Monday, August 2, 2010

తల్లిపాల వారోత్సవాలు , Mother milk week Celebration





ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగష్టు నెల మొదటి వారం రోజులు తల్లిపాల వారోత్సవాలుగా వాబా (వరల్డ్ అలైన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్షన్ ) సంస్థ పర్యవేక్షణలో డబ్ల్యు.హెచ్.ఓ (WHO), యునిసెఫ్ (UNICEF) మరియు బి.పి.ఎన్.ఐ (BPNI) వంటి అంతర్జాతీయ, జాతీయ సంస్థల అనుబంధంగా జరుపబడుచున్నది.

తల్లి పాల సంస్కృతిని ప్రోత్సహించి, సహకరించి, రక్షించుకోవడానికి ప్రతి సంవత్సరం ఒక క్రొత్త సందేశముతో ఈ వారోత్సవాలు జరుగుచున్నవి.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల విశిష్టత గురించి తెలుసు కుందాం!

1. తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి.

2. శిశువు పుట్టిన వెంటనే గంటలోపే తల్లిరొమ్ము అందించి ముర్రుపాలు (కొలస్ట్రం-ఈుుషసషప) తప్పని సరిగా పట్టాలి. వ్యాధుల నుండి రక్షించే శిశువుకు కావలసిన ఖనిజాలు, మాంసకృత్తులు, విటమిన్‌ -ఏ సమృద్ధిగా ఉంటాయి. వ్యాధుల నుండి రక్షించే యాంటీబాడీలు ఉంటాయి. బిడ్డపేగుల నుండి విసర్జకాలను తొలగించడానికి, అలర్జీలు రాకుండా నిరోధించడానికి ముర్రుపాలు తోడ్పడతాయి. ఒక్కమాటలో చెప్పా లంటే ముర్రుపాలలో శిశువుకు కావలసిన అన్ని పోషకవిలువలు బిడ్డ శరీరానికి అందుతాయి.

3. బిడ్డకు మొదట వ్యాధి నిరోధక టీకాగా పనిచేస్తుంది.

4. శిశువులకు ప్రకృతి ప్రసాదించిన సహజ అత్యుత్తమమైన పౌష్టికాహారం.

5. బిడ్డ సులువుగా జీర్ణమౌతాయి.

6. ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంటాయి.

7. తల్లిపాలవలన మలవిసర్జన సులభంగా జరుగుతుంది.

8. శిశువులకు దృష్టిలోపం రాకుండా నివారించడానికి దోహదపడతాయి.

9. తల్లికీ, బిడ్డకు చక్కని అనుబంధం ఏర్పడుతుంది.

10. వ్యాధుల బారి నుండి తల్లిపాలు రక్షిస్తుంది.

11. బిడ్డకు ప్రృతివరం కొనవలసిన అవసరంలేదు.

12. తల్లిపాలు సురక్షితమైనవి రోజులో 24 గంటలూ తల్లిపాలు లభిస్తాయి.

13. తల్లిపాలలో శిశువులకు కావలసిన అన్ని పోషక పదార్థాలన్నీ పూర్తి మోతాదులో ఉంటాయి.

14. శిశువునకు కావలసిన ఉష్ణోగ్రతలో ఉంటాయి.

15. బిడ్డ కోరుకున్న ప్రతిసారి పగలైనా, రాత్రైనా తల్లిపాలు పట్టాలి. బిడ్డ ఎంతసేపు పాలు త్రాగుతుంటే

అంతసేపు తాగిస్తుండాలి.

16. తల్లిపాలు తాగే పిల్లలు ఆకస్మిక మరణానికి గురయ్యే అవకాశం (సడన్‌ ఇన్‌ ఫాంట్‌ డెత్‌ సిండ్రోం) తక్కువని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది.

17. తల్లిపాల వలన పోషకాహార లోపాలు తగ్గి 13 శాతం శిశుమరణాలరేటు తగ్గించవచ్చు. (మనదేశం, రాష్ట్రంలోనే శిశుమరణాలు అధికం)

18. శిశువులు అనారోగ్యంగా ఉన్నా తల్లిపాలు పట్టాలి.

19.మండువేసవిలోనైనా (నాలుక పిడచకట్టుకుపోయే వేసవిలోనైనా) శిశువుకు ఎలాంటి నీరు పట్టనవసరం లేదు. ఎందుకంటే తల్లిపాలలో 90 శాతం నీరు ఉంటుంది. తల్లిపాలు త్రాగే శిశువులకు తల్లి పాల నుండి తగినంత నీరు లభిస్తుంది.

20. శస్త్రచికిత్స ద్వారా (సిజేరియన్‌) పుట్టిన పిల్లలకు కూడా వెంటనే తల్లిపాలు పరిశుభ్రమైన గిన్నెలో ప పిండది చెంచాతో లేదా ఉగ్గుగిన్నెతో పట్టించాలి.

21. శిశువుకు తల్లిపాలు ఇచ్చే టప్పుడు సరైన రీతిలో ఇవ్వాలి.

22. ఉద్యోగినులైతే శిశువుకి కనీసం నాలుగు గంటకొకసారి పాలివ్వాలి.

23. బిడ్డల్ని వదిలి కూలి పనికి వెళ్లే తల్లులు తమ పాలను ఒక పరిశుభ్రమైన గ్లాసులో పిండి 8 గంటలలోగా ఆపాలను శిశువులకు చెంచాతోగానీ లేదా ఉగ్గుగిన్నెతోకాని పట్టవచ్చును.

24. తల్లిబిడ్డకు పాలివ్వడం వలన మొదటి 6నెలలలోపు అండం విడుదల కానందున గర్భం దాల్చే అవకాశం లేదు. తల్లికి సహజ కుటుంబ నియంత్రణ పద్ధతిగా ఉపయోగపడుతుంది. ఈ పద్థతినే ''లాక్టేషనల్‌ ఎమోనోరియా లేదా లామ్‌' అని అంటారు.

25. పిల్లలకు పాలిచ్చే తల్లులు వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులు వాడరాదు.

26. ఒక తల్లి మరో బిడ్డకు అత్యవసరమైన సమయాలలో పాలు పట్టించవచ్చును.

27. దీర్ఘకాల వ్యాధులు ఉన్న తల్లులు వైద్యులు సలహామేరకు శిశువులకు పాలివ్వాలి.

28. హెచ్‌.ఐ.వి. ఇన్‌ఫెక్షన్‌ ఉన్న తల్లులు పోతపాలు సురక్షితంగా ఇవ్వలేనప్పుడు కేవలం తమ పాలను 6నెలల వరకు శిశువులకు ఇవ్వడం ఎంతో శ్రేయస్కరం. ఎట్టి పరిస్థితులోనూ కలగలుపు (మిక్స్‌డ్‌) ఫీడింగు ఇవ్వకూడదు. ఏదో ఒక్కపాలుమాత్రమే ఇవ్వాలి.

29. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు ప్రకారం శిశువుల గరిష్ఠ పెరుగుదలను మానసికాభివృద్దిని ఆరోగ్యాన్ని సాధించాలంటే వారికి మొదట 6 నెలలపాటు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించాలి.

30. కేవలం తల్లిపాలను మాత్రమే తాగించడం శిశువు జీవితానికి శుభారంభం పలుకుతుంది. అవి వారిని చురుగ్గా చేసి; మేథా ప్రతిభను పెంచుతుంది.

31. ఆరునెలల తర్వాత ఎదుగుతున్న శిశువు, పెరుగుతున్న అవసరాలు తీర్చడం కోసం శిశువులకు ఇష్టపూర్వ కమైన ఇంట్లోనే లభ్యమయ్యే పౌష్ఠిక విలువలున్న ద్రవ /ఘణ అనుబంధ ఆహారాన్ని ఇస్తూ... రెండు సంవత్స రాల వరకు తల్లిపాల పోషణను కొనసాగించాలి. అనుబంధ ఆహారాన్ని తయారు చేయడంలోనూ, తినిపించడం లోనూ పరిశుభ్రతను పాటించాలి.

ఉభయులకు లాభదాయకమే : తల్లిపాలవల్ల శిశువుకే కాదు...తల్లికి కూడా అనేక లాభాలు ఉన్నాయి. కొన్ని రకాల (ఉదాహరణకు : రొమ్ము గర్భసంచి, అండాశయం మొదలగు క్యాన్సర్లు) క్యాన్సర్లు తక్కువగా వస్తాయని, అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రసవ సమయంలో స్థిరత్వం కోల్పోయిన గర్భసంచి పూర్వ స్థితికి వచ్చి అధిక రక్తస్రావం తగ్గడం, శిశువుకు తల్లిపాలతోనే పెంచినట్లయితే హార్మోన్లు ప్రభావంతో 6 నెలల వరకు అండం విడుదల కానందువలన గర్భధారణ జరుగదు కాబట్టి తల్లికి ఇది తాత్కాలిక కుటుంబ నియంత్రణగా ఉపయోగపడుతుంది. (ఈ పద్థతినే ''లాక్టేషనల్‌ ఎమోనోరియా లేదా లామ్‌'' అని అంటారని వరుసక్రమం 24లో ముందే చదువుకున్నాము)

తల్లిపాల సంస్కృతి ఒక సామాజిక బాధ్యత. సమాజంలోని ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించి తల్లిపాల సంస్కృతిని పెంపొందించుకోవాలి.

source : Brest feeding week

అమ్మపాల బ్యాంక్‌-తల్లిపాల వారోత్సవాలు

మనకు బ్లడ్‌ బ్యాంక తెలుసు..ఐ బ్యాంక తెలుసు..మనకు అంతగా తెలియనిది ఇటీవలే బెంగాల్‌లో రూపుదిద్దుకున్నది...విదేశాలలో విస్తారంగా ఉన్నది అమ్మపాల బ్యాంక. దాన్నే మదర్‌ మిల్క్‌ బ్యాంక అనీ, బ్రెస్ట్‌ మిల్క్‌ బ్యాంక అని పిలుస్తున్నారు. ఈ బ్యాంకులో దాచే పాలు 5నెలలున్నా పాడవకుండా భద్రంగా ఉంటాయి. తల్లిపాలు చాలని పిల్లలకు, పాలే పడని తల్లులకు ఈ బ్యాంక వరంలా మారి అనేక మందిని ఆకర్షిస్తోంది. అవసరంలో ఉన్న పిల్లలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అంత, ఎక్కడికి తేవాలంటే అక్కడికి క్షణాలలో చేర్చే వ్యవస్థగా ఈ మిల్క్‌ బ్యాంకలు... తయారై ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. అమెరికాలోనే 12 మిల్క్‌ బ్యాంకులు, ఉన్నాయంటే ఇవి పొందుతున్న జనాదరణ ఎంతటిదో ఆలోచించుకోవచ్చు. అమ్మకు పాలు పడక పోయినా, పడ్డపాలు చాలకపోయినా, బిడ్డపుట్టగానే అమ్మ పోయినా పోతపాలు అవసరమవుతాయి. మన దేశంలో అమ్మపాలకు నోచుకోని పసిబిడ్డలకు ఆవుపాలు, మేకపాలు పట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఆవుపాలు అమ్మపాల లాగే పల్చగా ఉండి అజీర్తి చేయకుండా ఉంటాయని, బలవర్థకంగా ఉండి పిల్ల ఎదుగుదలకు దోహదం చేస్తాయని పెద్దవాళ్ళు అంటారు. అందుకే అ-అమ్మ, ఆ-ఆవు అనే పాఠం తెలుగునాట పిల్లలందరికీ కంఠోపాఠం. అమ్మ వంటిది ఆవు కనుకనే ఆవును గోవు మాలకి్ఝ అని పూజిస్తాం. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ముదిరిన ఈ కలికాలంలో గాలి పీల్చిన, నీళ్ళు తాగినా ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చిపడుతున్నాయి. ఈ భయంతో ఆవు పాలు పట్టడానికి కూడా బెదిరిపోయి డబ్బాపాలకు పిల్లలను అలవాటు చేస్తున్నారు. అవైతే శుద్ధి చేసిన పాలు కనుక రోగాలు రొచ్చులు రాకుండా ఉంటాయని నమ్ముతున్నాం. డబ్బాపాలైనా అందులో ఉన్నవి ఆవుపాలే! ఆవుపాలను పొడిచేసి అమ్మితే డబ్బాపాలు తయారవుతున్నాయి. ఈ విజాతి ప్రయోగాల కన్నా మనిషిపాలనే పిల్లలకు అందిస్తే పశుత్వ లక్షణాలు, పాశవిక లక్షణాలు సోకకుండా ఉంటాయని కొందరు ప్రయోగశీలురు మదర్‌మిల్క్‌ బ్యాంకలుే ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మరో మాటలో చెప్పాలంటే దీన్ని చంటిపిల్లల పాలిటి మదర్‌ డెయిరీ అని అనవచ్చు.

అమ్మపాలను ఎలా తీస్తారు

ఆవుపాలనైతే మనం పొదుగు పితకడం ద్వారా పాలు పిండుకుంటాం. అమ్మ విషయంలో అలా చేయడానికి

లైఫ్‌కుదరదు. చాతిని కొంగుచాటున దాచడం ఆడవారి నైజం. అలాగే బిడ్డకు పాలిచ్చేటపðడు కొంగుచాటు వేసి దిష్టి తగులకుండా చూడడం అమ్మతనంలోని విశిష్టలక్షణం. రొమ్ముపట ్టకుండా, ముట్టకుండా పచ్చి బాలింత నుంచి పాలు పట్టేదెలా సభ్యత, సంస్కారం, మర్యాద వంటివి ఎన్నో అడ్డొస్తాయి. కనుక అమ్మపాలు వెలికి తీయడానికి ఒక మృదువైన పంపును తయారుచేశారు. ఇవి అన్ని మిల్క్‌ బ్యాంకుల వద్ద అందుబాటులో ఉంటాయి. పాలిచ్చే తల్లి వెళ్ళగానే ఆమె నుంచి ఎంత సేపటి వరకు పాలు తీయవచ్చునో శాస్త్రీయంగా అధ్యయనం చేసి నిర్ధారిస్తారు. ఇందుకోసం హెల్త్‌ప్లాన్‌ రూపొందించారు. దాన్ని పూర్తి చేసి ఇస్తే పాలిచ్చే అపాయింట్‌మెంట్‌ ఫిక్స చేసి పాలిచ్చే తల్లి ఏ టైముకు రావాలో బ్యాంకు వారు తెలియజేస్తారు. అమ్మపాల బ్యాంకు గురించి తెలియజేయడానికి, అమ్మలను ఒప్పించడానికి వాలంటీర్లు ఉంటారు. ఈ వాలంటీర్‌ను గర్ల్‌ఫ్రెండ్‌ అని పిలుస్తారు. స్కూలు పిల్లలు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విద్యార్థినిలు, ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఆస్పత్రుల ద్వారా, స్నేహితుల ద్వారా గర్భంతో ఉన్న వారి వివరాలను, ప్రసవించిన తాజా అమ్మల వివరాలను సేకరించి వారికి కౌన్సిలింగ్‌ ఇస్తారు. అలాగే క్రీడా ప్రాంగణాలలో, చర్చిలలో కూడా చేరి అమ్మలైన వారికి, అమ్మకాబోయే వారికి, వివాహం చేసుకోడానికి సిద్ధంగా ఉన్న వారికి ఈ బ్యాంక గురించి తెలియజేస్తారు. మదర్‌మిల్క్‌ బ్యాంక గురించి తెలుసుకోగోరే వారు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి వివరాలు అందజేయడం, ఈ సేవ వెనకగల పరమార్థాన్ని వారికి అర్థమయ్యేలా విడమరచి చెప్పడం వంటి పనులు చేస్తారు. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన గోరే వారు ఈ బ్యాంకులో విధిగా వాలంటీర్‌ అయి ఉండాలని నియమం లేదు. దీని గురించి ప్రచారం చేసేందుకు ఆసక్తి ఉందంటే వాలంటీర్‌గా కూడా తీసుకుంటారు. కాలేజీ, హైస్కూలు విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ కూడా ఉంది.

బ్యాంక పాలు తాగితే బిడ్డకు ఏమీ అవదా

కన్నతల్లి పాలు కాకుండా ఇతర పాలు ఏవైనా అవి విజాతి పాలే అవుతాయి. కనుక బిడ్డకు తక్షణం ఒంటబట్టే అవకాశాలు తక్కువే! కనుక మదర్‌మిల్క్‌ బ్యాంకకుే వెళ్ళి పాలు తీసుకువచ్చి బిడ్డకు పట్టినా మొదట్లో తేడా రావచ్చు. వేరే అమ్మ పాలే అయినా సహజ పోషకాలు ఎక్కడికీ పోవని, డబ్బాపాలకన్నా ఇవి ఖచ్చితంగా శ్రేష్ఠమైనవని డాక్టర్లు అంటున్నారు. బ్యాంక పాలు తాగడం వల్ల పిల్లలకు కడుపునొప్పి వచ్చి బాగా ఏడవవచ్చు. వాంతులు, దద్దులు రావచ్చు. కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడవచ్చు. చర్మం కందిపోయినట్టుగా, ఒంట్లో అసహజమైన వాపు వచ్చినట్టుగా అనిపించవచ్చు. పిల్లలు మబ్బుగా అయిపోయే అవకాశం ఉంది. రక్త విరోచనాలు కూడా అయ్యే అవకాశం ఉంది. అయితే ఇవి కొద్ది రోజులే ఉంటాయి. క్రమంగా ఆ పాలకు అలవాటుపడడం మొదలయ్యాక ఈ బాధలన్నీ పోయి బిడ్డ బలంగా ఆరోగ్యంగా తయారవుతాడు.

పాల సేకరణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు

మంచి ఆరోగ్యంతో ఉన్న అమ్మలను, తమ పిల్లలకు సరిపోగా ఎక్కువైపోతున్న తల్లుల నుంచి పాలు సేకరిస్తారు. అయితే పాలు ఇచ్చే అమ్మలకు ఏ దురలవాటూ లేకుండా ఉండాలి. పాలు ఇచ్చే అమ్మలు సిగరెట్‌ పట్టని వారు, మందు కొట్టనివారు, మాదక ద్రవ్యాలు ముట్టని వారు అయి ఉండాలి. అలాగే దీర్ఘకాలిక రోగాలకు మందులు వాడే వారు కూడా పాలు ఇవ్వడానికి పనికిరారు. హెపటిటీస్‌ బి, సి, హెచ్‌ఐవి 1,2 పరీక్షలు, హెచ్‌టిఎల్‌వి 1,2 పరీక్షలలో పాజిటివ్‌ రిజల్ట్స్‌ రాకుండా ఉండాలి. పాలు ఇచ్చే తల్లికి అలర్జీలు, టిబి వంటి జబ్బులు ఉండకూడదు. ఇవి నిర్థారించుకోడానికి తల్లికి ఉచితంగా రక్తపరీక్ష నిర్వహిస్తారు. పాలు పట్టే పాత్రను కూడా ఉచితంగానే ఇస్తారు. తల్లి ఆరోగ్యానికి సంబంధించిన మెడికల్‌ హిస్టరీ చూస్తారు. సాధారణంగా రక్తదానానికి అర్హమైనతల్లి దాదాపుగా పాల దానానికి కూడా అర్హమౌతుంది. అయినా తల్లిని పరీక్షించే డాక్టర్‌, బిడ్డను పరీక్షించే డాక్టర్‌ సలహాలను పరిశీలించాకే బ్యాంక పాలు ఇస్తారు. తాను ఇచ్చే పాలు మరో అమ్మ కన్న బిడ్డ ప్రాణాలు నిలబెడతాయి కదా అనే వితరణ దృక్పథం కలిగి పాలు దానమివ్వాలి. పాల పాత్రను శుచిగా శుభ్రంగా ఉంచాలి. ఇలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని సేకరించిన పాలను బ్యాంకకుే తీసుకురాగానే వాటిని పాశ్చురైజ్‌ చేస్తారు. ఇందువల్ల పాలలో సహజంగా ఉండే రోగ కారక క్రిములు చచ్చిపోతాయి. అమ్మపాలలో సహజంగా ఉండే బలవర్థక గుణాలు, పోషక పదార్థాలు పాడైపోకుండా ఉంటాయి. పాశ్చురైజేషన్‌ తరువాత పాలను బాక్టీరియా లేకుండా ఉండేలా పరీక్షలు చేసి నిర్మూలిస్తారు. అయినా ఎందుకైనా మంచిదని ఈ పాలను బీమా చేయిస్తారు. రవాణాలో నష్టమైనా, వాడకంలో తేడా వచ్చి అనారోగ్యం వచ్చినా కవర్‌ చేయడానికి ఈ బీమా ఎంతగానో ఉపయోగ పడుతుంది.

పాలివ్వాలంటే ఏం చేయాలి

తల్లి పాల అవసరంతో అంగలార్చే బిడ్డను ఆదుకోవాలని ఏ దయగల తల్లికి అనిపించినా సమీపంలో గల అమ్మపాల బ్యాంకకుే సమాచారం అందిస్తారు. ఇది విదేశీ సంప్రదాయం. ఎవరి బిడ్డకో పాలిస్తే మాకేంటంట అని అక్కడ ఏ తల్లీ అనుకోదు. ఒక మంచి పని చేస్తున్నానన్న సంతృప్తితో వారీ పని చేస్తుంటారు. పాలు ఇచ్చి సహకరించిన అమ్మకు ఆమె ఇచ్చిన పాలను ఏ బిడ్డకు ఇచ్చారో మిల్క్‌ బ్యాంక నిర్వాహకులు తెలియజేస్తారు. తద్వారా తమ వితరణ సద్వినియోగమైందన్న ఆనందం వారికి కలిగిస్తారు.

క్షీరనిధికి నిధులెలా

తల్లిపాల అవసరాన్ని, తల్లిపాలకు నోచుకోని బిడ్డలకు వాటిని అందించవలసిన అవసరాన్ని వివరిస్తూ ఈ బ్యాంకులు లేఖలు, ఫొటోలు రూపొందించాయి. వాటిని జాలి గుండెలు గల తల్లులకు పంపిస్తారు. ఈ బ్యాంకులను సేవాభావం, వితరణ శీలం గల వారి సారథ్యంలో నడిచేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. వీటిని నడపడానికి ఎలాగూ నిధులు కావాలి. ఇందుకు దయాగుణం గల పెద్దలు, సంఘాల నుంచి విరాళాలు తీసుకుంటారు. అలాగే పాలను శుద్ధిచేసి, భద్రపరిచినందుకు అయ్యే ఖర్చులో కొంత భాగాన్ని వాటిని వినియోగించే వారి నుంచి తీసుకుంటారు. అందువల్ల తల్లి పాలు ఆ బిడ్డలకు కారు చవకగా అందుతాయి. ఈ సేవా కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగేందుకు విదేశాలలో ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. వీటికి విరాళాలిచ్చే వారికి పన్ను నుంచి మినహాయింప ునిస్తున్నాయి. అలాగే లాభాపేక్ష లేకుండా నడిచే ఈ బ్యాంకులపైన కూడా ఎలాంటి పన్నులూ విధించకుండా ప్రోత్సహిస్తున్నాయి.

చనుపాలు పసిబిడ్డలకేనా

అమ్మపాలు కేవలం పసిబిడ్డలకేనా మరెవరి కైనా ఇస్తారా సేకరించిన పాలలో చాలా వరకు పసిబిడ్డలకే వాడతారు. కొన్ని సందర్భాలలో ప్రాణావ సరాలలో ఉండే ఇతర రోగులకు కూడా వాడతారు. ముఖ్యంగా కాలేయం మార్పిడి చేయించుకున్న రోగులకు రోగనిరోధక శక్తి కలిగించేందుకు వారు త్వరగా కోలుకునేందుకు అవసరమైన బలాన్ని, పోషక ఆహారాన్ని అందించేందుకు తల్లిపాలను వాడతారు. అందువల్ల రోగులు వేగంగా కోలుకుంటున్నారని డాక్టర్ల అధ్యయనంలో వెల్లడైంది.

-డాక్టర్‌ వంగల రామకృష్ణ-Andhraprabha Newspaper-- Sat, 31 Jul 2010, IST


  • =============================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .