Saturday, March 5, 2011

పెళ్ళి దినోత్సవం , Marriage Day,ప్రపంచ వివాహ దినోత్సవంగత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (.....) -పెళ్ళి దినోత్సవం- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

అమెరికాలో మొదలయిన వేడుక ఈ ప్రపంచ వివాహ దినోత్సవం (world marriage Day). వైవాహిక జీవిత ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ సమాజ నిర్మాణానికి ఆధారము , ఆలంబనము అయిన భార్యాభర్తల్ని కుటుంబ పెద్దలుగా భావించి , గౌరవించే సంప్రదాయాన్నీ పాటించాలని , దాన్నో సంస్కృతిగా అలవరుచుకోవాలని ' వరల్డ్ మ్యారేజ్ డే' అమూల్యమైన సందేశము అందిస్తోంది . 'వరల్డ్ వైడ్ మ్యారేజ్ ఎన్‌కౌంటర్ ' 28 ఏళ్ళ క్రితం ఫిబ్రవరి నెలలో 2 వ ఆదివారాన్ని వివాహవేడుక దినం గా ప్రోత్సహించడం తో " వివాహ దినోత్సవం " మొదలైనది . సమాజానికి మౌలిక పునాది అయిన భార్యాభర్తలను గౌరవించే ప్రత్యేక రోజుగా 1983 లో " వరల్డ్ మ్యారేజ్ డే" గా ఫూపాంతరం చెందినది .

మతమేదయినా వివాహ ధర్మమొకటే ' సహజీవన సౌందర్యం ' . పాశ్చాత్య నాగరికతా మోజులో పడి భారత యువత ఎంతగా భ్ర ష్టుపట్టిపోతుందో మనకి తెలియంది కాదు. ప్రేమ పేరుతో వంచనలు, దురాగతాలు అంతు లేకుండా పోతున్నాయి. భాధ్యతగలిగిన పౌరులే కాదు సమాజంలో హోదా,పరువు వున్నవారు కూడా ఈనాడు వివాహేతర సంబంధాలతో విచ్చలవిడి శృంగారాన్ని .. ఇపుడు ఒక స్టేటస్ గా భావిస్తున్నారు. సర్వత్రా నైతిక విలువలు లోపిస్తున్నాయి.
యావత్ ప్రపంచం లోనే అత్యధిక యవశక్తి ఉన్నదేశం మన భారతదేశం. యువత సన్మార్గం లో నడుచుకుంటే భారతదేశాన్ని మించిన మరొ దేశం ఈ ప్రపంచం లో ఉండదంటే అతిశయోక్తి కాదు.

సంఘమ్లో సదాచారాలను, సాంఘిక న్యాయాన్ని విశ్వజనీనంగా ఏర్పాటుచేసి సువ్యవస్థను రూపొందిచిన వారు మన పూర్వీకులు. ప్రపంచం లో ఎక్కడా లేని వివాహ సంస్కృతి మనది. భిన్న కుటుంబం లో పుట్టి, భిన్న వాతావరణం లో పెరిగి, భిన్న అలవాట్లను, అభిప్రాయాలను కలిగి ఉన్న ఇద్దరు మనుషులను ఒక పసుపు తాడు ప్రేమానురాగాలతో ఆ జన్మాంతం కట్టిపడేసే పటిష్టమైన వివాహ బంధం మనది. మన పూర్వీకులు మనకందించిన ఈ సంస్కృతీ సంప్రదాయాలను మన ముందుతరాలకు అందిచాల్సిన బాధ్యత మనందరిది.
భారతీయ వివాహ పధ్ధతి యందలి పవిత్రత, గౌరవం , ఆశయం, ఆదర్శం ప్రపంచమందలి మరి ఏ యితర దేశమందుగాని, మతమునందుగాని గానజాలము. ....అనిబిసెంటు.

మధుర స్మృతుల కలబోత : ఆలుమగలుగా మీఇద్దరూ కల్సి ఆనాటి మధురస్మృతులు కలబోసుకోండి . పెళ్ళి ఫొటూలను తిలకించండి . మీరు ఎలా కలుసుకున్నారో , ఎలా ప్రేమలో పడ్డారో ... ఎలా పెళ్ళి చేసుకున్నారో ఆ వృత్తాంతాన్ని మీ పిల్లలకు చెప్పండి . మ్యారేజ్ డే ని మీ మనస్సుకు నచ్చిన రీతిలో జరుపుకోండి . ఆనందించండి . పరస్పర కానుకలు ఇచ్చి పుచ్చుకోండి . మీకిస్టమైన విందు భోజనం ఆరగించండి . మీ పిల్లలకు ఈ వేడుకలను పురస్కరించుకొని కానుకలు ఇవ్వండి . అందరూ కలిసి ఆనందముగా ఆడండి , పాడండి , సంతోషముగా గడపండి . నిజానికి ఎన్నో సుదీర్ఘ వసంతాలు వైవాహిక జీవితం గడిపిన జంటలకు అనుభవాలతో పండిపో్యిన ఆలుమగలకు ఒకరోజు నిజంగా సరిపోతుందా? .

ఆలుమగలు తమ ఇష్టాయిష్టాలను ఒకరిపై ఒకరు రుద్దే ప్రయత్నం చేయకూడదు . ఇద్దరికీ ఒకే ఇష్టం ఉండాలనికాని , ఒకే ఇష్టాన్ని ఇద్దరూ ఇష్టం గా చేసుకోవాలనిగాని నియమము ఏదీలేదు . అయితే ఇరువురి ఇష్టాలు ఒక్కటైతే వారిమధ్య సక్యత మరింత బలపడ్తుందని నా నమ్మకము . ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా పరస్పరము అవ్యాజమైన ప్రేమ కలిగి ఉండాలి. జీవిత భాగస్వామి అనుక్షణం వెంటవున్నవారు బాగారాణిస్తారు. ఏ పని అయినా కలిసి చేయడానికి ఇష్టపడాలి . అప్పుడప్పుడు ఏకాంత జీవితం గడుపుతూ ఉండాలి . దూరము మరింత దగ్గర చేస్తుంది .

పరస్పర అవసరాలు : ఏ సంబంధాలలోనైనా పారదర్శకత చాలా ముఖ్యము . ప్రేమ సంబంధాలలో ఇది మరీ ముఖ్యము . ఇమెయిల్స్ , పాస్ వర్డ్ , బ్యాంక్ ఖాతాలు , ఎటియం పిన్‌ ... తదితరమైన వాటినుండి ప్రతి విషయములో తాము ఇద్దరూ ఒక్కటేనన్న భావం తో ఉండాల్సిఉంటుంది. మొబైల్ కాల్స్ పరస్పరము తెలుసుకుని , తనిఖీ చేసుకునే జంటలూ ఎన్నో ఉన్నాయి. మరీ ఇంతగా ప్రతి అంశాన్ని పట్టించుకోవడం కొంతమందికి ఎబ్బెట్టుగా కనిపిస్తుంది . ఇటువండి వ్యక్తిగత సమాచారాన్ని పరస్పరం పంచుకోవడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యము వారి మధ్య చేటుచేసుకునే అభద్రతా భావము , విశ్వాసలేమి ఉండకూడదనే అభిప్రాయమే. ఒక అంశాన్ని లేదా సమస్యను పంచుకునే విషయములో పరస్పర విరుద్ధ అభిప్రాయాలుంటే అవి వారి పాలిట పెద్ద శాపముగా పరిణమిస్తాయి. అన్ని వివరాలను పంచుకోవాలని అలుమగ లలో ఏ ఒక్కరైనా మంకుపట్టు పడితే అవిశ్వాసాన్ని నెలకొల్పడములో ఇది విషమపరిణామాలకు దారితీస్తుంది ... అలాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి తమను జవాబుదారీ చేస్తున్నారని భావింఛే ప్రమాదము ఉండవచ్చును . ఇంకా స్పస్టం గా చెప్పాలంటే ప్రతిదీ పంచుకోవడం అంటే మరీ ఎక్కువగా పంచుకోవడమే కాగలదు . ప్రతి వ్యక్తికి ఎంతో కొంత ప్రైవసీ అవసరము . సంబంధాల పేరిట హక్కులను కాలరాయడం తగదు ... కాని భార్యాభర్తల హాకులన్ని ఏకమైతే జీవితం సజావుగా , సంతోషముగా ఉంటుంది . మగవారు కొద్దిక ఇగో చూపిన ... ఔదార్యానికి మారుపేరైన స్త్రీలు ఇగో వైపు వెళ్ళకుండా భర్త జీవన యానములో కలిసి కట్టుగా అనిగి మనిగి ... తను భర్త కంటే అన్నివిధాల తక్కువే అన్నట్లుగా , భర్త ప్రతి మాటను , ప్రతి చర్యను తగిన సలహానిస్తూ గౌరవించేదిగా నడవాలి . ఇతరుల దగ్గర,సమాజము లోను తన భర్తను అవమానపరిచే విధం గా మాట్లాడకూడదు ఏ చర్యా చేపట్టరాదు . అదే నిజమైన ఆదర్శ దాంపత్యజీవతం . భర్త దగ్గర భార్య ... భార్య దగ్గర భర్త పారదర్శకం గా ఉండాలి. తప్పైనా , ఒప్పు అయినా .. పాపమైనా , పుణ్యమైనా సమానముగా పంచుకోవాలి , అనుభవించాలి. ప్రతిపనిలోనూ చేదోడు వాదోడుగా ఉండాలి. భోజనం దగ్గర కలిసి బోజనం చేయడం తప్పనిసరిగా ఉండాలి . కామమే ప్రేమ కాకూడదు . సహచర్యమే సంఘమం గా సాగాలి.

నేటి మానవ జీవితం లో ఒకరిపై ఒకరు అధారపడడం అనేది ఉండదు . అందరూ స్వతంత్రులే ... సంపాదనలోనూ సమానులైనా ... పక్కవారిపై ఆదారపడడం సంబంధీకులలోనూ ఉండకూడదు . ఇలాంటి సంబంధాలు అవసరాల ప్రాతిపదికగా ఏర్పడతాయి. సహోద్యోగులు , కాలేజి స్నేహితులు , ఇరుగు పొరుగు వారు మధ్య ఇలాంటి సంబంధాలు తరచుగా ఏర్పడతాయి. అవసరమైనంత మేరకే సంబంధం తర్వాత వెంటనే కట్ చేసెయ్యాలి. సంబంధ బాంధ్యవ్యాలు మనస్పర్ధలకు దారితీస్తాయి. బంధమైన ... సంబంధమైనా భార్యా భర్తల మద్యే ఉండాలి. చివరికి అమ్మ నాన్న లతోనైనా సరే దూరము మెంటైన్‌ (maintain) చెయ్యాలి. ఆలుమగలకు అవసరాలుంటాయి. వారు జీవితం ఒంటరిగా గడపలేమని భావిస్తారు . ఇటువంటి సంబంధాలలో ఒకరిని మరొకరు సహాయ సహకారులుగా ఉండాలి. ఒక ప్రణాళిక ప్రకారము ... మర్చిపోవడానికి వీలులేకుండా చేయవలసిన పనులు ఒక పుస్తములోనో ,కాగితం పైనో , డైరీ లోనో రాసుకొని తు.చ. తప్పకుండా చేసుకుంటూ ఒకరి అభిరుచిని ఒకరు గౌరవిస్తూ అవసరమైతే తన ఇస్టా యిష్టాలను ప్రక్క పెట్టి తన వాడి కోసం/తనదానికోసం అహర్ణిసలూ పాటుపడుతూ ఉండాలి.

మనసు విప్పి మాట్లాడుకోవాలి : ప్రతి క్షణము భాగస్వామితో కలసి గడపాలనుకోవడం అంత మంచిది కాదు . అంటి పెట్టుకు తిరగడం వలన , వెన్నంటి ఉండడం వలన అతడు / ఆమె కు ఆ పరిస్థితి ఇబ్బందికరం గా ఉండవచ్చు. దానివలన ఏం చేయడానికైనా సరిగా ప్రయత్నించలేరు . సలహా చెప్పడానికి సమయానికి ఆయనో , ఆవిడో లేదని అనుకోవలసిన పరిస్థితి ఎదురయ్యే విధంగా మసలుతూ ఉండాలి. అభిప్రాయాలు నిర్మొగమాటం గా వెళ్ళడించుకోవాలి . ప్రశాంతం గా వ్యవహరించుకోవాలి. అరోపణ , అభియోగాల ధోరణి ఉండకూడదు . ఇద్దరి మధ్య చర్చ ఉండకూడదు , స్పస్టత ఉండాలి . భాగస్వాముల లో ఏకపక్షనిర్ణయాలు , ప్రయత్నాలు ఆశించినంత ఫలితాలు ఇవ్వవు . కమ్యూనికేషం గ్యాప్ ఉండకూడదు . వారాంతము రోజుల్లో షికారులు , సినిమాలు ఉండాలి. పెళ్ళిల్లు , ఫంక్షన్లు , గుడి గోపురాలకు కలిసే వెళ్ళాలి . భక్తి అయినా రక్తి అయినా ఒకే బాటలో నడవాలి . కొన్ని విషయలలో రాజీ పడడం అవసరము . . . మొండి వాదనకు దిగరాదు .. కుక్కతోక వంకర అన్నట్లు మెలగరాదు .
మనదేశము లో అందరూ మ్యారేజ్ డే ని జరుపుకుంటున్నారా? ... లేదనే చెప్పాలి . . జరుపుకోవడం చాలా మంచిది ... మీరు జరుపుకునేవారైతే ఆ విధానాన్ని పదిమందికీ తెలియజెప్పండి . భార్య భర్త అన్యోన్యతా జీవనము తమ పిల్లల మంచి మనుగడకు దోహదపడుతుంది.


  • =========================================

Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .