Monday, January 17, 2011

ప్రపంచ మతము దినము , World Religion Day
గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే 'ఉత్సవాలు ' చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి 'దినోత్సవాలు' చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం 'పండుగలు' చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు... ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (జనవరి 3వ ఆదివారము ) ప్రపంచ మతము దినము (World Religion Da.y )గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

మతం అంటే ..........

మానవ జీవితం లో క్రమశిక్షణను నింపడానికి వచ్చినవే మతాలు . మానవ సమాజం లో తలెత్తే పలురకాల ఇబ్బందులు పరిధి దాటి ఘర్షణలకు దారితీయకుండా ఉండాలంటే ఆ సముదాయము అంగీకరించే ఒక జీవన విధానము అవసరము . ఆ జీవన విధానము ఎటువంటిది అనేది ఆ సముదాయం సమిష్టిగా నిర్ణయించుకుని అనుసరిస్తుంది . అలా ఒక్కొక్క ప్రాంతమ్లో ఒక్కోలాంటి సమాజం రూపుదిద్దుకుంది . స్థానిక అవసరాలకు తగ్గట్టుగానే అక్కడ ఒక సమాజ సమూహము ఏర్పడినది ... దాన్నే మతం అని పిలిచారు . ఆ విదంగా మతము తయారైనది . ప్రపంచలో నేడు కనిపించే మతాలన్నిటికీ పుట్టిల్లు ఆసియా ఖండమే కావడం గమనించాల్సిన విషయము . సనాతన ధర్మం మొదలుకుని తాజాగా పుట్టుకొచ్చిన మతాలన్నింటి వెనకనున్న లక్ష్యము మానవ ప్రశాంతజీవనం . సృష్టిలో ప్రతిజీవి తనవంతు బాధ్యతని నిర్వహిస్తూ తోటి జీవులతో సత్సంబంధాల్ని కలిగివుండేలా చూసుకుంటుంది. మానవుడు కూడా అందుకు భిన్నం కాదు .

ఈ నిర్ధిస్టమైన సమాజ సమూహం గా భావించే మతం లోని జనులంతా సెంటుమెంటు గా ఒకే మాటని నమ్మాలంటే వారందరు ఏదో ఒక వ్యక్తిపైన గాని , విషయం పైన గాని నమ్మకం కలిగి ఉండాలి . అధి ఎవరికీ సొంతం కాని అందరి సొత్తై ఉండాలి . ఆ విదంగా సృస్టించబదినదే " దేవుడు - దెయ్యము , పాపము -పుణ్యము , మంచి - చెడు , స్వర్గము - నరకము. . . అనే ఎనిమిది అంశాల " ఆద్యాత్మిక న్యాయవిచారణ -Mythological Law & Order" .

మతాల మధ్య ఘర్షణ :

సర్వశక్తిమంతుడు , సృస్టికర్త అయిన భగవంతుడు సమస్త జీవులను సృస్టించాడని అన్ని మతాలు నమ్ముతాయి. ప్రపంచ జనాభాలో 99 శాతము మంది ఇలాంటి విశ్వాసము కలవారే వీరినే ఆస్తికులంటాము . అందుకు భిన్నమైన అభిప్రాయము కలిగిన వారూ ఉన్నారు . నాస్తికులు అనబడే వీరి అభిప్రాయం ప్రకారము మానవుడే భవంతుని సృస్టించాడు ... అని అంటారు . ఆస్తికత్వము , నాస్తికత్వము రెండు భిన్నధృవాలు . పూర్తిగా పొంతనలేని అభిప్రాయాలు . ఒకరి ఆలోచన , నమ్మకం మరొకరు ఏమాత్రం అంగీకరించరు . అయినా చరిత్రలో ఎక్కడా వీరి మధ్య ఘర్షణలు జరిగిన దాఖలాల్లేవు . నాస్తికులమీద ఆస్తికులు దాడులు చేయటం , వారి ఆస్తులు ధ్వంసం చేయడం ఎక్కాడ జరిగినట్లు వినలేదు . అదే విధమగా నాస్తికులు తమ ఆలోచనలను ప్రచారము చేస్తారే తప్ప ఆస్తికుల ప్రార్ధనాలయాల మీద దాడులు చేయరు . ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిందడం మనే సత్సంప్రదాయము ఆస్తికులు , నాస్తికులను చూసి నేర్చుకోవాలి . కాని ఆటువంటి సత్సంప్రదాయము ఆస్తికుల మధ్యలోపించడం గమనించాలసిన విషయం . అందరూ ఆ సర్వేశ్వరుని బిడ్డలమనేనని , అంతా ఆయన ద్వారనే ఈ లోకంలోకి వచ్చామంటారు కాని ఆ సర్వేశ్వరుడు ఎవరు అనే దగ్గరే వారికి ఏకాభిప్రాయము కుదరదు . తామంటే తాము నిర్వచించినవాడే సర్వేశ్వరుడని పిడివాదం వల్లే నేడు ఘర్షణ వాతావరణం నెలకొన్నది . మత ఘర్షణల్కు అంతం లేదు . చరిత్రలో క్రూసేడ్ ల వంటివి ఎంత తీవ్రము గా జరిగాయో , ఎన్ని లక్షల మంది ప్రాణాలు కోల్ఫోయారో నమోదైవుంది . నాటి క్రూసేడ్ లనుండి రెండవ ప్రపంచయుద్ధం కాలం లో హిట్లర్ యూదులను ఊచకోతకోయడం వరకు ఎన్నెన్నో మతఘర్షణలు చేదు అధ్యాయాలుగా మిగిలిపోయాయి. నేడు అమెరికా , దాని మిత్ర పక్షాలు ఇరాన్‌ , ఆఫ్ఘనిస్తాన్‌ -వాటి మద్దతుదారుల మధ్య నెలకొనివున్న ఘర్షణ వాతావరణం ఏక్షణములోనైనా మరో ప్రపంచయుద్ధానికి దారితీసే విదంగా ప్రపంచాన్ని మతం ఆధారం గా విడగొట్టి లబ్దిపిందాలని చూస్తున్న శక్తులున్నాయి .

మనిషిని సన్మార్గములో నడిపించడానికి పుట్టుకొచ్చిన మతాలు హింసాత్మక మార్గము వైపు తీసుకెళ్ళడం బాధాకరం . ఘర్షణ వాతావరణము పెచ్చరిల్లితే తీవ్రం గా నస్టపోయేది అత్యంత అల్పసంఖ్యలో నున్న మతస్తులే . ప్రంచము లో అనేక మతాలున్నాయి . అటువంటి మతాల్లో అన్నిటికన్న ఆలస్యము గా పుట్టిన మతం " బహాయి మతం " . ప్రపంచమంతా వీరి సంఖ్య కోటి మంది లోపలే . అమెరికాలో ఉన్న బహాయిలు తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే అన్ని మతాలు తమ తమ మతానకి ప్రాధాన్యతనిచ్చుకోవాలని , ఇతర మతాలతో ఘర్షణకు దిగకూడదని సూచిస్తూ ప్రజలందరిలో మతతత్వముకన్నా ఆధ్యాత్మిక చింతన పెరిగినపుడే అది సాధ్యమవుతుందని ప్రచారము ప్రారంభించినది . 1949 లో జాతీయ ఆధ్యాత్మీక సమావేశాల్ని బహాయిలు నిర్వహించారు . ఆ సమావేశములో బహాయిలందరు ప్రతియేటా " వరల్డ్ రెలిజియన్‌ డే " ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు . వారి పిలుపును మిగిలిన మతాలు గౌరవించినా గౌరవించకపొయినా గత ఆరు దశబ్దాలుగా క్రమము తప్పకుండా బహాయిలు ప్రపంచ మత దినోత్సవాన్ని జరుపుతునే ఉన్నారు . ప్రతి సంచత్సరము జనవరి నెలలో మూడవ ఆదివారాన్ని రెలిజయన్‌ డే గా జరుపుకోవడం అనే సంప్రదాయాన్ని వారు మొదలుపెట్టరు . అత్యంత అల్పసంఖ్యాకులయిన బహాయిలు ఆరంభించిన ఈ రెలిజియన్‌ డే అనే అంశాన్ని ఇతత మతస్తులు కూశా అర్ధం చేసుకుని జరుపుకోవాల్సిన పరిస్టితులు నేడు వచ్చాయి . కాబట్టే నేదు జనవరి నెలలో వచ్చే మూడవ ఆదివారం ప్రపంచ వ్యాపతం గా రెలిజియన్‌ డే ని జరుపుకుంటున్నారు .

మతము పుట్టుక :
  • ancient persian god Mithras

మతముకన్నా మమత గొప్పది అన్నాడు ఓ ప్రాంతం కవి . మానవుడు ముందుగా మానవత్వాన్ని మనసులో నింపుకోవాలి . ఆ తర్వాత మతం గురించి ఆలోచించాలి. ఆస్తికులు చెప్పినా , విజ్ఞాన శాస్త్రం చెప్పినా మానవులందరూ ఒక్కచోటునుండి వచ్చారనే చెపుతుంది . అలా ఒక మూలమునుండి పుట్టినవారు తమ మూలాల్ని మరిచిపోయి మధ్యలో వచ్చిన మతాలకు విలువ పెంచడం వల్లనే ఘర్షణలు , యుద్ధాలు తలెత్తుతున్నాయి. ప్రతి మతం పుట్టుక వెనకున్న గాధ ఒక్కలానే ఉంటుంది . నాటి సమజం లో ధర్మం దారితప్పినప్పుడు ప్రజలు ధర్మ మార్గం వదిలి అధర్మం లోకి మళ్ళి , భోగలాలసులై సృష్టికరకు (దేవుడు) దూరమవుతున్న సమయం లో మానవాళిని మేలుకొలిపి సన్మార్గం ప్రభోదించేందుకు మహానుభావులు ఈ లోకం లో అవతరించారు . హైందవ మతం లొ అవతారాల గురించి చెప్పినా అరేబియాలో పుట్టిన మతాలలో ప్రవక్తల గురించి ప్రస్తావించినా అదంతా ఆనాటి పరిస్థితులను , వ్యక్తులను సంస్కరించే లక్ష్యం తో జరిగినవే. ఏ మతం కూడా ద్వేషన్ని పంచలేదు . అన్ని మతాలు భగవంతునికి , భక్తునికి మధ్య ఉండలసిన బంధం గురించే మాట్లాడతాయి. అన్ని మతాలలలోను స్వర్గం , నరకం అనే ఆలోననన ఉంది . మరణం తర్వాత భగవంతుని ఎదుట నిలబడాల్సిన ఉంటుందనే నమ్మకము ఉంది . పాపం , పుణ్యం అనే పదాలు అన్ని మతాలలోను కనిపింఛేవే . సాటివారికి సహాయపడడం , ఇతరులకు ఎటువంటి కీడు తలపెట్టకుండా జీవించడం పుణ్యకార్యాలుగా అన్ని మతాలలో చెప్పబడి ఉంది . ఆ పుణ్యకార్యాలు ఆచరించినవారు భగవంటుని ప్రీతికి పాత్రులవుతారు . పాపం చేసినవారు శిక్షింపబడతారు . భగవంతుడికున్న సర్వశక్తులలో మానవుని శిక్షించడం ఒకటి ... ఇది కాదనేందుకు వీలులేనిది . ఈ బగవత్ సందేశాన్ని ప్ర్జలకు మళ్ళీ మళ్ళీ తెలియచెప్పేందుకు సందర్భాన్ని బట్టి దైవప్రతినిధులు ఈ లోకం లోకి అవతరిస్తుంటారు . అలా నేడు ఎందరో దైవ దూతలు వచ్చినా వారిలో కొందరికి మాత్రమే అనుచరగణం అత్యధికం గా ఉండి , ఆ పంధా అనుసరించేవారంతా ఒక మతం గా రూపుదిద్దుకున్నారు . ఏ మతం కూడా కొత్తగా పుట్టింది కాదు . నాడు సమాజం లో ఉన్న మతాన్ని సంస్కరించే యత్నం లో భాగం గా కొత్త అలోచనలను , కొత్త బోధనలను ప్రచారం లొకి తీసుకురావడమనేది జరిగింది .
కొత్త ఆలోచనలన్నీ రెండు ప్రాంతాలకె ఎందుకు పరిమితమయ్యాయో తెలియదు . మతం తొలిగా పుట్టింది భారతదేశం లోనే . ఆ భారతదేశము లోనే అనేక మతాలు పుట్టాయి .భారతదేశ సంస్కృతి ఉన్నత స్థితికి చేరిన రోజుల్లో మిగిలిన ప్రదేశాల్లో ప్రజలు చీకతి జీవితం గడుపుతున్నారు . చీకటి ప్రదేశం గా వర్ణించే నేటి ఇజ్రాయిల్ నుండే అనేక కొత్త మతాలు పుట్టుకొచ్చాయి . భారతదేశం లో సనాతన ధర్మం నుండి హిందూమతం , దానినుండి జైన , బౌద్ధ , సిక్కు మతాలు పుట్టుకొచ్చాయి . ఇక ఇజ్రాయిల్ ప్రాంతం లో పుట్టిన మతాలన్నింటినీ కలిపి అబ్రహాం వరసమతాలుగా పేర్కొంటారు . ఆయన తరువాత వరుసగా మోజెస్ , జీసస్ , జరద్రష్ట , మహమ్మద్ , బహావుల్లాలు పుట్టాయి . మతాలలొ అతిపురాతనమైనది హిందూమతానికి స్థాపకుడు లేడో ... తెలీదో కాని దీనికన్నా ముందు మతాలు లేవు . లాలానికి అందని రోజుల నుండి భారతావని లో ధర్మ మార్గం లో జనం నడిచారు . వేదాలు , ఉపనిషత్తులు , రామాయణ , భారతం లు ఇక్కడ పుట్టినవే .దశావతారాలు అలోవనా ఇక్కడిదే .. ఎంతో విశిష్టత కలిగినది హిందూ మతం . . అన్నిటికీ మూలము ఇదే అని అనవచ్చును .

అబ్రహాం మతాలు :

మానవాళికి అందించబడిన తొలి మగ్రంధం గా భావించే హగవద్గీతలో చెప్పిన అంశలనే అటూ ఇటుగా మిగిలిన ప్రంటాలలోనూ ప్రవక్తలు చెప్పారు . ధర్మమార్గం తప్పితె సరిదిద్దడనికి , లొంగనివారిని సంహరించటానికి దైవం ఏదో ఒక రూపం లో అవతరిస్తూనే ఉంటాడు . అలా అవతరించిన వ్యక్తి అబ్రహాం . క్రీస్తుకు పూర్వం 2 వేల సంవత్సరాల క్రితం ఆయన జర్మించాడన్నది చరిత్ర . యూదులు , క్రైస్తవులు , ముస్లిం లందరికీ మూలపురుషుడు అబ్రహామే. జెనిసిస్ -అనేగ్రందములో ఆయన్ని భగవంతుడు ప్రత్యేకంగా పంపాడని ... ఆయన సంతానమే ఆ తర్వాత కాలములో ఆ ప్రదేశమంతా విస్తరించారని చెప్పబడి ఉంది . అబ్రహాం పేరు " అబ్రమ్‌ " ... అబ్ రామ అని కూడా అక్కడక్కడ ప్రస్తావించారు . అత్యంత గౌరవనీయుదైన తండ్రి గా ఆయన్ని కొలిచారు . సర్వజాతులకు ఆయనే తండ్రి అవుతాడని , దేవుడు దీవించి పంపారన్నది నమ్మకం . దైవం ఒక్కడేనన్నది ఆయన చెప్పినది . ఆయన ప్రకటించిన గ్రంధమే " ఓల్డ్ టెస్టమెంట్ " . దైవము ఒక్కడేనని ... ఆయన్ని పలు పేర్లతో పిలవవచ్చని భగవద్గీతలో చెప్పిన అంశం అలాగే అబ్రహాం నొటివెంట కూడా భగవంటుడు ఒక్కడేనని ఆయన తనను ఈ లోకమ్లోకి పంపాడని చెప్పడం జరిగింది .

జూడాయిజమ్‌ :
అబ్రహాం కూడా మానవుడే ఆయనలోనూ లోపాలు ఉన్నాయి . ఆయన మీద ఎదురు దాడులు జరిగాయి. ఆయం తప్పించుకుని కొత్త ప్రదేశాలము వెళ్ళాడు . అబ్రహాం మనవడు ' జాకోబ్ ' కి 12 మంది కొడుకులు . వీరు ఒక్కొక్క తెగకు అధిపతులు . స్థానిక కరువు పరిస్థితులను తట్టుకోలేక ఈ జిప్టు ప్రాంతానికి వలసవెళ్ళిన వీరిని అక్కడి ' ఫారో ' చక్రవర్తులు బానిసలు గా వాడుకుంటారు . అలా 400 సంవత్సరాలు బానిసత్వము తరువాత ప్రవక్త మోజెస్ ద్వారా ఇజ్రాయిల్ జాతివారు తిరిగి తమ స్వస్థలానికి రాగలుగుతారు . వారి ప్రయాణం మధ్యలో సైనాయ్ పర్వతం మీద భ్గవంతుడు మోజెస్ కి ' టెన్‌ కమాండ్ మెంట్స్ ' అందిచాడు . ఆ మోజెస్ ని అనుసరించనవారే యూదులు . జుడాయిజమ్‌ అబ్రహాం వారసత్వ మతాలలో తొలి మతం . జెరూసలేమ్‌ వీరి పవిత్ర నగరం . అక్కడ తొలిమందిరం వారు నిర్మించుకున్నారు . నేటి ఇజ్రాయిల్ దేశం యూదుల దేశం రెండవ ప్రపంచయుద్ధం తర్వాత ఏర్పడిన దేసం ఇజ్యాయిల్ . ప్రపంవం లోని పలుప్రాంతాలలోకి పారిపోఇ తదాచుకున్న యూదులంతా తిరిగి స్వదేశానికి వచ్చిచేరారు.

జొరాస్ట్రియన్స్ :
క్రీస్తుపూర్వం 650 లో పుట్టింది జొరాస్ట్రియన్లు ల మతం . ఇది పర్షియన్‌ ప్రాంతం లో పుట్టినదే. జరద్రష్ట దీని స్థాపకుడు . అగ్ని ఆరాధకులు వీరు. ఇస్లాం పుట్టుకవరకు జొరాస్ట్రియన్‌ మతం ఆ ప్రాంతాం లో విస్తరిల్లింది. ఇస్లాం రాకతో జొరాస్ట్రియన్ల మీద దాడులు మొదలయ్యాలి. ముస్లిం ల దాడులనుభవించలేక ఇస్లాం లోకి మారడమో లేక ఆ ప్రాంతం వదలి పారిపోవడమో చేయాలసివచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో వారికి ఆశ్రయమిచ్చంది భారతదేశం . మన దేశం పశ్చిమ తీరప్రాంతం లోని సూరత్ ప్రాంత పాలకుల ఆదరణ్లో తిరిగి ఆ మతం వారు ముందడుగు వేయలలిగారు . పర్షియా ప్రాంతం నుండి వచ్చినవారు కాబట్టి వారిని పార్శీలని పిలవగా నేడు వారిది పార్శీ మతం గా పిలుస్తున్నారు . శాంతికాముక మతం ఇది . పర్షియాలో జొరాస్టియన్‌ మతం పుట్టిన 50 సంవత్సరాల తర్వాత (క్రీస్తు పూ.600) భారతదేశము లో జైన మతం వచ్చింది . మహావీరుడు సనాతన ధర్మం లో నుండి వెలుపలికి వచ్చి చేసిన బోధనలు జైన మతస్థాపనకు దారితీశాయి. వైదిక మతం లోని జంతుబలులను నిరసించి జీవహింస కూడదని ... అది పాపమని ... శాకాహారమే తగిన ఆహారమని ఆయన బోదించాడు . ఇంకా ఏం బోధించాడంటే - సర్వసంగ పరిత్యాగిలా సత్యాన్వేషణ చేయాలి , జ్ఞానం ఆర్జించాలి , ముక్తిని పోందాలి, ఇది జైన మునులు బోధించిన అంశము. కర్మలనుండి విముక్తి పొందినప్పుడే ముక్తి సాధ్యం ... మోక్షము పొందినవాడు సిద్ధుడు ... ఆ యత్నం చేయనివాడు సంసారి .

జైన , బౌద్ధ మతాలు :

జైన తీర్ధంకరులు చూపిన మోక్షమార్గం లోనే జైనులు నడవాలి . ధర్మం చిరస్థాయిగా నిలిచేది , అహింస , సత్యం , ఆస్తేయ , బ్రహ్మ చర్యం , అపరిగ్ర్హ సూత్రాలు జైనులకు మూలమైనవి . జైనం తరువాత వచ్చింది బౌద్ధం . గౌతం బుద్దుడి కాలం క్రీ.పూ.563 వ సంవత్సరం . మహావీరుదుడు చెప్పిన అహింస తోపాతు కోరికలే దు:ఖానికి మూలకారణం అని ఈ లోకం లోని బంధాలను తెంచుకుని పరలోకం లోకి వెళ్ళాలని బుద్ధుడు బోదించాడు . వైదిక మతం నుంచి వచ్చినదే బౌద్దం . బౌద్ధం కర్మలను నమ్ముతుంది . . . మరుజన్మలను నమ్ముతుంది . బౌద్ధం అతివేగంగా ఆసియా ఖండమంతా వ్యాప్తి చెందినది . నేడు చైనా, జపాన్‌ , శ్రీలంక , కంబోడియా , ధాయ్ లాండ్ వంటి దేశాలలలో బౌద్ధమతం బహుళ ప్రచారం లో ఉన్నది . ఇది శాంతికాముక మతం .

క్రైస్తవం :
యూదిడి గా జన్మించిన వారిలోని భోగలాలసను తొలగించే యత్నం చేసిన ప్రవక్త జీసస్ . భగవంతుని పుత్రుడు గా ఈ లోకం లోకి పంపబడ్డాడు . ఆయన ఈ లోకం లోకి సువార్త సందేశం అందించేందుకు ఏతెంచాడన్నది విశ్వాసం . ఆయనకు తండ్రి లేడు . భవంతుడే వరప్రసాదిగా అందించాడు అని నమ్మకం . ఆయన భోదనల సంలననమే బైబిల్ . జీసస్ బోధనలను యూదుపాలకులు వ్య్తిరేకించి శిలువవేయగా , అంతర్ధానమై స్వర్గం చేరిన ఆయన తిరిగి ఏ సమయం లోనైనా ఏతెంచుతాడని క్రైస్తవులు ఎదురు చూస్తుంటారు . క్రైస్తవుల విశ్వాసం ప్రకారం యేసే దేవుడు , యేసే మానవుడు ఆయన ద్వారానే ముక్తి లభిస్తుంది . క్రీస్తు బోధనలలఓ ముఖ్యమైనవి ... దయ , కరుణ , సహనం , పొరుగువారిని ప్రేమించడం . మానవాళి అంతటికీ వర్తించే అంశాలు అవి .
ఐతే వాటిని కూడా యూదుల రాజులు సహించలేక జీసస్ ని ఒక తెరుగుబాటుదారుడి గా బంధించి హింసించారు . 4 వ శతాబ్దం తరువాత క్రైస్తవ మతం మరింత పుంజుకుంది . రోమన్‌ సామ్రాజ్య ఆదరణతో ఐరోపా మొత్తం విస్తరించినది . ఐరోపా దేశాల వలస సామ్రాజ్య నిర్మాణం క్రైస్తవాన్ని ఆసియా , ఆఫ్రికా , అమెరికా ఖండాలకు తీసుకు వెళ్ళింది . నేడు ప్రపంచం లో అతిపెద్ద మతం క్రైస్తవం ద్వేషానికి తావులేని శాంతి ప్రేమికులు ఈ క్రైస్తవ మతస్థులు .

ఇస్లాం :

క్రీస్తుశకం ఆరంభం అయి 600 సంవత్సరాల తర్వాత వచ్చిన ప్రవక్త మహమ్మద్ . . . అరేబియాలో సరికొత్త మతానికి పునాదులు వేశాడు . పూర్వము అరేబియా ప్రాంతం లో విగ్రహారాధన ఉండేది . అక్కడి తెగలు తమ దేవతలను ఆరాధంచేవారు. జంతుబలులు ఉండేవి . అటువంటి వాతావరణం లో తనకు భగవంతుదు స్వయం గా వివరించిన కొత్త జీవన విధానం ప్రజలకు పంచుతానంటూ మహమ్మద్ ప్రవక్త రంగప్రవేశం చేశాడు . ఆయనకు అందించబడిన పవిత్ర గ్రంధము ఖురాన్‌ దైవప్రసాదమే అని నమంచుతారు . అయితె మహమ్మద్ ప్రవక్త బోధనల్కు అంత సులభముగా అంగీకారము లభించలేదు . నాటి పాలకులు ఆయన్ని శత్రువునానే భావించారు . ఆయన్ని అంగీకరించక తరిమి వేశారు . అయినా మహమ్మద్ తన బోధనల్తో ప్రజం ఆకట్టుకోగలిదాడు . వారినదరినీ కూడగట్టుకుని మక్కా నగరం ప్రవేశించి తన కొత్త మతానికి దానిని పవిత్ర ప్రాంతం గా ప్రకటించగలిగాడు . నాటినుండి అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన మతం ఇస్తాం . ఇస్తాం అంటే శాంతి ... ప్రజలందరూ శాంతి సుఖాలతో ఉండాలని అందుకోసం భగవంతునికి బద్దులై జీవితం గడపాలని బోధించాడు . ప్రతిరోజూ ఐదుసార్లు ప్రార్ధనలు చేయడం , తన ఆదాయం లో కొంతమే పేదప్రజల్కు దానం చేయడం వంటి ఎన్నో కొత్త విధానాలను ప్రవేశపెట్టాదు . ఆ నాడు అరేబియా ప్రాంతం లో ఉన్న ప్రజలకు వారి జీవన విధానాలకు భిన్నమైన మార్గం చూపడం ప్రవక్త మహమ్మద్ సాధించిన ఘనత . ఇస్లాం కూడ అబ్రహాం సంతతి మతమే . ఆయన ప్రస్తావన ఇస్లామిక్ గ్రంధలోనూ ఉంటుంది . ఇలా ఒక మతంతో సంబంధం కలిగిన కొత్త మతం పుట్టుకురావడమే ఈ లోకలోని ఆనవాయితీ .

సిక్కు మతం :

గురునానక్ వ్యవస్థాపకుడిగా పుట్తినది సిక్కు మతం . ఇది 15 వ శతాబ్దం లో భారతదేశము లో ప్రారంభమైనది . నాటికి భారతదేశాన్ని ముస్లిం పాలకులు పరిపాలించేవారు . స్థానిక హిందూ మతం మీద వారి ప్రార్ధనా మందిరాలమీద దాడులు చేస్తుండేవరు . అలాంటి సమయం లో హిందూమతం లో క్షాత్ర ధరమం పాటించే వీరులను తయారుదేసేందుకు జరిగిన యత్నం సిక్కుమతం స్థాపన . మతపరంగా ఇస్లాం ను వ్యతిరేకించలేదు . ముస్లిం పాలకుల ధారుణ్యాన్ని వ్యతిరేకించారు . ఇస్లాం , హిందూ మత సంప్రదాయాల కలయికయే సిక్కు విధానం .

బహాయి :
సిక్కు మతం తరువాత మరో నాగొందల ఏళ్ళకు వచ్చిన మతం బహాయిమతం . ఇది ఇస్లాం మతం లోనుండి బయతకు వచ్చింది . మహమ్మద్ మాత్రమే చివరి ప్రవక్త అని , ఇక ఆయన తర్వాత మరో ప్రవక్తకు తావులేదనేది ఇస్లాం విస్వాసము . అది వాస్తవం కాదని ఇరాన్‌ లొని షిరాజ్ లోని సియ్యద్ ఆలీ మహమ్మద్ తాను ప్రవక్త గా ప్రకటించుకొని బోధనలు చేసాడు . ఆయన అనుచరులను బాబీలనేవారు . ఆలీ తనయుడు అబ్దుల్ బహవుల్లా దీన్ని విస్తుతపరిచాడు. బహవుల్లా బోదించిన మతమే బహాయి మతమైనది . బహాయిలను ఇస్లాం అంగీకరించలేదు . వీరిని ఇరాన్‌ నుండి తరిమికోట్టారు . ఇస్లాం దాడులకు తట్టుకోలేని బహాయిలు ప్రపంచం లోని పలు దేశాలకు వల్సవెళ్ళరు . భగవంతుడు ఒక్కడేనని స్త్రీ పురుష వివక్షత కూడదు అని ... సత్యం , ధర్మం చిరస్థాయిగా నిలుస్తాయని , అధిక ధనం , పేదరికం ఉండకూడదని బహాయిలు బోధిస్తారు . బహాయి తరువాత నేటివరకు ఇంకో మతము రాలేదు .

మతాన్ని అర్ధం చేసుకోవాలి :
మైవము ఒక్కడేనని నమ్మకము తో మొదలైన మతాల అన్నిటిలో చీలికలు రావడం గమనార్హం . ప్రతి మతం లో ఒకటి కన్నా ఎక్కువ శాఖలున్నాయి . ప్రతిశాఖ తన ప్రత్యేకతను కాపాడుకోవాలనుకుంటుంది . ప్రతి మతానికి తమదైన ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. వాటి అమలు విషయం లోనూ నేడు విభేదాలు తలెత్తుతున్నాయి . మతాల మధ్య విబేదాలు ప్రమాదకరం . మతాలన్నీ మంచినే బోధిస్తున్నాయి . మతాల మూలసూత్రాలను సరిగా అర్ధం చేసుకున్న వారెవరూ మరో మతం తో ఘర్షణ పడాలనుకోరు . తన మత సూత్రాలను తు.చ తప్పక పాటించేవారు ఇతర మతాలను తప్పకుండా గౌరవించ గలుగుతారు . సత్యం , ధర్మం .... అవి శాశ్వితమయినవి . వాటికి మతం రంగు అంటదు . ఆ విషయం ప్రచారం చేయడమే " వరల్డ్ రెలిజియన్‌ డే " లక్ష్యము . ప్రతి ఒక్కరూ తమ మతం గురించేకాక ఇతర మతాల మూలసూత్రాల్ని తెలుసుకునేలా చేయడం ఈ రోజు ముఖ్య ఆశయం . ఆ విధంగా ప్రతి ఒక్కరు అర్ధం చేసుకున్నప్పుడు ఈ లోకం లో శాంతి , సుఖాలు నెలకొంటాయి .
Simple Classification of Religions :
  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .