హ్యాపినెస్ డే (Happiness Day) -- ఆగస్టు 08 న . ప్రతిసంవత్సరము .
- మనిషి జీవితం చాలా చిన్నది . ప్రతిరోజునీ ఆనందం గా మలచుకునే మార్గాలు అనేకము ఉన్నావాటిని పక్కన పెట్టి అనవసర అంశాలతో జీవితకాలాన్ని వ్యర్ధం చేసుకుంటున్నాం . ఇది మనకు తెలియకుండా నే జరిగిపోతున్న ప్రక్రియ . జీవితం నిశ్చల తటాకములా ఉండకూడదు ... జీవితం ప్రవాహం లా సాగాలి . జనన మరణాల మధ్య , ఆనంద విషాదాలమధ్య , భయవిభ్రమాల మధ్య ఊగిస్సలాడే నిత్య సంఘటనే జీవితం . ఇవన్నీ యాదృచ్చికాలు . రకరకాల వెంపర్లాటలు , వెతికులాటలు , సహజ పరిణామాలు , చీకటి వెలుగులు , ఆశనిరాశలు , కోపతాపాలు ... ఎన్నోఅంశాలమీదే జీవితాన్ని దొర్లించేస్తాం .
- జీవితాన్ని ప్రేమించాలి ,
- తోటివారిని ప్రేమించాలి - ప్రేమించబడాలి ,
- మనసారా నవ్వాలి - నవ్వించాలి ,
- నిజాయితీగా ఉండాలి ,
- దేనికీ భయపడవద్దు ,
- స్నేహశీలి గా ఉండాలి ,
- పరోపకారి గా వ్యవహరించాలి , ... ఇవే ఆనందజీవితానికి మూలము .
- మొదట పోర్చుగల్ లో Liberto Pereda (లిబర్టొ పెరెడా) అంతర్జాజీయ హ్యాపినెస్ డే ని స్థాపించాడు . ప్రపంచములో ప్రతిఒక్కరు ఆనందం గా బ్రతకాలి అన్న సదుద్దేశముతో ప్రారంభించిన ఈ సెలెబ్రేషన్ అన్నిదేశాల అంబాసిడర్ల సహాయ సహకారాల తో వ్యాపింపజేసారు . జీవితం ఆనందకరముగా ఉండేందుకు ఎన్నో మార్గదర్శ కాలు సూసిస్తూ పలుదేశాల్లో ప్రచారము చేయగలిగేరు . హ్యాపినెస్ డే అసోసియేషన్లు అన్నిదేశాలలోను ఏర్పడ్డాయి . On Happiness Day, go out of your way to try to make someone else happy. Smile, laugh and let yourself be happy, too. అనే సందేశము అందిరికీ తెలియజెప్పేందుకు జరిపే ప్రయత్నమే ఈ సెలెభ్రేషన్ ముఖ్య ఉద్దేశము . 194 దేశాలు హ్యాపినెస్ డే అస్సోసియేషన్‌లు కలిగిఉన్నాయి .
- =================================
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .