Friday, October 14, 2011

వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే , World Brain Tumour Day



గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (జూన్ 8న) -వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే , World Brain Tumour Day- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము.

మెదడులో క్రమంగా పాతకణజలాలు పోయి కొత్త కణజాల సృష్టి నిరంతరంగా జరుగుతున్నప్పుడు పాత కణజాలు సమసిపోకుండా మిగిపోయినప్పుడు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిని తెలుగులో 'మెదడు కణిత' అని అంటారు.

ఈ వ్యాధి సంక్రమించడం వల్ల ఏ భాగానికైన దేబ్బతగిలితే అక్కడ పనితీరు మందగిస్తుంది. పిల్లలు, యువకులలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి 25 – 35 సం.ల మధ్య వయసులో ఉన్న వాళ్లకి వస్తుంది. సకాలంలో ఈ వ్యాధిని గుర్తించకపోవడం వల్ల 3 శాతం మంది 5 సం.లకే మరణిస్తారు. ప్రతీ సంవత్సరం ఈ వ్యాధి 12 వేల మందికి వస్తుంది-అంచనా.

ఈ వ్యాధిలో మొత్తం 120 రకాలు ఉన్నాయి. అన్ని రకాల ట్యూమర్లు రోగికి హానికలిగించేవే. ఈ వ్యాధిని ముందుగా పసిగట్టి చికిత్స చేయించుకుంటే ఈ వ్యాధి నయం అవుతుంది. బినైన్ ట్యూమర్, మ్యాలిగ్నేంట్ ట్యూమర్ వంటివి ప్రమాదకరమైనవి. ఈ రెండి ట్యూమర్ వచ్చిన వారికి చికిత్స చేయడం చాలా కష్టం. ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ ఉన్న స్థానాన్నికనుక్కొని వాటిని తొలిగించవచ్చు.

బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి (మెదడు కణిత) లక్షణాలు:
ఈ వ్యాధి వచ్చినప్పుడు తలనొప్పితో పాటు వాంతలు, ఒక వస్తువు 2 వస్తువులుగా కనిపించడం, ఇన్ బ్యాలెన్స్, స్పర్శ తగ్గిపోవడం, కంటి చూపు మందగించడం, వినికిడి తగ్గిపోవడం వంటివి జరుగుతాయి.


‘వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్స్ డే’

గడ్డ (ట్యూమర్) ఎక్కడైనా రావచ్చు. ఇతర ఏ శరీర భాగాల్లో వచ్చినా దానితో అంత ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ అన్ని అవయవాల నియంత్రణ కేంద్రం

అయిన మెదడులో గడ్డలు వస్తే? అది తప్పకుండా ప్రమాదమే. ఎందుకంటే... మెదడులో ఒక అవయవాన్ని నియంత్రించే భాగంలో గడ్డ వస్తే అది ఆ

నియంత్రణ కేంద్రంపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా ఆ అవయవమూ చచ్చుబడిపోయే ప్రమాదం ఉంది. ఇలా మెదడులోని గడ్డలు వ్యక్తి ఆరోగ్యం,

కదలికలు, చురుకుదనం వంటి ఎన్నో కీలక అంశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నెల 8న ‘వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్స్ డే’ సందర్భంగా వాటిపై

సమగ్ర అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం.

 మెదడు గడ్డలు - వివరాలు
మెదడులో అసహజంగా/అసాధారణంగా పెరిగే కణజాలాన్ని గడ్డ (ట్యూమర్)గా పేర్కొనవచ్చు. ఈ గడ్డ మెదడుతో పాటు కేంద్ర నాడీ వ్యవస్థలోని ఏ ప్రాంతంలో

వచ్చినా అది మెదడు సాధారణ పనితీరును దెబ్బతీయవచ్చు. మెదడు గడ్డల్లో దాదాపు 120 రకాలుంటాయి. మెదడులో అది వచ్చిన ప్రాంతాన్ని బట్టి, ఆ

గడ్డలో ఉన్న కణాల తీరును బట్టి ఆ గడ్డకు పేరు పెడతారు. మెదడు గడ్డల్లో ప్రధానంగా రెండు రకాలు ఉండవచ్చు. మొదటివి ఎలాంటి హానీ చేయని

మామూలు గడ్డలు (బినైన్). రెండోవి ప్రమాదకరమైన క్యాన్సర్ (మ్యాలిగ్నెంట్) గడ్డలు.

 గడ్డల వర్గీకరణ
హాని చేయనివి (బినైన్): వీటి వల్ల మెదడుకు సాధారణంగా పెద్దగా ప్రమాదం ఉండదు. ఇవి మెదడులోని కణజాలం నుంచి గాని లేదా మెదడు పరిసరాల్లో

ఉండే కణజాలం నుంచి గాని పుట్టుకొస్తాయి. అయితే ఇవి క్యాన్సర్ సంబంధిత గడ్డలు కాకపోవడం వల్ల మెల్లగా పెరుగుతాయి. గడ్డ ఏ మేరకు పెరిగిందనే

విషయం తెలుసుకోవడానికి వీలుగా గుర్తించడానికి అనువైన అంచులు కలిగి ఉంటాయి. ఫలితంగా ఇవి మరో రకం కణజాలంలోకి చొచ్చుకుపోయేలా పెరగవు.

 హాని చేసే గడ్డలు (మ్యాలిగ్నెంట్): ఈ తరహా గడ్డల కణాలు క్యాన్సర్ కణాలను కలిగి ఉంటాయి. వీటి అంచులు గుర్తించడానికి వీలుగా ఉండవు. పెరుగుదల

కూడా చాలా వేగంగా ఉంటుంది. వీటి అంచులు గుర్తించడానికి వీలుగా ఉండకపోవడంతో చుట్టుపక్కల, పరిసరాల కణజాలంలోకి చొచ్చుకుపోయేలా

పెరిగిపోతాయి. దాంతో ప్రాణాపాయానికి అవకాశాలు ఎక్కువ. ఇవి మళ్లీ రెండు రకాలు - ప్రైమరీ, సెకండరీ లేదా మెటాస్టాటిక్ గడ్డలు.

 ప్రైమరీ గడ్డలు: మెదడులో పుట్టిన ఈ తరహా గడ్డలు మొదట మెదడు కణజాలంలో పుడతాయి. అయితే అవి మెదడులోనే ఇతర ప్రాంతాలకుగాని, లేదా

వెన్నులోకి గానీ పాకే అవకాశం ఉంటుంది.

 సెకండరీ లేదా మెటాస్టాటిక్ గడ్డలు: అవి మెదడులో నుంచి ఇతర ప్రాంతాలకు వ్యాపించిన గడ్డలు. వీటి ఆవిర్భావ కేంద్రాన్ని బట్టి వీటికి పేర్లు పెడతారు.

 మెదడులో గడ్డలు - కొన్ని వాస్తవాలు
 మెదడులో గడ్డలు వచ్చే అవకాశాలు పురుషులూ, మహిళలూ ఇద్దరిలో కనిపిస్తున్నా... అవి స్త్రీలలోనే ఎక్కువగా ఉంటున్నాయి. (ప్రతి లక్ష మందిలో

స్త్రీలలో 22.3 మందికి, ప్రతి లక్ష మంది పురుషుల్లో 18.8 మందికి మెదడులో గడ్డలు రావచ్చు).

 మొత్తం మెదడు గడ్డల్లో హానికరం కానివి 63 శాతమైతే, హానికరమైనవి 37 శాతం.

 ప్రతి ఏటా తెలుగునాట 25,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి.

 ఇతర రకాల క్యాన్సర్లు (అంటే రొమ్ము, ఊపిరితిత్తులు, పెద్దపేగు, మూత్రపిండాల క్యాన్సర్లు) సోకిన సందర్భాల్లో వారిలోని 20 - 40 శాతం కేసుల్లో అవి

మెదడుకు పాకి, అక్కడ క్యాన్సర్ గడ్డలు ఏర్పడుతున్నాయి.

 బ్రెయిన్ ట్యూమర్లకు కారణాలు
 వాతావరణ సంబంధమైనవి: నిత్యం రేడియేషన్‌కు గురయ్యే ఆస్కారమున్న ప్రాంతాల్లోని వారికి మెదడులో గడ్డలు రావచ్చు. అంటే చికిత్స కేంద్రాల్లో, వైద్య

పరీక్ష కేంద్రాల్లో పనిచేసేవారికి, సాధారణంగానే వాతావరణంలో రేడియేషన్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని వారికి, పారిశ్రామికంగా రేడియేషన్ వెలువడేందుకు

ఆస్కారం ఉన్న ప్రాంతాల్లోని వారికి, అణు ప్రమాదాలు జరిగిన చోట్ల ఈ తరహా ప్రమాదాలకు ఆస్కారం ఇస్తాయి.

 అయొనైజేషన్ లేకుండానే రేడియేషన్: కొన్ని సందర్భాల్లో మనం అయొనైజేషన్ ఎక్కువగా లేకుండా కూడా రేడియేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది.

ఉదాహరణకు మొబైల్ వాడకం వల్ల ఇలా జరిగేందుకు అవకాశం ఉంది. మొబైల్ ఫోన్స్ ఎక్కువగా వాడే వారిలో గ్లయోమా తరహా మెదడులో గడ్డలు

వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ఇటీవల పరిశోధనల వల్ల తేలింది. అయితే మొబైల్ ఫోన్స్ వల్ల బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయనేందుకు కచ్చితమైన

ఆధారాలేవీ ఇదమిత్థంగా లభించలేదు. అందువల్ల, ఫోన్ల వల్ల ట్యూమర్లు తప్పనిసరిగా వస్తాయని బల్లగుద్ది చెప్పేందుకు వీల్లేదు. అయితే అవకాశాలు

ఎక్కువగా ఉన్నట్లు మాత్రం చెప్పుకోవచ్చు. అందుకే 16 ఏళ్ల లోపు పిల్లలకు మొబైల్‌ఫోన్స్ నిత్యం ఉపయోగించేందుకు ఇవ్వకపోవడమే మంచిది. చాలా

సుదీర్ఘమైన కాల్స్ చేసేందుకు బదులు చిన్న చిన్న కాల్స్ (అవసరమైన మేరకే) చేయడం ఉత్తమం.

జన్యుపరమైనవి: క్రోమోజోముల్లో వచ్చిన మార్పులతోనూ మెదడులో గడ్డలు రావచ్చు. మానవుల్లో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. అయితే

సాధారణంగా ఇందులోని 1, 10, 13, 17, 19, 22 క్రోమోజోముల్లో ఏవైనా మార్పులు ఏర్పడటం వల్ల మెదడులో గడ్డలు వచ్చే ఆస్కారం ఎక్కువ. ఇక

1, 19 క్రోమోజోముల్లో వచ్చే మార్పుల వల్ల ఆలిగోడెండ్రోగ్లియోమా తరహా క్యాన్సర్ గడ్డలు వచ్చే అవకాశం ఎక్కువ. అదే 22వ క్రోమోజోములో మార్పుల

వల్ల మెనింజియోమా తరహా మెదడు గడ్డ ఏర్పడుతుంది. అయితే ఈ గడ్డ హానికరం కాదు.

 ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్లలో కొన్ని రకాలు
  గ్లయోబ్లాస్టోమా తరహావి 16 శాతం
  ఆస్ట్రోసైటోమా 7 శాతం
  మెనింజియోమా 35 శాతం
  పిట్యూటరీ 14 శాతం
 నర్వ్ షీత్ 9 శాతం
 లింఫోమా 2 శాతం
 ఇతర రకాలు (ఎపిండిమోమా, ఆలిగోడెండ్రోగ్లిమోవా, ఎంబ్రియోనల్ వంటివి) 33 శాతం.

 ఎలాంటి సమస్యలు రావచ్చు?
 మెదడు ఫ్రంటల్ లోబ్‌లో గడ్డలు రావడం వల్ల...
 కదలికలకు సంబంధించినవి
 రీజనింగ్‌కు సంబంధించిన లోపాలు
 ప్రవర్తనాలోపాలు
 జ్ఞాపకశక్తి లోపాలు
 నిర్ణయం తీసుకోవడంలో లోపం
 వ్యక్తిత్వ లోపాలు
 ప్రణాళికలో లోపాలు
 ఏదైనా విషయాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవడం
  చొరవ తీసుకోవడంలో లోపాలు
  తరచూ మూడ్స్ మారిపోవడం.

 టెంపోరల్ లోబ్‌లో గడ్డలు రావడం వల్ల...
 భాషను అర్థం    చేసుకోవడంలో లోపం
 ప్రవర్తనలో లోపం
 జ్ఞాపకశక్తిలో లోపం
 వినికిడి లోపాలు
 భావోద్వేగపరమైన మార్పులు

 పెరైటల్ లోబ్‌లో గడ్డలు రావడం వల్ల...
  ఏదైనా విషయాన్ని చెప్పడంలో లోపాలు
  సరిగ్గా లెక్కలు చేయడంలో అశక్తత
  స్పర్శజ్ఞాన లోపం
  చదవలేకపోవడం
  రాయలేకపోవడం

 పిట్యూటరీ గ్రంథి ప్రాంతంలో గడ్డల వల్ల...
 హార్మోన్ పరమైన మార్పులు
 ఎదుగుదల లోపాలు
 ప్రత్యుత్పత్తి లోపాలు / వంధ్యత్వం

 సెరిబెల్లమ్ ప్రాంతంలో గడ్డలు రావడం వల్ల...
 శరీరాన్ని నిటారుగా ఉంచడంలో లోపం
 తూగుతున్నట్లు నడవడం

 ఆక్సిపెటల్ లోబ్‌లో గడ్డల వల్ల...
 చూపు మసకబారడం / చూపునకు సంబంధించిన లోపాలు

 బ్రెయిన్ స్టెమ్ ప్రాంతంలో గడ్డల వల్ల...
 శ్వాస సంబంధమైన లోపాలు
 రక్తపోటులో మార్పులు
 గుండె స్పందనల్లో మార్పులు
 మింగడంలో, మాట్లాడటంలో ఇబ్బందులు

 నిర్ధారణకు వైద్య పరీక్షలు

 సీటీ స్కాన్ : మెదడులో ఏవైనా గడ్డలున్నట్లు అనుమానిస్తే మొదట చేయించే పరీక్ష ఇది.
  
 ఎమ్మారై: ఈ పరీక్ష వల్ల మెదడులో గడ్డ ఏ ప్రాంతంలో ఉంది, అది ఏ తరహాకు చెందినది, సైజు, మెదడులోని ఇతర భాగాల్లో ఏ మేరకు చొచ్చుకుపోయింది

వంటి అంశాలపై స్పష్టత వస్తుంది. శస్త్రచికిత్సలో కూడా ఎమ్మారై టెక్నిక్ చాలా ఉపయోగపడుతుంది.
  
 పెట్ స్కాన్: ఇది గడ్డలకూ, గడ్డలుగా కనిపించేవాటికి (ట్యూమర్స్‌కూ, నాన్‌ట్యూమర్స్‌కు) మధ్య తేడా చూపేందుకు ఉపకరించే పరీక్ష.

 లక్షణాలు
 మెదడులో గడ్డ ఏ ప్రాంతంలో ఏర్పడిందన్న అంశం ఆధారంగా ఈ లక్షణాలు మారుతుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో మెదడులో గడ్డ ఉన్నప్పటికీ

బయటకు ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. సాధారణ లక్షణాలివి...
  
 నలభై ఏళ్లకు పైబడిన వారిలో లేదా ఆరేళ్లలోపు వారిలో మొదటిసారిగా తీవ్రమైన తలనొప్పి  అకస్మాత్తుగా వాంతి
  
 మొట్టమొదటిసారిగా ఫిట్స్ రావడం
  
 స్పర్శజ్ఞానం కోల్పోవడం లేదా ఏదైనా అవయవానికి సంబంధించిన కదలికలు లోపించడం
  
 చూపు మసగ్గా మారడం
  
 వెంట్రుకలు రాలిపోవడం
  
 మాట ముద్దగా రావడం  డిప్రెషన్
  
 ప్రవర్తనలో, ఆలోచనసరళిలో మార్పు
  
 అంతర్గత హార్మోన్ల స్రావాల్లోనూ మార్పులు (ఎండోక్రైన్ డిస్‌ఫంక్షన్).

 ట్యూమర్లు - చికిత్సలు

 మెదడులో గడ్డలకు చేసే చికిత్సలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. వేర్వేరు అంశాలను పరిగణనలోకి తీసుకొని, అప్పుడు చేయాల్సిన చికిత్సను

నిర్ణయిస్తారు. ఆ అంశాలివి...
 రోగి వయసు
 అతడి పూర్తి ఆరోగ్యపరిస్థితి
 గడ్డ ఉన్న ప్రదేశం, దాని సైజు, అది ఏ తరహాకు చెందినది అన్న వివరాలు
 అది క్యాన్సర్ గడ్డా, కదా అన్న అంశాలు
 ఏదైనా ప్రత్యేక చికిత్స విధానానికి రోగి స్పందించే తీరు, అతడు తట్టుకోగలిగే తీరుతెన్నుల వంటి వ్యక్తిగత అంశాలు.

 మైక్రోన్యూరోసర్జరీ ప్రక్రియలు
 ఇటీవల వైద్య విజ్ఞానశాస్త్రంలో ఏర్పడిన పురోగతితో మెదడులోని గడ్డల తొలగింపులో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్తగా వచ్చిన

ఇమేజింగ్ ప్రక్రియలు, మైక్రోస్కోపిక్ విధానాలు, మ్యాపింగ్ ప్రక్రియలు, ఆపరేషన్ ప్రణాళికల్లో మార్పుల వల్ల మైక్రో న్యూరోసర్జన్లు అతి సూక్ష్మమైన గడ్డలతో

పాటు, గతంలో శస్త్రచికిత్స ద్వారా తొలగించలేని ప్రాంతాల్లోకి సైతం చేరుకొని వాటిని తొలగించి, బయాప్సీకి పంపగలుగుతున్నారు. ఈ పురోగతి వల్ల మరింత

కచ్చితత్వంతో గడ్డ ఏ తరహాకు చెందిందన్న విషయాన్ని నిర్ధారణ చేసి, గతంలో ఆపరేషన్ ద్వారా తొలగించలేమని భావించిన (ఇన్ ఆపరబుల్), చేరలేమని

భావించిన (ఇన్ ఆక్సిసిబుల్) గడ్డలనూ తేలిగ్గా తొలగించగలుగుతున్నారు.

 ఈ మైక్రో న్యూరోసర్జరీ ప్రక్రియల్లో ఇటీవల అత్యంత ప్రభావశీలమైన, శక్తిమంతమైన మైక్రోస్కోప్‌లను ఉపయోగించి గడ్డను ఎన్నో రెట్లు ఎక్కువగా కనిపించేలా

చేసి, శస్త్రచికిత్స సమయంలో వాటిని స్పష్టంగా చూస్తూ శస్త్రచికిత్స నిర్వహించగలుగుతున్నారు. అంతేకాదు... శస్త్రచికిత్సకు ఉపయోగించే ఉపకరణాలు,

పరికరాల (సర్జికల్ టూల్స్)లో సైతం గణనీయమైన మార్పులు, పురోగతి వచ్చాయి. దాంతో చాలా సునిశితత్వం అవసరమైన కేసులలోనూ సులభంగా

ఆపరేషన్ చేయడం సాధ్యమవుతోంది. ఈ తరహా శస్త్రచికిత్సల్లో సునిశితత్వమే చాలా ప్రధానమైన అంశం. ఏదైనా చిన్న రక్తనాళానికి ఆనుకొని ఉన్న గడ్డలు/

ఏదైనా చిన్న నరానికి ఆనుకొని ఉన్న గడ్డలు / పుర్రెలోని ఎముక అంచుకు ఆనుకొని ఉన్న సునిశిత భాగాల్లోంచి గడ్డను తొలగించడానికి ఈ తరహా

మైక్రోన్యూరో శస్త్రచికిత్స ప్రక్రియలు అవసరమవుతాయి.

 కీహోల్ సర్జరీ సాధ్యమేనా?
 ఇప్పుడు అన్ని శస్త్రచికిత్స ప్రక్రియల్లోనూ కోత కోసే భాగం అతి తక్కువగా ఉండేలా చిన్న గాటుతోనే మొత్తం శస్త్రచికిత్స నిర్వహించేలా ‘కీ-హోల్’ ప్రక్రియ

శస్త్రచికిత్సలు జరుగుతున్న విషయం తెలిసిందే. అలాగే మెదడుకు శస్త్రచికిత్స చేసే సందర్భాల్లోనూ ఇదే టెక్నిక్ సహాయంతో పుర్రెకు చిన్న గాటు పెట్టడం

లేదా అసలు గాటే లేకుండా కూడా శస్త్రచికిత్స నిర్వహించడం జరుగుతోంది. ఈ తరహా శస్త్రచికిత్స వల్ల ఆసుపత్రుల్లో ఉండాల్సిన వ్యవధి గణనీయంగా

తగ్గుతుంది. అంతేకాదు... కొన్ని కేసుల్లోనైతే అదే రోజు ఇంటికి వెళ్లేలా కూడా శస్త్రచికిత్స ప్రక్రియల్లో పురోగతి వచ్చింది.
అలాంటి కొన్ని అడ్వాన్స్‌డ్ ప్రక్రియలు ఏమిటంటే... న్యూరో ఎండోస్కోపీ
 ఈ ప్రక్రియలో భాగంగా చిన్న రంధ్రం ద్వారా మెదడు ఉండే ప్రదేశంలోకి సూక్ష్మమైన ఎండోస్కోప్‌ను పంపుతారు. ఆ ఎండోస్కోప్ లోపలికి వెళ్లి, దానికి అమర్చి

ఉన్న కెమెరా సహాయంతో గడ్డ ఉన్న ప్రదేశాన్ని స్పష్టంగా చూపుతుంటుంది. ఆ నిజ చిత్రం (రియల్‌టైమ్ ఇమేజ్) ఆధారంగా సర్జికల్ లేజర్ సహాయంతో

న్యూరో మైక్రోసర్జన్లు గడ్డలను/తిత్తులను న్యూరోసర్జన్లు అతి తేలిగ్గా తొలగించగలరు.

 స్టీరియోటాక్టిక్ సర్జరీ
 ఇది కూడా అతి సూక్ష్మమైన గాటుతో చేసే న్యూరో సర్జరీ ప్రక్రియ. ఇందులో మెదడులోని అత్యంత ఇరుగ్గానూ, సంక్లిష్టంగానూ ఉన్న ప్రాంతాల్లో ఏర్పడిన గడ్డ

నుంచి కూడా నమూనాను సేకరించి బయాప్సీకి పంపవచ్చు. అక్కడ ఏర్పడిన గడ్డను ఏ మాత్రం కదిలించినా కూడా ఇతర అవయవాలకు సంబంధించిన

సమస్యలు వస్తాయని భావించిన సందర్భాల్లో అత్యంత సునిశితమైన శస్త్రచికిత్స కోసం ఈ స్టీరియోటాక్టిక్ శస్త్రచికిత్స ప్రక్రియను అవలంబిస్తారు.

 ఫ్రేమ్-బేస్‌డ్ స్టీరియోటాక్టిక్ సర్జరీ
 ఈ తరహా శస్త్రచికిత్సలో అత్యంత తేలిగ్గా ఉండే ఒక ఫ్రేమ్‌ను తలకు అమరుస్తారు. ఈ ఫ్రేమ్‌ను పుర్రెకు సంబంధించిన నలువైపులా నాలుగు చోట్ల ఉండేలా

అమర్చాల్సి ఉంటుంది. ఒకసారి ఫ్రేమ్‌ను అమర్చాక సీటీ, ఎమ్మారై పరీక్షలతో పాటు మెదడులోని రక్తనాళాల్లోకి ఒక రంగు వంటి పదార్థాన్ని (డై ను)

పంపుతారు. దాంతో ఆ మెదడులో ఆ గడ్డ ఉన్న ప్రదేశం, సైజు వంటివి స్పష్టంగా (త్రీ-డైమన్షన్‌లో) కనిపిస్తుంటాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని

న్యూరోసర్జన్లు అత్యంత సునిశితంగా మెదడులోకి ఒక యంత్రభాగాన్ని (ప్రోబ్‌ను) పంపి, అత్యంత సునిశితమైన గాటు ద్వారా గడ్డను తొలగించి, దాన్ని

బయాప్సీతో పాటు ఇతర పరీక్షలకు పంపుతారు.

 ఫ్రేమ్‌లెస్ స్టీరియోటాక్టిక్ సర్జరీ (న్యూరో నేవిగేషన్)
 ఈ ప్రక్రియలో తలకు ఫ్రేమ్ అమర్చరు. అదేదీ లేకుండానే తల లోపలి భాగాలను గుర్తించేందుకు వీలుగా చిన్న చిన్న గుర్తులు పెట్టుకుంటారు. మనం బయట

ఏదైనా ప్రాంతానికి చేరడానికి వీలుగా కొన్ని కొండగుర్తులను (ల్యాండ్‌మార్క్స్) పెట్టుకున్నట్లుగానే ఈ గుర్తులు ఉపయోగపడతాయి. ఈ గుర్తులను

‘ఫిడ్యూషియల్ మార్క్స్’గా చెబుతారు. ఆ గుర్తుల ఆధారంగా మెదడులోపలి ప్రాంతాలను గుర్తించేందుకు అనువుగా మెదడును కంప్యూటర్‌కు అనుసంధానం

చేస్తారు. దాంతో కంప్యూటర్ స్క్రీన్‌పై మెదడు లోపలి భాగాలు, గడ్డ ఉన్న చోటు వంటివి స్పష్టంగా కనిపిస్తుంటాయి.

 సర్జరీ ప్రక్రియలో సర్జన్ పెట్టుకున్న ఈ గుర్తులను ఒక పాయింటింగ్ ఉపకరణం సహాయంతో తెలుసుకుంటారు. ఈ పాయింటింగ్ డివైజ్‌ను ‘వ్యాండ్’ అంటారు.

ఈ ప్రక్రియలో గడ్డను తొలగించాల్సిన సునిశితమైన ఉపకరణాలు మెదడులోని ఏ భాగంలో ఉన్నదీ కంప్యూటర్‌పై స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఈ చిత్రాల

ఆధారంగా సరిగ్గా గడ్డ ఉన్న ప్రాంతానికి చేరి అత్యంత సంక్లిష్టమైన భాగాల్లో ఉన్న గడ్డను సైతం తొలగిస్తారు.

 మందులతో చికిత్స
 కొన్ని సందర్భాల్లో గడ్డ ఉన్న ప్రాంతంలోని వాపును తగ్గించడానికి కొన్ని స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో రోగికి తలనొప్పి వంటి ఇతర భౌతిక

లక్షణాలు తగ్గుతాయి. అలాగే గడ్డల కారణంగా రోగికి ఫిట్స్ వస్తే వాటిని తగ్గించేందుకు మందులు వాడాల్సి ఉంటుంది.

 అసలు గాటు పెట్టకుండానే శస్త్రచికిత్స చేసే వీలుందా?
 అవును ఉంది. దానికి ఈ కింది ప్రక్రియలు ఉపయోగపడతాయి. అవి...

 స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ
 ఈ ప్రక్రియలో అత్యంత శక్తిమంతమైన రేడియేషన్ కిరణాలు (గామా కిరణాలు / ఎక్స్-రే /ప్రోటాన్ బీమ్) వంటివి ఉపయోగించి గడ్డను పూర్తిగా నిర్వీర్యం

చేస్తారు. ఈ చికిత్సలో గడ్డ పరిసరాల్లో ఉండే మెదడు భాగాలు ఏమాత్రం దెబ్బతినకుండా జాగ్రత్త తీసుకుంటారు. అయితే గడ్డ మరీ పెద్దగా ఉంటే ఈ తరహా

చికిత్సకు అవకాశం ఉండదు. అందుకే పెద్ద గడ్డల విషయంలో ఇదో ప్రతిబంధకం అనుకోవచ్చు. ఇలా కోత లేదా గాటు పెట్టకుండానే శస్త్రచికిత్స చేయడానికి

రెండు రకాల యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. అవి... గామా నైఫ్. ఇందులో తల చుట్టూ ఫ్రేమ్‌ను అమర్చి సునిశితమైన రీతిలో శస్త్రచికిత్స

నిర్వహిస్తారు. ఇక లినాక్ బేస్‌డ్ ప్రక్రియ అనే తరహాలోనూ రేడియో శస్త్రచికిత్స నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా  మెనింజియోమా

 అకాస్టిక్ న్యూరోమా
 మెటాస్టాసిస్
 పిట్యూటరీ అడినోమా
 గ్లామస్ ట్యూమర్
 కాండ్రోసర్కోమా / కాండ్రోమా
 హిమాంజియోబ్లాస్టోమా
 గ్లయోమాస్ వంటి గడ్డలను తొలగిస్తారు.

 రేడియేషన్ థెరపీ
 కొన్ని రకాల మెదడులోని క్యాన్సర్ గడ్డలనూ / క్యాన్సర్ తరహాకు చెందని గడ్డలనూ తొలగించడానికి రేడియేషన్ థెరపీ మంచి మార్గం. ఇందులో గడ్డను

పూర్తిగా నిర్వీర్యం చేయడంతో పాటు దాని పెరుగు దలను అరికట్టడం జరుగుతుంది. అయితే రేడియేషన్ చికిత్స ఏ మేరకు విజయవంతమవుతుందన్న

విషయం అనేక ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఏ తరహా గడ్డకు చికిత్స చేస్తున్నాం, దాని సైజు ఎంత వంటివి). చిన్న సైజు గడ్డలకు ఈ

తరహా చికిత్స బాగుంటుంది. ఇక కొన్ని తరహా గడ్డలకైతే కేవలం రేడియేషన్ చికిత్స మాత్రమే పనికివస్తుంది. ఇక కొన్ని సందర్భాల్లో బయాప్సీ తర్వాత లేదా

కొంత గడ్డను తొలగించాక శస్త్రచికిత్స ద్వారా తొలగించలేని ఆ మిగిలిపోయిన గడ్డ భాగాన్ని పూర్తిగా నాశనం చేయడం కోసం రేడియేషన్ థెరపీని

ఉపయోగిస్తారు. అలాగే శస్త్రచికిత్స ద్వారా తొలగించడానికి వీల్లేకుండా ఉన్న ప్రాంతాల్లో పెరిగిన గడ్డలకూ రేడియేషన్ థెరపీ బాగా పనికి వస్తుంది. ఇప్పుడు

సరిగ్గా గడ్డ ఎంత మేరకు ఉందో, అంతే మేరకు రేడియేషన్ తగిలేలా, మిగతా మెదడు భాగానికి ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేలా రేడియేషన్‌ను

పంపించగల అత్యంత సునిశితమైన యంత్రపరికరాలూ అందుబాటులోకొచ్చాయి. అలాగే అత్యంత సురక్షితమైన మోతాదుల్లో (డోస్‌లలో) రేడియేషన్‌ను

వెలువరించేలా కూడా పురోగతి చోటు చేసుకుంది. అందుకే ఇప్పుడు రేడియేషన్ చికిత్స గతం కంటే మరింత సురక్షితంగా జరుగుతోంది.

 కీమో థెరపీ
 చిన్న తరహా హానికరమైన గడ్డల (మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్)కు చికిత్స చేయడానికి కీమోథెరపీ బాగా పనిచేస్తుంది. ఇక కొన్ని రకాల క్యాన్సర్ గడ్డలు

రేడియేషన్‌తో పాటు కీమోథెరపీ ఇస్తేనే చికిత్సకు బాగా లొంగిపోతాయి. ఇక కొన్ని సందర్భాల్లో నేరుగా గడ్డలోకి మందు వెళ్లేలా కూడా కీమోథెరపీ ఇస్తారు.

ఇప్పుడు కీమోథెరపీలోనూ మరింత సమర్థంగా పనిచేసే మందులు కొత్తగా అందుబాటులోకి వస్తున్నాయి.

 మెదడులో గడ్డలకు చికిత్స చేసే నిపుణులు
 మెదడులోని గడ్డల చికిత్సల్లో వివిధ విభాగాలకు చెందిన నిపుణులు పాలుపంచుకుంటుంటారు. వారు న్యూరాలజిస్టులు, న్యూరోసర్జన్లు,

న్యూరోరేడియలాజిస్టులు, న్యూరోపాథాలజిస్టులు, రేడియేషన్ ఆంకాలజిస్టులు... వీళ్లందరి సమన్వయం, సహకారంతో మంచి ఫలితాలు వచ్చే ఆస్కారం

ఉంది.

 మెదడులో ఏర్పడే గడ్డలను తొలగించడం అనే ప్రక్రియ ఇప్పుడు గతంలో కన్నా సమర్థంగా, సునిశితత్వంతో, సురక్షితమైన రీతిలో జరుగుతోంది కాబట్టి

మునుపటిలా ఆందోళన అవసరం లేదు.

 శస్త్రచికిత్స ఎప్పుడు చేస్తారంటే...
 రోగికి శస్త్రచికిత్స చేసి గడ్డను తొలగించాలని సిఫార్సు చేసే సందర్భాలివి...
  
 వీలైనంత వరకు గడ్డను తొలగించేందుకు అవకాశం ఉన్నప్పుడు.
  
 గడ్డ ఏ తరహాకు చెందినదనే అంశం స్పష్టంగా, నిర్ధారణగా తెలిసినప్పుడు
  
 గడ్డను తొలగించడం వల్ల మెదడులోని ఇతర ప్రాంతాల్లో గడ్డ వల్ల పడే ఒత్తిడి (ఇంట్రాక్రేనియల్ ప్రెషర్) గణనీయంగా తగ్గి మంచి ఉపశమనం లభిస్తుందని

తెలిసినప్పుడు లేదా మిగతా గడ్డను రేడియేషన్ / కీమోథెరపీతో తేలిగ్గా నిర్మూలించగలమని స్పష్టంగా తెలిసినప్పుడు
  
 మందులతో ఫిట్స్ నియంత్రణలోకి రాని సందర్భాల్లో బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల వస్తున్న ఆ ఫిట్స్ కాస్తా గడ్డలను తొలగించడం వల్ల తగ్గిపోతాయని నిర్ధారణగా

తేలినప్పుడు.

 భవిష్యత్తులో రానున్న మరిన్ని ప్రక్రియలు
 జీన్ థెరపీ: ఇందులో జన్యుపరివర్తన ద్వారా గడ్డలు రాకుండానే చేసేందుకు ఆస్కారం ఉంటుంది.
  
 ఇమ్యూనోథెరపీ: కొన్ని రకాల మందులు ఉపయోగించి, రోగి తాలూకు రోగనిరోధకత పెంచి చేసే చికిత్సలతో గడ్డలు అసలు రాకుండానే చేయడం.
  
 యాంటీ యాంజియో జెనిక్ థెరపీలాంటివి...

Courtesy with : http://firstcry.blogspot.in/2014/06/8.html



=========================================

Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .