టాయిలెట్ క్లీనింగ్ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడమే ఈ దినము ఉద్దేశము .
గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .
పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (నవంబర్ 19) మరుగు దొడ్లు గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము.
చాలా మంది చెప్పడానికో , మాట్లాడడానికో ఇస్టపడకపోయినా మన జీవితాలలో టాయ్ లెట్ అనేది ప్రాధమిక అవసరాల జాబితాలోనిదే . చాలా మందికి దీనికోసం ప్రపంచవ్యాప్తం గా ఓ రోజు ఉందనే సంగతి అస్సలు తెలియనే తెలియదు . వరల్డ్ టయిలెట్ ఆర్గనైజేషన్(W.T.O) ప్రపంచ లాభేతర సంస్థ . ప్రపంచవ్యాప్తంగా టాయిలెట్ పరిశుభ్రతని మెరుగు పరిచే ఉద్దేశము తో ఏర్పాటైన సంస్థ . " శానిటేషన్ " అన్న అత్యంత సామాన్య (సాధారణ) విషయం గురించి అత్యధికుల దృస్టిని ఆకర్షింప జేసిన సంస్థ ఇది . 2001 లో 15 మంది సభ్యులతో ఏర్పాటైన ఈ సంస్థ ఇప్పుడు 58 దేశాలకు చెందిన 235 సభ్య సంస్థలు ఉన్నాయి . టాయిలెట్ మెరుగుదల , శానిటేషన్ ధ్యేయము గా ఇవి పనిచేస్తాయి . వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ ఓ గ్లోబల్ నెట్ వర్క్ గా ఏర్పాటు చేశారు . అన్ని టాయిలెట్ మరియు శానిటేషన్ సంస్థలు ఒకదాని నుంచి మరొకటి విభిన్న అంశాల్ని తెలుసుకినేందుకు వీలుగా ఉన్న ఏకైక సేవా సంస్థ .
వరల్డ్ టాయిలెట్ సదస్సులు , వరల్డ్ టయిలెట్ ఎక్స్ పో మరియు ఫోరం లను వరలే టాయిలెట్ ఆర్గనైజేషన్ విజయవంతముగా నిర్వహిస్తోంది . తొమ్మిది అంతర్జాతీయ సదస్సులు , రెండు వరల్డ్ టాయిలెట్ ఎక్స్్పోలను ప్రపంచవ్యాప్తం గా పది నగరాల్లో ఏర్పాతు చేసింది . ప్రతి సదస్సు లోనూ టాయిలెట్ , శానిటేషన్ లకు సంబంధించిన వివిద క్లిస్ట విషయాలను విభిన్న సాంకేతిక పరిజ్ఞానము , అభివృద్ధి , నిధులు , డిజైన్ , మెంటెనెన్స్ , సామాజిక పారిశ్రామిక సామర్ధ్యము , పరిశోధన్ల నుంచి అనేక అంశాల్ని విపులము గా చర్చిస్తారు .
సంష్త ఆవిర్భావ దినమైన నవంబరు 19 తేదీని " వరల్డ్ టాయిలెట్ డే " డబ్లు .టి.ఓ. ప్రకటించినది . దీనిని ప్రపంచవ్యాప్తం గా గల సభ్యులందరూ నిర్వహిస్తారు . సక్రమ పారిశుధ్యము పట్ల స్థానిక కార్యాచరణను , అవగాహనను పెంచుతూ కార్యక్రమాలు నుర్వహిస్తారు . 2005 లో w.t.o. తొలి వరల్డ్ టాయిలెట్ కళాశాలను ప్రారంభించినది . ఇక్కడే టాయిలెట్ డిజన్ , మెయింటెనెన్స్ , స్కూల్ శనిటేషన్ , డిజాస్టర్ శానిటేషన్ , , విభిన్న శానిటేషన్ వ్యవస్థల అమలు వంటి విషయాలలో శిక్షణ ఇస్తారు . w.t.o . కూడా సస్టెయినబుల్ శానిటేషం అలయెన్స్ లో వ్యవస్థాపక సభ్యురాలు . ప్రస్తుత పారిశుద్ధ వ్య్వస్థలను అభివృధి ప్రైచే 50 ప్రముఖ సంస్థలతో కూడిక అతిపెద్ద కూటమి ఇది . ప్రపంచ ఆర్ధిక ఫోరం కుటుంబానికి చెందిన స్కౌట్ ఫొండేషన్ 2006 లో w.t.o కు ఔట్ స్టాండింగ్ సోషల్ ఎంట్రప్రిన్యూర్ గా అవార్డ్ బహూకరించినది . 2007 లో w.t.o . తన అద్బుత సామాజిక పారిశ్రామికీకరణకు నాటి అశోక్ గ్లోబల్ ఫెలోషిప్ ను పొందినది .
వరల్డ్ టాయిలెట్ అభివృద్ధి :
- 2001 లో వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ ,
- 2005 లో వరల్డ్ టాయిలెట్ కాలేజీని ,
- 2004 లో సింగపూర్ గ్రీన్ ప్లాన్ అవార్డ్ అందజేయడం ,
- 2006 లో బెర్లిన్ లో " ది జర్మన్ టయిలెట్ ఆర్గనైజేషన్ " ప్రారంభం ,
ఉద్దేశము -లక్ష్యము :
- పారిశుద్ధ్యము ప్రజల ఆరోగ్యానికి , గౌరవానికి ప్రయోజనాలను చేకూరుస్తుంది . ముఖ్యముగా మురికివడలు , గ్రామీణ ప్రాంతాలను దృస్టిలో ఉంచుకుని పనిచేయాలి .
- మానవ జీవనప్రమాణాలను మెరుగుపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశము .
- అనారోగ్యానికు గురికాకుండా మానవ ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపడుతుంది ,
- ప్రతి కుటుంబానికి టాయిలెట్ తప్పనిసిరిగా ఉండాలన్నదే ఈ దినము ఉద్దేశము .
- టాయిలెట్ శుభ్రత ఆ కుటుంబ స్థాయిని ప్రతిబంబిస్తుందని ప్రతికుటుంబానికు తెలియజెప్పడం ,
- బహిరంగ మలవిసర్జన వల్ల కలిగే అనర్దాలను , అనారోగ్యాలను, భూకాలుష్యాన్ని , ప్రజలకు వివరించడము ,
- టాయిలెట్ శుబ్రతను గురించిన సదస్సులు , సమావేశాలు ఏర్పరచడము , నిర్వహించడము ,
- బాత్ రూం ఫ్లొర్ , ఉపరితలము క్రమము తప్పకుండ క్లీన్ చేయాలి . క్లీనింగ్ పైడర్ వాడాలి .
- టాయిలెట్ బౌల్ పై ప్రత్యేక శ్రద్ద చూపాలి .. దీని లొనే అనేక క్రిములు ఉంటాయి ,
- టాయిలెట్ లిడ్ వినియోగము తరువాత నీరు ప్లష్ చేసిన తదుపరి ... తప్పనిసరిగా మూసివేయాలి ,
- బాత్ రూం తలుపు మూసి ఉంచాలి ,
- పబ్లిక్ టాయిలెట్స్ విషయము లో ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయడానికి పనివాళ్ళను నియమించాలి .
- ప్రభుత్వం పబ్లిక్ టాయిలెట్లు కంటే వ్యక్తిగ టాయిలెట్లకే ప్రాధాన్యత ఇవ్వాలి . వ్యక్తిగత టాయిలెట్లు స్వంత భాద్యత పై క్లీన్ చేయడం జరుగుతుంది .
- పబ్లిక్ గా మలవిసర్జ చేసేవారిని నివారించేందుకు ప్రభుత్వ పనివారి పర్యవేక్షణ , శిక్షలు ఉండాలి .
- =====================================
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .