Friday, February 4, 2011

అమర వీరుల దినం , Martyrs Day




గత చరిత్రను , మనపూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (జనవరి 30) అమర వీరుల దినం - గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము.
అమర వీరుల దినం (జనవరి 30): జాతి పిత మహాత్మగాంధీ హత్య జరిగిన ఈరోజును భారత్‌లో అమరవీరుల దినోత్సవంగా జరుపు కుంటారు. జనవరి 30, 1948వ సంవత్సరం లో మహాత్మగాంధీ నివాసం ఉంటున్న ఢిల్లీలో ని బిర్లా భవనం ప్రాంగణంలో గాంధీజీ ప్రార్థ నా సమావేశం వేదికను సమీపిస్తుండగా నాథూరాం గాడ్సే అనే వ్యక్తి రివాల్వర్‌తో గాంధీజీని కాల్చి చంపాడు. ఆనాటి నుండి గాంధీ వర్థంతిని అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ రోజున భారత దేశమంతటా 11 గంటలకి సైరన్‌ మోగు తుంది. భారత దేశ ప్రజలు అందరూ స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు విడిచిన అమర వీరులకు 2 నిమిషాలు మౌనం పాటించి ‘శ్రద్ధాంజలి’ ఘటిస్తారు.
  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .