Tuesday, September 14, 2010

Bal Vikash Day , బాలవికాస్ దినోత్సవం



శ్రీ భగవాన్‌ సత్య సాయిబాబా గారిచే 1969 సెప్టెంబర్ 12 వ తేదీన బాలవికాస్ ను ప్రారంభించారు . నేటి బాలలే రేపటి పౌరులు . మానవతా విలువలు తో కూడుకున్న విద్యను 5-15 సంవత్సరాల పిల్లలలో అందించే ఉద్దేశముతో ఈ మహత్తర కార్యక్రమాన్ని బాబా గారు చేపట్టేరు . సత్యము , ధర్మము , శాంతి , ప్రేమ ,అహింస అనే ఈ అయిదింటిని పిల్లలలో చిన్నతమునుండే అలవడే విధంగా వారి విద్యావిదానము కొనసాగించడమే ఈ బాలవికాస్ ముఖ్య ఉద్దేశము . ప్రపంచవ్యాప్తము గా ఎన్నో కేంద్రాలను స్థాపించి , వాటికి కావలసిన మౌళిక సేఉపాయాలను సమకూర్చుతూ ఉన్నారు . ఆధ్యాత్మికం గా ఉన్నత స్థాయిలతో ఎంతో మంది విద్యార్ధులు తయారవు తూ ఉన్నారు .
భారత సంస్కృతి , పురాణ గాధలు , ఆధ్యాత్మిక విలువలు , దైవభక్తి , గురుభక్తి , కన్నవారి ఎడల ప్రేమ,అనురాగాలతో నిండి ఉన్నా జీవిత రహ స్యాన్ని తెలియజెప్పడమే ముఖ్యాంశము గా తీసుకొని ఎంతోమంది పిల్లలము ఆదిశగా తయారుచేస్తూఉన్నారు . దేశ విదేశాలలలో భారత సంస్కృతి ని తెలియజేస్తూ Truth, Righteousness, Peace, Love and Non-violence... లతో కూదుకున్న సమాజాన్ని బావితరాలకు అందిస్తూఉన్నారు .
ఆంద్రప్రదేశ్ లో ప్రతిజిల్లాలోను 10 నుండి 20 వరకు ఈ బాలవికాస్ కేంద్రాలు ఉన్నాయి . 1975 లో బాలవికాస్ ను విదేశాలలో ప్రవేశపెట్టేరు . అఖిలభారత బాలవికాస్ దినోత్సవాన్ని ప్రతిసంవత్సరమూ సెప్టెంబర్ 12 న జరుపుకుంటారు .
  • ========================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .