Friday, March 19, 2010

ప్రపంచ వినియోగదారుల దినము , World Consumers protection Day




  • గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (March 05)world consumers protection Day గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

శ్రీకాకుళం జిల్లాలో వినియోగదారుల ఫోరం ఏర్పాటు చేసి దశాబ్దం గడిచినప్పటికీ ఏటా కేవలం ౧౦౦ నుంచి ౨౦౦ కేసులు దాఖలు కావడం లేదు ... అంటే ఇక్కక ప్రజల జాగ్రుత తక్కువనుకోవాలా? లేక వ్యాపారుల మోసాలు లేవని అర్ధం చేసుకోవాలా? ఏది ఏమైనప్పటికీ నా జిల్లాలో అజావుగా వ్యాపారము జరగడం సంతోషదాయకము .

వినియోగదారుల ఉద్యమం ప్రప్రథమంగా అమెరికాలో ప్రారంభమయ్యింది. 1920లో మొట్టమొదటి వినియోగదారుల సంఘం అమెరికాలో ఏర్పడింది. దీని తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, డెన్మార్క్‌, నార్వే ఇతర ఐరోపా దేశాలలో కూడా ఉద్యమం వ్యాప్తి చెంది అక్కడ కూడా వినియోగదారుల సంఘాలు ఏర్పడ్డాయి. 'రాల్ఫ్‌నాడార్‌'ని వినియోగదారుల ఉద్యమ పితామహుడుగా పిలుస్తారు. ఆయన కృషి వల్ల నేడు ప్రపంచమంతటా వినియోగదారుల ఉద్యమ సంఘాలు ఉన్నాయి.
మార్చి 15, 1962లో జెఎఫ్‌ కెన్నెడి ప్రప్రథమంగా నాలుగు వినియోగదారుల హక్కులు అమెరికా ప్రజలకు ప్రకటించారు. అవి- రక్షణ, సమాచారం, ఎంపిక, విజ్ఞప్తి చేసుకునే హక్కులు. తర్వాత ఆ హక్కులు ఎనిమిది అయ్యాయి.

1972లో అంతర్జాతీయ వినియోగదారుల సంఘాల సంస్థ ప్రాంతీయ సంచాలకుడు అన్వర్‌ ఫజల్‌ మార్చి 15 తారీకుని ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా పరిగణించాలని తీర్మానించారు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 సంఘాలు, సంస్థలు 1973 మార్చి 15 ని వినియోగదారుల హక్కుల దినంగా పాటించాయి.

మనదేశంలో మొట్టమొదటి వినియోగదారుల సంఘాన్ని అప్పటి బొంబాయి (ఇప్పటి ముంబయి)లో ప్రారంభించారు. మన రాష్ట్ర విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఉద్యమాన్ని 1973లో విశాఖపట్నంలో పరిగి వసంతకుమార్‌ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యింది. ఆయన మొదటి వినియోగదారుల సంఘాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం 500 పైన సంఘాలు ఉన్నాయి. వినియోగదారుల్లో చైతన్యం, వారి సంరక్షణ, సంక్షేమం, సేవాలోపాలు, వినియోగదారుల విద్య తదితర అంశాలలో ఈ సంఘాలు, సంస్థలు పనిచేస్తున్నాయి. మన దేశంలో 1986లో వినియోగదారుల రక్షణ చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం వినియోగదారులుగా మనకు ఆరు హక్కులు ప్రకటించింది. అవి-
1. వినియోగదారుల రక్షణ- మానవప్రాణాలకు, ఆస్తికి ప్రమాదకారక వస్తువులు, సేవల నుంచి రక్షణ పొందే హక్కు. అవసరాలు తీర్చడమే కాకుండా, దీర్ఘకాలం మన్నే వస్తువులు, సేవలను పొందాలి.
2. సమాచారం పొందే హక్కు- అవాంఛిత వ్యాపార కార్యకలాపాల నుంచి వినియోగదారులకు రక్షణ కల్పించేందుకు వస్తు నాణ్యత, బరువు, స్వచ్ఛత, పుష్టి, ప్రమాణం గురించి తెలియజేయాలి. నాణ్యమైన సేవలు పొందే సమాచారాన్ని తెలుసుకునే హక్కు ఉంది.
3. వస్తువులను, సేవలను ఎంపిక చేసుకునే హక్కు- వివిధ రకాల వస్తువులు, సేవలు పొందేటప్పుడు వాటి మధ్య రేటు తెలుసుకోవడం మంచిది. సముచిత రేటులో నాణ్యత, సేవలు పొందడం
4. ప్రాతినిథ్యం వహించే హక్కు- వినియోగదారుల ఆసక్తిని, వారి అవసరాలను సరైన వేదికలు, ఫోరంలలో వినిపించడం. వినియోగదారుల సంక్షేమార్థం ఏర్పాటు చేసిన వివిధ వేదికలలో ప్రాతినిథ్యం వహించడం.
5. వినియోగదారుల ఫోరంలో విజ్ఞప్తి చేయడం ద్వారా సేవాలోపాలు, వస్తు లోపాల నుండి పరిహారం పొందే హక్కు- వినియోగదారులు మోసానికి గురయినప్పుడు ఫోరంలో కేసులు వేసి, తగిన పరిహారాన్ని పొందడం.
6. వినియోగదారుల విద్య హక్కు- వినియోగదారులు నిరంతరం తమ హక్కులను తెలుసుకుంటూ, తమ జ్ఞానాన్ని పెంచుకోవడం, నైపుణ్యాలను పెంపొందించుకోవడం ఎంతో అవసరం. గ్రామీణ ప్రాంతాలలో వినియోగదారులు హక్కుల పట్ల అవగాహన లేక ఎంతో మోసపోతున్నారు.
భారత ప్రభుత్వం 1989లో మార్చి 15 ని వినియోగదారుల దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనం ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని మార్చి 15 న జరుపుకుంటున్నాం.

మన రాష్ట్రం లోని 29 జిల్లా ఫోరాలలోఅవి ప్రారంభమైనప్పటి నుంచి అక్టోబర్‌ 2009 మాసాంతం వరకు దాఖలయిన, పరిష్కారమైన, పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
జిల్లా ఫోరం పేరు--- దాఖలైన కేసులు ----------పరిష్కారమైన కేసులు------ పెండింగ్‌ కేసులు
ఆదిలాబాద్‌---------------- 4671 --------------4441 -----------------230
అనంతపూర్‌ ---------------- 4586 ------------4449----------------- 137
చిత్తూరు1 -------------------4348------------ 4293 ----------------- 55
చిత్తూరు - 2 (తిరుపతి)------ - 591-------------- 558 ------------------33
తూర్పు గోదావరి - 1 (కాకినాడ) -8725------------ 8627 -----------------98
తూర్పు గోదావరి - 2 (రాజమండ్రి)- 917------------ 839 -------------------78
గుంటూరు ------------------9652------------ 9278 ------------------374
హైదరాబాద్‌ - 1 --------------16389---------- 16152 --------------- 237
హైదరాబాద్‌ - 2 --------------7961 -----------7672 ----------------289
హైదరాబాద్‌ - 3 ------------- 2068 -----------1907 --------------- 161
కడప ---------------------6593 ------------6559 ------------------34
కరీంనగర్‌ ------------------9252 ----------- 9027 ----------------225
ఖమ్మం------------------ 8678 --------------8517 --------------161
కృష్ణా - 1 (మచిలీపట్నం) ----5276 -------------5236---------------- 40
కృష్ణా - 2 (విజయవాడ) ----- 3576 ------------3416 ---------------160
కర్నూలు -----------------6530 ------------6391 ---------------139
మహబూబ్‌నగర్‌ ----------4532 -------------4445 ---------------87
మెదక్‌ ------------------2684 -------------2637 --------------- 47
నల్గొండ ----------------2718 -------------2696 ---------------22
పొట్టి శ్రీరాములు నెల్లూరు --13457 ------------13237 ---------------220
నిజామాబాద్‌ ------------5996 -------------5905 ---------------91
ప్రకాశం -----------------7481 -------------7326 ----------------155
రంగారెడ్డి -------------- 4328 --------------4111 ---------------217
శ్రీకాకుళం--------------- 4764 -------------4601 ---------------163
విశాఖపట్నం - 1 --------15896 ------------- 15575 -------------321
విశాఖపట్నం - 2 ------- 2073 --------------1834 ---------------239
విజయనగరం -----------2926 --------------2845 ---------------81
వరంగల్‌ ---------------5649 --------------5547 --------------102
పశ్చిమ గోదావరి --------4341 --------------4037 ---------------304


మొత్తం --------------176658 ------------- 172158 ------------4500


సౌజన్యం: గాలి ఉదయ కుమార్, రచయిత "Consumer Guide", కార్యదర్శి- Consumer Education Society
ఆహరం, వినియోగదారుల మంత్రిత్వ శాఖ-ఇండియా

  • ==================================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .