Monday, November 19, 2012

World COPD. Day-ప్రపంచ సి.ఒ.పి.డి. డే

  •  
  •  
  • గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (.21-నవంబర్ -2012....) -World COPD. Day-ప్రపంచ సి.ఒ.పి.డి. డే- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

సి.ఒ.పి.డి. అనేది  ఊపిరితిత్తులకు సంబంధించి ఒక రకమైన ఆయాసము కలిగించే వ్యాధి. ప్రతి సంవత్సరమూ ప్రపంచ వ్యాప్తము గా చాలా దేశాలు ఈ వ్యాధి గురించి అవగాహన కోసము నవంబర్ 2, లేదా 3 వ బుధవారము జరుపుకుంటారు. మన భారతదేశములో అంతగా ప్రచారములో లేదు.

ఈ సి.ఒ.పి.డి .. వ్యాధి గురించి కొన్ని విషయాలు : - COPD వ్యాధి చికిత్సావిధానాలని తెలుసు కోవడం ఎంతో అవసరం.


ఊపిరితిత్తులలో కొంత అవరోధం కలగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడాన్ని క్రానిక్‌ ఆబ్‌స్ట్ర క్టివ్‌ పల్మనరీ డిసీజ్‌ అంటారు. ఈ వ్యాధికి దీర్ఘ కాలిక చికిత్స అవసరం. ఊపిరితిత్తులలోని వాయు నాళాలలో అవరోధం వల్ల ఊచ్ఛాస, నిశ్వాసలో తేడా వస్తుంది. ఈ కారణంగా ఊపిరితిత్తులు బరువుగానూ, నిండుగా ఉన్నట్లుగానూ , ఛాతీ పట్టేసినట్లుగానూ ఉండి శ్వాస ఆడనట్లు అనిపిస్తుంది. కాలంలో క్రానిక్‌ ఆబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌ (COPD )  వ్యాధి ప్రబావం ఎక్కువగా ఉంటుంది.

కారణాలు :
COPD అనేది ఇన్‌ఫెక్షన్‌ కలిగించే వ్యాధి, అంటు వ్యాధి కాదు.- సాధారణంగా COPD వచ్చేవారు 40 ఏళ్ళకి పైబడినవారే అయివుంటారు. కానీ, పొగతాగేవారైతే 40ఏళ్ళలోపే రావచ్చు. COPD రావడానికి ముఖ్యకారణం పొగతాగడం (బీడీలు, సిగరెట్లు, హక్కా పీల్చడం).
- పొగతాగని వాళ్ళకి కూడా COPD రావచ్చు. అయితే వారు ఎక్కువ కాలం ఊపిరితిత్తులకు నష్టం కలిగించే వాతావరణంలో ఉండేవారై ఉంటారు. ఉదాహరణకి, వంట పొయ్యి, కుంపట్లు నుండి వచ్చే పొగ పీచ్చేవారిలో వస్తుంది.ఈ కారణంగానే చాలా మంది స్త్రీలకు COPD వస్తుంది.
-అంతేకాకుండా బొగ్గు గనులు, సిమెంటు, టెక్స్‌టైల్స్‌, రసాయనాలు, ఆభరణాలకు పూతపూసే (ఎలక్ట్రో ప్లేటింగ్‌) పరిశ్రమల దుమ్ముతో కూడుకున్న గాలి వున్న చోట్ల చాలాకాలం పని చేసిన వ్యక్తులకు కూడా ఇది రావచ్చు.
- ఆస్తమా (ఉబ్బసం) ఉన్న వ్యక్తులలో ఆస్త్తమాకి సరైన చికిత్స తీసుకోని వారికి COPD రావచ్చు.

లక్షణాలు :- స్పైరోమీటర్‌ అన్న ఒక పరికరం సహాయం ద్వారా,మీరు కొన్ని శ్వాస పరీక్షలు చెయ్యవలసి వుంటుంది. COPD
తక్కువైనదా ( MILD), ఓ మోస్తరుదా ( MODERATE) లేదా విపరీతమైనదా (SEVERE) అనేది కనుక్కునేందుకు ఈ పరీక్షలు పనికొస్తాయి.

తక్కువ COPD లక్షణాలు :- ఎక్కువగా దగ్గతూ వుండవచ్చు, ఒక్కొసారి దగ్గులో శ్లేష్మం కూడా రావచ్చు.కాస్తగా గట్టిగా పనిచేస్తే లేదా త్వరగా నడిస్తే, తగ్గినట్లు అనిపించవచ్చు.

మోస్తరు COPD లక్షణాలు :- శారీరకమైన పని లేదా ఇంటి పనులు చేస్తూ వున్నప్పుడు, మీకు కష్టం అనిపిస్తూ వుండచ్చు. మిగతా వారి కంటే ఈ పనులన్నీ కాస్త మెల్లగా చేయవలసి రావచ్చు.జలుబు, ఛాతీ ఇన్‌ఫె క్ష్‌న్‌ల నుండి కోలుకోవడానికి చాలా వారాలు పట్టవచ్చు.

విపరీతమైన COPD లక్షణాలు :- మీరు మెట్లు ఎక్కలేరు. ఓ గదిలో ఈమూల నుంచి ఆ మూలకి సరిగ్గా నడవలేరు. ఎంత కొంచెం పని చేసినా లేదా మీరు కాస్త విశ్రాంతి తీసుకున్నా కూడా మీరు ఆలిసిపోతూవుంటారు.

COPD చికిత్స మార్గాలు :-
పొగతాగే వారైతే, వెంటనే పొగతాగడం మానెయ్యండి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా వుంచుకోవాలను కుంటే ఇదే అతి ముఖ్యమైన పని. రోజుకి రెండు సిగరెట్లు తాగుతూ వున్నా, పరిస్థితి మరింత వేగంగా దిగాజారిపోతుంది. సిగరెట్ల పొగ వాయు నాళాలని
కుంచించుకుపోయేట్లు చేస్తుంది. కారణంగా మరింత ఎక్కువ శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తుంది. పొగతాగడం వల్ల రక్తంలో గల మీ శరీరానికి కావల్సిన ఆక్సిజన్‌ ను ప్రసరణ చేసే శక్తిని తగ్గిస్తుంది.

చికిత్స : -డాక్టర్‌ సూచన మేరకు మందులను క్రమం తప్పకుండా ఖచ్చితంగా తీసుకోవాలి. COPD తీవ్రతను తెలుసుకోవడానికి వైద్య పరీక్షలు చేయించుకోండి.
ప్రతి మందు పేరు, తీసుకోవలసిన మోతాదు, ఎప్పుడు తీసుకోవాలి అనవి రాసి ఉంచుకోండి.వాయునాళాలని వెడల్పు చేసే మందులను 'బ్రోంకో డైలేటర్స్‌' అంటారు. మీ ఊపిరితిత్తులలో గల వాయు నాళాల చుట్టూ వున్న కండరాలను గట్టిపరిచే చర్యను అవరోధించి, ఇంకా వెనక్క మరలించడం ద్వారా ఈ మందులు పని చేస్తాయి. ఉపశమనం కలిగి మరింత కులాసాగా శ్వాస పీల్చడానికి తోడ్పడ తాయి. శీతాకాలంలో మరింత జాగ్రత్తగా ఉంటే ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు.

Courtesy with - డా. సుధీర్‌ ప్రసాద్‌-పల్మోనాలజిస్ట్‌--గ్లోబల్‌ హాస్పిటల్‌,-హైద్రాబాద్‌@Andhraprabha news paper.

============================

 Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .