Friday, May 7, 2010

పెంపుడు జంతువుల దినోత్సవము , Pet Animals Day

పెంపుడు జంతువుల దినోత్సవము నే రాబీస్ డే అని కూడా అంటారు .


ఒక్కోసారి మనుషుల కంటే పెంపుడు జంతువులే మంచివనిపిస్తుంది. మనుషుల కపటి ప్రేమ కంటే జంతువుల కల్మషంలేని ప్రేమ నయమనిపిస్తుంది. జంతువులను అతిగా ప్రేమించే మనుషులు ఉన్నారు. ఇళ్ళల్లో పెరిగే ఈ జంతువుల నుంచి సంక్రమించే వ్యాదుల పట్ల జాగ్రత్తలు పాటించడానికి నివారణా దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక కధనాన్ని అందిస్తున్నాం .

1885 సంవత్సరంలో లూయీ పాశ్చర్‌ అనే శాస్త్రవేత్త మొదటి సారిగా పిచ్చికుక్క కాటుకు గురై, రేబిస్‌ వ్యాధి సోకిన బాలునికి టీకా మందు ఇచ్చి రోగవిముక్తి చేశారు. సోమవారం జునోసైస్‌ డే (జంతువుల నుంచి సక్రమంచి వ్యాది నివారణాదినోత్సవాన్ని) నిర్వహిస్తున్నారు. రేబిస్‌(పిచ్చి) వ్యాధి అతి భయంకరమైనది. మాంసాహారం తినే జంతువులైన కుక్కలు, నక్కలు, తోడేళ్ళు, కోతులు, పిల్లులు, గబ్బిలాల ద్వారా వస్తుంది. ఈ జంతువుల కరవడం వల్ల మనుషులకు, పశువులకు శరీరంలో ప్రవేశిస్తుంది. మనుషులకు వస్తే తలనొప్పి, ఒళ్లునొప్పులు, జ్వరం, నీరసం వస్తుంది. కాంతిని, ధ్వనిని భరించలేవు. దీనిని షోబియా అని అంటారు. శరీరం మీద గాయం మీద నాకితే వైరస్‌ శరీరంలో ప్రవేశిస్తుంది. కుక్క కరిస్తే ముందుగా గాయాన్ని శుభ్రపరిచి ధనుర్వాతం రాకుండా ఇంజక్షన్లు వేయాలి. శరీరం వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఇమ్యూనోగ్లోబిన్‌ తీసుకోవాలి. రాబిస్‌ వ్యాది నిరోధక టీకాలు వేసుకోవాలి. కరిచిన రోజు నుంచి 0,3, 7, 14, 28 రోజుల్లో ఐదు ఇంజక్షన్‌లు తీసుకోవాలి . కుక్కలకు రెండు నెలల వయస్సులోనే టీకాలు వేయించాలి. కుక్కలకు పాముల మందు(డీవార్మింగ్‌), వ్యాది నిరోదక టీకాలు వేయించాలి. పిల్లుల వల్ల కూడా రేబిస్‌ వ్యాది సంక్రమిస్తుంది. కుక్క శరీంపై ఏలిక (round worm) పాముల వల్ల అనేక రోగాలు వస్తాయి. కుక్కలను, పిల్లులు తదితర పెంపుడు జంతువులను పట్టుకున్న తరువాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. లేకపోతే అంత్రాక్స్‌ వ్యాది సోకే ప్రమాదం ఉంది. చర్మవ్యాధులు కూడా ప్రాణాంతకమవుతాయి. సూక్ష్మజీవులు , వైరస్‌ వల్ల మెదడువ్యాపు వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. పశువుల వల్ల క్షయవ్యాధి కూడా వస్తుంది. పశువుల కాపర్లలో ఈ వ్యాధి ఎక్కువగా ఉంటుంది. కుక్కలను ముద్దులాడడం వల్ల కూడా రోగాలు సంక్రమిస్తాయన్నారు. ప్రజల్లో అవగాహన కోసం ప్రతి ఏటా జూలై ఆరున ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

  • =====================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .