Wednesday, February 16, 2011

చైల్డ్ రైట్స్ అండ్ యు డే , Child rights and you Day


గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (jan 28) - చైల్డ్ రైట్స్ అండ్ యు డే (Child rights and you Day)- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

పిల్లల్ని పువ్వులతో పోల్చుతారు , దేవుళ్ళతో సమానము అంటారు . పువ్వు మాదిరి పిల్లల్ని సుకుమారం గా చూసుకోగలుగుతున్నామా? . , దైవము లా గౌరవించి పూజిస్తున్నామా? అంటే సమాధానము సరిగా రాదు . మన దేశం లో రోజుకు పదివేల మంది పిల్లలు మృత్యువాత పడుతున్నారంటే వింతగా అనిపిస్తుంది . ఈ సంఖ్య సునామీ , వరదలు , భూకంపాలు , యుద్ధాలు , ఇతర విపత్తుల కంటే ఎక్కువే . మన దేశ పిల్లల సంఖ్యలో సగం మందికి పైగా ప్రాధమిక హక్కు అయిన విద్యను ప్రతిరోజూ కొల్పోతుంటారు . 20 లక్షల మంది భారతీయ శిశువులు ఏటా తమ మొదటి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోకుండానే కన్నుమూస్తున్నారు . ప్రతిరోజూ లక్షలాది మంది పిల్లలు ఆకలితోనే రాత్రి పడక చేరుతున్నారు అని అంచనా . వారికి రాజ్యాంగము కల్పించిన హక్కులు ఏవీ అందడం లేదు .

వీటన్నింటినీ దృష్టిలో వుంచుకుని బాలల హక్కుల పరిరక్షణ కోసం ఆవిర్భవించిన సంస్థ " చైల్డ్ రైట్స్ అండ్ యు " ఇది ఆర్ధిక ప్రయోజనేతర సంస్థ . మన దేశం లో పిల్లల హక్కుల్ని కాపాడాలన్న ఉద్దేశము తో 1979 లో ఈ సంస్థను ఏర్పాటు చేసారు . దీనిని సి.ఆర్.వై( క్రై -CRY) గా పేర్కొంటారు . కిందస్థాయి ప్రభుత్వేతర సంస్థలు దీనిలో భాగస్వాములు . ప్రాధిమిక హక్కులు కోల్పోతున్న వేలాది మంది పిల్ల కోసం ఏర్పాటయిందీ సంస్థ . 1979 లో ముంబయి కేంద్రం గా ఏర్పాటైన ఈ సంస్థకు బెంగుళూరు , చెన్నై , ఢిల్లి ,కలకత్తాలలో శాఖలు ఉన్నాయి . సామాజిక సేవకోసము రిప్పన్‌ కపూర్ అనే వ్యక్తి దీనిని స్థాపించాడు . అయితే పిన్నవయసులోనే తన 40 వ ఏట 1994 లో రిప్పన్‌ మరణించాడు . ఈ సంస్థ ప్రధానము గా 4 అంశాలమీద దృష్టి సారిస్తుంది . మనుగడ , అభివృద్ధి , పరిరక్షణ , పార్టిసిపేషన్‌ ..... సదరు అంశాలు . 192 దేశాల సమ్మతితో జరిగిన అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందం అయిన యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్‌ అనేది ' రైట్స ఆఫ్ ది చైల్డ్ (సి.ఆర్.సి ) వీటిని విర్వచించినది . అన్ని కేటగిరీలు అంటే .. వీధిబాలలు , వెట్టి కార్మికులు, బాల సెక్స్ వర్కర్లు , మానసిక , శారీరక్ లోపాలుగల పిల్లలందరికీ హక్కుల కల్పనకు " క్రై " పనిచేస్తుంది .

1979 వ సంవత్సరము లో ఏడుగురు మిత్రులు కలిసి భారతదేశములో హక్కుల కాలరాతకు గురవుతున్న పిల్లల జీవనాన్ని మార్చే ప్రయత్నం చేయాలనే ఒక వినూత్న నిర్ణయం తీసుకొన్నారు . ఈ ఒప్పందానికి ఎయిర్ లైన్‌ లో లెక్కలు రాసే ఉద్యోగి అయిన రిప్పన్‌ కపూర్ (25 సం.) అధ్వర్యం వహించగా ఇందుకు వారి పెట్టుబడి 50 రూపాయిలు , ఒక డైనింగ్ టేబుల్ మాత్రమే.

ప్రతి ఒక్కరు బాలల జీవితం లో ఎంతో కొంత మార్పు తేవచ్చునన్న విశ్వాసం పరోక్ష మూలదనము . ఇది " క్రై" ఆరంభ వైనము . నేరుగా పిల్లల కోసం కార్యక్రమాలు అమలుపరిచే సంస్థ కాదు ఇది . లక్షలాది మంది వనరులు సమకూర్చేవారికి , వేలాది మంది అంకితభావం గల ఫీల్డ్ వర్కర్లకు నడుమ లింక్ లేదా చానెల్ గా " క్రై" వ్యవహరిస్తుంది . ఈ సంస్థకు ప్రాధమిక ఆధాయము వ్యక్తులు లేదా సంస్థలు ఇచ్చే విరాలలే. 2004 - 2005 ఆర్ధిక సంవత్సరానికి నాటి సంస్థ ఆదాయము విరాళాలు , ఉప్తత్తుల అమ్మకము , వడ్డీ రూపేణా 36 కోట్ల రూపాయిలు గా ఉన్నది .

గత 30 యేళ్ళుగా 18 రాష్ట్రాలలోని 5700 గ్రామాలు , మురికి వాడలలో బాలలకు సంబంధించి గుర్తించ తగిన మార్పులు సాధించినది . పిల్లల హక్కుల్ని గుర్తెరిగే విధంగా సఫలీకృతమైంది . పిల్లల్ని పాఠశాలలో చేర్పించేలా చర్యలు చేపట్టడమేకాకుండా ఆకలి , నిరక్షరాస్యత , దోపిది వంటి వాటినుండి పరిరక్షించారు . ఇవన్నీ ఒకనాటితో , ఏ ఒక్కరి కృషితోనో సాధించే అద్భుతాలు కావు . దేశవ్యాప్తం గా పదిహేను లక్షల మంది బాలలకు అందుబాటులో గల అవకాశాల్ని సాధించే కృషి సాగింది . పిల్లల హక్కుల పరిరక్షణకు దేశవ్యాప్తం గా మూల మూలనా గుర్తింపు కావాలి . ఇందుకోసం అనేక అంచనాలు , కార్యక్రమాలు అవసరము . అందుకోసమే జనవరి 28 న బాలల హక్కుల దినోత్సవాన్ని జరుపుతున్నారు . సమాజం చైతన్యవంతం కావాలి . జాగృతమవ్వాలి . అప్పుడే బాల హక్కుల పరిరక్షణ సాఫల్యమవగలదు . ఈ దిశ గా " క్రై" సంస్థ పనిచేస్తుంది .

  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .