- Every year on December 2nd Sunday ...
దైనందిన జీవితంలో రేడియో, టెలివిజన్, సినిమాలు, వీడియోగేమ్స్‌తోపాటూ ఫోన్, కంప్యూటర్, ఇంటర్‌నెట్ పాత్ర చాలా ముఖ్యమైనది. అందరూ ఇప్పుడు ఎక్కువ సమయం వాటితో గడుపుతున్నారు. ఖాళీ సమయాన్ని గడపడంకోసం పోయి నేడు దానికోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తున్నారు. చెప్పాలంటే బానిసలుగా మారిపోతున్నారు. కాలం విలువ, మానవ సంబంధాలు, చదువు, కెరియర్ వంటివన్నీ పక్కనపెట్టి వీటితోనే కాలక్షేపమంతా! వీటన్నింటివల్లా ప్రపంచం కుగ్రామం అయిందని వింటుంటాం. ఎక్కడో ఉన్న వారితో ఎదురుగా కూర్చున్నంత హాయిగా మాట్లాడుకోవచ్చని చెబుతుంటారు. ఆ మాట నిజమే అయినా... పక్కనే వున్నవారితో మాట్లాడకుండా మరో లోకంలో లీనమైపోవడం విషాదం!
ముఖ్యంగా వీటి ప్రభావానికి పిల్లలు ఎక్కువ లోనవుతున్నారు. పిల్లలు టెలివిజన్ చూడటంవల్ల వారిమీద మంచి ప్రభావం ఉండొచ్చు, లేక చెడుప్రభావం కావచ్చు. మంచిచెడుల మధ్య తేడా పిల్లలకు తెలియకపోవచ్చు. కానీ విచక్షణ తెలిసిన అమ్మకు, నాన్నకు దాన్ని సరిచేయాల్సిన అవసరం వుంది. ఉపాధ్యాయులుసైతం పిల్లలను చూసి తల్లిదండ్రులకు సలహా ఇవ్వాల్సిన బాధ్యత వుంది. కానీ 'మావాడు యాడ్స్ చూస్తూనే అన్నం తింటాడు' అని ఒకరు, 'మా చంటిది సీరియల్ టైటిల్ సాంగ్ వినగానే డాన్స్ చేసేస్తుంది' అంటూ మరొకరు నడకరాని పిల్లల గురించి చెప్పి మురిసిపోతుంటారు. వీటి ప్రభావాలను అర్థంచేసుకుని అప్రమత్తంగా వుండాల్సిన అవసరం పెద్దలదే!
టీవివల్ల వచ్చే ఇబ్బందులేంటో చూద్దాం.
వైద్య పరిశోధనల ప్రకారం పిల్లలు కనీసం రోజులో ఆరుగంటలు టివితోనో, సెల్‌ఫోన్‌తో లేక వీడియో గేమ్స్‌తో గడుపుతున్నారు. ఇండియాలో పరిస్థితి మరింత తీవ్రం. మిగతావారికన్నా పిల్లలు మరో రెండు గంటలు ఎక్కువ సమయం టివి దగ్గర గడుపుతున్నారు. దీనివల్ల పిల్లలకు వచ్చే ఇబ్బందులు, సమస్యలేంటో చూద్దాం.
బిహేవియర్ ప్రాబ్లెమ్స్
హింస, దెబ్బలాటలు టివిలో చూసినపుడు పిల్లల్లో కోపం, తిరగబడటం, కొట్టుకోవడం చూస్తాం. అంటే ప్రసార మాధ్యమాల ప్రభావం వారి ప్రవర్తనపై పడుతోందన్నమాట.
హింస ఎక్కువగా చూసినపుడు పిల్లల్లో కలిగే మార్పులు
1. స్కూలు, చదువు మీద ధ్యాస తక్కువవడం, సామాజికపరంగా అందరిలో ఇమడలేకపోవడం, పిల్లలమీద ఒత్తిడి ఎక్కువ అవుతుంది. వారిలో లేనిపోని భయాలు, ఒత్తిడి, కలలు, నిద్రలో అరవడం ఎక్కువగా కనిపిస్తుంది. మనసుమీద పడిన ప్రభావం టీవి చూసినంత సేపే కాదు, తరువాత కూడా వదలదు. భయంకరమైన, హింసను ప్రేరేపించే సినిమాలు ఎక్కువగా చూసినపుడు పిల్లల్లో ఈ మార్పు కనిపిస్తుంది. అది ఎక్కడికైనా దారితీయొచ్చు.
2. టీవిలు ఎక్కువగా చూసినపుడు ఇతరులతో మాట్లాడటం తగ్గిపోతుంది. స్నేహితులను పెంచుకోవడంలో ఆసక్తి తగ్గుతుంది. బంధాలను పెంపొందించుకోవడానికి, భావాలు పంచుకోడానికి ఆటంకం కలుగుతుంది. ఆ వయసులో పిల్లలకు స్నేహితులు ఎంతో ముఖ్యం. కానీ టీవీ, వీడియో గేమ్స్ కారణంగా వారికి తెలీకుండానే దూరమవుతారు. స్నేహితులతో కలవనపుడు ఒంటరితనం వారికి అలవాటవుతుంది. అది మనిషి ఎదుగుదలకు ఆటంకమవుతుంది. అంతేకాకుండా ఆయా పిల్లల్లో ఆత్రుత, తొందరగా కోపం, యాంగ్జైటీ, సహనం కోల్పోవడం వంటి మార్పులన్నీ కనిపిస్తాయి. ఎప్పుడో ఒకసారి స్నేహితులవద్దకెళ్తే ఎవరూ దగ్గరకారు. ఆ చికాకుతో స్నేహితులకు మరింత దూరమవుతారు. దానివల్ల మళ్లీ టీవీ 'ఎక్కువ' చూడటం మరింతగా మొదలెడతారు.
- =======================================
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .