Wednesday, January 19, 2011

Indian Army Day , భారత సైనిక దినోత్సవం ,ఆర్మీ డే

గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు - జనవరి 15 న - భారత సైనిక దినోత్సవం గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము
  • http://1.bp.blogspot.com/_pYzq4zxbFTY/TQWFZWTEq3I/AAAAAAAAAzU/W5II6JnNOfw/s1600/B.S.F.jpg

ఇండియన్‌ ఆర్మీ డే :
అనేక పద్దతుల్లో అహింసా పోరాటాలు నిర్వహించి స్వాతంత్ర్య సమరయోధులు భారతదేశానికి బ్రిటిషర్ల నుంచి స్వాతంత్ర్యాన్ని సముపార్జించి పెడితె ... ప్రజాసా్మ్య భారతాన్ని మనదేశ సైనికులు కంటికి రెప్పలా కాపాడుకొస్తున్నారు . 1948 లో చిట్టచివరి బ్రిటిష్ కమాండర్ ' సర్ ఫ్రాన్సిస్ బచ్చర్ ' నుంచి భారతీయ సైన్యం తొలి కమాండర్-ఇన్‌-చీప్ గా లెఫ్టినెంట్ జనరల్ కె.ఎం.కరియప్ప బాధ్యతలు స్వీకరించారు . అందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం " జనవరి 15 వ తేదీన " - " ఆర్మీ డే " ని నిర్వహిస్తారు . ఆ రోజున దేశ రాజధానిలో ఆరు ఆర్మీ కమాండ్ ప్రధాన కార్యాలయాల్లో పెరేడ్లు , ఇతర మిలటరీ షోలు నిర్వహిస్తారు . 2010 జనవరి 15 న ఢిల్లో 62 వ ఇండియన్‌ ఆర్మీ డే ని నిర్వహించారు .

మనదేశ ప్రజల పరిరక్షణకోసం తమ జీవితాలు త్యాగం చేసిన అమరసైనికులకు ఈ సందర్భం గా నివాళులర్పిస్తారు. భారత దేశ ప్రజాస్వామ్యం కోసం స్వాతంత్ర్య సమరయోధులు ఎంతటి ముఖ్యమయిన పాత్రనయితే పోషించారో , భారత సైన్యము కూడా అంతే సమానపాత్ర వహించినది . జనరల్ కోదండర మాదప్ప కరియప్ప స్వదేశీయులతోను , బ్రిటిషర్లతోనూ సత్సంబంధాలు కలిగివుండి జనరల్ రాయ్ బచ్చర్ నుంచి తొలికమాండర్ ఇన్‌-చీప్ గా బాధ్యతలు స్వీకరంచిన తర్వాత సైన్యము సరిహద్దుల్లోను , ప్రకృతి వైపరీత్యాలలోనూ అనేకవిధాల పోరాడింది . పోరాడుతూనే ఉంది .
భారతీయ సైన్యము చరిత్ర కొన్ని వేల సంవత్సరాలకు పైబడిందే. మహాభారత కాలాల్లో కురుక్షేత్ర సంగ్రామం లోదాదాపు నాలుగు లక్షల మంది యుద్ధం లో పాల్గొన్నారు . రధాలు , గురాలు , ఏనుగులపై నుంచి యుద్ధం సాగించడమే కాకుండా నేలపై నుంచి కూడా యుద్ధం చేసారు . అప్పట్లో విశ్వశాంతి , ధర్మ పరిరక్షణల కోసం అనేక యుద్దాలు జరిగాయి. క్రమ క్రమం గా నాగరికత పెరిగేకొద్దీం వాయవ్య దిశ గా హిందూకుష్ పర్వతాల ద్వారా చొరబాట్లు పెరిగాయి . ఎన్నో శతాబ్దాల పాటు ఇక్కడ పర్యవేక్షణ లేదు . ఆ తరువాత చొరబాట్లకు అనేక మార్గాలు ఏర్పడ్డాయి. వీటిని ఎదుర్కొనేందుకు గాను ఆయా ప్రదేశాల రాజ్యాధినేతలు యుద్ధాలు చేయాల్సివచ్చేది . స్వదేశీతెగల్లోని సైన్యం ప్రధాన ఆయుధాలు విల్లు , బాణాలు . ఆనాటి యుద్ధ కారణాలు చాలావరకు పరిమితంగా ఉండేవి . మనుగడ , చొరబాట్లకు సంబంధించినవే ఎక్కువ . భారతీయ రాజకీయ చరిత్రలో చెపుకోదగ్గ తొలి చొరబాటు క్రీ.పూ.327 లో అలెగ్జాండర్ అధ్వర్యం లో గ్రీకులది .

ప్రాచీన బారతీయ సాహిత్యం లో , రాజకీయాల్లో యుద్ధాల ప్రస్తావనలు ప్రముఖం గా కనిపిస్తాయి . చంద్రగుప్త మౌర్యులు కాలంలోని సైన్యాన్ని ఈ సందర్భముగా ప్రస్తావించుకోవాలి . ఆనాటి సైనిక చరిత్రకు ' అర్ధశాస్తం ' ఓ ప్రముఖ దర్పణం లాంటిది . కళింగ రాజుల కాలంలో యుద్ధభూమిలోకి ఏనుగులు వచ్చాయి. ఇవి 17 వ శతాబ్దిదాకా సాగాయి. మౌర్యులు కాలం లో శాంతి స్థాపన జరిగినది . గుప్తుల కాలం లో మన దేశానికి ప్రపంచ గుర్తింపు లబించినది . ఈ విదంగా రాజ్యాల రక్షణ కోసం సైన్యము , సైనిక అవసరాలు , ఆయుదాలు పెరుగుతూ వచ్చాయి . బ్రిటిష్ ఆదిపత్యం పెరిగింది ... అనేక స్వాతంత్ర్యియ సమరాల అనంతరం బ్రిటిషర్ల నుంచి స్వేచ్చ పొందిన నేటి భారత సైన్యము పరిధి భాగా పెరిగినది . సరికొత్త సాంకేతిక పరిజ్ఞానము తో వ్యక్తిగత జీవితాలు పణం గా పెడుతూ దేశాన్ని అన్నివిధాలా కాపాడుతూ ఆ పదల్లో ఆదుకునే బారత సైన్యానికి ప్రతి ఒక్కరూ కృతజ్ఞత తో .. వారిని గౌరవిస్తూ దేశవ్యాప్తం గా ఒక రోజు ను జరుపుకోవాలి .

  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .