Saturday, May 8, 2010

మదర్స్ డే , Mother's Day


-
 • courtesy with Eenadu Telugu daily.

 •  
మదర్స్ డే ( మే 2 వ ఆదివారము ) సందర్భంగా ప్రపంచంలోని అమ్మలందరికి "ఎ వెరీ వెరీ హ్యపీ మదర్స్ డే".

ఈ స్రుష్టిలో అమ్మ కన్న గొప్పది ఇంకేమి లేదు. అమ్మే లేకపోతే మనమెవరమూ లేము. మనల్ని నవమాసాలు మోసి, పురుటి నొప్పులు భరించి కని, మనల్ని కంటికి రెప్పలాగా కాపాడి, మన ఆలనా పాలనా చూసి, పెంచి పెద్ద చేస్తుంది. మరి అలాంటి అమ్మకి మనం ఏమి చేసినా తక్కువే.

” ‘మదర్స్ డే’ని తెలుగులో ‘తల్లుల రోజు’ అనో, ‘తల్లుల దినం’ అనో అనొచ్చు కదా? అబ్బే, అబ్బే, చాలా ఎబ్బెట్టుగా వుంది. కాబట్టి, ‘మదర్స్ డే’ని ‘మదర్స్ డే’గా సంభాషించడమే బాగుంది. పైపెచ్చు ఇది ఎలాగూ తెలుగు సంస్కృతికి చెందిన విషయమే కాదు.

"అమ్మ"
 • త్యాగాలకు ప్రతిరూపం
 • సృష్టికి మూలం
 • దేవుడు మలిచిన దైవం
 • మమతానురాగాల ప్రతిరూపం
 • తరగనిది తల్లి రుణం
 • జీవితానికి మూలం
కాకి పిల్ల కాకికి ముద్దయినట్లు బిడ్డ అవిటిదైనా, కురూపి అయినా తల్లికి ముద్దే. ఎన్ని కష్టాలు పడి అయినా బిడ్డ బ్రతకదని తెలిసినా చివరి నిమిషం వరకు బిడ్డ గురించి తపించే తల్లులెందరో. అమ్మని ఏ అనాధాశ్రమంలోనో పడేసి ఏడాదికొకసారి ఒక గ్రీటింగ్ ముక్కో, ఓ కేకు ముక్కో పడేస్తే సరిపోతుందనుకునేవాళ్ళు ఎక్కువైపోతున్నారు ప్రస్తుత నాగరిక , ఆధునిక ప్రపంచములో . . . ఇదా మనకు మన చదువులు నేర్పిన సంస్కారం!! ఇదా మనకు మన సంపదలు తెచ్చిన వైభోగం!!!

పదిమంది ప్రభోదకుల కంటే విజ్ఞానము అందించే ఓ ఉపా్ధ్యాయుడు ముఖ్యమయిన వ్యక్తి . అటుమంటి 10 మంది ఉపాధ్యాయుల కంటే కర్తవ్య నిర్వహణతో పిల్లల్ని తీర్చిదిద్దే తండ్రి మరెంతో ముఖ్యమైనవాడు . పదిమంది తండ్రుల కంటే తల్లి ముఖ్యమైనది . తల్లికి మించిన గురువు ఇంకెవరూ ఉండరు . ఎన్నో హద్దులతో , అవమానాలతో కస్ట నస్టాలతో తీర్చిదిద్దిన బిడ్డను మనసారా చూసుకుని తృప్తిపడాలనుకునే సరికి రెక్కలొచ్చి ఎగిరిపోతారు ... అయినా అమ్మకు కోపము రాదు , మౌనముగానే ఉండిపోతుంది . మరోమారు కష్టాలను కడుపులో , కన్నీటిని కనుకొలకుల్లో నొక్కిపెట్టేస్తుంది . ఇదీ అమ్మ పరిస్థితి .

మదర్స్ డే చరిత్ర :

ఈ అమ్మల పండుగ చరిత్ర ఇప్పటిది కాదు . గ్రీకుల వార్షిక వసంతోత్సవం లో మాతాజీని పూజించేవారు . ఇది ప్రాచీన కాలంనాటినుండి ఉన్నది. గ్రీకు పురాణం లోని అనేకమంది దేవతల తల్లి -క్రోనస్ భార్య " రియాను " గ్రీకులు ఈ ఉత్సవాన్ని జరుపునేవారు . ప్ర్రాచీన రోమన్లు కూడా " హిలారి " అనే మాతోత్సవాన్ని నిర్వహించేవారు . దేవతా మూర్తి ' సిబెలెకు ' ఈ పండుగ అంకితమైంది . క్రీస్తు పూర్వము 250 యేళ్లు ముందే ఈ సిబెలె గౌరవార్ధము ఉత్సవం జరిగిన దాఖలాలున్నాయి. సిబెలె దేవాలయం లో మూడు రోజులపాటు పూజలు జరిపేవారు . పేరేడ్లు , క్రీడలు , సమావేసాలు , నిర్వహించేవారు . అయితే సిబెలె అనుచరులు విద్రోహకార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణం గా ఈ ఉత్సవాల్ని రోం లో నిషేధించారు ..

క్రీస్తు తల్లి గౌరవార్ధం ప్రాచీన క్రైస్తవులు మదర్స్ డే ని జరుపుకునేవారు . ఇంగ్లండులో తల్లులందరికీ సెలవు ప్రకటించి .. దానిని " మదరింగ్ సండే ' గా పిలిచేవారు . ఈ మదరింగ్ సండే చరిత్ర ఇంగ్లండ్ లో 1600 సం. కాలములో ఉండేదట . లెంట్ (ఈస్టర్ కు 40 రోజుల ముందు కాలము) లో నాల్గవ ఆదివారాన్ని ప్రతి ఏటా మదరింగ్ సండే గా వ్యవహరించేవారు . ఆ రోజున పిల్లలు తమ అమ్మలకు బహుమతులు , పూలు ఇచ్చేవారు . 19 వ శతాబ్ది నాటికి దాదాపుగా ఈ మదరింగ్ సండే కనుమరుగైనది .

1914 -మే 8 వ తేదీన అమెరికా అధ్యక్షుడు " ఉడ్రో విల్సన్ " మే రెండో అదివారాన్ని ' మదర్స్ డే ' గా పరిగణించే సంయుక్త తీర్మానం పై సంతకాలు చేశాడు . అప్పటినుంచీ అది అమెరికా సంయుక్త రాష్ట్రాల పండుగ అయినది . అక్కడి నుండి విభిన్న దేశాలలో విభిన్న రకాలుగా అమ్మకు అభివాదం తెలుపుతుంది ఈ పండుగ .

జూలియావాల్డ్ హానె 1872 లొ ఈ మదర్స్ డే తొలి సూచనచేసింది . పౌరయుద్ధం పాటతో పేరొందిన కార్యకర్త , రవయిత్రి , కవయిత్రి అయిన జూలియా శాంతికి అంకితం చేసే ఈ ఉత్సవాన్ని ఏటేటా జూన్క్ష్ రెండో తేదీన జరుపుకోవాలని సూచించింది . 1870 లో బోస్టన్క్ష్ లో తన ప్రఖ్యాత మదర్స్ డే ప్రొక్లెమేషన్క్ష్ లో యుద్ధానికి వ్యతిరేకం గా గొంతు కలపాల్చిందిగా మహిళలకు విజ్ఞప్తి చేసింది . జూన్క్ష్ రెండో ఆదివారం నాడు మదర్స్ పీస్ డే నిర్వహించి , అనేక సమ్వత్సరాలు సమావేశాలు నిర్వహించినారు . అధికారిక మదర్స్ డే ప్రకటనకు , ఆ రోజున అధికారిక సెలవుకు ఆమె నిర్వరామం గా ప్రయత్నించినారు .. . కాని సదరు మదర్స్ డే సెలబ్రేషన్లు మే నెలకు మారాయి .

మదర్ ఆఫ్ మదర్స్ డే :

యు.ఎస్. లో మదర్స్ డే వ్యవస్థాపకురాలిగా " అన్నా జార్విస్ " ను గుర్తించారు . ఆమె వివాహము చేసుకోలేదు . పిల్లలకు తల్లి కాలేదు , కాని మదర్స్ డే కి మదర్ గా ప్ఖ్యాతి గడించారు . తల్లులందరి గౌరవార్ధం కస్టపడి పనిచేసిన వనితగా ప్రపంచవ్యాప్తం గా గుర్తింపు పొందినారు . ఆమె తన తల్లి "అన్నా మేరీ రీవేస్ జార్విస్ " నుంచి తన బాల్యం లోనే మదర్స్ డే సెలబ్రేషన్ స్పూర్తి పొందినారు . ఆ తల్లికి కుమార్తె గా అన్నా జార్విస్ అమ్మ మాటల్ని ఏనాడూ విస్మరించలేదు . 1905 లో తన తల్లి మరణించినప్పుడు మదర్స్ డే నిర్వహించాలన్న తన తల్లి కోరికను నెరవేర్చాలని తీర్మానించుకున్నారు . ఆ విధం గా ఈమె ఎన్నోవిధాలుగా మదర్స్ డె కోసం కస్టపడ్డారు .

1911 లో అమెరికా లో ఇంచుమించు అన్ని రాష్ట్రాలల్లోను మదర్స్ డే ఉత్సవాలు నిర్వహించారు . 1914 లొ అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ తీర్మానము పై సంతకం చేసి మే రెండెవ ఆదివారము మదర్స్ డే గా ప్రకటించారు . ఇప్పుడీ పండుగ అమెరికా తో పాటు ఇండియా , ఇంగ్లండ్ , డెన్మార్క్ , ఫిన్ల్యాండ్ , ఇటలీ , టర్కీ , ఆస్ట్రేలియా , మెక్షికో , కెనడా , చైనా ,జపాన్క్ష్ , బెల్జియం , వంటి అనేక దేశాలు జరుపుకుంటున్నాయి .

భారత్ లో మదర్స్ డే :

మన దేశము లో ఈ మదర్స్ డే ను 10 సంవత్సరాలుగా జరుపుకుంటున్నారు . ప్రపంచీకరణ ద్రుష్ట్యా పాశ్చాత్య పోకడ , మనదేశస్తులు అమెరికాలో అధికము గా ఉండడం , , ఇంటర్నెట్ , శాటిలైట్ విప్లవం మున్నగునవి భారత్ లో ఈ మదర్స్ డే ని జరుపునేందుకు దోహదపడ్డాయి . ఈ పండుగ సంబరము మిగతాదేశాల మాదిరగానే ఇక్కడా సాగుతుంది . ఒక్కకరు ఒక్కో పద్దతిలో తమ మాత్రుమూర్తికి కృఉతజ్ఞతలు తెలుపుతారు ... బహుమతులు ఇస్తారు .

ఏయేదేశం లో ఎప్పుడెప్పుడు : కొన్ని దేశాలు , ( ప్రపంచ వ్యాప్తం గా 46 దేశాలు )

 • మే నెల రెండో ఆదివారము -> అమెరికా , ఆస్ట్రేలియా , బెల్జియం , బ్రెజిల్ , కెనడా , డెన్మార్క్ , ఫిన్క్ష్ లాండ్ , జర్మని , గ్రీస్ , ఇటలీ ,జపాన్క్ష్ , న్యూజిలాండ్ , సింగపూర్ , టర్కీ , ఇండియా .
 • లెంట్ ' లో నాలుగో ఆదివారము ఇంగ్లండ్ లో ' ,
 • జూన్ మొదటి ఆదివారము ఫ్రాన్క్ష్స్ లో ,
 • మే 10 తేదీ - దక్షిణ్ అమెరికా , బహ్రెయిన్ , మలేషియా ,ఒమన్క్ష్ , పాకిస్తాన్క్ష్ , కటార్ , సౌది అరేబియా , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ,
 • మే 8 వ తేదీ - మెక్షికో ,
 • మార్చి 8 న - ఆల్బేనియా లో ,
 • నవంబరు 28 న - రస్యాలో ,
 • మే 26 న - పోలెండ్ లో ,
 • డిసెంబర్ 22 న _ ఇండోనేషియాలో ,
 • మార్చి 21 న - ఈజిప్ట్ లో ,
 • ఫిబ్రవరి 13 న - నార్వే లొ ,
 • ఆగస్టు 12 న -- థాయ్ లాండ్ లో ,
 • మే చివరి ఆదివారం - స్వీడెన్ లో ,
 • ఫిబ్రవరి 2 వ ఆదివారం -లెబనాన్క్ష్ ,
 • మే 1 వ ఆదివారం - ఆస్ట్రియా , హాంగ్ కాంగ్ , నెదర్ ల్యాండ్ , తైవాన్క్ష్ , హంగేరి , పోర్చుగల్ , దక్షిణాఫ్రికా , స్పెయిన్ ,
 • ఆగస్టు 15 న -- బెల్జియం , కోస్టారికా ,
 • అక్టోబర్ 2 న -- అర్జెంటీనా లో ,

source : Andhraprabha an article on mothers day / Ramarao sastry


ఆదిగురువు అమ్మే...న్యూస్‌టుడే - శ్రీకాకుళం సాంస్కృతికం/నరసన్నపేట/కాశీబుగ్గ/రాజాం/కలెక్టరేట్‌ 12/May/2013

ఒక సమాజం ఆరోగ్యవంతంగా... క్రమశిక్షణాయుతంగా.. బాధ్యతాయుతంగా... నైతిక విలువలను పాటిస్తూ.. పెద్దలను గౌరవిస్తూ.. తోటివారిని ప్రేమిస్తూ... ఎలాంటి కల్మషాల్లేని వాతావరణంతో వర్ధిల్లుతుందంటే....అమ్మ పాత్రే కీలకం... అవును మరి.. మన ఆదిగురువు అమ్మే కదా...
కని.. పెంచి... పెద్ద చేసి.. విద్యాబుద్ధులు నేర్పించి.. లాలించి.. పాలించి.. క్రమశిక్షణ తప్పితే దండించి.. మనం ఎదిగితే సంతోషించి.. సమాజంలో మనకో స్థానం కల్పించింది అమ్మ...

ప్రస్తుత సమాజంలో అమ్మ పాత్ర ఎలా ఉంది? తరాల అంతరం ఏవిధంగా ప్రభావం చూపుతోంది..? జీవితం సాంకేతికమయమైపోయిన ప్రస్తుత తరుణంలో అమ్మ ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది...?

ఈ పరిస్థితులను కొంతమంది విశ్లేషించారు... వారి మాటల్లోనే...

ఆదిగురువు అమ్మే
అపుడూ.. ఇపుడూ.. ఎప్పుడూ... ఆదిగురువు అమ్మే--సృష్టికి మూలం అమ్మ. సంప్రదాయం ప్రకారం గృహిణిగా, తల్లిగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించేది అమ్మ. ప్రస్తుత సమాజంలో తల్లిగా పాత్ర నిర్వహించడం అత్యంత కీలకం. ప్రపంచంలో ఇప్పుడు ఎప్పుడూ గురుస్థానం తల్లిదే. ఒకపుడు అమ్మ ఇంట్లోనే ఉండేది. పిల్లల మీద అప్యాయతానురాగాలు కురిపిస్తూ చక్కగా తీర్చిదిద్దేది.పిల్లలకు క్రమశిక్షణాయుత జీవితం ఇవ్వటంలో అమ్మ పాత్ర అమోఘం. సమాజ పరిస్థితులు మారడం, భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయాల్సిరావటం వల్ల 80 శాతం మంది తమ పిల్లల పెంపకంపై అశ్రద్ధ చూపిస్తున్నారు. ఆర్థిక సమస్యల వల్ల కొందరు ఉద్యోగాలు చేయక తప్పని పరిస్థితి. ఫలితంగా పిల్లలకు దూరమవుతున్నారు. దీంతో పర్యవేక్షణ లేకపోవడం వల్ల చిన్నారుల ఆలోచనలు తప్పుదోవపడుతున్నాయి. ఫెమినిస్టులు స్త్రీపురుషులు సమాన బాధ్యతలను పంచుకోవాలంటారు. తండ్రి కొన్ని పనులను చేయలేరు. తల్లి బయట ఉద్యోగం, ఇంట్లో గృహిణిగా చేయాలంటే కొన్ని బాధ్యతలను నిర్వర్తించలేకపోతున్నారు. మా నాన్నగారు 1981లో చనిపోయినప్పటికీ మా అమ్మగారే రోల్‌మోడల్‌గా ఉంటూ మంచి నర్తకిగా తీర్చిదిద్దింది. ఈనాటి తల్లుల్లో కొందరు తమ బాధ్యతలను విస్మరించడం వల్ల కుటుంబ వ్యవస్థ పాడవుతోంది. సంప్రదాయ ప్రకారం ఇంట్లో గృహిణిగా ఉంటూ భర్తకు దగ్గరగా పిల్లలకు సన్నిహితంగా జీవించడం మంచిదని నా అభిప్రాయం.
- స్వాతి సోమనాధ్‌, ప్రముఖ నర్తకి

తల్లిది బహుళ బాధ్యత
తల్లి బాధ్యత గతం కంటే పెరిగింది.--ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు ఇపుడు బహుళ బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తోంది. ప్రస్తుత సమాజంలో బాలురు.. బాలికలన్న తేడా లేకుండా దాడులు పెరుగుతున్నాయి. చిన్నారులపై లైంగిక దాడులు అత్యంత క్రూరత్వం. ఇలాంటి వాటిపై చిన్నారులకు జాగ్రత్తలు చెప్పాల్సిన బాధ్యత తల్లిదే. ఆరోగ్యకరమైన స్పర్శ, అనారోగ్యకరమైన స్పర్శ (గుడ్‌టచ్‌, బ్యాడ్‌టచ్‌)పై పిల్లలకు అవగాహన అవసరం. వీటిపై వ్యత్యాసాలు నేర్పాలి. ఇంటి దాడులు ఎక్కువగా తెలిసిన వ్యక్తుల నుంచే జరుగుతుంటాయి. పిల్లలను ఒంటరిగా అపరిచితుల వద్ద వదలకూడదు. వారికి సమాజంపై అవగాహన కల్పించాలి. తల్లలకు సమాజం.. దాని పోకడలపై అవగాహన ఉంటేనే పిల్లలను అప్రమత్తం చేసేందుకు వీలవుతుంది. మహిళలు వంటింటికే పరిమితం కావడం లేదు. అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. భర్త సంపాదనలో వేడి నీళ్లకు చన్నీళ్లుగా తోడవుతున్నారు. కుటుంబపరంగా ఒత్తిడి పెరుగుతోంది. తల్లులు పిల్లలతో తక్కువ సమయం గడిపి.. ఆప్యాయత, అనుబంధంతో వ్యవహరించాలి.
- వైవీ అనూరాధ, జనగణన రాష్ట్ర సంచాలకురాలు, హైదరాబాద్‌

కుటుంబ వ్యవస్థకు సారథి అమ్మ
అన్ని బంధాలకు వారధి..కుటుంబ వ్యవస్థకు సారథి అమ్మ. తన పిల్లలు ఉన్నతస్థానాల్లో ఉండాలనే ప్రతీ తల్లి కోరుకుంటుంది. తల్లి సంరక్షణ బాగుంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలు తెలిసీ తెలియక తప్పులు చేస్తే తల్లి మొదట్లోనే అది తప్పు అని చెప్పి మరో మారు అలా జరుగకుండా చూడాలి. అలా చేయకపోతే పిల్లలు తప్పుడు మార్గం పడతారు
- డాక్టరు ఎం.సునీలకృష్ణ, సూపరింటెండెంట్‌, సామాజిక ఆసుపత్రి, పలాస

పిల్లల పెంపకం సవాలుగా మారింది
తల్లే... పిల్లలకు ఆదర్శం.--నీతి నియమాలతో పెంచాల్సిన నైతిక బాధ్యత తల్లిపైనే ఉంది. ప్రస్తుతం పిల్లలను పెంచడం సవాలుగానే మారిపోయింది. సమాజ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉండడంతో కుటుంబ వ్యవస్థలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా స్నేహితులు, సినిమాలు, ప్రస్తుత జీవనశైలిలో మార్పులు, పాశ్చాత్య ధోరణి వారిపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. దీంతో పెంపకం కష్టంగానే మారింది. పిల్లల్లో సున్నితతత్వాన్ని ఎక్కువగా అలవాటు చేయకూడదు. దేనినైనా ఎదుర్కొనే విధంగా ఆత్మస్త్థెర్యాన్ని పెంపొందించాలి. ముఖ్యంగా అమ్మాయిలు బయటకు వెళ్లే సందర్భంలో తల్లిగా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది తల్లులు పిల్లల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ చూపించలేకపోతున్నారు. ఇది వారి ఎదుగుదలపై ప్రభావం చూపుతోంది.
-వి.ఎస్‌.ఎస్‌.ఎల్‌.ప్రసన్న, ఏడీ, సీపీవో కార్యాలయం

సంబంధాలు దెబ్బతింటున్నాయి...
పిల్లలను సన్మార్గంలో నడిపించాలంటే... పెంపకంలో బాధ్యతగా వ్యవహరించాలి. వారి నడతపై దృష్టి పెట్టాలి. చిన్నపుడే చదువుల పేరిట పిల్లలను దూరంగా ఉంచడం మంచిది కాదు. దీనివల్ల మానవసంబధాల్లో గణనీయమైన మార్పు వస్తోంది. అనుబంధాలకు అర్ధం మారిపోతోంది. ఇప్పటి సాంకేతిక పరిజ్ఞానం పిల్లల మనస్తత్వంపై విపరీత ప్రభావాన్ని చూపుతున్నాయి. పెద్దలు చెప్పిన పద్ధతులు ఎంతో విలువైనవి. అవి పిల్లలకు అందటం లేదు.
-ఆర్‌.స్వప్న, ఐద్వా మహిళాసంఘ ప్రతినిధి

పిల్లాడికి చిన్న దెబ్బ తగిలితేనే ఏ తల్లీ తట్టుకోలేదు..
ఒంట్లో కాస్త నలతగా ఉందంటే.. మంచినీళ్లు కూడా ముట్టుకోదు.. తన ముద్దుల కొడుకు నాలుగు రోజులు దూరంగా ఉండాల్సి వస్తేనే తల్లడిల్లిపోతుంది..
అలాంటిది... దేశ సరిహద్దు ప్రాంతం... ప్రతిక్షణం ప్రాణాపాయం.. బతికి తిరిగొస్తామన్న గ్యారంటీ లేదు.. అయినా.. దేశ రక్షణ కోసం.. కోట్లాది మంది ప్రజల బంగారు భవిష్యత్తు కోసం.. తమ పిల్లలను పంపించారా వీరమాతలు. శుత్రుమూకల చేతిలో తమ పిల్లలు బలైపోయినా.. ఆ బాధను దిగమింగుకుంటూనే.. దేశం కోసం ప్రాణాలర్పించారంటూ గర్వపడుతున్నారు..


 • ================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .