Thursday, September 2, 2010

ప్రపంచ కొబ్బరికాయ దినోత్సవం , World Coconut Day


  • courtesy with http://www.Wikipedia.org/
ప్రపంచ కొబ్బరికాయ దినోత్సవం'--- ప్రతీ సంవత్సరము సెప్టెంబర్ 02 న జరుపుతారు .


కొబ్బరికాయను అందరూ శుభప్రదముగా భావిస్తారు. మనదేశములో శుభకారార్యాలకు కొబ్బరికాయ తప్పనిసరి. కొబ్బరికాయ లేని పండుగ లేదంటే అతిశయోక్తి కాదు. కేరళీయులకైతే రోజూ అన్నింటిలోనూ కొబ్బరికాయ ,కొబ్బరినూనె తప్పనిసరిగా వుండి తీరవలసినదే . వారి ఆరోగ్యమూ , సంపదా కొబ్బరిపంట మీద అదారపడివున్నాయి . కోట్లాదిమంది జనం కొబ్బరిపంటనే జీవనాదారం చేసుకుని వుంటున్నారు .

ఎక్కడ పుట్టిందో తెలీదు... దేశదేశాలకు విస్తరించింది... ఆదాయాన్నీ, ఆరోగ్యాన్నీ ఇస్తుంది... అదే కొబ్బరికాయ...ఇవాళ 'ప్రపంచ కొబ్బరికాయ దినోత్సవం'

చాలా కాలం క్రితం పోర్చుగీసు, స్పెయిన్‌లకు చెందిన నావికులు ఓడలపై దేశదేశాలు తిరిగేవారని తెలుసుకదా? అలా వాళ్లు ఓ తీరంలో తొలిసారిగా కొబ్బరి చెట్టును చూశారు. ఆ కాయ వాళ్లకి చాలా వింతగా కనిపించి ఒలిచి చూశారు. లోపల మూడు కళ్లతో కోతి ముఖంలాగా కనిపించింది. వెంటనే 'కోకో నట్‌' అన్నారు. ఆ భాషల్లో కోకో అంటే కోతి ముఖమని అర్థం. అలా పుట్టిన ఈ పదం తొలిసారిగా 1555లో ఇంగ్లిషు నిఘంటువుల్లో చోటు చేసుకుంది.

ఇంతకీ కొబ్బరి దినోత్సవాన్ని ఎందుకు జరుపుతారో తెలుసా? 'ది ఏషియా- పసిఫిక్‌ కొకోనట్‌ కమ్యూనిట్‌' (APCC) అనే అంతర్జాతీయ సంస్థని 1969 సెప్టెంబరు 2న ఇండోనేషియా రాజధాని జకార్తాలో స్థాపించారు. కొబ్బరి ఉత్పత్తులను మరింత పెంచి, దాని ప్రాధాన్యాన్ని తెలపడమే దాని లక్ష్యం. ఆ సంస్థ 35వ వార్షికోత్సవం నుంచి 'కొబ్బరి దినాన్ని' ప్రత్యేకంగా జరుపుతోంది.

* కొబ్బరి ఉత్పత్తిలో ఇండోనేషియా, పిలిప్పీన్స్‌ తర్వాత మూడో స్థానంలో ఉంది మన దేశమే. భారత్‌లో దీని వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నవారు కోటిమందికిపైనే. మన జాతీయ ఉత్పత్తిలో కొబ్బరి వాటా ఏడు వేల కోట్ల రూపాయలు.

* ఇదెక్కడ పుట్టిందనే విషయంపై అనేక వాదనలున్నాయి. దాదాపు కోటిన్నర ఏళ్ల నాటి కొబ్బరి కాయ శిలాజం న్యూజిలాండ్‌లో కనిపించడంతో అక్కడే పుట్టిందని చెబుతారు. కానీ ఉత్తర అమెరికాలోనని, ఆసియాలోనేనని, గంగానది తీరమేనని వాదనలు వినిపిస్తాయి.

* ఎక్కడ పుట్టినా కొబ్బరి కాయలు సముద్రాల్లో తేలుతూ ప్రయాణించి వివిధ తీరాల్లో నాటుకుని వ్యాపించాయనేది మాత్రం నిజం. సముద్రంలో 110 రోజులు ఉన్నా కూడా ఇది మొలకెత్తుతుంది. ఇప్పుడు ఏకంగా 86 దేశాల్లో కొబ్బరి చెట్లు ఉన్నాయి.

* ఆరోగ్యపరంగా చూస్తే హృద్రోగాల్ని తగ్గిస్తుంది. రోగనిరోధకత పెంచుతుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. జీర్ణవ్యవస్థను పటిష్టపరుస్తుంది.

* అతి పెద్ద విత్తనం కొబ్బరికాయే.

* ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 5000 కోట్ల కొబ్బరికాయలు ఉత్పత్తి అవుతున్నాయి అని అంచనా .

* అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 20వ శతాబ్దం వరకు కొబ్బరికాయల్నివస్తు మారకంగా వాడేవారు.

ఉపయోగాలు : (uses)->
కొబ్బరికాయలో నలబైతొమ్మిది శాతం లారిక్ యాసిడ్ వుంటుంది .ఇది తల్లి పాలకు దాదాపు సరిసమానం. కొబ్బరినూనెలో వుండే పాటియాసిడ్స్, వైరల్ ,ఫంగల్ ,బ్యాక్టీరియల్ వంటి మానవజాతి ఎదుర్కునే రుగ్మతలను తగ్గించడములో సహాయపడతాయి. పోషకాలతో కూడిన ఆహారాన్ని ,పానీయాన్ని అందిచడముతో పాటు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది . కొబ్బరిచెట్టు లో ప్రతీ భాగము అన్నిరకాలగాను ఉపయోగపడుతొంది .అందుకే దీనిని మానవుల పాలిట కల్పవృక్షము అంటారు .
కొబ్బరి పీచు తో కార్పెట్లు , క్వాయర్ పరుపులు , తాళు తయారు చెస్తారు . కొబ్బరి మట్టలు వంట చెరకుగా ఉపయోగిస్తారు . కొబ్బి ఆకులు చాపలు గ్రామాలలో ఉపయోగిస్తారు . కొబ్బరి ఆకు ఈనె లతో కొబ్బరి కంపలు , చీపుర్లు త్రయారు చేస్తారు . ఈ విధం గా కొబ్బరి చెట్టు ప్రతి భాగము మానవులకు ఉపయోగపడుతుంది .

కొబ్బరికాయకు కూడా ఒక రోజు, అదే ప్రపంచ శ్రీ ఫల దినోత్సవము (కోకోనట్ డే)ప్రతీ సంవత్సరము సెప్టెంబర్ రెండు న జరుపుతారు .
  • =================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .