Sunday, July 31, 2011

తెలుగు అకాడమీ ఆవిర్భావ దినోత్సవం , Telugu Academy day



గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (ఆగస్ట్‌ 06) -తెలుగు అకాడమీ ఆవిర్భావ దినోత్సవం- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము


తెలుగు భాషను అధికార భాషగా అభివద్ధి పరచడానిి సూచనలిచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జె.పి.ఎల్‌.గ్విన్‌ అధ్యక్షతన ఒక నిపుణుల సం ఘాన్ని ఏర్పరిచింది. రాష్ట్ర భాషనొకదానిని నెల కొల్పాలని ఈ నిపుణుల సంఘం సూచించిం ది. ఉన్నత విద్యాస్థాయిలో ప్రాంతీయ భాషల ను బోధనా మాధ్యమాలుగా ప్రవేశపె ట్టేందు కు ప్రాంతీయ భాషా సంస్థలను స్థా పించటాని కి భారత ప్రభుత్వం ఒక ప్రణాళి కను రాష్ట్ర ప్ర భుత్వాల కు 1967 లో అందిం చింది. ఈ నేపథ్యంలో ఆగస్ట్‌ 6, 1968వ సంవత్సరంలో ‘తెలుగు అకాడమీ’ స్థాపించ బడింది.

పారిభా షిక పదకోశాలు, నిఘంటువులు, మోనోగ్రాఫు లు, ఇంటర్‌, డిగ్రీ తరగతు లకు పాఠ్యగ్రంథా లు, ఇతర గ్రంథాలు అన్నీ కలిపి వెయ్యికి పై గా గ్రంథాలను ఈ అకాడమీ ప్రచురించింది.


పూర్తి వివరాలకోసం ---> తెలుగు అకాడమీ
  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .