందుకు , పిల్లలు ఎదిగేందుకు సౌకర్యము కల్పిస్తాయి . ఆయా ప్రాంతాలలో ఉండే నీటి నాణ్యతను పెంచడంలోనూ చిత్తదినేలలు పాత్ర వహిస్తాయి. ఆ ప్రదేశాలలోకి వదలబడిన కాలుష్యకారకాలను గ్రహిస్తాయి. ఇన్ని లాభాల్ని అందించే చిత్తడి నేలల విలువను డబ్బు రూపం లో లెక్కకడితే కొన్ని లక్షలకోట్ల రూపాయల్లో ఉంటుంది . నీటికి , భూమికి అనుసంధాన ప్రాంతంగా ఉండే ఈ చిత్తడినేలల ప్రాముఖ్యతను అర్ధము చేసుకోలేకపోయిన ప్రజలు తమ ఆవాసాల విస్తరణలో చిత్తడి నేలలను మింగేయసాగారు . ముంబయి నగరం ఈ స్థాయికి విస్తరించిందంటే దానివెనక మాయమయిన చిత్తడి నేలలనేకము ఉన్నాయి . చిత్తడి నేలలు ఆక్రమించి , మట్టితో కప్పి తమ భవన నిర్మాణానికి వాడుకోవడం మొదలు పెట్టేరు . ఒకప్పుడు చిత్తడి నేల ఆడవులుగా ఉన్న ముంబయి ప్రాంతం లో నేడు కాంక్రీటు భవనాలు నిలిచాయి . ఇది కేవలము మనదేశానికి సంబంధిన సమస్యకాదు . ప్రపంచవ్యాప్తం గా పారిశ్రామిక అభివృద్ధితో తరిగిపోతున్న చిత్త్డినేలలను గుర్తించి అంతర్జాతీయ వేదిక ఒక ప్రత్యేక సదస్సును ఏర్పాటు చేసింది .
1971 ఫిబ్రవరి 02 న చిత్తడి నేలల మీద ప్రపంచ దృష్టి మళ్ళించే సదస్సు ఇరాన్ దేశములో రామ్‌సార్ పట్టణములో జరిగింది . కాస్పియన్ సముద్రతీరం మీదున్న అ రామ్‌సార్ జరిపిన చర్చల ఫలితం గా ప్రపంచం లోని దేశాలన్నీ తమ తమ దేశాల్లోని కీలక చిత్తడి నేలలను గుర్తించి వాటి పరిరక్షణ కు అవసరమైన చర్యలు చేపట్టాలని తీర్మాణము చేసారు . ప్రత్యేక చట్టాలతో వాటిని రక్షించాల్సిన భాద్యత ప్రభుత్వాలపైన పెట్టింది . అయినా చిత్తడి నేలల మీద దృస్టి 1997 వరకు కేంద్రీకరించబడలేదు .
తొలిసారిగా ప్రపంచ చిత్తడినేలల దినోత్సవాన్ని 1997 లో ఫిబ్రవరి 02 న జరిపారు . నాటి నుండి ప్రతియేటా ఈ దినోత్సవం జరుగుతోంది . ఒక్కొక్క సంవత్సరము ఒక కొత్త అంశం మీద దృష్టి పెడుతూ ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు . గత సంవత్సరము " చిత్తడి నేల జీవవైవిధ్యం , వాతావరణం , ఉష్ణోగ్రత మార్పుల్ని పరిరక్షించడం " అనే అంశ ను పరిగణలోనికి తీసుకున్నారు . ఈ సంవత్సరము రాంసార్ సదస్సుకు 40 వ వార్షికోత్సవం కాబట్టి ఘనం గా జరిపేందుకు " చిత్తడి నేలలు లో అడవులు -నీటికోసం , చిత్తడి నేలల కోసం అడవులు " అనే అంశం మీద దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు .
కొల్లేరు సరస్సు పై దృష్టి :
ప్రపం చ పర్యావరణాన్ని కాపాడాలంటే చిత్తడి నేలల సంరక్షణ ఆవశ్యమని, అందుకు ప్రభుత్వం కషి చేయాల్సి ఉందని వరల్డ్‌వైడ్‌ఫండ్ ఆఫ్ ఇండియా(డబ్ల్యు డబ్ల్యుఎఫ్) స్టేట్ డైరెక్టరు ఫరిదా టంపల్ పేర్కొన్నారు. డబ్ల్యుడబ్ల్యుఎఫ్ ఆధ్వర్యంలో చిత్తడినేలల దినోత్సవాన్ని బుధవారం అన్ని కేంద్రం లలో ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్బంగా వివిధ పాఠశాలల విద్యార్థులను కొల్లేరు పర్యటనకు తీసుకువచ్చారు. చిత్తడి నేలల ఆవశ్యకత, కొల్లేరు పరిరక్షణ వంటి ఆంశాలపై విద్యార్థులకు ఆవగా హన కలిగించారు. చిత్తడినేలల రకాలను, చిత్తడి నేలలో ఉండే వివిధ రకాల పక్షులు, జంతువులు, జలచ రాలు, మొక్కలు పర్యావరణపై విద్యా ర్థులకు అవగాహన కలిగించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు పెయిటింగ్ పోటీలు నిర్వహించి బహు మతులు ఆందజేసారు. పాఠశా లలకు చెందిన అనేక మంది విద్యార్థు లకు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డబ్ల్యుడబ్ల్యుఎఫ్ స్టేట్ డైరెక్టరు ఫరిదా మాట్లాడుతూ చిత్తడి నేలలు రానురాను అంతమయ్యే పరిస్థి తులు ఏర్పడుతున్నాయని, దాని వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కలిగించి వారి ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చేం దుకు తమ సంస్థ కషి చేస్తోందని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగిన తరువాత తుఫాన్‌లు సంభవిం చినపడు ఆ నీరు బయటికి పోయే పరిస్థితులు కనిపించడం లేదని, ఈ చిత్తడినేలలు ఉండడంవల్ల తుఫాన్ ప్రమాదాల నుంచి తప్పుకునే ఆవ కాశం ఉంటుందన్నారు.
40 సంవత్సరాల క్రితమే ప్రభుత్వం రాం సార్ సాగర్‌లో చిత్తడి నేలల సంరక్ష ణపై తీర్మానం చేసిందని, ఈ చట్టం పరిధిలోకి దాదాపు 25 సరస్సులను తీసుకు వచ్చిందని, ఆంధ్రప్రదేశ్‌లోని కొల్లేరు సరస్సును కూడా చట్టం పరిధిలోకి తీసుకు వచ్చేందుకు ముసా యిదాలో పేర్కొనడం జరిగిందన్నారు. కృష్ణా, గోదావరి జిల్లాలు, నదుల మధ్య సహజసిద్ధంగా ఈ కొల్లేరు సరస్సును చిత్తడినేలల సంరక్షణ పరిధిలోకి తీసుకు రావాలన్నారు. కొల్లేరు ప్రాంతంలో ఈ చిత్తడినేలల చట్టంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చిత్తడి నేలల సంరక్షణ బాధ్యత ప్రభుత్వం చేపట్టాలన్నారు. కొల్లేరులో ఉన్న పక్షులకు రక్షణ కలిగించాలని, పక్షులు పెద్ద సంఖ్యలో వచ్చేలా ఫారెస్టు అధికా రులు చర్యలు తీసుకోవా లన్నారు.
190 దేశాలు ఈ చిత్తడినే లల సంరక్షణపై కషి చేస్తున్నా యని, తాము ఇదే కొల్లేరు సరస్సులో ఈ చిత్తడినేలల దినోత్సవాన్ని మూడేళ్లగా చేస్తున్నామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో డబ్ల్యు డబ్ల్యు ఎఫ్‌కు చెందిన సీనియర్ మేన జరు పిఎస్‌ఎం శ్రీనివాస్, సీనియర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శరవణ్ణన్, ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీకాంత్, ఎడ్యుకేషన్ ఆఫీసర్ విక్రమ్ ఆదిత్య, మండవల్లి సాధన స్వఛ్చంద సేవా సంస్థ డైరెక్టరు పి.యేసుపాదం, సబ్‌డిఎఫ్‌ఒ మల్లిఖా ర్జునయ్య, రేంజ్ ఆఫీసర్ జి.గోవర్థన రావు, రిటైర్డు డిఎఫ్‌ఒ గ్రేసియస్, ఫారెస్టు ఆధికారులు, ఉపాధ్యా యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- =========================================
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .