Sunday, August 1, 2010

స్నేహితుల దినోత్సవం , Friendship Day

  • ఫ్రెండ్షిప్‌ డే ప్రతి ఏడాది ఆగష్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు.



స్నేహమేరా జీవితం.....స్నేహమేరా శాశ్వతం అన్నాడో కవి. కలకాలం నిలిచిపోయేది స్నేహమని, సృష్టిలో తీయనైంది స్నేహమేనని ఎందరో కవులు పేర్కొన్నారు. స్నేహితులంతా కలిసి ఒక పండగ సంవత్సరంలో ఒక రోజును జరుపుకోవాలని నిర్ణయించుకొని జరుపుకుంటుండగా,యుఎస్‌ కాంగ్రెస్‌ 1935లో ఆగస్టులో వచ్చే మొదటి ఆదివారాన్ని అధికారికంగా ఫ్రెండ్‌షిప్‌ డేగా ప్రకటించినది . ఫ్రెండ్షిప్‌ డే ప్రతి ఏడాది ఆగష్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. ఈ ఆచారం 1935 లో అమెరికాలో జాతీయ స్నేహ దినోత్సవంగా ప్రారంభమైంది. క్రమక్రమంగా అది అంతర్జాతీయ స్థాయి సంబరంగా మారింది. నిజానికి కొన్నింటికి ప్రత్యేక ప్రస్తావన అవసరంలేదు. అందులోనూ అందమైన స్నేహాలకి. అయినా ఎన్నో రకాల రోజులు ప్రత్యేకంగా ఏర్పరుచున్నట్టే దీనినీ ఆచరిస్తున్నారు. రాఖీరోజును మణికట్టుకు కట్టే తాళ్లతో అన్నా చెల్లెళ్ల బంధాన్ని ఏర్పరచుకున్నట్టూ, బలోపేతం చేసినట్టూ ఫ్రెండ్షిప్‌ డే నాడు ప్రత్యేక ఫ్రెండ్షిప్‌ బ్యాండ్లు ధరించడం ఫ్యాషనైంది. ఇదంతా కుర్రకారు వ్యవహారం. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం చిన్నారులకు పెద్ద క్రేజీగా మారింది. ఉదయాన్నే లేచిన చిన్నారులు తమ స్నేహితులను కలవడానికి ఎంతో ఉత్సాహం చూపించారు. పేరు, పేరున తమస్నేహితులను గుర్తుంచుకొని వారందరికి ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌లు కట్టాలని ఆశపడతారు .

ఎలా వచ్చిందంటే :
అమెరికా ప్రభుత్వము 1935 ఆగస్టు మొదటి శనివారము ఓ వ్యక్తిని చంపింది . అతని మరణ వార్త విని ఆమరుచటి రోజు అతని స్నేహితుడు ఆత్మహత్య చేసుకున్నాడు . ఈ సంఘటనకు స్పందించిన అమెరికా ప్రభుత్వము వీరి స్నేహానికి గుర్తుగా అప్పటి నుంచీ ఏటా ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవము గా ప్రకటించినట్లు చరిత్ర చెబుతోంది .

  • చాలా దేశాలు జులై 20ని స్నేహితుల దినోత్సవం (ఫ్రెండ్షిప్‌ డే)గా జరుపుకుంటాయి.
  • మహిళా స్నేహ దినోత్సవం - ఆగస్టు మూడవ వారం-ఇండియాలో సెప్టెంబర్ 3 వ ఆదివారము జరుపుతారు .
  • అంతర్జాతీయ స్నేహమాసం - ఫిబ్రవరి.
  • పాత, కొత్త స్నేహితుల వారం - మే మూడవ వారం.

రక్త సంబంధాలకూ, బీరకాయ పీచు బంధుత్వాలకూ, చత్వారపు చుట్టరికాలకూ అతీతంగా ఉండేది స్నేహం. నిజానికి వాటన్నిటికన్నా అందమైనదీ, అపురూపమైనదీ, అద్భుతమైనదీ, అత్యున్నతమైనదీ స్నేహమే. ఇటువంటి ఎన్నో విశేషణాలు జోడించి స్నేహాన్ని వర్ణించడానికి చేసిన ప్రయత్నంలో ఎన్నెన్నో కథలు, కవితలు రూపొందాయి. కానీ స్నేహానికి వివరణలు, వర్ణనలు, తాఖీదులు, హామీలు అవసరం లేదు. ఎందుకంటే స్నేహం మనసుకు సంబంధించిన విషయం. అనుభూతులకు నెలవు. అనుభవాలకు కొలువు.

ఈ సృష్టి ఉన్నంతకాలం నిలిచేది ఒక్క స్నేహమే... ఆదిదేవుళ్లు సృష్టి, స్థితి, లయకారకాలను కచ్చితంగా అమలుపరిచేది తమ స్నేహబంధంతోటే... జగన్మాతలు ముగ్గురూ స్నేహంగా ఉండబట్టే రాక్షస సంహారం గావించబడి లోకాలన్నీ శాంతించినాయి. ద్వాపరయుగంలో లేమికి నిర్వచనంగా చెప్పబడే కుచేలుడు ఇచ్చిన పిడికెడు అటుకులతో అతని స్నేహితుడైన శ్రీకృష్ణుడు అతనికి బంగారు పట్టణాన్నే బహూకరించి స్నేహం విలువను ఈ లోకానికి తెలియజేశాడు. మహాభారతంలో రారాజు ధుర్యోధనుడు, మానసపుత్రుడు కర్ణుడు మధ్యనున్న స్నేహం వెలకట్టలేనిది. స్నేహితుని కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టి కర్ణుడు చరిత్ర లో నిలిచిపోయాడు. రామాయణంలో కూడా శ్రీరామునికి, ఆంజనేయునికి మధ్య ఉన్న స్నేహబంధం లతలా పెనవేసుకుపోయి భక్తిబంధంగా రూపుదాల్చింది. ఇలా యుగయుగాలలో భగవంతుడు స్నేహబంధం విలువను ఏదో ఒక రూపంలో మనుషులకు సూచిస్తునే ఉన్నాడు. స్నేహబంధంతో ఇరుదేశాల మధ్య రక్తపాతాన్ని ఆపవచ్చు... కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడ వచ్చు... దేశ ఉన్నతిని కాంక్షించవచ్చు... ఇలా చెప్పు కుంటూ పోతే స్నేహబంధం ఒక నిరంతర గంగా ప్రవాహం... దానిని అదుపు చేయడం గంగ వెల్లువను కమండలంలో పట్టివుంచి నట్లవుతుంది...
స్నేహితుల దినోత్సవం -- మనస్తత్వము :

ప్రండ్షిప్ బాండ్లు కడతారు ... ఎస్.ఎమ్‌.ఎస్‌ లతో గ్రీటింగ్స్‌ చెబుతారు... కుదిరితే కవ్పు కాఫీ, కాకుంటే కబుర్లు చెవ్పుకుని సరదాగా గడువుతారు... ప్రండ్షిప్ డే' ఎంజాయ్‌ చేయాలంటే ఎన్నెన్నో మార్గాలు!
కానీ మన చుట్టూ ఉన్న స్నేహితులతో మనపెలా ఉంటున్నామో ఒక్కసారైనా మననం చేసుకుంటున్నామా? నిజమైన స్నేహం నిలవాలంటే ఏమేం పాటించాలో తెలుసుకుంటున్నామా?
'ఒరే... వీడు సెల్ఫిష్‌రా... వదిలెయ్‌...' అంటే, 'పోనీలేరా... ప్రెండ్‌ కదరా...' అంటాడు 'హ్యాపిడేస్‌'లో టైసన్‌. స్నేహితుడిలో లోపాలున్నా పాటికి అతీతంగా స్నేహం ఉండాలని అంతర్లీనంగా చెబుతుందీ సన్నిపేశం.
స్నేహితులు లేని మనిషి జీవితం ఒయాసిస్‌ లేని ఎడారిలాంటిది. ఓ వేదాంతి స్నేహాన్ని కొండగుహతో పోలుస్తాడు. దాని ముందు నిల్చొని అరిస్తే వ్రతిధ్వని వినివిస్తుంది. మంచి మిత్రుడి స్పందన కూడా అంత సహజంగా వేగంగా ఉంటుంది. 'నీ వెంట నేనున్నా' అనే భరోసా ఇచ్చేవాడే స్నేహితుడు.

పార్లీ (PARLEE) అనే మనోవిశ్లేషకుడి నిర్వచనంలో చెప్పాలంటే, 'నిజమైన మిత్రుడు ఓటమిలో ఓదార్చేవాడు; మన గెలువును తనదిగా భావించి ఆనందాన్ని పంచుకునేపాడు; సమస్యల్లో ఓ కౌన్సిలర్‌గా ఉండేవాడు; ఏం చేయాలో తోచని స్థితిలో నీకండగా ఉన్నాననే ధైర్యాన్నిచ్చేపాడు'
మనిషి అవసరాల్నింటిలో సంబంధం (Affiliation) చాలా ముఖ్యమైందంటాడు సైకాలజిస్ట్‌ హెన్రీముర్రే. బాల్యం నుంచి ఎదిగే క్రమంలో యువతలో తలెత్తే మానసిక ఒత్తిళ్లకు స్నేహం అవసరం మరింత పెరుగుతుందని క్యాష్టర్‌ వరిశోధనలు నిరూపించాయి. స్నేహితులు ఒకరి నుంచి ఒకరు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఒకరికొకరు ఆదర్శంగా నిలిచి మానసిక వికాసానికి తోడ్పడతారు.
యువతరం స్నేహాల్లో మూడు దశలున్నాయని ఆడర్సన్‌ అనే మనస్తత్వపేత్త చెప్పాడు. మొదటి దశలో వ్యక్తిగత సంబరధం ఉండదు. కలిసి చేసే వనులవైనే ఆధారవడి ఉరటుంది. వదిహేను ఏళ్ల తర్వాత మొదలయ్యే రెండో దశ నమ్మకం పై ఆధారవడి ఉంటుంది. ఆపై సోషల్‌ సపోర్ట్‌, భద్రత ముఖ్య పాత్ర వహిస్తాయి.

  • స్నేహం నిరంతరం పెరిగేలా వ్రవర్తించాలి. తెంచే వ్రవర్తనలు ఉంటే గమనించుకుని మనల్ని మనం మార్చుకోపాలి.
  • చిన్న చిన్న విషయాలను వట్టించుకోకూడదు. స్నేహితుడు నీకు చెవ్పకుండా సినిమాకు పెళితే 'వీడు సెల్ఫిష్‌' అనుకోకూడదు.
  • విమర్శించి తవ్పులు సరిదద్దడం స్నేహంలో భాగమే కానీ అదపనిగా విమర్శలు చేయకూడదు.
  • విమర్శ మనసులో ముల్లులా గుచ్చుకోకుండా, చెవ్పే మాటలు సున్నితంగా ఉండేలా జాగ్రత్త వడాలి.
  • ఒక స్నేహితుడిలోని లోపాలను మరో స్నేహితుడి వద్ద వ్రస్తావించకుండా ఉంటేనే మంచిది.
  • మిత్రునిలోని మంచి గుణాలను కూడా వ్రకటిస్తూ ఉండడం ముఖ్యం. అలాగని నింరతరం పొగడ్తల్లో ముంచెత్తకూడదు.
  • స్నేహితుని మాటల్లో, వ్రవర్తనలో నిగూఢ అర్థాలున్నాయోమోననే అనుమానాన్ని దరిచేరనీయకూడదు. ఉదాహరణకు నీకు బహూకరించిన వుస్తకం విలువను బట్టి 'నేనంత ముఖ్యుడిని కాననే ఈ వుస్తకం ఇచ్చాడు' లాంటి అన్వయాలను విడనాడాలి.
  • స్నేహంలో నిజాయితీ, పారదర్శకత చాలా ముఖ్యం.


  • ==========================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .