Thursday, November 25, 2010

World Kindness Day, ప్రపంచ దయాగుణ దినము




  • ఏటా నవంబర్ 13 వ తేదీన " వరల్డ్ కైండ్నెస్ డే(Kindness Day) " నిర్వహిస్తూ ఉన్నారు .
గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .
  • పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (నవంబర్ 13) సమాజము లో దయాగుణము గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము
ప్రపంచము లో అశాంతి పెరిగిపోతున్నది . అన్ని దేశాల వారిని ఉగ్రవాదము భయాందోళనలకు గురిచేస్తున్నది . ఏ క్షణము లో ఎటునుండి ఏ ప్రమాదము ముంచుకు వస్తుందోతెలియని పరిస్థి. ఏ తరహా బాంబు ఎవరిని బలితీసుకుంటుందో తెలియటములేదు . ఈ సమస్యకు పరిష్కారము కనుక్కోవలసిన అవరసము ఉంది . ప్రపంచమంతా ఒక్కటే ... అంతటా మానవులే , సృస్టి పరముగా అంతగా తేడా లేకున్నా కృత్రిమముగా సృస్టించుకున్న తేడాలు మనుషులను విడదీస్తునాయి . తమకు తాముగా సృస్టించుకున్న తేడాల్ని మూర్ఖం గా అనుసరిస్తూ ఇతర ఆలోచనా విధానాలను అంగీకరించని మనస్తత్వం పెరిగినందునే మానవాళి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నదన్నది .

జాలి , దయ , సహనము , కరుణ , కోపము , ఈర్శ్య , ఆందోళన ... అన్నీ కూడా మానవుల్లో ఉండే వివిధ కోణాలు . విభిన్న పరిస్థితుల్లో వివిధ రూపాల్లో ప్రతిస్పందించడం మానవ నైజము . అయితె వీటిలో కొన్ని అనుకూల ధోరణికి ప్రతిబింబాలయితే కొన్ని వ్యతిరేక ధోరణి స్పందనలు . శాంతము గా తోటివారికి సాయపడే గుణము కలిగి ఉండడం గొప్ప సంగతి . కస్టము లో ఉన్న వారిని ఆదుకోవాలన్న కరుణాభావం పరిసరాలన్నింటినీ పర్వదినం గా మార్చగల అపూర్వ శక్తిని కలిగివుంటుంది . దేశ సరిహద్దులు , సంస్కృతులు , కులము ,మతము , జాతి అన్నవేమీ లేకుండా మనమందరం ప్రపంచ పౌరులమన్న భావన కలిగి ఒకరి పై ఒకరు దయాభూత గుణము కలిఉండడాని చేసే ప్రయత్నమే ఈ ప్రపంచ దయాగుణ దినోత్సవం ముఖ్య ఉద్దేశము .
లేనివాడికి తగిన రీతిలో మనకున్నది కొంతలో కొంత ఇచ్చి సహాయపడడదే దయాగుణము . కస్టములో ఉన్నవారికి కొన్ని మంచి ఓదార్పు మాటలు ఎంతో ఊరటనిస్తాయి . ప్రపంచీకరణ ప్రజల్ను దగ్గరికి తెచ్చంది . అన్నింటా ఓ తోడు , మన పక్క నున్నవారు అవసరం వస్తే సాయపడరారన్న చిన్ని ఆశ చాలు బ్రతుకు తెరువు లో ఎంతోభారము తగ్గిపోతుంది . చిన్ని చిన్ని అవసరాలు , చిన్నపాటి మాటతో లభించే సాంత్వన చాలు ఎదుటివారికి , మనకు సంతృప్తిని , శాంతిని కలిగిస్తుంది .
  • ============================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .