Friday, September 24, 2010

First-Aid Day , ప్రధమ చికిత్స దినము



ఉత్సవము అంటే పండగ ... ఆహ్లాదకరముగా జరుపుకునే సమయము . దినము అంటే ఒకరోజు ... దినోత్సవం అంటే ఒక రోజు ఒక నిర్ధిస్టమైన విధి విధానాలతో జరుపుకునే విశిస్ఠమైన రోజు . అన్నిరోజుల్నీ అలా జరుపుకోలేము . ప్రతిరోజుకి ఒక ప్రాముఖ్యత ఉంటుంది .. దినోత్సవము మానవాళికి ఒక మంచి సందేశము ఇచ్చేదిగా ఉండాలి . మనం మన సంప్రదాయాన్నీ, మన సంస్కృతనీ ఎలాగైతే పండగలను చేసుకోవాలని ఆరాటపడతామో, అందులో పదోవంతు – “నా దేశం” , "నా భాష "అన్న భావనలో ఉంటే, ఎందుకు ఈ దినోత్సవాలు? అన్న విషయం అర్థమౌతుందని నా అభిప్రాయం. స్వతంత్ర్యం అంటే ఏమిటి? దేశమంటే ఏమిటి? ఈదేశాన్ని ప్రేమిస్తే తక్కిన దేశాల్ని ద్వేషించాలా? దేశమా – మానవత్వమా? అనికాదు , దినోత్సవాలు ద్వార గత స్ముతులను జ్ఞాపకం చేసుకోవడమే . చరిత్రను తెలుసు కొని మన జీవిత విధానము సరియైన మార్గం లో సాగించడమనేదే... నా అభిప్రాయము.
ప్రపంచ ప్రధమ చికిత్స దినోత్సవము - World First-Aid Day .

పథమ చికిత్స అనగా జబ్బు వచ్చినప్పుడుగాని, ప్రమాదము సంభవించినప్పుడు గాని తాత్కాలికముగా చేయు సహాయము. వైద్య సహాయము లభించే వరకు సేదదీర్చుటయే దాని ముఖ్యోద్దేశము. వ్యాది ఎంత చిన్నదయినా , పెద్దదయినా , చిన్న గాయమే అయినా , పెద్ద దెబ్బ తగిలినా ముందుగా కావాల్సింది , చేయాల్సింది ప్రాధమిక చికిత్స . ప్రాణాల్ని కాపాడేది , వ్యాధి తీవతను అదుపుచేసేది ఈ ప్రధమ చికిత్సే .
గాయపడిన వారికి ప్రథమ చికిత్స అను శాస్త్రము ఔషధ చికిత్స, శస్త్ర చికిత్స అను వాని ముఖ్య సిద్ధాంతముల ననుసరించియున్నది. ఈ శాస్త్ర జ్ఞానము వలన ఆకస్మికముగా దెబ్బగాని, గాయముగాని తటస్థించినపుడు డాక్టరు వచ్చే లోపల రోగి ప్రాణమును నిలుపుటకు శిక్షణ నొందిన వారికి సాధ్యపడుచున్నది.

for full details -> click on First-Aid
  • =====================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .