Monday, August 30, 2010

Kids Day , కిడ్స్ డేనేషనల్ కిడ్స్ డే -- ఆగస్టు 01 .. పిల్లలను మంచి పౌరులు గా తీర్చిదిద్దడానికి ఉద్దేశించబడినది .

పిల్లలులేని ఇల్లు ఇల్లే కాదంటారు . పిల్లలు దైవస్వరూపాలు . ఇవి వట్టి మాటలు మాత్రమేకాదు . . నిజాలు . చిన్నతనము నుంచి పిల్లల విషయము లో సరైన పరిరక్షణ తీసుకుంటూ , పోషణ ఇస్తూ పెంచితే ఆ పిల్లల మానసిక , శారీరక ఆరోగ్యాలు రెండూబాగుంటాయి . మంచి పౌరులుగా తీర్చిదిద్దుకోవచ్చును .

ఈ రొజుల్లో పిల్లల పెంపకము అంటే ఆషామాషీ వ్యవహారము కాదు . అనేకానేక ఒత్తిడులు , వ్యాపకాలు , ఒడిదుడుకుల నడుమ పిల్లల్ని పెంచడమంటే ఎంత కస్టమో అనుభవపూర్వకము గా తెలుసుముంటున్నదే . పిల్లల విషయములో పెద్దలు ఎంతగా , ఎన్నిరకాలుగా టెన్షన్‌ పడుతుంటారో , కొన్ని తెలిసి , కొన్ని తెలియక పిల్లలు కుడా అమేమాదిరి రకకకాల ఒత్తిళ్ళకు , ప్రలోభాలకు గురవుతూ ఉంటారు . బాల్యము సజావుగా , సంతోషం గా సాగాలని అటు పెద్దవాళ్ళు , ఇటు పిల్లలు కూడా ఆరాటపడుతుంతారు . పిల్లల్ని ప్రేమించాలి , మందలించాలి , స్పూర్తిని ఇవ్వాలి , ప్రశంసించాలి .. ఇవన్నీపెంపకం లో భాగాలు . పిల్లల్ని ఆరొగ్యం గా , సంతోషం గా , విజయవంతం గా భవిష్యత్తుని అందుకునేలా పెంచి పెద్దచేయలలగాలి . దీనిని ఓ తపస్సు గా భావించాలి .

పిల్లల పెంపకం గురించి , వారికి అందించాల్చి న ప్రేమానురాగాల గురించి , పిల్లలకున్న అసాధారణ విలువల గురించి గుర్తు చేస్తూ పెద్దవాళ్ళు , పేరెంట్స్ , తాత , అమ్మమ్మ , నాన్నమ్మ , బంధువులు , పొరుగువారు , ఉపాధ్యాయులు , ఇతర సంరక్షకుల్ని పిల్లలతో ఎక్కువ సమయాన్ని కలసి గడిపేందుకు ప్రోత్సహిస్తూ అమెరికాలో ఏటేటా భారీ ఎత్తున కిశ డే ని నిర్వహిస్తున్నారు .

పిల్లలు ఎదుర్కొనే సమ్క్షోభాన్ని 127 సంవత్సరాలకు పైగా పరిష్కరిస్తూ వస్తున్న కిడ్స్ పీస్ అనే సంస్థ ఈ జాతీయ కిడ్స్ డే ను వార్షికోత్సవం గా జాతీయ క్యాలెందర్ లో పొందు పరిచింది . పిల్లల అసాధారణ విలువకు గుర్తుగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు . పిల్లలతో సంబంధిత పెద్దలు ఎక్కువ సమయాన్ని గశవడాం కోసం ఈ రోజును ఉద్దేశంచారు . పిల్లలతో వీలైనంత ఎక్కువ సమయం గడపగలిగితే సంతోషం గా ఎదిగి , వారు మంచి పౌరులుగా రూపొంది , బాధ్యత గల చక్కని జాతినిర్మాతలు గాకగరన్నది కిడ పీస్ యొక్క అభిప్రాయము . పిల్లల్కు గల అసాధారణ , గొప్ప విలువలపట్ల కిడాపీస్ కు అచంచల విశ్వాసము ఉంది . ఈ రోజు పిల్లకు అనేక బహుమానాలు అందిస్తారు . దశాబ్దాలుగా అమెరికా పిల్లలు తమ తల్లిదండ్రుల్ని గ్రాండ్ పేరెంట్స ను , అంరక్షకుల్ని ఓ ప్రశ్న వేస్తూ వస్తున్నారు . అమెరికన్‌లు మదర్స్ డే , ఫాదర్స్ డే లను నిర్వహించుకున్నట్లు " కిడ్స్ డే " ను ఎందుకు నిర్వహిండం లేదు .అని ... అందుకే ఈ కిడ్స్ డే .. ఈ రోజు ముఖ్య ఉద్దేశము -> పిల్లలు పెద్దలతో వీలైనంత అర్ధవంతమైన సమయాన్ని గడపడం , వారితో ఇంటరాక్ట్ అవడం .

యు.ఎస్ . కాంగ్రెస్ , యు.ఎం.మేయర్ల కాన్‌ఫరెన్‌సులు ' కిడ్స్ డే ' ను గుర్తించాయి . నిర్లక్ష్యము , డిప్రెషన్‌ , ఒత్తిళ్ళకు ఎటువంటి పిల్లలనైనా రక్షించేందుకు ఉద్దేశించ బడింది . అమెరికా తో పాటు మన భారత దేశము లో ఈ దినాన్ని అనుకరిస్తున్నాము . ఎక్కువ ప్రచారములోనికి రాలేదు కాని మనజీవితాల్లో ఎంతో ప్రాధాన్యము గల పిల్లల కోసము ఓ రోజు కేటాయించాలి కదా ... మంచిదే కదా !  • ===========================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .