Friday, May 7, 2010

ప్రపంచ పశువైద్యుల దినోత్సవం , veterinary doctors day




అంటువ్యాధులపై అవగాహన కల్పించడానికి వైద్య, ఆరోగ్య దినోత్సవాలు, వారోత్సవాలు దోహ దపడతాయి. ఈ నేపథ్యంలో ఏటా ఏప్రిల్ చివరి శనివారం రోజు నిర్వహించే ప్రపంచ పశువైద్యుల దినోత్సవాన్ని జ్ఞప్తి తెచ్చుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. 1963లో మొదటిసారిగా 100 దేశాల సభ్యులతో ఏర్పడిన అమెరికన్ వెటర్నరీ మెడికల్ అసోసియేషన్ ప్రపంచ పశు వైద్యుల దినో త్సవాన్ని నిర్వహించింది. ఆ రోజు జూనోటిక్ వ్యాధు లపై టెక్నికల్ సదస్సులు నిర్వహించడం... నివా రణకు చర్యలు తీసుకోవడంతోపాటు పశువైద్యుల సహాయకుల ద్వారా రక్త నమూనాలు సేకరించి బ్రూసెల్లోసిస్ వ్యాధిపై పరీక్షలు నిర్వహించి, ఉచితంగా ఏంటీ ర్యాబిస్ వేక్సినేషన్ శిబిరాలు నిర్వహణ, సీనియర్ పశు వైద్యులను సన్మానించడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ ఏడాది ప్రపంచ పశు వైద్యుల దినోత్సవాన్ని ఒకే ప్రపం చం-ఒకటే ఆరోగ్యం అనే నినాదంతో ప్రారం భిస్తున్నారు. పశు వైద్యులు, వైద్యుల మధ్య స్నేహ పూర్వక వాతావరణాన్ని కల్పించడమే దీని ఉద్దేశమని పశువైద్యాధికారులు చెబుతున్నారు పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులపై రైతులకు అవగాహన కల్పిస్తారు. 60 శాతం అంటువ్యాధులు పెంపుడు జంతువుల నుంచి ఉపయోగించే పాలు, గ్రుడ్లు, మాంసం ద్వారానే సంక్రమిస్తున్నాయని నిపుణులు చెబు తున్నారు. వైద్యులు, పశు వైద్యుల మధ్య సహృ ద్భావ వాతావరణం ఉంటేనే వ్యాధుల నియంత్రణ వీలుపడుతుంది .

వరల్డ్ వెటర్నరీ డే అవార్డు

2008 నుంచి వరల్డ్ వెటర్నరీ డే అవార్డును అందజేస్తున్నారు. ప్రపంచ పశు వైద్యుల దినో త్సవంపై ఎవరు పూర్తిస్థాయిలో అవగాహన కల్పి స్తారో వారినే ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. దీని కింద ఎంపికైన వారికి 1000 అమెరికన్ డాలర్లను అందజేస్తారు. మే నెల ఒకటో తేదీలోగా దరఖాస్తులు పంపించుకోవచ్చు.

సంబంధాలు మెరుగుపడతాయి
ప్రపంచ పశువైద్యుల దినోత్సవాన్ని ఏటా జరుపుకోవడం సంతోషంగా ఉందని శ్రీకాకుళం పశువైద్య సంయుక్త సంచాలకులు డాక్టర్ అఫ్జలుద్దీన్ చెప్పారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా పశు వైద్యులకు, వైద్యులకు మధ్య సత్సంబంధాలు మెరుగుపడతాయన్నారు. తద్వారా పశు సంబంధిత అంటువ్యాధులు మనుష్యులకు సంక్రమించకుండా ఉండేందుకు వీలుపడుతుంది. సోంపేట మండల పశు సంవర్థక సహాయ సంచాలకుడు డాక్టర్ మంచు కరుణాకరరావు మాట్లాడుతూ పెంపుడు జంతువులకు ఏంటీ రాబీస్ వ్యేక్సిన్‌లు చేయించ డంపై ప్రజలను అవగాహన కల్పిస్తామన్నారు. ఆసుపత్రుల్లో మైక్రోస్కోప్ వంటి ఆధునిక సాధనాలు లేకపోవడంతో వైద్యులకు వ్యాధి నిర్ధారణ చేయడం కష్టమవుతుందన్నారు.
  • =====================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .