Sunday, September 19, 2010

ఉమెన్స్ ఫ్రిండ్ షిప్ డే , Womens Friendship Day


  • ఇండియా లో జాతీయ ఉమెన్స్ ఫ్రండ్షిప్ డే (National women's friendship day ) ని సెప్టెంబర్ 3 వ ఆదివారము జరుపుకుంటారు .... every year September 3rd .
స్నేహానికి లింగవివక్ష లేదు . స్నేహము స్వచ్చం గా సాగితే ఆడైనా , మగైనా ఒక్కటే . ఇద్దరు మగవాళ్ళ మధ్య అతితే స్నేహం చిరకాలం కొనసాగుతుంది , కాని ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సదరు స్నేహము దీర్ఘకాలము కనసాగలేదన్నది సాధారణంగా చలా మందికి ఉండే అభిప్రాయము .. కాని ఈ అభిప్రాయం లో నిజం లేదు . ఎన్నాళ్ళయినా , ఎన్నేళ్ళయినా మహిళల స్నేహం లో మార్పుండదు . పనుల ఒత్తిడివల్లనో , మరే ఇతర కారణం గానో తమ స్నేహాన్ని కొనసాగించలేకపోవచ్చు . లేదా కొంతకాలం సదరు స్నేహానికి అంతరాయం రావచ్చు . కాని మనసు పొరల్లో భద్రం గా ఆ స్నేహపరమళాలు నిక్షిప్తమై ఉంటాయి . సమయం వచ్చినప్పుడు స్నేహం తాలుకా అనుబంధాలు అనుభూతులు గుప్పుమంటాయి . మహిళల నడుమ స్నేహము గాఢత ఉంటుంది .

స్నేహానికి వయస్సు లేదు , ప్రాంత , కుల , మతాలు లేవు .. ఎప్పుడైన ఎక్కడైనా జనించవచ్చు .. ఒక మంచి మిత్రురాలు ఎక్కడైనా ఉండవచ్చు . అయితే సదరు స్నేహము లో స్వచ్చత తప స్వార్ధం ఉండకూడదు . అనుభందం విషయం లో స్త్రీలు చాలా స్థిరం గా ఉంటారు . భూమి పై అత్యంత మానసిక , శారీరక్ సౌందర్యము కలిగిన వారు మహిళలే . ఆడవాళ్ళ మధ్య స్నేహానికి .. స్త్రీ -పురుషుల మధ్య స్నేహానికి తేడా లేకపోయినా వ్యవహార శైలి లో ఎంతో తేడా ఉంటుంది . ఆడ , మగ మధ్య ఆకర్షణ ఉంటుంది . . అది స్వార్ధము . మహిళల తొ స్నేహం విషయం లో మగవారు సున్నితం గా వ్యవహరించాలి . స్నేహానురాగలును పంచడం లో మహిళల్లో భావోద్రేకం కనిపిస్తుంది . అనుభందము అంతులేనిదిగా ఉంటుంది . మగవారికి మహిళ మిత్రులు ... భార్య , అమ్మ , బాల్యస్నేహితురాలు , సోదరి , కాలేజి సహవిద్యార్ధి , సహోద్యోగి ... ఎవరైనా కావచ్చు . ఇద్దరు ఆడవారు , లేదా ఇద్దరు మగవారు స్నేహితులైతే దాన్ని అంతగా ఎవరూ పట్టించుకోరు - అస్సలు గుర్తించరు . అదే ఇద్దరు ఆడ - మగ స్నేహితులైతే రకరకాల అనుమానాలు , సందేశాలు వేధిస్తుంటాయి . గుస గుస లు వినిపిస్తూ ఉంటాయి .. వాటి అన్నిటికీ అతీతం గా స్నేహం స్వచ్చం గా సాగినపుడే సదరు స్నేహము అర్ధవంతమవుతుంది . మహిళలో స్నేహము ... అమ్మ , అత్త , సోదరి ,వదిన , మరదలు , తోడికోడళ్ళు , కూతురు , కోడలు , సహ ఉద్యోగి , ఇరుగు పొరుగు వారు మొదలైన వారు అయి ఉంటారు .

చరిత్ర :
ప్రతిచోటా గల మహిళా స్నేహితురాళ్ళను ప్రోత్సహించే ఉద్దేశ్యము తో వారి స్నేహాన్ని గుర్తించే ప్రక్రియ లో భాగం గా 1999 లో ' కప్పా డెల్టా సొరొరిటి ' ఈ నేషనల్ ఉమెన్స్ ఫ్రండ్-షిప్ డే ను సృస్టింది . వివిద రాస్టాల గవర్నర్లు ఈ రోజు ప్రత్యేకతకు ఆమోదముద్ర వేసారు . స్నేహితురాళ్ళకు స్నేహం విలువ తెలుసు . మిగతా వారికంటే బాగా అర్ధం చేసుకునే శక్తి వారిలో ఉంటుంది . ఆ స్నేహం లో ప్రేమ ఉంటుంది . అనురాగం ఉంటుంది . అప్యాయత ఉంటుంది . కస్టాలను పంచుకునే ఓర్పు , సహనము ఉండి తోడవుతారు . సంతోషము పంచుకొని ఉత్సాహాన్ని , ప్రోత్సాహాన్ని అందిస్తారు .

ముగింపు :
ఏ స్నేహము అయినా పరిణతి , పరిపక్వత ఉన్నప్పుడే వికసిస్తుంది . బహిళల స్నేహమూ ఇందుకు అతీతం కాదు . ఊరికే ఉబుసుపోని కబుర్లు కోసమో లేకపోతే కాలక్షేపం కోసమో స్నేహం చేయాలనుకుంటే అది తాత్కాలైకమే అవుతుంది . నిజానికి అది స్నేహము కాదు ... తోడు అంతే . స్నేహము లో నిజాయితీ ఉన్నప్పుడు ఆ స్నేహితురాళ్ళ నడుమ ఉండే బాంధవ్యము దృఢం గా సాగుతుంది . అటువంటి స్నేహం ఎల్లవేళల కాపాడుకోవాలి . స్నేహము అవసరము కోశం వాడుకోకూడదు .. స్నేహితుల అవసరాన్ని గుర్తించగలగాలి . స్నేహమే అవసరమన్నట్లు ఉండాలి .



  • ==============================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .