Friday, August 20, 2010

ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం , World Photography Day



ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ మధుర స్మృతుల మాల ............ ఆగస్టు 19 తేదీ .... ప్రతిసంవత్సరము .

కరిగేకాలము లో చెదరని మధుర స్మృతులకు ప్రతిబింబాలు ఫొటోలు . ప్రతి ముఖ్య సన్నివేశాన్ని కెమెరాలో బంధించి , జీవతకాలం వాటిని పదిలంగా దాచుకుని , అలనాటి జ్ఞాపకాల్ని మళ్ళీ మళ్ళీ తనివితీరా వీక్షించుకునే అవకాశాన్ని ఇచ్చే తీపిగుర్తులు .

ఓ మాట వింటే కొన్నాళ్ళకు మర్చిపోతాం , ఓ పదం చదివితే ఇంకొన్నాళ్ళకు మరుగున పడుతుంది ... కాని ఓ ఫోటో చూస్తే ఎంతోకాలం మదిలో ముద్రవేసుకు పోతుంది . ప్రతి ఫోటో వెనుక ఓ జ్ఞాపకం , ఓ కథ , ఓ అనుభూతి దాగుంటుంది . ఇంతటి తీయని గుర్తుల ముద్రలు వేసే ఈ ఫొటోగ్రఫీ కోసం ప్రపంచవ్యాప్తం గా ఓ ముఖ్యమైన రోజు ఉంది . ఇందుకోసం ఆగస్టు 19 తీదీన ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటారు . ఓ ఫొటోగ్రఫీ ప్రక్రియ అయిన ' డాగ్యుర్రియో టైప్ ' ను కనుగొనడం ఈ ఫొటొగ్రఫీ దినానికి మూలం . ఈ ప్రక్రీను లూయిస్ డాగ్యుర్రె అభివృద్ధి పరిచాడు .

ఫొటొ లను , వీడియోలను "రేడియో - సెన్‌సిటివ్" పదార్దము(ఫొటొ పేపరు , ఫ్లాస్ డ్రైవు , హార్డ్ దిస్క్ ) పై రికార్డ్ చేయడాన్నే ఫొటో గ్రఫీ అంటాము . ఇది ఒక ఆరోగ్యకరమైన అలవాటు . ఫొటొ గ్రఫీ ని వినోధం కోసం , వ్యాపారము , సైన్‌సు ప్రయోగాలు , కళాత్మకము , మాన్యుఫాక్చురింగ్ (photolithography) ల కోసము వాడుతారు . 1839 జనవరి 9 వ తేదీన ఫ్రెంచ్ అకాడమి ఆఫ్ సైన్‌సెస్ ' డాగ్యుర్రె టైప్ ను ప్రకటించినది . రోయల్ సొసైటీ కి చెందిన " సర్ జాన్‌ హెర్ సెల్ (Sir John Herschel) " 14-మార్చి -1839 న ఫొటో గ్రాఫీ ని ప్రపంచానికి పరిచయం చేసారు .మరో ఫోటోగ్రఫీ ప్రక్రియ అయిన ' కెలొటైప్ ' ను 1839 లో విలియం ఫాక్స్ టాల్బొట్ కనుగొనగా , దానిని 1841 లోప్రకటించారు . ఫొటొ గ్రాఫీ అనె పేరు గ్రీక్ భాష నుండి వచ్చినది -- Greek φῶς (photos) "light" and γραφή (graphé) "representation by means of lines" or "drawing", together meaning "drawing with light".

ఫోటొగ్రఫీని సెలబ్రేట్ చేసుకుంటూ , ఫోటోగ్రఫీ ఏ విధంగా ప్రత్యేకమైనదో తెలియజెప్పేందుకే ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఏటేటా నిర్వహిస్తుంటారు . ఈ రోజుల్లో క్షణాల్లో ఎన్ని ఫోటోలనైనా తీసివేసి వెంటనే చూడగల శాస్త్రీయ పరిజ్ఞానము ఉన్నది .

చరిత్రకు సాక్షిగా,విజ్ఞాన,వినోద మరియు ఎన్నో రంగాలలో ఫోటోగ్రఫీ ని విసృతంగా ఉపయోగిస్తున్నారు. మానవుల జీవితాలలో ఫోటోగ్రఫీ ఎంతో ప్రభావితం చేస్తుంది . ఫొటో లను తీయడానికి కెమారాను వాడుతారు . ఇప్పుడు ఎంతో అధునాతన కెమారాలు వచ్చాయి . ఎన్నో సంవత్సరాల పూర్వమునుండి ఫోటొ లు తీసిన వారూ ఉన్నారు . గతస్మృతులను జ్ఞాపకము చే్సేవి ఫొటోలే . వీడియోలు ఈకోవకే చెందుతాయి . మొదటి లో బ్లాక్ & వైట్ ఫొటో లు మాత్రమె తీయగలిగేవారు . కాలక్రమేనా కలర్ ఫొటొగ్రఫీ బాగా ప్రాచుర్యం లోకి వచ్చినది . ప్రతి సెల్ ఫోన్‌ కెమెరాను కలిగి ఉంటుంది అంటే ... ఫొటోగ్రఫీ ఎంత అభివృద్ధి చెందిందో అర్దమవుతుంది . దీన్నే డిజిటల్ ఫొటోగ్రఫీ అంతాము .
  • మన మధురమైన తీపి జ్ఞాపకాలను పదిలపరిచే చాయాచిత్రం,
  • మన జీవితాల్లో విడదీయరాని బంధమైన ఛాయాచిత్రం,
  • మనకి దూరంగా వున్న, దూరమైన వారిని దగ్గరగా చూపే చాయాచిత్రం,
  • మన రూపాలకి ప్రతిరూపం, మన హావభావాలకి నిలువెత్తు నిదర్శనం చాయాచిత్రం,

చైనీస్ ఫిలాసఫర్ ' మొట్రై , గ్రీకు మేధమెటీషియన్లు అరిస్టాటిల్ , యూక్లిడ్ లు క్రీస్తుపూర్వం 4--5 శతాబ్దాలలో ' పిన్‌హోల్ కెమెరా గురించి వివరించారు . ఆరో శతాబ్దం లో ' బైజంటైన్‌ శాస్తవేత్త అంధెమియస్ ' తన ప్రయోగాలకోసం ' అబ్సెక్యురా కెమెరాను ఉపయోగించాడు . తరువాత ఇబ్న్‌ ఆల్-హేతమ్‌ అనే శాస్త్రవేత్త కెమెరా అబ్స్క్యురా , పిన్‌హోల్ కెమెరా ల గురించి అధ్యయనం చేసారు . అల్బెర్టస్ మాగ్నస్ (1193/1206 - 1280 ) సిల్వర్ నైట్రేట్ ను గుర్తించగా , జార్జెస్ ఫాబ్రిసియస్ ( 1516-1571) సిల్వర్ క్లోరైడ్ ను కనుగొన్నాడు . 1568 లో మరో శాస్త్రవేత్త ' డేనియల్ బార్ బరొ ' డయాప్రమ్‌ ను వర్ణించాడు . విల్ హెల్మ్‌ హాంబర్గ్ అనే ప్రముఖుడు కొన్ని రసాయానాలను (ఫోటోకెమికల్ ఎఫెక్ట్) కాంతి ఏవిధం గా చేదిస్తుందన్న విషయాన్ని వివరించారు . మరో ఫ్రెంచ్ నిపుణుడు 1729-1774 సం . నడుమ ఫోటోగ్రఫీ గురించి వివరించాడు . ఇలా నేడు కనురెప్ప పాటులో క్లిక్ మనిపించే ఫోటోగ్రఫీ వెనక ఎందరో శాస్త్రవేత్తల కృషి - అధ్యయనాలు ఉన్నాయి .

1839 అక్టోబర్ - నవంబర్ నెలల మధ్యలో డాగ్యుర్రియో టైప్ సాయం తో సుమారు క్వార్టర్ ప్లేట్ ఫొటో తీశారు . ఇది తొలి లైట్ పిక్చర్ . 1826 లో ఓ ఫ్రెంచ్ ఇన్‌వెంటర్ తొలి శాశ్విత ఫోటోగ్రాఫ్ తీసే ప్రయత్నాలు సాగించాడు .. రక రకాల ప్రక్రియలతో ఫోటోలు తీయడం పై ప్రయోగాలు సాగించాడు . జార్జ్ ఈస్ట్ మేన్‌ నేటి కెమికల్ ఫిల్మ్‌ కెమెరాల టెక్నాలజీకి ఆధారాన్ని ఇచ్చాడు . జూనెజ్ పుహార్ 1841 లో గ్లాస్ పై ఫోటోగ్రాఫ్స్ తీయగల ప్రక్రియను గుర్తించగా , దానిని 1852 లో ప్యారిస్ లొ ఎకడమిక్ నేషనల్ అగ్రికోల్ మ్యానుఫాక్చరర్స్ కమర్షియల్ గుర్తింపు ఇచ్చినది . 1847 లో నిప్సే సెయింట్ విక్టర్ గ్లాస్ ప్లేట్స్ తయారీ గురించి తాను గుర్తించినట్లు ప్రక్రియను ప్రచురించాడు . బోస్టన్‌ కు జాన్‌ విప్పల్ కూడాగ్లాస్ నెగిటివ్ ప్రక్రియ మెరుగుదలకు కృషి సేసాడు . 1851 లో ఫ్రెడరిక్ స్కాట్ అర్చర్ కలోడియన్‌ ప్రక్రియను గుర్తించగా ఫోటోగ్రాఫర్ , పిల్లల రచయిత లూయిస్ కరోల్ ఈ ప్రక్రియను ఉపయోగించాడు . తర్వాతి పరిశోధకులు రకరకాల రసాయన చర్యల ద్వారా ఫోటో ల అభివృద్ధికి పరిశోధనలు సాగించారు . 19 వ శతాబ్ది నాటికి అనేకరకాల కెమెరాలు , ఫోటోగ్రఫీ పద్దతులు అందుబాటులోకి వచ్చాయి .

దశాబ్దాలు గడిచేకొద్దీ రకరకా కెమెరా డిజైన్లు అందుబాటులోకి వచ్చేశాయి . ఎన్నో మెరుగుదలలు , సిరీస్ ల తో ఫోటోగ్రాఫిక్ ప్రక్రియ ఇరవై (20) ఏళ్ళలో ఎంతో బలపడింది . 1901 లో మార్కెట్లొకి " కొడక్ బ్రౌనీ ' రావడం తో ఎవరైనా ఫోటోలు తీసుకోవడానికి వీలైన పరిజ్ఞానము అందుబాటులోకి వచ్చేసింది . తొలి డిజిటల్ స్కానింగ్ ఫోటోగ్రాఫ్ 1957 లో ఆరంభం అయినది . డిజిటల్ స్కానింగ్ ప్రక్రియ ను 'రస్కెల్ ఎ కిర్స్చ్' అనే కంప్యూటర్ పరిజ్ఞాని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఒఫ్ స్టాండర్డర్స్ మరియు టెక్నాలజీ లో గుర్తించాడు . కెమెరా ఇమేజ్ లను కంప్యూటార్ లోనికి ఫీడ్ చేయగల పద్దతిని మెరుగుపరిచాడు . తన కొడుకు ' వాల్డెన్‌ కిర్స్చ్ ' ఇమేజ్ ను ఇలా తొలిసారి అభివృద్ధి చేశాడు . తొలి కలర్ ఇమేజ్ ను 1861 లో ఫోటోగ్రాఫ్ చేసినా , కలర్ ఫోటోగ్రఫీ పై 19 వ శతాబ్ది అంతా అభివృద్ధి సాగుతునే ఉంది .

క్షణాల్లో ఫోటొలు చేతుల్లోకి వచ్చేసే నేటి ఆధునిక ఫోటోగ్రాఫ్ పరిజ్ఞానం వెనక ఎందరెందరో అధ్యయనాలు , పరిశోధనలు ఉన్నాయి . అంచెలంచెలుగా ఒక్కో దశ సాగి 100 ఏళ్ళ కాలం లో నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం హంగులు సమకూరాయి . నాటి నుంచి నేటి దాకా ఎందరి శాస్త్రవేత్తల కృషి ఉందో గుర్తుదేసుకోవడం కోసమే ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ ఉత్సవం .


  • మూలము : వికీపెడియా ఇంగ్లిష్ వ్యాసము నుండి .-- డా.శేషగిరిరావు (శ్రీకాకుళం).


  • ===================================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .