గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (Feb 01) (Indian Coast guard day) ఇండియన్ కోస్ట్‌గార్డ్ డే గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము.
ఇండియన్ కోస్ట్‌గార్డ్ డే (ఫిబ్రవరి 1): భారతీయ తీరరక్షకదళం 1977 ఫిబ్రవరి 1న ఏర్పాటయింది. 1978 ఆగస్ట్ 18న తీర రక్ష కదళ చట్టాన్ని చేయటంతో ఇది భారత యూ నియన్ సాయుధ బలంగా రూపొందింది. 10 ఓడరేవులు, 3,700 కిమీ తీరప్రాంత సరి హద్దులను శత్రువుల బారినుండి కాపాడడం, తీరం ఆవలి పారిశ్రామిక స్థావరాల సంరక్షణ, ఆపదలో ఉన్న మత్స్యకారుల రక్షణ, కస్టమ్స్ శాఖకు స్మగ్లింగ్ వ్యతిరేక చర్యల్లో తోడ్పాడు, సముద్ర సంబంధ వాతావరణ రక్షణ మొదలైనవి ఈ కోస్ట్‌గార్డ్ నిర్వహించే విధులు. రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోనిదైన ఈ ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీలో ఉంది.
- =========================================
Visit My Website - >
Dr.seshagirirao.com/
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .