Saturday, April 24, 2010

హోమియోపతి డే , Homeopathi Day




ఏప్రిల్-10. ఇది హోమియో పితామహుడు డాక్టర్ శామ్యూల్ హానిమాన్ పుట్టిన రోజు. ఇతర వైద్య విధానాలన్నిటికీ భిన్నంగా మానవాళికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్న ఈ హోమియో వైద్య విధానం పుట్టి ఇప్పటికి రెండు శతాబ్దాలు దాటిపోయింది. ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా డాక్టర్ శేషగిరి్రావు అందిస్తున్న ఈ ప్రత్యేక వ్యాసం.

"ఉన్న వ్యాధి తగ్గడం మాట ఎలా ఉన్నా రోజూ వేసుకునే ఈ మాత్రలతో కొత్తగా లేని వ్యాధులు వచ్చేలా ఉన్నాయి.''అంటూ ఒకప్పుడు ఎంతో మంది ఆందోళన పడే వాళ్లు. కానీ, అలాంటి దుష్ప్రభావాలే వీ లేని వైద్య విధానం కూడా ఒకటుందని తెలిసిన నాడు వారంతా ఎంతో సంతోషించారు. అలాగే వ్యాధి ఎంత తీవ్రంగా ఉన్నా ఆ మాత్రల వాసన, అది కడుపులో లేపే మంట వికారం భరించలేక మధ్యలోనే మానేసిన వారు ఎంతో మంది.

అందుకే దుష్ప్రభావాలు కానీ, వికారాలు గానీ లేని హోమియో వైద్య విధానం ప్రజల హృదయాలకు బాగా చేరువయ్యింది. ప్రపంచ హోమియోపథిక్ డే సందర్భంగా ప్రజలూ, వైద్యులూ నేడు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. హోమియో పితామహుడు డాక్టర్ శామ్యూల్ హ్యానిమాన్ పుట్టిన రోజైన ఏప్రెల్-10 ప్రపంచ హోమియోపథిక్ డే గా జరుపుకుంటున్నారు.


హోమియోపతి సిద్ధాంతం "రోగానికి కాదు రోగికి చికిత్స చేయాలి'' అన్న సూత్రం మీద నడుస్తుంది. రోగం అనేది కేవలం శరీర అనారోగ్యాన్ని తెలిపే ఒక లక్షణం మాత్రమే ఆ లక్షణాలను తగ్గించే వైద్య చికిత్సల వల్ల శరీరం తిరిగి పూర్వ ఆరోగ్యస్థితిని పొందలేదు. ఒక జబ్బు రావడానికి శరీర వ్యవస్థ అంతా కారణంగా ఉంటుంది. అందుకే హోమియో విధానంలో మొత్తం శరీరానికి చికిత్స జరుగుతుంది.

ఆ కారణంగానే హోమియో చికిత్సతో తగ్గిన జబ్బు సాధారణంగా మరోసారి రావడం అంటూ ఉండదు. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ఏదైనా ఒక జబ్బు ఎంతో మందికి సోకవచ్చు. కానీ, ఆ వ్యాధి ప్రభావం అందరిలోనూ ఒకేలా ఉండదు. అందుకే ఒక్కొక్కరిలో ఒక్కోరకం లక్షణాలు కనిపిస్తాయి. దానికి వ్యక్తికీ వ్యకికీ మధ్య ఉన్న శ రీర తత్వాల్లోని వ్యత్యాసాలే కారణం. హోమియో విధానంలో ఆ వ్యత్యాసాలను కూడా గుర్తించి చికిత్స చేస్తారు. అందుకే ఎంతో దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధులు సైతం హోమియోలో సులువుగా తగ్గిపోతున్నాయి.


ఆధునిక జీవన శైలి కారణంగా ఇటీవలి కాలంలో మెటబాలిక్ సిండ్రోమ్ అనే సమస్య ఎక్కువ మందిలో కనిపిస్తోంది. ఇది మొత్తం శరీరంలో ఏర్పడిన అస్తవ్యస్తతకు నిదర్శనం. ఈ సమస్యను తగ్గించడంలో హోమియోపతి ముందు వరుసలో ఉంటోంది. నిజానికి శరీరం వ్యాధి గ్రస్తం కావడానికి మౌలికంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గడమే కారణం. అందుకే హోమియో విధానం వ్యాధి నిరోధక శక్తిని పెంచడం మీదే ఎక్కువగా దృష్టి సారిస్తుంది. శరీరంలోని ఏ భాగం బలహీనపడితే ఆ భాగం రోగగ్రస్తమవుతుందని కూడా హోమియో సూత్రీకరణ.

శరీర వ్యవస్థనంతా చక్కదిద్దే చికిత్సలో సహజంగానే ఆ అవయవం కూడా బలపడి వ్యాధి తగ్గుముఖం పడుతుంది. వ్యాధినిరోధక శక్తి బలంగా ఉన్నప్పుడు శరీరంలోకి ప్రవేశించిన వైరస్, బ్యాక్టీరియాలు ఏవైనా నశిస్తాయి. ఆ శక్తే బలహీనపడితే వైరస్ తీవ్రమై శరీరం రోగగ్రస్తమవుతుంది. ఆ భాధను శరీరం కొన్ని లక్షణాల ద్వారా వ్యక్తం చేస్తుంది. ఆ లక్షణాల ఆధారంగా వ్యాధి తీవ్రతను దాని మూలాలను గుర్తించి హోమియో చికిత్సలు పనిచేస్తాయి.

దుష్ప్రభావాలు ఎందుకు ఉండవు ?
హోమియో మందులు వ్యాధిని ప్రభావితం చే స్తున్నప్పుడు వాటి దుష్ప్రభావాలు మాత్రం ఎందుకు ఉండవు? అనే అనుమానాన్ని చాలా మంది వ్యక్తం చేస్తుంటారు. వాస్తవమేమిటంటే హోమియో మందులు భౌతిక రూపంలో ఉండవు.

మందు తయారీలో వాడే మూలికను విస్పోటనం చేయడం ద్వారా దాన్ని ఒక అతీత శక్తిగా ( డైనమిక్ ఫోర్స్) మారుస్తారు. నిజానికి మనిషి ప్రాణం భౌతికానికి అతీతమైనది. అందుకే హోమియో మందు ప్రాణ శక్తితో పూర్తిగా విలీనమవుతుంది. అందుకే దుష్ప్రభావాలు ఉండవు. అదే మందును భౌతిక రూపంలో ఇస్తే దుష్ప్రభావాలు తప్పనిసరిగా ఉంటాయి.

శస్త్ర చికిత్సలను దూరం చేస్తూ...
అలర్జీలు, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, ఆస్టియోఆర్థరైటిస్, స్పాండిలైటిస్, బ్రాంకియల్ ఆస్తమా, వంటి ఎన్నో వ్యాధులను హోమియో సమర్థవంతంగా నివారిస్తుంది. వీటికి తోడు అర్శమొలలు, టాన్సిల్స్, సైనసైటిస్ వంటి సమస్యలను శస్త్ర చికిత్స లేకుండానే నయం చేస్తుంది. అందుకే హోమియో వైద్య విధానం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తోంది.

ప్రపంచ ప్రజలకు అల్లోపతి వైద్య చికిత్సావిధానము పై విశ్వాసము సన్నగిల్లుతున్న తరుణము లో ప్రత్యామ్నాయ వైద్యవిధానాల కోసం వెతుకులాట మొదలైంది . ప్రపంచములోని ఇతర వైద్యవిధానాల గురించి అర్ధం చేసుకొని , వాటిని అనుసరిండం మొదలు పెట్టారు . అటువంటి సమయములో అల్లోపతి వైద్యులు తమకు తగులు తున్న దెబ్బను తట్టుకునేందుకు ఈ కొత్త విధానాలను "ప్రత్యామ్నాయ వైద్యవిధానాలు " (Alternative medical systems) అంటూ ఒకే గాడిన కట్టే ప్రయత్నం చేసారు . వారు ఏపేరు పెట్టినా ఈ వైద్యవిధానాలు మాత్రము ప్రజల విశ్వాసాన్ని పొందుతున్నాయి . ఈ వైద్యవిధానాలు ఎంతగా పుంజుకున్నాయంటే నేడు ఆ ఔషధాల అమ్మకాలు ప్రపంచవ్యాప్తం గా 7000 కోట్లకు చేరుకున్నాయి. అందులో ఒక్క హోమియోపతి 630 కోట్ల మేర అమ్మకాలు జరుగుతున్నాయి. ముఖ్యమైన ప్రత్యామ్నాయ వైద్యవిధానాలు -- ఆయుర్వేదము , హోమియోపతి , సిద్ధ , యునాని , మూలికా వైద్యము , యోగా, నేచురోపతి , ఆక్యుపంచర్ మున్నగునవి .

1796 లో హానిమాన్‌ అనే వైద్యుడు " ఒక కొత్త సిద్ధాంతము మీద వ్యాసం " అంటూ ఒక పరిశోధక సిద్ధాంతము ప్రతిపాదించారు . హనిమాన్‌ అప్పటికే ప్రచారములో ఉన్న అల్లోపతి వైద్య పట్టభద్రుడు . అయితే తాను చదువుకున్న విధానము , తాను చేస్తున్న చికిత్స లో ఎదో లోపము వుందని భావించి కొత్త చికిత్సామార్గము వైపు మనసు మళ్ళించారు . ఆయన తన పరిశోధనల ద్వారా " లైక్ క్యూర్స్ లైక్ " అనే సిద్ధాంతము ప్రతిపాదించాడు . శరీరము లో రోగాలను తట్టుకుని నిలబడగల శక్తి ఉంది . అది జీవుల సహజ లక్షణము కూడా . ఆ సహజ లక్షణము ను ఉత్తేజపరచడం ద్వారా శరీరాన్ని ఎటువంటి అనారోగ్యము నుండైనా బయటపడవేయవచ్చు అన్నది హోమియోపతి సిద్ధాంతము . హోమియోపతి సిద్ధాంతము పతిపాదించిన 1796 లోనే మరో పరిశోధన వెలుగు చూసింది . అది జెన్నర్ చేసిన టీకా ప్రయోగము . ఒక రోగము సోకకుండాఉండేందుకు ముందస్తుగా టీకాలు ఇవ్వడం జెన్నర్ కనుగొన్నది . అందుకు ఆయన అతి తక్కువ మోతాదులో రోగకారక క్రిములను శరీరములో ప్రవేశపెట్టి ... శరీర రోగనిరోధకవ్యవస్త ను అప్రమత్తం చేసే విధానాన్ని పాటించాడు . హోమియోపతి సిద్ధాంతం కూడా అటువంటిదే . హోమియోపతి కి హనిమాన్‌ కాలము లో అంతగా పుంజుకోలేదు, ప్రచారమూ జరుగలేదు . కాలక్రమేనా మంచి పేరున్న వైద్యవిధానము గా వెలుగొందినది . ఈ చికిత్సావిధానము లో వున్న మరో ప్రత్యేకత ... ఇది రోగముతో వచ్చే శారీరక ఇబ్బందులను పారద్రోలడమే కాదు మానసికం గా ఉత్సాహము తెచ్చిపెదుతుంది .

హోమియో మందులు ఖరీదు తక్కువ . వైద్యుల ఫీజులూ తక్కువ కాబట్టి ఆర్ధికం గా తక్కువ స్థాయిలో ఉన్న వారికి అందుబాటులో ఉంటుంది . హోమియో మందులలో సైడు ఎఫెక్ట్స్ ఉండవు లేదా తక్కువగా ఉంటాయి. ఈ మందులు ఎక్కువగా ఉచితం గా ఇవ్వడమే జరుగుతుంది . ఆ విధంగా పేద ప్రజల వైద్యం గా ముందుకు దూసుకు పోయింది . ఇక్కడ మందు పనిచేస్తుందో లేదా వారుచెప్పే పథ్యము , నియం నిబందనలు పాటించడం మూలనో శరీరము తనకు వచ్చిన రోగాన్ని ... తనే నయము చేసుకుంటుంది . హోమియోపతికి సంబంధించినంతవరకు ప్రజామోదములబించింది కాని నవీన వైద్యవిధానము (అల్లోపతి) వారు మాత్రము తమ అభ్యంతరాలులు చెపుతునే ఉన్నారు .ఒక దశలో హోమియోపతి నకిలీ వైద్యం అని ప్రచారమూ జరిగి దానిని నిషేదించాలని ప్రభుత్వాలను కోరిన సంఘటనలూ ఉన్నాయి. అయితే హోమియో వాడుతున్నవారిలో అధికారులూ ఉన్నందున వారి వాదన అంగీకరించబడలేదు . ఇటువంటి దాడులు ప్రపంచవ్యాప్తంగా సాగుతున్నందున వాటిని అడ్డుకునేందుకు , హోమియోపతి విశిష్టతకు ప్రచారము కల్పించేందుకు 2005 లో W.H.A.O (వరల్డ్ హోమియోపతి ఎవేర్నెస్ ఆర్గనైజేషన్‌) ఏర్పడినది . అల్లోపతి మందుల తయారీకి ప్రధాన కేంద్రమైన అమెరికానుండే ఈ ఆర్గనైజేషన్‌ తన కార్యకలాపాలను మొదలు పెట్టడం మూలానా మంచి ఆదరణ లబించినది . ఈ ఆలోచన క్రమముగా 2008 నవంబర్ 21 న పూర్తిస్థాయి సంస్థ గా హాలండ్ లో రూపుదిద్దుకున్నది . హోమియోపతికి విశేష ప్రచారము కల్పించడం , ప్రజలలో అవగాహన పెంపొందించడం , హోమియోపతికి సంబంధించి ఎవరి దగ్గర ఎటువంది కొత్త ఆలోచన ఉన్న స్వీకరించడం , రీచర్చి జరపడం మున్నగునవి ఈ సంస్థ , హోమియోపతి దినోత్సవం ల ముఖ్య ఉద్దేశము .

source : "similia similabus curentus"

  • =================================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .