Sunday, January 23, 2011

New year Day , న్యూఇయర్స్‌డే,కొత్త సంవత్సరాది దినం

గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (జనవరి 01)NEW YEAR DAY ----- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

న్యూఇయర్స్‌డే

నిరత యాతనా భరితమైన మానవ జీవితంలో, నిత్య వసంతాలు చల్లుకునే ప్రయాసలోనే పర్వాలూ, పండుగలూ, పుట్టుకొచ్చాయి. 'కొత్త ఒక వింత, పాత ఒక రోత' కనుక, 'కొత్త మోజు'లకి స్త్రీపురుష వివక్షత లేదు. కుల, మత, వర్ణ, వర్గ, దేశీయ ప్రాంతీయ వ్యత్యాసాలు లేవు. అంచేతే, 'న్యూ ఇయర్స్‌ డే' లేదా కొత్త సంవత్సరాది అంత ప్రాముఖ్యత సంతరించుకుంది. విశ్వమంతా ఎంతో సంరంభంగా, సంబరంగా, సందడిగా జరుపుకునే సత్సాంప్రదాయానికి నాందీ పలికింది. అలసి, సొలసిన మనసులకీ, నిరంతర శ్రామికుల శరీరాలకీ ఆవంత విశ్రాంతీ, రవ్వంతా వూరటా కల్పించి, వినూత్నోత్సాహం నింపడంలో నూత్న సంవత్సరారంభ మహోత్సవానికి మించిన 'సంజీవిని' మరొకటిలేదు. అందుకనే 'న్యూ ఇయర్స్‌ డే' అంతర్జాతీయంగా జరుపుకునే 'ఫెస్టివ్‌ ఈవ్‌' గా పరిణమించింది.

'కాలం' అమేయం, అనంతం, అనాద్యంతం. కనుకనే, దానికి 'అనేహం' అనే పేరు వచ్చింది. అసలీ కాల చక్రభ్రమణం, అనాదిగా, మన్వంతరాలుగా, యుగయుగాలుగా, శతాబ్దాలుగా, సంవత్సరాలుగా, మాసాలుగా, పక్షాలుగా, వారాలుగా, దినాలుగా, గంటలుగా, నిమిషాలుగా, సెకండ్స్‌గా జరిగిపోతూనే వుంది. ఈ కాలవలయంలోనే ప్రాకృతిక పరిణామశీలమైన, శిశిర, హేమంత, వసంత, గ్రీష్మ, వర్ష, శరదృతు షష్టకం, రెండు నెలల కొక్కరుతువుగా చోటుచేసుకుంటోంది. అవే పాశ్చాత్య ప్రపంచంలో, స్ప్రింగ్‌, సమ్మర్‌, వింటర్‌, ఆటమ్‌ అనే ట్రైమంత్‌లీ సీజన్స్‌గా పరిణతి చెందుతున్నాయి.

ఇవన్నీ, సౌరమానాల, చాంద్రమానాల కొలమానాలతో కొనసాగుతున్న ప్రక్రియలే. అసలు 'కాలం' అనేది ఒక వింత 'ఇమేజినరీ డైమన్షన్‌' గా ఆల్‌ఫ్రెడ్‌ ఐన్‌స్టీన్‌ వంటి అంతర్జాతీయ భౌతిక శాస్త్రజ్ఞులు భావిస్తే, వర్డ్‌వర్త్‌, కీట్స్‌, కాళిదాసు లాంటి మహాకవి సత్తములు పుంఖాను పుంఖాలైన 'ఇమేజరీ ఇన్వెన్షన్స్‌'కి తమ ఫాంటసీస్‌నీ, ఫిక్షన్స్‌నీ, 'ఫాక్ట్యువల్‌ నోట్స్‌'తో రంగరించి, 'మాగ్నమ్‌ ఓపస్‌'లూ, మహాకావ్యాలూ సృష్టించారు. అంతటి అనర్ఘమైన కాలమహిమని వివరించే విధానానికి 'ఫోర్‌ వర్డ్‌' 'న్యూ ఇయర్స్‌ డే'.
రెన్యూడ్‌ ఇయర్స్‌ డేగా...

మానవేతిసానికి మకుటాయమానాలైన సంస్కృతీ, నాగరికతలలో, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకి చెందిన మానవ సముదాయాలు వేర్వేరు రోజులని 'న్యూ ఇయర్స్‌ డేస్‌'గా జరుపుకోవడం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇప్పుడు మనం, ఏటేటా, జనవరి 1 వ తేదీన జరుపుకుంటున్న 'న్యూ ఇయర్స్‌ డే' 400 సంవత్సరాల పూర్వం అమలులోకి వచ్చింది.

రోమన్స్‌ 153 బి.సి. నుంచి, జనవరి 1 వ తేదీని సంవత్సరాదిగా జరుపుకుంటున్నారు. అంతకు ముందు మార్చ్‌ 25 వ తేదీన, 'వెర్నల్‌ ఈక్వినాక్స్‌' నాడు, న్యూఇయర్స్‌ డే' నిర్వహించేవాళ్లు. మధ్యయుగం ఆరంభంలో కూడా, ఎన్నో 'క్రిస్టియన్‌ యూరోపియన్‌ కంట్రీస్‌ కూడా ఈ సంప్రదాయాన్నే అవలంబించారు.

ఇలా, 'న్యూ ఇయర్స్‌ డే' మార్చ్‌ 25 నుంచి, జనవరి 1 వ తేదీకి మారడం అనే ప్రక్రియని అందరూ ఆమోదించడానికి ఎంతో ఆలస్యం జరిగింది. అసలీ జనవరి 1 వ తేదీకి, వ్యవసాయికంగా, రుతుక్రమానుసారంగా, ఎలాంటి పొంతనా లేకపోవడమే దానికికారణం. నిజానికి, రోమన్స్‌ 'న్యూఇయర్స్‌ డే'ని మార్చ్‌ 25 నుంచి జనవరి 1 కి, 3 నెలల వెనక్కి జరపడం వల్ల, మన కేలండర్‌లో కూడా అవకతవకలు ఏర్పడ్డాయి. అసలు సెప్టెంబర్‌, అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌ నెలలు, గతంలో సంఖ్యాపరంగా, వరుసగా, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది మాసాలు. ఆ తరువాత ఎందరెందరో రోమన్‌ చక్రవర్తులు (ఎంపరర్స్‌) ఈ నెలలకి తమ ఇష్టానుసారంగా పేర్లు పెట్టారు. 'సెప్టెంబర్‌' నెలకి, 'జెర్మేనుకస్‌', 'ఆంటోనియస్‌', 'టాసిటస్‌' అనే రకరకాల పేర్లు వచ్చాయి. అలాగే నవంబర్‌ నెలకి కూడా, 'డామిటియానస్‌', 'ఫాస్టినస్‌', 'రొమేనస్‌' అనే నామధేయాలు వ్యాప్తిలోకి వచ్చాయి.

జూలియస్‌ సీజర్‌ సవరింపుతో...

'కాలం' గుణింపులో, గణింపులలో జరుగుతున్న ఈ అసౌకర్యాలతో చిరాకుపుట్టిన జూలియస్‌ సీజర్‌ చక్రవర్తి, అలెగ్జాండ్రియాకి చెందిన గ్రీక్‌ ఎస్ట్రోనమర్‌ 'సోసిజెనిస్‌', ఎలాంటి విభేదాలూ లేని 'ఈజిప్షియన్‌ సోలార్‌ కేలండర్‌' ఆధారంగా రూపొందించిన ఒక కొత్త 'కేలండర్‌'ని అమలు చేసి, 'సోలిస్టిస్‌'కీ, 'ఈక్వి నాక్సెస్‌'కీ చేరువైన జనవరి 1 వ తేదీని 'న్యూఇయర్స్‌ డే' గా ప్రకటించాడు. కాని 45. బి.సి.నాటి జనవరి 1 వ తేదీ అమావాస్య (న్యూమాన్‌) కావడంతో, ఆరోజు దురదృష్టానికీ, అపశకునానికీ, అశుభానికీ సంకేతం అవుతుందనీ, కనుక కొత్త సంవత్సరాది తేదీ మార్చమనీ, ప్రజానీకం ఆయనని కోరారు. కాని రోమన్‌ సెనేట్‌మాత్రం, 'జూలియస్‌ సీజర్‌' సేవలని కొనియాడి, ఆయన గౌరవార్థం, ఆయన జన్మించిన 'క్వింటిలిస్‌' మాసానికి 'జులై' అనే పేరు పెట్టింది.

అగస్టస్‌ సీజర్‌ సవరణతో...

అలాగే, 'జూలియస్‌ సీజర్‌ గ్రాండ్‌' నెవ్యూ, 'అగస్టస్‌ సీజర్‌', 'లీప్‌ ఇయర్‌' గుణింపు సమయంలో జరిగిన ఒక పొరపాటుని సరిదిద్ది, 'సెక్ట్సిలైటిస్‌' అనే నెలకి 'అగస్ట్‌'గా పేరు మార్చిన ఘనత దక్కించుకున్నాడు. అప్పటిదాకా, మూడేళ్లకొకసారి 'లీప్‌' ఇయర్‌గా పరిగణించేవాళ్లు. 'అగస్ట్‌ సీజర్‌'తోనే నాలుగు సంవత్సరాలకొకసారి 'లీప్‌ ఇయర్‌'గా రూపొందించే ఆచారం అమలులోకి వచ్చింది.

1582 సంవత్సరం దాకా...

పోప్‌ గ్రెగొరీ ృఒఒ, 1582 లో కీలకమైన మార్పులు చేసేదాకా, రోమన్స్‌ కాలంనాటి పాతకేలండర్‌లో ఎలాంటి సంస్కరణలూ జరగలేదు. అసలు, మళ్లీ జనవరి 1 న, 'న్యూ ఇయర్స్‌ డే'జరుపుకోవడం అనే ఆచారాన్ని మళ్లీ ప్రవేశపెట్టిందే, పోప్‌గ్రెగొరీ ృఒఒ. గ్రెగోరియన్‌ సంస్కరణలు కూడా, అక్టోబర్‌ నెలలోంచి 10 రోజులు మినహాయించి, 1582 అక్టోబర్‌ 4 వ తేదీ గురువారం తరువాత, అక్టోబర్‌ 15 వ తేదీ శుక్రవారం వచ్చేలా చేశాయి. అసలు ఆ సెంచరీలని 400 సంఖ్యతో భాగించి, లీప్‌ ఇయర్స్‌ని పరిగణించడం వల్లే, ఈ తేడాపాడాలు వచ్చాయి. అంచేత, 1700, 1800, 1900 సంవత్సరాలు లీప్‌ ఇయర్స్‌ కాకపోయినా, 2000 సంవత్సరం మాత్రం ఖచ్చితంగా, 'లీప్‌ ఇయర్‌' అయిపోయింది.


భూగోళమంతటా...

అలా, జనవరి 1 వ తేదీన 'న్యూ ఇయర్‌'గా పరిగణించే పద్ధతిని కాథలిక్‌ దేశాలన్నీ అవలంబించాయి. చివరికి 1700 సంవత్సరంలో జర్మనీ, 1752 లో గ్రేట్‌ బ్రిటన్‌, 1753 స్వీడన్‌ దేశాలుకూడా ఈ విధానం అనుసరించాయి.

'ఓరియంటల్‌ కంట్రీస్‌'గా పేరుపడ్డ, ప్రాక్‌దేశాలలో, హిందువులూ, తావోయిస్ట్స్‌, బౌద్ధులూ, ముస్లిమ్స్‌, ఈ కేలండర్‌ని 'క్రిస్టియన్‌ కేలండర్‌'గా పరిగణించినా, దాన్ని తమ 'అఫిషియల్‌ కేలండర్‌'గా స్వీకరించారు. 1873 లో, జపాన్‌, 1912 లో చైనా కూడా ఈ కేలండర్‌ని అనుమతించాయి. 'ఈస్టర్న్‌ ఆర్థొడాక్స్‌', 1924 లో, 1927 లో, ఈ కేలండర్‌ని పరిగణనలోకి తీసుకున్నాయి. రష్యా మాత్రం 1918 లో ఒకసారి ఈ కేలండర్‌ని అమలు చేసి, మళ్లీ తమ 'కేలండర్స్‌' కేసి మొగ్గుచూపి, చివరికి 1924 లో జనవరి 1 వ తేదీన 'న్యూఇయర్స్‌డే'గా రూపొందిన కేలండర్‌నే సమ్మతించింది. అదే జనవరి 1 వ తేదీ ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటికీ సాధికారకమైన సంవత్సరాదిగా, (అఫీషియల్‌ న్యూ ఇయర్స్‌ డే)గా, శోభాయమానంగా భాసిల్లుతోంది. అలాగని, దేశదేశాల, వివిధ ప్రాంతాల , వేర్వేరు మతాల సంప్రదాయాల 'సంవత్సరాదులు'కూడా సమసిపోలేదు. ఆ సంవత్సరారంభాల సంరంభాలు సైతం ముగిసిపోలేదు.

భారతదేశంలో కూడా...

'భిన్నత్వంలో ఏకత్వానికి' (యూనిటీ ఇన్‌ డైవర్సిటీ) సంకేతంగా నిలిచే భారతదేశంలోని, వివిధ ప్రాంతాల, భాషాప్రయుక్త రాష్ట్రాల ప్రజానీకానికి, వేర్వేరు సంవత్సరాదుల సంరంభాల సమగ్రచరిత్ర వుంది. వర్ణమయశోభితంగా, విశిష్ట సంప్రదాయాలతో, ఈ సంవత్సరాది పండుగలు వెల్లివిరుస్తున్నాయి.ఎన్నోమతాల సంవత్సరాదుల తేదీలు మమేకంగానే వుంటా యి. ఏప్రిల్‌ 13 లేదా 14 వ తేదీన, 'బైశాఖి' పం డుగ వస్తుంది. సరిగ్గా అదే రోజున, అస్సాంలో 'బిహూ', బెంగాల్‌లో, 'నబో బార్షో', తమిళనాడులో 'పుత్తాండు', కేరళలో 'పూర్ణమ్‌ విశూ' పేర్లతో, సంవత్సరాది పండుగజరుపుకుంటారు. అయితే, తెలుగు 'ఉగాది' మాత్రం చైత్యబహుళపాడ్యమినాడు తొలివసంత శోభతో అలరిస్తుంది. వ్యవసాయ ప్రధానమైన భారతదేశంలో, సాధారణంగా, ఫలసాయం చేతికి వచ్చే సమయంలో, 'కొత్త సంవత్సరాది' వస్తుంది. కొన్ని ప్రాంతాలలో, మత విశ్వాసాలని అనుసరించి సృష్టికర్త 'బ్రహ్మ'కి కృతజ్ఞతాపూర్వకంగా, కొత్త సంవత్సరం తొలిరోజుని వైభవంగా జరుపుకుంటారు. కారణాలు ఏవైనా, కొత్త సంవత్సరం ఇళ్లలో, గుళ్లలో పూజలతో మొదలవుతుంది. కొత్త సంవత్సరాది సందర్భంలో, ఇంటింటా రంగురంగుల పువ్వులతో, మామిడాకులతో, అరిటిబోదెలతో, దీపాలతో అలంకారాలు గోచరిస్తాయి. సంవత్సరాదినాడు, సంప్రదాయికంగా, సుహృద్భావపూర్వకంగా, ప్రజలు తమ సన్నిహితులతో, కుటుంబాలతో విందుభోజనాలు చేసి, పరస్పరం కానుకలు అందించుకుంటారు.
వివిధ ప్రాంతాలలో జరిగే 'న్యూఇయర్స్‌ డే' పేర్లు కూడా ఎంతో అందంగా, ఆకర్షణీయంగా వుంటాయి.

కొన్ని ప్రాంతాలు సంవత్సరాది పేరు->

1. అస్సాం బోహాగ్‌ బిహు

2. బెంగాలీ నబో బర్షో

3. గుజరాతీ బెస్తు వరస్‌

4. మళయాళీ విషూ

5. తమిళ్‌ పుత్తాండు

6. తెలుగు ఉగాది

7. మరాఠీ గుడి పడ్వా

8. మార్వాడీ దివాలీ

9. పంజాబ్‌ బైశాఖీ

10. సిక్కిం లోసూంగ్‌

అలాగే వివిధ దేశాలలో, భాషలలో, సంవత్సరాదులకి విశిష్టమైన నామధేయాలు వున్నాయి.

కొ్న్నిదేశాలలో : దేశీయంగా...

దేశం/భాష సంవత్సరాది నామధేయం

1. ఆఫ్‌ఘనిస్థాన్‌ సాలే నవోముబారక్‌

2. ఆఫ్రికన్స్‌ గెలుక్కిగే నువేజార్‌

3. ఆల్బెనియా గెజుఅర్‌ వితిన్‌ ఎరీ

4. ఆర్మేనియా స్నోర్‌ హావొర్‌ నోర్‌ తారీ

5. అరేబియా కుల్‌ 'అమ్‌ అన్‌తుమ్‌ బిఖాయిర్‌

6. అస్సీరియా షేతా బ్రిఖ్తా

7. అజేరీ ఎనీ ఇలినిజ్‌ ముబారక్‌

8. బ్రెటోన్‌(సెలిక్‌ బ్రైథోనిక్‌ భాష) బ్లోవావెజ్‌ మత్‌

9. బల్గేరియా ఛెస్తితా నోవా గోదినా

10. కంబోడియా సౌర్స్‌ డే ఛనమ్‌ త్మెయ్‌

11. కాటలాన్‌ ఫెలిక్‌ అనీ నౌ

12. చైనా గ్జిన్‌నియాన్‌ కువైలే

13. క్రోషియా స్రెత్నా నోవాగోదినా

14. సిమ్‌రాయిగ్‌ (వెల్ష్‌) బ్లౌద్విన్‌ న్యూయిద్ద్‌ ద్దా

15. చెకోస్లోవేకియా స్తాత్నీ నోవీ రోక్‌

16. డేనిష్‌ గాడ్త్‌ నైతార్‌

17. ధివేహీ ఉఫావెరీ ఆ ఆహారఖ్‌ ఎథెన్‌

18. డచ్‌ గెలుక్కిగ్‌నైయూవ్‌ జార్‌

19. ఎస్కిమో కియోర్తామే పివ్‌ద్లువారిత్లో

20. ఎస్పెరాంటో ఫెలికన్‌ నోవాన్‌ జారోన్‌

21. ఎస్టోనియా హెడ్‌ ఉత్‌ ఆస్తాత్‌

22. ఇతియోపియా మెల్కాం అద్దిస్‌ అమెత్‌ ఇహు నెలివో

23. ఇతియోపియా(ఎరిత్రెయాన్‌ టిగ్రిగ్నా) రుహుస్‌ హదుష్‌ అమెత్‌

24. ఫిన్నిష్‌ ఒన్నెల్లిస్తా ఉత్తా ఔత్తా

25. ఫ్రెంచ్‌ బొన్నె అన్నె

26. గేలిక్‌ బ్లియాధ్నా వ్హూత్‌ వుర్‌

27. గలీషియా(నార్త్‌ వెస్ట్రన్‌స్పెయిన్‌) బోనాదల్‌ ఎ ఫెలిజ్‌ అని నోవో

28. జెర్మనీ ప్రోసిత్‌ న్యూజార్‌

29. జార్జియా గిలోత్‌ సవ్త్‌ అఖల్‌ త్సెల్స్‌

30. గ్రీస్‌ కెనౌరియోస్‌ క్రోనోస్‌

31. హవాయ్‌ హవోలీ మకాహికీ హౌ

32. హంగ్‌కాంగ్‌ సన్‌ లీన్‌ ఫెయ్‌ లోక్‌

33. హంగేరీ బోల్డాగ్‌ ఊయ్‌ ఐవెత్‌

34. ఇండోనేషియా సెలామత్‌ తహున్‌ బరూ

35. ఇరాన్‌ సాల్‌ఎనొ ముబారక్‌

36. ఇరాక్‌ సనాహ్‌ జాదిదాహ్‌

37. ఐరిష్‌ బ్లియాయిన్‌ నుయా ఫె వ్హొసేథూయిత్‌

38. ఇటలీ ఫెలిస్‌ అన్నో నువో

39. జపాన్‌ అఖిమాషితే ఒమెడెత్తో గోజాయ్‌ మాసు

40. ఖ్మేర్‌ సువా స్దెయై తఫ్‌నమ్‌ త్మెయై

41. కొరియా సేహే బాక్‌ మని బాదియూసెయ్‌ యో

42. కుర్డిష్‌ న్యూరోజ్‌ పిరోజ్‌బే

43. లాట్‌వియా లాయ్‌మింగూ నేజూజూమేతూ

44. లావోషియా సబై దీ పీ మెయ్‌

45. లితుయానియా లెయ్‌ మింగు నౌజుజూ మేటు

46. మెసెడోనియా స్రెక్‌జ్ఞానోవా గోదినా

47. మడగాస్కర్‌ ట్రాత్రీ ని తావోనా

48. మాలే సెలామత్‌ తహున్‌ బరూ

49. మాల్‌ తీస్‌ ఇస్‌సేనా త్‌తజ్‌బా

50 నేపాల్‌ నవా బర్షారా శుభేచ్ఛే

51. నార్వే గోద్త్‌ నైత్తర్‌

52. పాపువా న్యూగునియా(గయానా) నుపేలా ఇయా ఐగో లాంగ్‌యు

53. పామ్‌పాన్‌గో(ఫిలిప్పైనస్‌) మసగనంగ్‌ బాయుంగ్‌బనుయా

54. పాస్తో నవై కాల్‌ మో ముబారక్‌ షా

55. పెర్షియా సాల్‌ఎనొముబారక్‌

56. ఫిలిప్పైన్స్‌ మనిగాంగ్‌ బాగాంగ్‌ తావోఁ

57. పోలెండ్‌ స్కిజెస్‌లివెగో నోవెగో రోకూ

58. పోర్చుగీస్‌ ఫెలిజ్‌ అనో నోవో

59. రొమేనియా అన్‌ నో ఫెరిసిత్‌

60. రష్యా ఎస్‌ నోవిమ్‌ గోదోమ్‌

61. సమోవా మానుయా లె తాసగా ఫౌ

62. సెర్బోక్రోషియా స్రెత్నా నోవా గోదినా

63. శ్రీలంక (సింహళ) సుభ అయిత్‌ ఆరుథక్‌ వేవా

64. సిరైకీ నవాన్‌ సాల్‌ షాలా ముబారక్‌ హోజే

65. స్లోవక్‌ స్తాస్త్నీ నోవీ లెతో

66. స్లోవేనియా స్రీనో నోవో లేటో

67. సోమాలీ లియో సనద్‌ క్యుసుబ్‌ ఓఫెయ్‌కాన్‌

68. స్పెయిన్‌ ఫెలిజ్‌ అనోన్యూవో

69. స్వాహిలీ హెరీ జె మాకా కుప్యా

70 స్వీడన్‌ గోతో నైత్‌ అర్‌! గోత్‌ నైత్‌అర్‌!

71. సూడాన్‌ వర్సా ఎన్‌గల్‌

72. టిబెట్‌ లోసార్‌ తాషీ దెలెక్‌

73. థాయ్‌లాండ్‌ సవాదే పీ మై

74. టర్కీ ఎని ఇలినిజ్‌ కుత్లు ఓల్‌సున్‌

75. యుక్రెనియా ష్చాస్త్‌లివోహో నొవోహోరోకూ

76. ఉజ్జెకిస్తాన్‌ యాంగి ఇల్‌ బిలాన్‌

77. వియత్నాం చుక్‌ ముంగ్‌ తన్‌ నియెన్‌

78. వెల్ష్‌ బ్లైద్దిన్‌ న్యూయిద్ద్‌ ద్దాంభాషాపరంగా...

79 బెంగాలీ శువో నవో బర్షో

80. మిజో కుమ్‌ థార్‌ చిచాయ్‌

81. గుజరాతీ నూతన్‌ వర్షాభినందన్‌

82. హిందీ నయే వర్షాకి శుభకామ్‌నాయేఁ

83. మరాఠీ నవీన్‌ వర్షాబీ శుభేచ్ఛా

84. ఒరియా నువా బర్షార్‌ శుభేచ్ఛా

85. పంజాబీ నవే సాల్‌ దీ ముబారక్‌

86. సింధీ నయే సాల్‌ ముబారక్‌ హోజే

87. తమిళ్‌ ఇనియ పుత్తాండు నల్‌వాళ్‌ తుక్కళ్‌

88. మళయాళం పుదువత్సర ఆశంసకళ్‌

89. కన్నడ హోసా వరుషాధ శుభశా యగళు

90. కోర్సికన్‌ పేస్‌ ఎ సాల్యూట్‌

91. హీబ్లూ ఎల్‌ షానాహ్‌ తోవాహ్‌

92. కబైలే అసేగ్‌వాస్‌ అమెగజ్‌

93. కిసీ సోమ్‌వాకా ఒమోయియా ఓముయా

94. ఖాసీ స్నేం తిమ్మై బసుక్‌ లఫీ

వివిధ మతాలలో...
''గతజల సేతుబంధన మేల?'' అని గ్రాంథికంలో తమని తాము ప్రశ్నించుకుంటే అసహ్యంగా వుంటుందేమోగాని, నిజానికది ఎంతో మేలే! 'సింహావలోకనం', 'చర్విత చర్వణం' లాంటి జాతీయాలు కూడా మనవాళ్ల నోళ్లలో మాటి మాటికీ నానుతూ వుంటాయి.

కాని కొంచెంలోతుగా వెడితే, ఇవన్నీ 'ఆత్మపరిశోధన (ఇంట్రోస్పెక్షన్‌) కి చెందినవని, ఏ మాత్రం 'ఇంగితం' వున్నవాళ్లకయినా అవగతం అవుతుంది. 'న్యూ ఇయర్‌' 'బిగినింగ్‌' అనే తొలిపండుగ రోజున, మనం గతంలో చేసిన 'తప్పుల'నీ, పొరపాట్లనీ, మహాపరాధాలనీ మననం చేసుకుని, నెమరువేసుకుని, రాబోయే జీవితకాలంలో అవి పునశ్చరణం కాకుండా చూసుకోమనే, 'మంచి'గా బతుకు కొనసాగించమనే

అన్ని మతాలూ చెబుతాయి.

వివిధ మతాలని అవలంబించేవాళ్లు, 'న్యూ ఇయర్‌' జరుపుకునే విధానాలలో కూడా వైశిష్యం, వైవిధ్యం, వ్యత్యాసం వుంది. వినూత్న వర్షారంభంనాడు యూదులు (జ్యూస్‌) పగలంతా ఉపవాసం చేసి, రాత్రి పూట సుఖసంతోషాలకి నిలయాలైన తమ కుటుంబాలతో, ఘనమైన విందు భోజనాలతో, తనువులనీ, మనసులనీ రంజింపజేసుకుంటారు. ముస్లిమ్‌లు సంవత్సరాదినాడు, మసీదులలో 'నమాజ్‌'లు చేస్తూ, మక్కా నుంచి మదీనాదాకా వున్న తమ మతప్రవక్తల (ప్రొఫెట్స్‌)నిస్మరించుకుంటారు. 'సెలిక్స్‌' మాత్రం, ఆడంబరాలకీ, అట్టహాసాలకీ ప్రాముఖ్యతనిచ్చి, తమ 'పబ్బం' గడుపుకుంటారు. తమ పితృదేవతలని కూడా ఇళ్లకి ఆహ్వానించి, ఆ రోజంతా వాళ్లతో గడిపినట్టుగా భావిస్తారు. హిందువులు కొందరు 'శిశిరం'లో, మరికొందరు 'వసంతం'లో సంవత్సరాదికి నాందీ పలుకుతారు.

'టీ పార్టీ'లూ, 'కాఫీ సిప్‌'లూ, పాతగిలిపోయిన ఈ నవనాగరిక యుగంలో, కలిగినోళ్లు, 'పబ్స్‌'లో, 'క్లబ్స్‌'లో, వెట్‌పార్టీలలో, కాక్‌టైల్స్‌లో తలమునకలైపోతుంటే, లేనోళ్లు, తాటికల్లుతోనో, నాటు సారాయితోనో 'వారుణీ వాహిని'లో మునకలేస్తుంటారు.

హైందవ సంవత్సరాదిలో...

హైందవ సముదాయం ప్రపంచంలో ఎక్కుడున్నా, ఇంచుమించు ఒకే విధంగా సంవత్సరాది జరుపుకుంటారు. పింక్‌, రెడ్‌, పర్పుల్‌, వైట్‌ ప్లవర్స్‌తో ఇళ్లూ, లోగిళ్లూ అలంకరిస్తారు. తెలుగువాళ్లూ, తమిళులూ, కన్నడిగులూ, వేపపూలూ, బెల్లం, పచ్చి మావిడిముక్కలూ, అరిటిపళ్లూ, చింతపండు పులుసూ కలగలిపిచేసిన, కష్టసుఖాలకి సంకేతమైన సలాడ్‌ సేవనంతో, సంవత్సరాది రోజు మొదలు పెడతారు. మళయాళీలు ముందుగానే, ఒక పళ్లెం నిండా తినుబండారాలూ, పళ్లూ, పూలూ, కానుకలూ పెట్టుకుని, పొద్దుట లేచీలేవగానే, కళ్లు విప్పీవిప్పగానే, ఆ పళ్లెంకేసి చూడడం శుభప్రదంగా భావిస్తారు. లక్ష్మీదేవికి స్వాగతం పలకడానికి ఇంటి ముంగిట నూనె దీపాలు వెలిగించిపెడతారు.
'సెలిక్‌' సంవత్సరారంభం

'సెలిక్‌ న్యూఇయర్‌' నవంబర్‌ 1 వ తేదీన వస్తుంది. దాన్ని ''సెల్‌టిక్‌ ఫీస్ట్‌ ఆఫ్‌ సామ్‌హెయిన్‌'' అని కూడా అంటారు. 'గెలిక్‌' భాషలో 'సామ్‌ హెయిన్‌' అంటే 'వేసవి అంతం' (సమ్మర్‌ ఎండ్‌) అని అర్థం. మామూలుగా 'సెలిక్స్‌' పరస్పరవ్యతిరేకశక్తులని, అంటే, చీకటి వెలుగులనీ, వేసంగిశీతాకాలాలనీ, రాత్రింబవళ్లనీ, జీవన్మరణాలనీ అపూర్వ పర్వాలుగా భావిస్తారు.

'సామ్‌హెయిన్‌ సెల్టిక్‌ న్యూ ఇయర్‌' అక్టోబర్‌ 31 సాయంత్రమే మొదలవుతుంది. గ్రామీణులు తమ 'ఫలసాయం' సేకరించి, పశువులనికోసి, ఆ ఫలసాయ సంయుక్త మాంసాహారాలతో విందు చేసుకుంటారు. పల్లెల నడిబొడ్డున చలిమంట (బాన్‌ఫైర్‌) వేస్తారు. అసలు 'బోన్‌ ఫైరిస్‌' అనే సెల్టిక్‌ శబ్దంలోంచే, 'బాన్‌ ఫైర్‌' అనే పదంపుట్టింది.

అసలు 'న్యూ ఇయర్‌' లేదా 'ఆయిధ్‌ ఛీ షామ్‌ హ్నా' అనే కొత్త పాతల సంధ్యా సమయంలో, పరలోకగతులైన పితృదేవతలు, భూలోకం సందర్శిస్తారని వాళ్లనమ్మిక. తమ పూర్వజుల రాకకోసం, గుమ్మాలూ, కిటికీలూ తెరిచివుంచి, ఆహారపానీయాలు సిద్ధంచేసి వేచివుంటారు. అయితే, వాళ్లలో కొందరు దుష్టశక్తులుగా కూడా వుంటారు కనుక, అలాంటి 'ఈవిల్‌ స్పిరిట్స్‌'ని వెళ్లగొట్టడం కోసం, 'స్పిరిట్‌గార్డియన్స్‌' ప్రతిమలు రూపొందించి, టర్నిప్‌ మీద పెట్టి, తమ ఇళ్ల గుమ్మాల ముందు పెడతారు. అప్పుడు యువకులు, వింత వింత దుస్తులు ధరించి, పితృదేవతలలా నటిస్తూ గ్రామమంతటా తిరుగుతారు. అసలు 'న్యూ ఇయర్‌' ఇహలోక పరలోకాల సరిహద్దులని చెరిపివేయడమేకాక, సమాజ వ్యవస్థని కూడా పూర్తిగా మార్చేస్తుందని వాళ్ల విశ్వాసం. 'క్రిష్టియానిటీ' కూడా, 'సెల్టిక్‌' సంప్రదాయంలో, తమ మతాచారాలతో సరిపడిన విషయాలని అవలంబించడం విశేషం. 'సామ్‌హెయిన్‌'ని 'ఫీస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ సెయింట్స్‌'గా, 'హాల్‌ టైడ్‌'గా, 'ఆయుధ్‌ ఛీ పామ్‌ హ్నా'ని, 'హాలో ఎ'వెన్‌'గా, చర్చ్‌ కూడా స్వీకరించింది.

ఇస్లామిక్‌ న్యూఇయర్‌

చంద్రగ్రహణ పరిభ్రమణానుసారంగా, చాంద్రమానం ప్రకారం, ఇస్లామిక్‌ కేలండర్‌ తయారయ్యింది. మొహర్రం మొదటిరోజున, ముస్లిమ్‌లు 'న్యూ ఇయర్స్‌ డే' జరుపుకుంటారు. ఈరోజు ముస్లిమ్‌లు తమ మహ్మద్‌ ప్రవక్త మహమ్మద్‌ మక్కా నుంచి మదీనాకి వలసపోవడం, అంటే 'హిరాజ్‌'ని గుర్తుచేసుకుంటారు. అసలాయన 'మొహర్రమ్‌' మొదటిరోజున వలసవెళ్లడం జరగలేదనేది వాస్తవం. బహుశా, ఆయన 3 వ ఇస్లామిక్‌ నెలలో వలస పోయి వుండాలి. అలా 'హిజ్రా'తో సంబంధం వున్న ఇస్లామిక్‌ కేలండర్‌ ప్రకారం వచ్చే 'న్యూ ఇయర్స్‌ డే' ప్రోఫెట్‌ మహమ్మద్‌ మైగ్రేషన్‌కి సంకేతమైపోయింది.

ముస్లిమ్‌లు 'న్యూ ఇయర్స్‌ డే' జరుపుకోవడానికీ, తతిమా పండుగలూ, ఉత్సవాలూ నిర్వహించడానికీ ఎంతో తేడావుంది. ఆ రోజున, ముస్లిమ్‌లు, మసీదులలో గుమికూడి, ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. 'కురాన్‌'లోంచి, ఖాజీలు చేసే విశిష్టమైన చేసే విశిష్టమైన ప్రసంగాలు ఆలకిస్తారు. ముఖ్యంగా మహ్మద్‌ ప్రవక్త మక్కా నుంచి మదీనాకి తరలిపోయిన సంఘటనని ఎంతో శ్రద్ధగా వింటారు. ముస్లిమ్‌లు న్యూ ఇయర్‌ని, 'మాల్‌ హిజ్రీ' అంటారు. ముస్లిమ్‌లు కూడా, పరస్పరం గ్రీటింగ్స్‌ పంపుకునే సంప్రదాయం కూడా ఇటీవలే మొదలయ్యింది.

జ్యూయిష్‌ న్యూఇయర్‌

యూదుల (జ్యూయిష్‌) 'న్యూ ఇయర్‌'ని 'రోష్‌ హష్‌నాహ్‌' అంటారని మనం ఇప్పటికే తెలుసుకున్నాం. 'రోష్‌ హషనాహ్‌' అంటే 'హెడ్‌ ఆఫ్‌ ది ఇయర్‌'అని అర్థం. శిశిరం (ఆటమ్‌)లో, 'తిస్రీ' యూదులనెల మొదటిరోజునే, 'న్యూఇయర్‌' మొదలవుతుంది. ఈరోజున యూదుల దేవాలయాలలో షో ఫార్‌ (రామ్స్‌ హార్న్‌) మోగిస్తారు. అది యూదులందరికీ తమ పాపాలకీ, అపరాధాలకీ పశ్చాత్తాప పడమని చేసే హెచ్చరిక. అసలు, సంవత్సరాదినాడే, దేవుడు, ఆ ఏడాదిలో మనుషుల భవిష్యత్తు ఎలా వుంటుందో నిర్ణయిస్తాడని యూదులవిశ్వాసం. 'తిస్రీ' నెలలో, 10 వ రోజున, 'యోమ్‌ కిప్పుర్‌' అంటారు. పవిత్రమైన, ఆ రోజంతా వాళ్లు ఉపవాసం చేసి, తమ పాపాలకి పశ్చాత్తాపపడుతూ, దైవప్రార్ధనలు చేస్తారు. కొత్త సంవత్సరాది నాడు, కొత్త బట్టలు కట్టుకుంటారు కాని, చర్మం (లదర్‌)తో చేసిన వస్తువులూ, దుస్తులూ ధరించరు. సూర్యాస్తమయం తరువాత, ఉపవాసం ముగించి, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో విందుభోజనాలు చేస్తారు. ముఖ్యంగా రాబోయే తీయటి రోజుల సంకేతంగా, యాపిల్స్‌, తేనే ఎక్కువగా సేవిస్తారు. ఇక డేట్స్‌, ఫిగ్స్‌, 'పొమ్‌గ్రెనేట్స్‌' వాళ్ల తినుబండారాలలో అంతర్భాగాలే. కొంత మంది, దేవుడి కిరీటానికి చిహ్నంగా, 'ఎగ్‌ బ్రెడ్‌' తింటారు. 'ఈస్ట్‌ యూరోపియన్‌ జ్యూస్‌', 'జెఫిల్ట్‌ ఫిష్‌', 'టర్కీ హనీకేక్స్‌' ఎక్కువగా తింటారు. 'మొరాకో'కి చెందిన యూదులు 'ఫ్రిట్టర్స్‌ ఇన్‌ హనీ', 'బ్లూప్లమ్‌పై' లంటే చెవికోసుకుంటారు. మొత్తం మీద యూదులకి కొత్త సంవత్సరాది, ప్రార్థనలకీ, పశ్చాత్తాపాల, ఉపవాసానంతర విందుభోజనాలకీ 'పర్వదినం' అన్నమాట.

అలా, దేశ, కాలమాన, పరిస్థితులకీ, మత విశ్వాసాలకీ, సంస్కృతులకీ సంప్రదాయాలకీ, ఆచార వ్యవహారాలకీ అనుగుణంగా, సౌరమాన, చాంద్రమానానుసారంగా, న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌ ఎలా మారినా, సంవత్సరాదినాడు చేసిన పనులకీ, తిన్న తిండికీ సరిపోలే విధంగానే, వ్యక్తుల జీవితాలలో 'అదృష్టం' చోటుచేసుకుంటుందనే యావన్మానవ సముదాయ విశ్వాసం విషయంలో ఎలాంటి విభేదాలూ లేవుగా?

'పాట'లాంటి ఆగామిలో...

ఇంగ్లీష్‌ భాష మాట్లాడే దేశాలన్నిటిలో, డిసెంబర్‌ 31 అర్థరాత్రి గంటలు మోగించగానే, ''అల్ద్‌ లాంగ్‌ సైన్‌...'' అనే 'అదృష్టాధ్యగమన గీతాలాపన' చేసే సంప్రదాయం ఈ నాటికీ కొనసాగుతోంది. 1700 సంవత్సరంలో 'రాబర్ట్‌ బర్న్‌' రాసిన అసంపూర్ణ గీతం, ''అల్ద్‌ లాంగ్‌ సైన్‌...'', ఆయన చనిపోయిన తరువాత, 1796 లో అచ్చయింది. 1700 కి పూర్వం, ఈ పాట పాడే తీరుతెన్నులని సవరించి, 'బర్న్స్‌' దీని, ఒక విశిష్టమైన ఆధునిక గీతం (మోడర్న్‌ రెండిషన్‌)గా వెలయించారు. పురాతనమైన స్కాటిష్‌ బాణీలో పాడే 'అల్ద్‌ లాంగ్‌ సైన్‌' అంటే 'ఓల్డ్‌ లాంగ్‌ ఎగో' లేదా, సింపుల్‌గా, 'ది గుడ్‌ ఓల్డ్‌ డేస్‌' అని అర్థం.

''షుడ్‌ అల్డ్‌ లాంగ్‌ సైన్‌ బి ఫర్‌గాట్‌

అండ్‌ నెవర్‌బ్రాట్‌ టు మైండ్‌

షుడ్‌ అల్ద్‌ ఎక్వైన్టెస్‌ బి ఫర్‌గాట్‌

అండ్‌ అల్ద్‌ లాంగ్‌ సైన్‌

ఫర్‌ అల్ద్‌ లాంగ్‌ సైన్‌, మైడియర్‌

ఫర్‌ అల్ద్‌ లాంగ్‌ సైన్‌

వుయ్‌ 'ల్‌ టేక్‌ ఎ కప్‌ ఆఫ్‌ కైండ్‌నెస్‌

ఫర్‌ అల్ద్‌ లాంగ్‌ సైన్‌

అండ్‌ దేర్స్‌ ఎ హాండ్‌ మై ట్రస్టీ ఫియర్‌

అండ్‌ గైస్‌ ఎ హాండ్‌ ఓ దైన్‌

అండ్‌ వుయ్‌'ల్‌ టేక్‌ ఎ రైట్‌ గుడ్‌విల్లీ వాట్‌

ఫర్‌ అల్ద్‌ లాంగ్‌ సైన్‌

ఫర్‌ అల్ద్‌ లాంగ్‌ సైన్‌, మైడియర్‌,

ఫర్‌ అల్ద్‌ లాంగ్‌ సైన్‌

వుయ్‌'ల్‌ టేక్‌ ఎ కప్‌ ఆఫ్‌ కైండ్‌నెస్‌ ఎట్‌

ఫర్‌ అల్ద్‌ లాంగ్‌ సైన్‌...''

అంటే, తెలుగులో...
''మంచిరోజులు పాతగిలితే మరిచిపోవాలా?

మనన మంటూ చేసుకోడం మాని వెయ్యాలా?

పాతబడితే పరిచయాలని,

పాతగిలితే మంచిరోజులు పాతరెయ్యాలా?

గతంలోని మంచికోసం, మిత్రమా రావా?

మంచిరోజుల గతం కోసం,

మనం ఓకప్‌ 'కరుణపానం' చేసుకుందామా?

మంచిరోజుల గతం కోసం...

నమ్మకంగా, నెమ్మనంతో చేయిచాస్తున్నా!

చెయ్యిఇచ్చీ, చెలిమినిచ్చీ అందుకుంటావా?

మంచికోసం, మంచిమనసులు కలుపుకుందామా?

మంచి రోజుల గతం కోసం...

గతంలోని మంచికోసం మిత్రమా రావా?''

మంచిరోజుల గతంకోసం,

మనం ఓ కప్‌ 'కరుణ పానం' చేసుకుందామా

మంచిరోజుల గతంకోసం....''

అనేగా మరి!

మనసుల సంకుచితమై, మనుగడ సంత్రస్తమై, మానవాళి అస్తవ్యస్తమై, క్రూర కరాళహింసాగ్రస్తమై, మానవత దహించుకుపోతూ, వసుంధర విహ్వాలమౌతున్న ఈ తరుణంలో, సంవత్సరాద్యంతార్మధనంతో, 'రాబర్ట్‌ బర్న్‌' నేపధ్యగీతాలాపన కంటే మించిన, మంచి 'న్యూ ఇయర్‌ మెస్సేజ్‌' వేరే ఏముంటుంది?

  • ========================================
మూలము : ఆంధ్రప్రభ ఆదివారము 27-డిసెంబర్ 2010

  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .