గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు ( ఆగస్ట్ 6వ తేదీన)
- హిరోషిమా డే - గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము...
ప్రతి సంవత్సరం ఆగస్ట్ 6వ తేదీన హిరోషిమా డే గా జరుపుకుంటారు. ఆగస్ట్ 6, 1945న ఉదయం 8.15 నిలకు అమెరికాకు చెందిన ‘బి29’ విమానం జపాన్‌లోని హిరోషిమా నగరం మీద బాంబు దాడి చేసింది. అగ్ని జ్వాలలతోపాటు, అణుధార్మికశక్తి చలరేగి 70 వేల మంది మరణించి ఉండవచ్చని అంచనా. అమెరికా కు 33వ అధ్యక్షుడైన హారీ ట్రూమన్ (1945-52) హిరోషిమా, నాగా సాకిలపై అణుబాంబులు ప్రయోగించమని ఆదేశాలు జారీచేశాడు.
ఆగస్టు 6న హిరోషిమా నగరంలోని శాంతి స్మృతి వనంలో జపాన్ ప్రజలు, ప్రపంచ శాంతి కార్మికులు ప్రార్ధనలు చేసి కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటిస్తారన్నారు.
- =========================================
Visit My Website - >
Dr.seshagirirao.com/
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .