Sunday, February 6, 2011

కస్టమ్స్ డే , Customs Day (International)


గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (జనవరి 26) కస్టమ్స్ డే , Customs Day (International) గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

ప్రపంచవ్యాప్తం గా ప్రతి సంవత్సరమూ జనవరి 26 న ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే (ఐ.సి.డి) గా జరుపుకుంటారు . ఇంగ్లిషు లో కస్టమ్‌స్ అంటే " సాంప్రదాయము " , సుంకము అనే అర్ధాలు ఉన్నాయి . ఈ కస్టమ్స్ సుంకానికి సంబంధించినది . ప్రతి దేశము తన దేశములో అధికంగా లభించే ముడి పదార్ధము , లేదా ఉత్పత్తిని ఎగుమతి చేస్తుంది . అదేవిధంగా తమకు అవసరమైన వాటిని దిగుమతి చేసుకుంటుంది . అలా దేశాలలో జరిగే ఎగుమతి , దిగుమతి మీద విధించే సుంకాలే ఇంగ్లిష్ లో కస్టమ్స్ అంటారు .

ప్రతి దేశానికీ ఒక కస్టమ్స్ శాఖ ఉంటుంది . ఎగుమతి దిగుమతులకు ద్వారాలైన నౌకాశ్రయాలు , విమానాశ్రయాలు లలో కస్టమ్స్ శాఖ డేగకన్ను వేసి వుంటుంది . వీటి ద్వారా వచ్చే సుంకాలు దేశ ఆర్ధిక వ్యవస్థకు బలం చేకూరుస్తాయి . అందుకే ప్రతి దేశము కూడా కస్టమ్స్ విభాగాన్ని బలపరుస్తుంది . ఎగుమతులు , దిగుమతు లతో ప్రభుత్వాలకు ఆదాయము ఉంటుంది కాని దేశ భద్రతకు ముప్పు ఉంటుంది . చట్ట బద్ధత లేని అంశాలు ఎగుమతి అయినా ... దితుమతి అయినా ఇబ్బందే. ఈ ఇబ్బంది తొలగించుకోవాలంటే దేశాల మధ్య సహకారము అవసరము . ఆ దృస్టితోనే కస్టమ్స్ కోపరేటివ్ కౌన్సిల్ ని అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసారు . ఈ కౌన్సిల్ లో 169 దేశాలు సభ్యత్వము కలిగిఉన్నాయి . ఆ కౌన్సిల్ తొలి సమావేశము జరిగిన జనవరి 26 నే " ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే " గా జరుపు కుంటున్నారు .

కస్టమ్స్ డిపార్త్మెంట్ దేశ ఆర్ధిక , సామాజిక భద్రతలో కీలక పాత్ర వహిస్తుంది . విదేశాల నుండి అక్రమ రవాణా జరిపే ముఠాల ఆట కట్టించ గలిగిన అధికారము కస్టమ్స్ కే ఉండేది . సాంప్రదాయం గా మన దేశం లోకి బంగారము , ఎలక్ట్రానిక్ వస్తువులు స్మగుల్ చేసేవారు . ప్రభుత్వము అవలంబిస్తున్న విధానాలవల్ల ఆ వస్తువులు భారతీయులకు అందుబాటులో లేకుండా వుండేవి . . . కాని విదేశాలలో అభించే నాణ్యమైన వస్తువుల మీద భారతీయులకున్న మక్కువను స్మగులినంగ్ ముఠాలు సొమ్ముచేసుకునేవి . అప్పుడు కస్టమ్స్ స్మగ్లింగ్ చేసే ముఠాలపైన కన్నేసి వుంచేవి . రెండు దశాబ్దాలుగా మనదేశము లో వచ్చిన సరళీకృత ఆర్ధిక విధానం అన్ని రకాల వస్తువులను అందుబాటులోకి తెచ్చింది . సంగ్లింగ్ చేయవలసిన అవసరము తగ్గిఫోయించి . అలాగని కస్టమ్స్ డిపార్ట్మెంట్ కి పని కేకుండా పోయిందని కాదు ... మారిన పరిస్థితులలో కస్టమ్స్ విభాగము మరింత అప్రమత్తం గా వ్యవహరించాల్సి వస్తుంది . తీవ్రవాదము ప్రపంచవ్యాప్తం గా పంజా విసురుతున్న తరుణం లో ఇప్పుడు స్మగ్లింగ్ పేలుడు పదార్ధాలు , మాదక ద్రవ్యాలు , మత్తుమందులు వ్యాపారము జోరుగా సాగుతుంది . ఇది కస్టమ్స్ శాఖకు మరింత సవాల్ గా మారినది .

గతం లొ విదేశాలకు ఆడవారిని రవాణా చేస్తూ ఒక M.P , ఒక MLA లు పట్టుబడ్డారు . అటువంటి మానవ రవాణా గుట్టు రట్టు చేసినది ఈ కస్టమ్స్ శాఖే . అయితే అదే సమయం లో కస్టమ్స్ విభాగము వైఫల్యము వల్లనే తీవ్రవాదులు పేలుడు సామాగ్రిని భారత తీరాలకు చేర్చగలిగారు . బొంబాయి బాంబు పేలుళ్ళు ముఠా మహారాస్ట్ర తీరంగుండా చేర్చారన్నది ధృవీకరించబడింది . కొందరు అధికారుల అలసత్వము , అవినీతి వల్ల అటువంటి స్థితిని తెచ్చింది . దీనిని బట్టి కస్టమ్స్ విభాగము అప్రమత్తతగా ఉంటే ఏం చేయగల్దో , అలసత్వము ప్రదర్శిస్తే ఏమి జరుగుతుందో అర్ధమవుతుంది .

సభ్యదేశాలు ఎదుర్కొనే సమస్యలను పతి ఏటా అంతర్జాతీయ సమావేశములో చర్చించి ఆ సంవత్సరము అనుసరించ వల్ససిన వ్యూహాలను రచించడమేకాక ఆ సంవత్సరానికి తగిన ఒక కీలక అంశాన్ని ప్రతిపాదిస్తారు . ఆ వరుసలో ఒక సంవత్సరము ఎంచుకున్న థీమ్‌... అని అంటారు . " కస్టమ్స్ & ఎన్విరాన్‌మెంట్ " మన ప్రకృతి వారసత్వ పరిరక్షణ . కస్టమ్స్ , పర్యావరణానికి సంబంధం ఏమిటనే ప్రశ్న కలగడం సహజం ... అయితే అక్రమ రవాణాకి అనర్హమైన అంశముగా దేనినీ భావించడం లేదు .నేడు ఔషధ మొక్కల అక్రమ రవాణా మొదలైనది . అరుదైన జంతువులను అక్రమ రవాణా అధికమైనది . జీవ వైవిధ్యాన్నికున్న విలువ ప్రపంచము గుర్తించినది . అందుకే నేడు జీవవైవిధ్య దేశాలమీద ప్రపంచదేశాల దృష్టి పడింది . ఆయా దేశాల లోని జీవ సంపదను కొల్లగొట్టే మార్గాల్ని అన్వేషించి ప్రయోగిస్తారు . అభివృద్ధి చెందుతున్న దేశాలలో అభిస్తున్న ధరలకు ఆశపడి జీవసంపదను కొల్లగొట్ట్టే ముఠాలు స్మగ్లింగ్ చేస్తున్నాయి . అమాయకు బలి అయిపోతున్నారు . మన దేసము నుంది అక్రమ రవాణా అవుతున్న జీవ సంపద సామగ్రిలో పులుల , సింహాల చర్మాలు , ఏనుగుల దంతాలు , నక్షత్ర తాబేళ్ళు , పాముల - మొసల్ల చర్మాలు , కప్పల కాళ్ళు , కొన్ని చేపలు ఇతర దేశాలకు అక్రమము గా రవాణా అవుతున్నాయి . వీటివల్ల మనుషులకు ఏమిటి నస్టము అని అంటే ... జీవావరణ వ్యవస్థలో వివిధ జంతువులు పోషించే్ పాత్ర , ఆ జీవులు కనుమరుగైతే పర్యావరణం మీద పడే ప్రభావము ... దానివలన మానవ జాతికి ఏర్పడే ముప్పును అర్ధము చేసుకోగలిగితే కస్టమ్స్ డే యొక్క థీమ్‌ ఎంత కీలకమైనదో అర్ధమవుతుంది .

కస్టమ్స్ విభాగము సరిగా పనిచేయాలంటే ప్రజలందరూ సహకరించాలి . అక్రమ రవాణా నివారించాలి . దేశ అర్ధిక పరిస్థితిని పటిస్టపడడానికి దోహదపడాలి .

  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .