Monday, August 23, 2010

ప్రపంచ జానపద కళల దినోత్సవం , World Village Arts Day



ప్రపంచ జానపద కళల దినోత్సవం -- ప్రతిసంవత్సరము ఆగస్టు 22 న జరుపుకొంటారు .

ఆంధ్రుల వికాసం లో జానపద కళలు భావమయ్యాయి . ఇవి జనజీవన సంస్కృతికి ప్రతిబింబాలు . జీవన సమరం లో సుఖదు:ఖాలను బాణీలుగా చేసుకొని వెలసిన జానపదాలు .... విజ్ఞాన , వినోదాలను పంచేవి గా ఉన్నాయి . జానపదం అంటే పల్లె , పల్లె జనాలు పాడుకునే పాటలు , ఆటలు , నృత్యాలు , సామెతలు ఈ కోవకిందకు వస్తాయి . ఉత్తరాంద్రకే వన్నె తెచ్చిన " తప్పెటగుళ్ళ " , శ్రీకాకుళం గిరిజన రైతాంగ పొరారటం లో సరికొత్త రుపాన్ని సంతరించుకొన్న " జముకు" కళారూపము జానపదకళల ప్రాశస్త్యానికి మచ్చుతునకులు .

మన ప్రాచీన సాంస్కకళలు : కళలు 64 రకాలుగా విభజించారు.వీటిలో ప్రధానమైనవి సంగీతం,నాట్యం,నాటకం, కవిత్వం.

1. ఇతిహాసము 2. ఆగమము 3. కావ్యం 4.అలంకారం 5.నాటకం 6.గాయకత్వం 7.కవిత్వం 8. కామశాస్త్రం 9. దురోదరం జ్ఞానం 10.దేశభాషలిపి 11.లిపికర్మం 12.వాచకం 13.అవధానం ,14.సర్వశాస్త్రం 15.శాకునం 16.సాముద్రికం 17.రత్నశాస్త్రం 18.రథాశ్యాగజ కౌశలం 19.మల్ల శాస్త్రం, 20.సూదకర్మం 21.దహదం 22. గంధవాదం 23. ధాతువాదం 24. ఖనివాదం 25. రసవాదం, 26. జలవాదం 27. అగ్ని స్తంభం 28. ఖడ్గ స్తంభం 29. జలస్తంభం 30.వాక్ స్తంభం 31. వయ స్తంభం , 32. వశ్యం 33. ఆకర్షణం 34. మోహనం 35. విద్వేషం 36. ఉచ్చాటనం 37.మారణం,38. కాలవంచనం39. పరకాయప్రవేశం 40. పాదుకాసిద్ధి 41. ఐంద్రిజీవితం 42. అంజనం 43.దృష్టి చనం , 44.సర్వ వంచనం 45. మణి మంత్రేషధాదిక సిద్ధి 46. చోరకర్మం 47. చిత్రక్రియ 48. లోహక్రియ , 49. అశ్వక్రియ 50.మృత్ర్కియ 51. దారుక్రియ 52. వేణుక్రియ 53. చర్మక్రియ 54. అంబరక్రియ , 55. అదృశ్యకరణం 56. దూతీకరణం57. వాణిజ్యం 58. పాశు పాలనం 59. కృషి 60. అసవకర్మం , 61. ప్రాణిదూతృత కౌశలం 62. వాక్సిద్ది 63. చిత్రలేఖనం 64. సంగీతం .

జానపద కళలు : భారత గ్రామీణ ప్రాంతం లో ఇవి ఎక్కువ ప్రాచుర్యం కలిగిఉన్నాయి .

  1. ఉరుము నృత్యము,
  2. ఒగ్గు కథ,
  3. కోలాటం,
  4. గొరవయ్యలు,
  5. జ్యోతినృత్యం,
  6. తెలుగునాట చోది చెప్పడం ,
  7. తెలుగునాట జానపద ఉడుపు పాటలు ,
  8. తోలుబొమ్మలాట,
  9. పగటి వేషాలు,
  10. బుట్టబొమ్మలు,
  11. బుర్రకథ,
  12. యక్షగానం,
  13. రికార్డింగ్ డాన్స్,
  14. హరికథ-హరిదాసు,
  15. డప్పు,
  16. తప్పెట గుళ్ళు,
  17. జముక గిరిజ నృత్యము ,
  18. లంబాడీ,
  19. బోనాలు,
  20. ధింసా,
  21. కోలాటం,
  22. జ్యోతి నృత్యం,
  23. ఉరుము నృత్యం,
  24. కత్తిసాము,
  25. కర్రసాము,
  26. కొమ్ము కథ,
  27. కొమ్ముల నృత్యం లేదా రేలా నృత్యం,
  28. గరగలు,
  29. గరిడి,
  30. గాన కళారూపం ఒగ్గు కథ,
  31. గురవయ్యలు,
  32. గొండ్లి నాట్యం,
  33. గొల్ల సుద్దులు,
  34. చెక్కభజన,
  35. యక్షగానం,
  36. చిందు యక్షగానం,
  37. చెంచు భాగవతం,
  38. చెక్కబొమ్మలాట,
  39. జడకోలాటం (కులుకుభజన),
  40. జిక్కికి,
  41. డప్పులు,
  42. తంబుర (కడ్డీ తంత్రి),
  43. పగటి వేషాలు,
  44. పల్లెసుద్దులు,
  45. పులివేషాలు,
  46. పొంబల వాయిద్యం,
  47. మరగాళ్ళు,
  48. రాయలసీమ కొరవయ్యల నృత్యం,
  49. లవకుశల,
  50. వగ్గుడోళ్ల విన్యాసం,
  51. వీధి బాగోతం,
  52. వీరనాట్యం,
  53. వీరభద్ర విన్యాసం,
  54. శ్రీ కాళీమాత నృత్యం,
  55. కోయ నృత్యము . ,
  56. బుడబుక్కల పాట ,
  57. గంగిరెద్దులు వారు ,
  58. బుట్ట పాములు ఆటవారు ,
  59. చెంచు వారి పాటలు ,
  60. జంగాల వారి పిట్టకథలు ,


మానవుడి మనోవికాసానికి, వినోదానికి, మంచి నడవడికి జానపద కళారూపాలు ఆలంబనగా నిలిచాయి. సినిమాలు, టి.వి.లు లేని ఆ రోజుల్లో ఈ వృత్తి కళాకారుల ప్రదర్శనలకు ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు. అలిసిపోయిన పల్లె ప్రజలకు వీరి ప్రదర్శనలు సేదతీర్చేవి.

కళలను నమ్ముకుని జీవనం సాగించిన కళాకారులకు నేడు ఆదరణ కరవవ్వడంతో కళలను నమ్ముకోలేక, నమ్ముకున్న కళలు కూడు పెట్టక దుర్భర జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం నాటి కళలను, కళాకారులను రక్షించుదామని ప్రకటనలు చేస్తున్నారే తప్ప ఆదుకునేందుకు చర్యలు మాత్రం తప్పడం లేదు. విదేశీ సంస్కృతిని, వారి అలవాట్లను పుణికిపుచ్చుకుంటున్న నేటి తరం నాటి జ్ఞాపకాలను, కళలను పట్టించుకునే అవకాశం లేకుండా పోతోంది. గ్రామాల్లో జానపద కళాకారులు వివిధ రకాలైన ప్రదర్శనలు ఇచ్చేవారు. వీరు నాటి రాజుల చరిత్రను, భాగవతం, రామాయణం, హరికథలతో పాటు, పద్యాల రూపంలో అందులో విషయాలను వివరించేవారు. రామాయణ, మహా భారతం, భాగవతంలోని సారాంశాన్ని ప్రజలకు వివరిస్తూ ప్రజలు ఇచ్చే తృనమో, పణమో తీసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. బుడగ జంగాలు, గంగిరెద్దులవాళ్లు, చెంచులు సగం రాత్రివాళ్లు, జంగాలు, పాముల వాళ్లు, హరికథా దాసులు, ఎర్రగోళ్లు వారు ఇలా చెప్పుకుంటూ చాలా మంది జానపద పాటలను, వేదాల్లోని సారాంశాన్ని పాటల ద్వారా పలికిస్తూ జీవనం సాగించేవారు.

కాలాన్నిబట్టి కళలు

గంగిరెద్దులు వాళ్లు సంక్రాంతి వచ్చిందంటే గ్రామాల్లో ఎద్దులను ఇంటింటికి తిప్పుతూ, పాటలతో సారాంశాన్ని చెబుతూ భిక్షాటన చేసేవారు. హరికథా దాసులు కూడా అంతే. సగం రాత్రి వాళ్లు కూడా వేకువ జామున గ్రామాల్లో తిరుగుతూ భిక్షాటన చేసేవారు.

జానపద, సాంస్కృతిక కళలు, కళా రూపాలు మానవ శ్రమ నుండి పుట్టి పురుడు పోసుకొన్నవే. మానవ వికాసానికి, శ్రమ నుంచి సేద తీరడానికి కళలను శ్రమజీవులే సృష్టించుకున్నారు. ప్రకృతిలో విహరిస్తూ పాటలు అల్లిన కష్టజీవులు, చెట్టునుండి పుట్టవరకు అన్నింటిని తమ జానపదంలో శిల్పంగా తీర్చిదిద్దారు.ఇదే సమయంలో అనేక ప్రాంతాలకు బతుకు తెరువు కోసం సంచరించిన సంచార జాతులు అనేక ప్రాంతల సంస్కృతులను, సాంప్రదాయాలను పాటలుగా అల్లి సమాజానికి జ్ఞానాన్ని అందించారు.

ఇదే కోవలో వృత్తి కులాల వారైన గొర్రెల కాపర్లు, గొల్ల కుర్మలు అడవిలో సంచరిస్తూ ప్రకృతిని వర్ణిస్తూ ‘ఒగ్గు కత’ను సృష్టించారు. సుక్క సత్తయ్య మిద్దె రాములు వంటి కళాకారులు ఒగ్గుకథను ప్రపంచానికి పరిచయం చేసి దేశానికి కీర్తిప్రతిష్ఠలు అందించారు. ఒగ్గు కథలను పుస్తక రూపంలో మారిస్తే వేల పేజీల పుస్తకాలుగా ముద్రించవచ్చు. ఇందులో ఎన్నో పదాలు, ఎన్నో పదప్ర యోగాలు, కమనీయమై న ప్రజల వాడుక భాష, తమ దేవతల గొప్పత నం, తమ పూర్వీకుల త్యాగాలు, వీర గాథలు కళ్లకు కట్టినట్లు నాట్య మాడుతాయి.

ఇదే కోవలో చిందు భాగవతం తెలంగాణలో ఎంతో ప్రాధాన్యత సంతరిం చుకుంది. చిందు ఎల్లమ్మవంటి వారు ప్రపంచ వేదికలపై తమ కళను ప్రదర్శించారు. దేశీయ కవి అంబాల మల్లగౌడ్‌ తెలంగాణ ప్రాంతం నుండి జానపద కళలను వెలికి తీయడానికి ఎంతో ప్రయత్నించి డోలు విన్యాసం, డప్పుల నృత్యం, భాగవతం, కోలాటం వంటి కళలను ప్రపంచ కళావేదికలపై పరిచయం చేశారు. అదే విధంగా ఎన్నో భాగవత రచనలు చేసి ఇక్కడి దేశీయ సంస్కృతిని ప్రతిబింబిచారు. శ్రమైక జీవనం నుంచి ఆవిష్కరించిన ఈ కళలు అనేక రూపాలుగా విలసిల్లి వర్థిల్లాయి. సంస్కృతి సత్సంప్రదాయా లను, ఆచార వ్యవహారాలను ప్రతిబింబిస్తూ దేశ విదేశాల్లో గుర్తింపు పొందాయి.
అదే సందర్భంలో ఈ సాంస్కృతిక కళలనే వృత్తిగా జీవనం చేసు కొని బతుకుతున్నవారు అనేకమంది. జానపద కళారూపాలను వారే సజీవం గా కాపాడుతున్నారు. అంతే కాకుండా సమాజంలో నడిచే జీవన విధానాన్ని, పూర్వీకుల చరిత్రను, కుల పురాణాలను చెబుతూ ఒక సూత్రబద్ధమైన జీవన విధానానికి అలవాటు పడే విధంగా వీరి కళలు తోడ్పడ్డాయి. మానవుడి మనోవికాసానికి, వినోదానికి, మంచి నడవడికి జానపద కళారూపాలు ఆలంబనగా నిలిచాయి. సినిమాలు, టి.వి.లు లేని ఆ రోజుల్లో ఈ వృత్తి కళాకారుల ప్రదర్శనలకు ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు. అలిసిపోయిన పల్లె ప్రజలకు వీరి ప్రదర్శనలు సేదతీర్చేవి.

చిందు, యక్షగానం, గౌడ శెట్టిల గౌడపురాణం, ఎనూటి వారి పటం కథ లు, మంద హెచ్చు కథలు, కొమ్ములవారి కథలు, పొడప్రొతుల కథలు, ఝం జ కథలు, విప్రవినోదులు, బైకాని కథలు, సాధనా శూరులు, పిచ్చకుం ట్లవారు, కాకి పడిగల పంట కత, గుర్రం పటం కథ, మాచయ్య పటం కథలు, గంచీ కూటిపటం కథలు, కొర్రొజులోటి కథలు, ఆడేంఎల్లయ్య కథ లు, పూజారి పటం కథలు, డోలి, పట్టి కథలు ప్రధానమైనవి. ఇవేకాకుండా వృత్తికళాకారులు ప్రదర్శించే కళారూపాలు- కొన్ని బైండ్ల కథలు, రాజన్నల వారు, హరిదాసులు, బుడబుడకలవారు, కాటిపాపలు, చెక్కబొమ్మలాట, గంగిరెద్దులాట, పగటివేషాలు, పాములాట, తోలుబొమ్మలాట, నాటకాలు, భాగవతం, వీధినాటకం, యక్షగానం, బుర్రకథ, చిరుతల రామాయణం, చెక్కభజన కర్రసాధన, డోళ్ళ విన్యాసం , తప్పెటగుళ్ళు ఆట . ఇవన్నీ మన సంస్కృతికి కళల ప్రతిరూపాలు.

వీటిని ప్రోత్సహిం చేది కూడా ప్రధానంగా గ్రామాల్లో రైతాంగం, చేతి వృత్తి దారులు, గిరిజనులు, హరిజనులే. నేడు వ్యవ సాయ సంక్షోభంవల్ల, ప్రపంచ పరిణామాల ప్రభా వం వల్ల చేతివృత్తులు దెబ్బతిన్నాయి. కరవు కాటకాలు మన జానపద రూపా లను క్షీణదశకు తీసుకువచ్చాయి. ప్రధానంగా గ్రామీణ ప్రజానీకంపై ఆధారపడ్డ సాంస్కృతిక వృత్తులు నేడు అంతరించి పోతున్నాయి.ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా మన జానపద సాంస్కృతిక వృత్తులను కాపాడడంలో సవతి తల్లి ప్రేమనే చూపుతోంది.అయినా గ్రామాల్లో ఈ వృత్తి కళాకారులు కూలి, నాలి చేసుకుంటూ ప్రదర్శనలు ఇస్తూనే ఉన్నారు. ఊపిరి ఉన్నంతకాలం జానపద కళారూపాలను కాపాడుకుంటాం. ముందు తరాలకు మా వృత్తి కళలను అందిస్తాం అంటూ ఈ వృత్తి కళాకారులు ఇప్పటికీ ధీమాగా ఉన్నారు.

  • ==================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .