Thursday, April 15, 2010

UNICEF day , యూనిసెఫ్ దినోత్సవంఐక్యరాజ్యసమితి .. బాల సంక్షేమం కోసం స్థాపించిన సంస్థ యునిసెఎఫ్ . బాలల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు ఈ సంస్థ క్రుషి చేస్తుంది .

గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు.... ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (December 11) 'UNICEF'Day గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము.

పిల్లలకు టీకా మందులు , పోషకాహార అవసరాన్ని తెలియజెపుతూ , బాలలు తమ బాల్యం ఆనందం తో గడుపుతూ ఎదిగేలా చేయాలనే లక్ష్యం తో పనిచేసే సంస్థ అయిన యునిసెఫ్ డే ని - డిశంబర్ 11 న జరుపు కుంటారు .
యుద్ధం లో ఓటమి చవిచూసున దేశాల్లోని పిల్లలకు మద్దతుగా, వారికి ఊరటను అందించడంలో సహకరించేందుకు గాను రెండోప్రపంచయుద్ధం తర్వాత ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ .. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (యునిసెఫ్) సంస్థను ఏర్పాటుచేసింది . 1940 నాటి ఆహార , వైద్య సంక్షోభం ముగిసిన తర్వత సంక్షుభిత దేశాల్లోని పిల్లల సహాయ సంస్థ గా యునిసెఫ్ తన పాత్రను కొనసాగించింది . 1970 వ దశకం లో పిల్ల హక్కుల పరిరక్షణ సంస్థగా పరిణమించినది .

పిల్లల హక్కుల కవెన్వెన్సన్‌ ముసాయిదా తయారిలో 1980 లలో యునిసెఫ్ ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమీషన్‌ కు సహకరించింది . 1989 యు.యన్‌ జనరల్ అసెంబ్లీకి పరిచయం తర్వాత పిల్లల హక్కుల కన్వెన్‌సన్‌ అత్యంత విస్తృతమైన మానవ హక్కుల ఒప్పందం గా చరిత్రలో నిలిచిపోగా , ఈ ప్రయత్నం లో యునిసెఫ్ కీలక పాత్ర పోషించినది . 183 ఐక్యరాజ్య సమితి సభ్యదేశాలలో కేవలం సోమాలియా , అమెరికా దేశాలు మాత్రమే ఒప్పందం అమలులో విఫలమయ్యాయి . సోమాలియాకు అంతర్జాతీయగుర్తింపు గల ప్రభుత్వ లేకపోవడం తో ఒప్పంద అమలు అక్కడ ఎంతమాత్రం సాధ్యపడలేదు . యునిసెఫ్ ను 1946 డిసెంబరు 11 వ తేదీన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఏర్పాటు చేసారు . జాతి , మత ,రాజకీయ వివక్షలేవి లేకుండా అవసరాలే ఆధారముగా పిల్లలకు సహాయపడాలన్నది యునిసెఫ్ లక్ష్యము .

మొదట్లో ఇది తాత్కాలికమైన ఎమర్జెన్సీ సంస్థ గానే ఉండేది . 1947 నుంచి 1950 వరకు రెండో ప్రపంచ యుద్ధ కాలం లో దెబ్బతిన్న పిల్లలకు సహాయం అందించడమే తన ధ్యేయమ గా పనిచేసింది . యునిసెఫ్ 31.90 కోట్ల టన్నుల పాలు , దుస్తులు , స్కూలు అవసరాలను యూరఫ్ , చైనాల్లోని పిల్లలకు అందించింది . క్షయ వ్యాధికి 'రెడ్ క్రాస్' సహకారముతో టీకాలు వేయించింది . యూరోపియన్‌ అత్యవసర పరిస్థితి ముగిసిన తరువా కూడా చేయాల్సిన పని చాలా మిగిలిపోయింది . దీంతో ఆఫిరికా , మధ్య ప్రాచ్యం , దక్షిణ అమెరికా ల్లోని వర్ధమానదేశాల్లో యునిసెఫ్ పని ప్రారంభించినది . 1953 లో సుధీర్ఘ చర్చల అనంతరం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ యునిసెఫ్ శాశ్వత మనుగడకు ఓటువేసింది . దాని పేరునుంచి అంతర్జాతీయ , ఎమర్జెన్సీ అన్న పదాల్ని పూర్తిగా తొలగించింది . కాని యునిసెఫ్ అన్నది అలా నిలిచిపోయింది . యూనిసెఫ్ 150 దేశాలకు , టెరిటరీలకు , ప్రాంతాలకు పైబడి పనిచేస్తున్నది . అభివృద్ధి చెందుతున్న దేశాల్లొ కార్యక్రమాల నిర్వహణకుగాను సంపన్నదేశాల్లోని 36 జాతీయ కమిటీలద్వారా నిధుల్ని సేకరించే కార్యక్రమాన్ని , పిల్ల హక్కులకు సంబంధించి అవగాహన కల్పించేందుకు యునిసెఫ్ నిరరంతము కృషిచేస్తున్నది . యునిసెఫ్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్ లో ఉన్నది . ఈ సంస్థ విధానాలు , కీలక నిర్ణయాల్ని ఇక్కడి నుంచే తీసుకుంటారు . యునిసెఫ్ ఐక్యరాజ్య సమితిలో భాగము . ప్రత్యేకంగా పిల్లలకోసం పనిచేసే అతిపెద్ద ప్రపంచ సంస్థ . దోపిడీ , నిర్లక్ష్యం , అత్యాచారాలనుంచి పరిరక్షణ , ఆరోగ్య రక్షణ , విద్య పిల్లలందరికీ అవసరమన్న లక్ష్యం దిశగా యునిసెఫ్ కార్యకలాపాలు సాగుతాయి .

యుద్ధం తో సహా సునామీ , భూకంపాలు , వరసలు వంటి ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు యునిసెఫ్ సహాయ సహకారాలు అందిస్తుంది . పిల్లలకు అవసరమైన రక్షణ కలుగజేస్తుంది . ప్రతి అబ్బాయి , అమ్మాయికి ఉన్నతమైన చదువు అందేలా చూస్తుంది . అనారోగ్యము , మరణాలు , వ్యాధుల బారినపడే పిల్లల సంఖ్య తగ్గించడం లో తోడ్పడుతుంది . ఏ దేశము లో ఏ విధము గా పనిచేయాలనేది ఆయా దేశాలకు సంభందించిన సమాచారము అనుసరించి పనిచేస్తుంది .
  • ============================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .