Friday, November 26, 2010

World Tolerance Day , వరల్డ్ టాలరెన్స్ డే , ప్రపంచ సహన దినోస్థవం


  • ప్రపంచ సహన దినోత్సవం ఏటా నవంబర్ 16 న జరుపుకుంటున్నారు ..
గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .
పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (నవంబరు 16 న ) సమాజములో సహనము (ఓర్పు) గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

సహనము , ఓర్పు ... మనిషికి సహజ లక్షణము . మనుషుల మధ్య ఎన్నో తేడాలుంటాయి ... లావు , పోడుగు , చర్మపు రంగు , జుట్తు వంటి తేడాలు అంగీకరించినట్లే భిన్న ఆలోచనా విధానాలను సహజమైనవిగా అంగీకరించాలి . తన ఆలోచనా విధానానికి అందరూ బద్దులైవుండాలన్న నియంతృత్వపోకడ ఎంతమాత్రము సరైనది కాదు . ఆ ధోరణి ప్రదర్శించే వారంతా తమ సహజ సహన గుణం కోల్పోయి , అసహము లో కొట్టుమిట్టాడి , అసహనం నుండి పుట్టుకువచ్చే విధ్వంసపు ఆలోచనలతో తోటి వారికి , మొత్తం మానవాళికి నస్టము కలిగిస్తూ ఉన్నారు . శాంతియుత సహజీవనము ఉన్నప్పుడు సరైన లక్ష్యము దిశగా వెళ్తున్నట్టే లెక్క . . ఆ దిశ బాగున్నప్పుడు ప్రపంచాభివృద్ధి బాగుంటుంది . ఇటువంటి భావనలున్నప్పుడు తోటివారి పట్ల ఈర్శాద్వేషాలుండవు . దయాగుణము ఉంటుంది .

సహనమంటే అవతలి వారిని నిర్లక్ష్యం చేయుట లేదా బలవంతము గా భరించటం కాకూడదు . అవతలివారిని అర్ధముచేసుకుని గౌరవించగలిగిన సహనం కావాలి . ప్రపంచము లో లోపిస్తున్న ఈ " సహనము" మీద దృస్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి 1995 వ సంవత్సరాన్ని " ఇయర్ ఆఫ్ టాలరెన్స్ " గా జరపాలని తీర్మానించింది . ఆ సంవత్సరము నవంబరు 16 న సమావేశమైన యునెస్కో దేశాలు సహన సూత్రాలతోకూడిన ఒక సమగ్రమైన ప్రకటనను జారీచేసాయి . సహనం అవశ్యకతను గుర్తించాలన్న లక్ష్యము తో ప్రకటన విడుదలైనందున ప్రతి ఏటా ఆరోజునే ' ప్రపంచ సహన దినోత్సవం' గా జరపాలని నిర్ణయించారు .

ఎప్పుడో వందల సంవత్సరాల నాటి చేదు జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ తరువాత తరమువారిలో అనవసర విద్వేషాలకు , ఆగ్రహాలకు కారణమయ్యే కంటే ఆ చేదు జ్ఞాపకాఅలకు స్వస్తిపలికి ప్రశాంతజీవనానికి దోహదపడడము మంచిది . గతాన్ని మనం మార్చివేయాలి . కుల , జాతి , మత , సంస్కృతి , దేశ గోడలని చేదించి ప్రపంచ శాంతి సౌభ్రాతృత్వానికి తోడ్పడాలి . పొరుగు వారు ఏదో మాట అన్నారని అనవసర రాద్ధాంతము చేయక సహనము తో మంచి చెడులను గురించి ఆలోచించాలి . మంచినే బోధించాలి . . .మంచినే ఆచరించాలి . ప్రపంచీకరణ ప్రజలను దగ్గరికి తెచ్చింది . ఒకరి గురించి మరొకరు తెలుసుకునే అవకాశము పెరిగించి . అతివేగముగా సమావారము అందుతున్న నేపధ్యము లో బిన్నత్వం పై ఏకత్వం దిశగా ప్రపంవం పననిస్తుందేమోనన్న అనుమానము వస్తుంది కొందరికి . కనుకనే అందరూ సహనము తో (ఓర్పు తో) ప్రపంచ శాంతి కోసము పాటుపడాలి . చిన్న పెద్ద , పేదలు , ధనికులు , విద్యావంతులు , నిరక్షరాస్యులు , ఉద్యోగులు , నిరుద్యోగులు ఎవరైనా సరే దయతో , కరుణతో చేసే చిన్న చిన్న చర్యలే కొండంత బలము నిచ్చేదిగా ముందుకు సాగాలి .
  • =====================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .