skip to main |
skip to sidebar
జాతీయ పత్రికా దినోత్సవం, National (India) press Day
- ----
- జాతీయ పత్రికా దినోత్సవం --నవంబర్ 16
- ఒక దేశము లో ప్రజాస్వామ్యము సక్రమముగా పనిచేస్తున్నదీ లేనిదీ తెలుసుకోవాలంటే ఆ దేశములో పత్రికా రంగాన్ని పరిశీలిస్తే చాలు . పత్రికా రంగము మీద ఎటువంటి ఆంక్షలు లేకుండా పత్రికా స్వాతంత్ర్యము అమలవుతుంటే ఆ దేశము లో ప్రజాస్వామ్యపాలనకు , చట్టబద్దపాలనకు ఢోకాలేనట్టే .
- జాతీయ పత్రికా దినోత్సవం (నవంబర్ 16): అధికారంలో ఉన్న వ్యక్తుల చేత, వ్యవస్థల ఇష్టాయిష్టాల వల్ల ప్రభావితం కాకుండా శక్తిమంతమైన ప్రసారమాధ్యమంగా అత్యున్నత ప్రమాణాలను పాటించేలా చూడటం లక్ష్యంగా భారతదేశంలో నవంబర్ 16, 1966వ సంవత్సరంలో ‘ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ స్థాపించారు. ప్రతిసంత్సరం ఈ రోజున ‘నేషనల్ ప్రెస్ డే (జాతీయ పత్రికా దినోత్సవం)’గా జరుపుకుంటారు.
పత్రికారంగంలో ఉన్నత ప్రమాణాలను పాటించేందుకు మనదేశంలో నవంబరు 16వ తేదీని జాతీయ పత్రికా దినంగా 1966 నుంచి పాటిస్తున్నారు. భారత తొలి ప్రెస్ కమిషన్ 1956లో సిఫార్సు మేరకు 1966 నవంబరు 16న ప్రెస్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. ప్రెస్ కౌన్సిల్ పత్రికారంగాన్ని పరిశీలించటంతో పాటు వార్తల తీరుతెన్నులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వృత్తిపరమైన అక్రమాలకు పాల్పడిన పత్రికలు, సంస్థల చర్యలను విమర్శించటం,అభిశంసించటం, చర్యలకు సిఫార్సు చేస్తుంది. పత్రికా స్వేచ్ఛకోసం పనిచేయాలన్నది లక్ష్యం. ప్రపంచంలో అనేక దేశాలలో ప్రెస్ కౌన్సిళ్లు ఉన్నాయి. అయితే మనదేశ కౌన్సిల్‌కు ఉన్న ప్రత్యేకతేమంటే ప్రభుత్వశాఖలపై కూడా తన అధికారాన్ని వినియోగించే అవకాశం కలిగి ఉంది. పత్రికలు, మీడియా స్వయంగా ఉన్నత ప్రమాణాలను నిర్ణయించుకొని అమలు జరిపే విధంగా ప్రెస్‌కౌన్సిల్ ప్రోత్సహిస్తుంది.
గత పన్నెండు సంవత్సరాలుగా ప్రెస్ కౌన్సిల్ పత్రికా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యల గురించి ప్రతి నవంబరు 16న సెమినార్లు నిర్వహిస్తున్నది. ఈ ఏడాది హైదరాబాదులో మారుతున్న భారత మీడియా రూపురేఖలు అనే అంశంపై సెమినార్ నిర్వహిస్తున్నది.
అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనలోని 19 ఆర్టికల్‌కు అనుగుణంగా పాలకులు పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, వారికి పత్రికా స్వేచ్ఛ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినంగా మే 3వ తేదీని ప్రకటించింది. ఈ సందర్భంగా పత్రికా స్వేచ్ఛకు విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థలు, సంఘాలకు అవార్డులను అందచేస్తున్నది. పత్రికా స్వేఛ్చకు అనేక దేశాలలో ముప్పువచ్చిన తరుణంలో 1997లో ఈ అవార్డును ఏర్పాటు చేశారు.
For more details -> World Press freedom Day - ====================================- =
Visit My Website - >
Dr.seshagirirao-MBBS
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .