Saturday, May 8, 2010

వరల్డ్‌ రెడ్‌క్రాస్‌ డే , RedCross Day


  • --------------------------------------------------- హెన్రీ డునాంట్


రెడ్‌క్రాస్ సొసైటీ అంటే ఏంటి? ఇది ఏం చేస్తుంది? అన్న విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం...

యుద్ధాలు లేదా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తీవ్రంగా నష్టపోయిన వారిని ఆదుకుని వారికి ఆసరాగా నిలవడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థే "రెడ్‌క్రాస్ సొసైటీ". ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇలాంటి సేవా సంస్థలన్నింటిలోకీ అతి పెద్దది.

1895వ సంవత్సరంలో ఫ్రాంకో-సార్డియన్ కూటమికి, ఆస్ట్రియా సామ్రాజ్యవాద సైనిక దళాలకు మధ్య జరిగిన యుద్ధంలో దాదాపు 40 వేలమంది సైనికులు అసువులు బాయగా, వేలాది మంది గాయపడ్డారు. ఈ యుద్ధంలో గాయపడ్డ క్షతగాత్రులను ఆదుకుని, వారికి సేవలందించేందుకు అప్పట్లో స్విట్జర్లాండ్‌కు చెందిన హెన్రీ డునాంట్ అనే వ్యక్తి ముందుకొచ్చాడు.

ఆ సంఘటన తరువాత... తానే ఇలాంటి వారికోసం ఓ సేవాసంస్థను ఎందుకు స్థాపించకూడదని ఆలోచనలో పడ్డాడు హెన్రీ డునాంట్. అతని ఆలోచనల ఫలితంగా ఏర్పడిన సంస్థే ఈ రెడ్‌క్రాస్ ఇంటర్నేషనల్ సౌసైటీ. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటైన ఈ సంస్థ ఇప్పుడు దాదాపు అన్నిరకాల సేవా కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
స్విడ్జర్లాండ్‌ దేశపు జాతీయ జెండాలోని ఎర్రని బ్యాక్‌గ్రౌండ్‌లో తెల్లని క్రాస్‌ ఉంటుంది. దానిని తారుమారు చేసి తెల్లని బ్యాగ్‌డ్రాప్‌లో ఎర్రని క్రాస్‌ను లోగోగా ఏర్పరిచాడు. 8-5-1812న జన్మించిన హెన్రీ డ్యూనెన్ట్‌ గౌరవార్థం ప్రతి సంవత్సరం మే 8న ప్రపంచవ్యాప్తంగా రెడ్‌ క్రాస్‌ దినోత్సవం జరుపుకుంటారు. 1901 లో ఈయనకు నోబెల్‌ బహుమతి లభించింది.

రెడ్‌క్రాస్ దినం సందర్భంగా)

* మే 8 న రెడ్‌క్రాస్ దినం జరుపుకొనుటకు కారణం--రెడ్‌క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూనాంట్ జన్మదినం.
* మే 8 న రెడ్‌క్రాస్ దినంగా జరపాలని ఏ సంవత్సరంలో నిర్ణయించారు--1938.
* రెడ్‌క్రాస్ సంస్థ ఏ సం.లో స్థాపించబడింది--1863.
* రెడ్‌క్రాస్ సంస్థ ఇప్పటి వరకు ఎన్నిసార్లు నోబెల్ శాంతిబహుమతిని గెలుచుకుంది--3 సార్లు (1917, 44, 63).
* రెడ్‌క్రాస్ సంస్థను హెన్రీ డ్యూనాంట్ ఏ నగరంలో స్థాపించారు--జెనీవా.
* రెడ్‌క్రాస్ పతాకం ఏ దేశ పతాకాన్ని పోలి ఉంటుంది--స్విట్జర్లాండ్ (కేవలం రంగులు మాత్రమే తారుమారు).
* రెడ్‌క్రాస్ సంస్థ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూనాంట్ ఏ దేశస్థుడు--స్విట్జర్లాండ్.
* హెన్రీ డ్యూనాండ్‌కు ఏ సం.లో నోబెల్ శాంతి బహుమతి లభించింది--1901 (తొలి నోబెల్ శాంతి బహుమతి).
* భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీ ఏ సం.లో స్థాపించబడింది--1920.
* భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీ ప్రధానకేంద్రం ఏ నగరంలో ఉంది--ఢిల్లీ.

మరికొంత సమాచారము కోసం : వికిపీడియా ని చూడండి- రెడ్ క్రాస్

2010 - Srikakulam celebrations :

ప్రపంచ రెడ్‌క్రాస్‌ దినోత్సవం సందర్భంగా శనివారం బాపూజీ కళామందిర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడు - కలెక్టర్‌ శ్రీకాంత్‌ దంపతులు సంయుక్తంగా విశేషసేవలు అందించిన పలువురికి అవార్డులు, పతకాలు. ప్రశంసాపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గత రెండేళ్లగా రక్తనిధి నుంచి ఎంతో మంది ప్రాణాలు కాపాడటం జరిగిందన్నారు. .జిల్లాలోని రక్తనిధుల్లో రక్తం నిండుకుంటున్నందున స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వచ్చి శిబిరాలు నిర్వహించాలని ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ జిల్లా అధ్యక్షుడు, కలెక్టర్‌ శ్రీకాంత్‌ పిలుపునిచ్చారు. అగ్నిప్రమాదాలు, విపత్తుల సందర్భంగా జిల్లాలో 35 వేల మందికి రెడ్‌క్రాస్‌ సాయం అందించామన్నారు. తీరప్రాంత మత్స్యకారులకు మరబోట్లు, వలలు, ఐస్‌బాక్సులు తదితర సామాగ్రి అందజేశామని వివరించారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ జిల్లా అధ్యక్షుడు పి.జగన్మోహనరావు రెడ్‌క్రాస్‌ చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించి నివేదిక చదివారు. అనంతం పట్టణీకరణ అనే అంశంపై రూపొందించిన బ్రోచర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. రెడ్‌క్రాస్‌ సంయుక్త కార్యదర్శి దూసి ధర్మారావు, డీఆర్వో ఎం.హెచ్‌.షరీఫ్‌, ఆర్డీఓ ఎన్‌.సత్యన్నారాయణ, వైద్యుడు కె.సుధీర్‌, వైద్యుడు అమ్మన్నాయుడు,డా.వందన శేషగిరిరావు , డీపీఆర్వో రమేష్‌, అయితమ్‌ కళాశాల అధ్యక్షుడు కె.సోమేశ్వరరావు, జిల్లా క్షేత్ర ప్రచార అధికారి జి.కొండలరావు, శ్రేయ ఫౌండేషన్‌ ప్రతినిధి కె.శ్రీనివాసకుమార్‌, తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ రెడ్‌క్రాస్‌ దినోత్సవం సందర్భంగా జిల్లాలో రక్తదాన శిబిరాలు, నేత్రదానం, ఉచితవైద్య శిబిరాలు, విపత్తుల్లో ఉన్న వారిని ఆదుకోవడం, తదితర కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొని సేవలు అందించిన పలువురికి కలెక్టర్‌ జ్ఞాపికలు బహూకరించారు. మరణానంతరం నేత్రదానం చేసిన 25 మంది కుటుంబీకులకు సత్కరించారు. ఈ సందర్భంగా నృత్యదర్శకులు శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

///collected / Dr.Seshagirirao///
  • ====================================
Visit My Website - > Dr.seshagirirao-MBBShttp://dr.seshagirirao.tripod.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .