Thursday, May 6, 2010

అథ్లెటిక్ దినోత్సవం , Athletic day
మనిషిలొని సహజ గుణాలైన నడవడం , దూకడం , విసరడం అనే మూడు అంశాలను ప్రామాణికం గా తీసుకొని రూపొందించిన క్రీడాంశమే అథ్లెటిక్స్ . క్రీడాకారుని లోని సంపూర్ణ మూర్తిమత్వాన్ని వెలికితీసే అద్భుత సాధనమిది . శరీరం లోని వివిధ అవయవాలను ఉత్తేజపరిచి అంతర్గత శక్తిని వెలికితీసే 26 క్రీడాంశాల సమాహారం అథ్లెటిక్స్ .

ప్రతిసంవత్సరము మే 5 వ తారీకున అథ్లెటిక్ డే ని జరుపుకుంటున్నారు . క్రీస్తు పూర్వం మూడో శతాబ్దం నుంచే ఈ క్రీడాంశం ఉనికి కనిపిస్తొంది . అప్పటిలో గ్రీకు నగర రాజ్యాల మధ్య ఈ పోటీలు జరిగేవి . ఆ రాజ్యాల పతనం తరువాత చాలా కాలం వరకు మరుగున పడ్డాయి .తిరిగి క్రీస్తుశకం 1896 లో ఫ్రాన్స్ ప్రభువు కౌబర్డన్ చొరవతో ప్రారంభమైన ఆధునిక ఒలంపిక్స్ లో అథ్లెటిక్స్ మళ్ళీ వెలుగు చూసింది .

అథ్లెటిక్స్ అంశాలు -- 26 .
 1. 100 మీటర్ల పరుగు ,
 2. 200 మీటర్ల పరుగు ,
 3. 400 మీటర్ల పరుగు ,
 4. 800 మీటర్ల పరుగు ,
 5. 1500 మీటర్ల పరుగు ,
 6. 5000 మీటర్ల పరుగు ,
 7. 10,000 మీటర్ల పరుగు ,
 8. లాంగ్ జంప్ ,
 9. హై జంప్ ,
 10. పోల్ వాల్ట్ ,
 11. ట్రిపుల్ జంప్ ,
 12. షాట్ పుట్ ,
 13. దిస్క్ త్రో ,
 14. హేమర్ త్రో ,
 15. జావెలిన్ త్రో ,
 16. 100 మీటర్ల హర్డిల్స్ ,
 17. 110 మీటర్ల హర్దిల్స్ ,
 18. 400 మీటర్ల హర్డిల్స్ ,
 19. పెంటాథలాన్ ,
 20. హెప్టాథలాన్ ,
 21. అక్టాథలాన్ ,
 22. డెకాథలాన్ ,
 23. 5000 మీటర్ల నడక ,
 24. 3000 మీటర్ల స్టెపుల్ చేజ్ ,
 25. 4*100 మీటర్ల రిలే ,
 26. 4*400 మీటర్ల రిలే ,
శిక్షణ మెలకువలు :

 • పాఠశాల స్థాయిలో తొలుత రెండేళ్ళ వరకు సాధారణ శిక్షణ ఇచ్చి క్రీడాకారుని లోని సామర్ధ్యం అవయవ వ్యవస్ఠ పనితీరు , అనువైన క్రీడాంశం , మున్నగు అంశాలను శిక్షకుడు పరిగణలోకి తీసుకుంటాడు .
 • రెండోదశ లో ఒకే విధమైన శిక్షణ మెలకువలున్న అథ్లెటిక్స్ ను ఎంపిక చేస్తారు . ఈ అంశాల్లో క్రీడాకారునికి అనువైన జోడీ ఈవెంట్స్ లో శిక్షణ ఇస్తారు .ఈ క్రమము లో క్రీడాకారుని ఆహార నియమాల పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి .
 • పోటీతత్వం అలవర్చుకునేందుకు వివిధ స్థాయిల పోటీల్లో పాల్గొనాలి . ఈ సమయం లొనే క్రీడాకారుని సామర్ధ్యాన్ని గుర్తించి ఆ అంశం లొనే పూర్తి ష్తాయి శిక్షణ ఇవ్వొచ్చు .
 • వీటితో పాటు బరువులు ఎత్తడం , కొండలు ఎక్కి దిగడం , ఇసుకలో పరుగెత్తడం వంటివి కుడా చేయాలి .
 • సంబంధిత అంశం లో ప్రావీణ్యం సాధించేందుకు శిక్షకుడు పూర్తిస్థాయి బాధ్యత తీసుకొవాలి . నిత్యసాధం , తగిన విశ్రాంతినిస్తూనే అంతర్జాతీయ స్థాయి నియమములను అనుసరించి శిక్షణ ఇవ్వాలి .
సామీప్యత :

ఆరోగ్యానికి , అథ్లెటిక్స్ కు దగ్గరి సంబంధం ఉంది , వ్యక్తి లోని వేగాన్ని 100 మీటర్ల పరుగు ద్వారా , బలాన్ని షాట్ పుట్ ద్వారా , శక్తిని లాంగ్ జంప్ ద్వారా అంచనా వేస్తారు . శరీరం లొని వివిధ భాగాల మధ్య సమన్వయాన్ని తెలుసుకునేందుకు హై జంప్ , వ్యక్తి లోని సహనాన్ని పరీక్షించేదుకు 800 మీటర్ల పరుగు ప్రామాణికం గా తీసుకుంటున్నారు .

విద్యార్ధి దశ లో కనుకూల తీతిలో శరీరాన్ని వంచుకునే అవకాసం ఉండటం వల్ల అథ్లెటిక్స్ సాధనకు ప్రయోజనకరం .
అథ్లెటిక్స్ లొ 26 అంశాలుండటం వల్ల క్రీడాకారుడు తనకు నౌకూలమైన దానిని ఎంచుకునేందుకు , పోరాత పటిమ ప్రదర్శించేందుకు అవకాశం ఉంటుంది . పోలీస్ , రక్షన , రైల్వే ఉద్యోగాలలో ఎంపిక కు మెరుగైన ప్రతిభ కనబరిచే వీలుంటుంది .

శ్రీకక్కుళం లో అథ్లెటిక్స్ :

 • జిల్లాకు చెందిన మహమ్మద్ ఖాసింఖాన్ , శ్యామసుందరరావు అథ్లెటిక్స్ లో అంతర్జాతీయ ప్రతిభ కనబర్చారు .
 • జిల్లా లొ అమెచ్యూర్ అథ్లెటిల్స్ అసోసియేషన్ ఉన్నది .దీని నిర్వాహం కార్యదర్శిగా ఎం.సాంబమూర్తి వ్యవహరిస్తున్నారు .
 • ఏటా రాస్ట్ర , జాతీయ స్ఠాయిల్లో వివిధ కేటగిరీలలో విజయాలు నమోదవుతున్నాయి .
 • 35 ఏళ్ళు పహిబడి , 85 ఏళ్లు వరకు ఉన్న అథ్లెట్ల తో మాస్టర్ అథ్లెటిక్స్ అస్సొసియేషన్ ఉన్నది .దీనికి కార్యదర్శిగా అంతర్జాతీయ క్రీడాముత్యం ఖాసింఖాన్క్ష్ వ్యవహరిస్తున్నారు . 2009 డిసెంబర్ లో చెన్నయ్ లొ మాస్టర్ అథ్లెటిక్స్ కు జరిగిన జాతీయ పోటీల్లో జిల్లా బృదం పాల్గొన్నది .

///డా.వందన శేషగిరిరావు -శ్రీకాకుళం ///
 • ===========================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .