Sunday, June 13, 2010

World Blood donors Day , ప్రపంచ రక్తదాతల దినోత్సవం



  • '' జూన్‌ 14 న ''
శాస్త్రసాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ది చెందినప్పటికీ కృత్రిమ రక్తాన్ని తయారు చేసేవీలు లేక అనసరమైన మేరకు రక్తాన్ని దానం ద్వారా మాత్రమే సేకరించే వీలు వుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఏటా ఎనిమది లక్షల యూనిట్‌ల రక్తం అవసరం కాగా అందులో 6 లక్షల యూనిట్ల రక్తాన్ని మాత్రమే 208 బ్లడ్‌బ్యాంక్‌ల ద్వారా సేకరించగలుగుతున్నారు. అవసరమైన రక్తాన్ని దాతలనుంచి సేకరించడానికి, రక్తదానం పై అవగాహన కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నది. ఈ నేఫధ్యంలో ప్రతి సంవత్సరము జూన్‌ 14 న ' ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని' జరుపు కుంటున్నాము . రక్తాన్ని సేకరించడానికి దాతలలో అవగాహన కల్పిస్తూ చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశము . తొలి వరర్డ్ బ్లడ్ డోనార్ డే ను 2004 జూన్ 14 జరపాలని తీర్మాణము జరిగినది .

'ప్రభుత్వ అనుమతిలేకుండా ఎవ్వరూ బ్లడ్‌ బ్యాంక్‌లనుంచి రక్తాన్ని సేకరించకుండా, సేకరించిన రక్తాన్ని పరిక్షించకుండా ఎవ్వరికీ మార్పిడి చేయకుండా జాతీయ బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూషన్‌ యాక్ట్‌2008 ఇటీవల అమలు లోకి వచ్చింది. ఈ చట్టాన్ని ఉల్లఘించిన వారికి రెండులక్షల జరినామా, ఆరునెలల జైలు శిక్ష వుంటుంది. రక్త మార్పిడితో ప్రాణాంతక మైన వ్యాధులు వ్యాప్తిచెందకుండా ఈ మేరకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. అంతే కాకుండా రక్తదానాన్ని వృత్తిగా భావించే వారిని పూర్తిగా బ్యాన్‌ చేస్తున్నామని' ఏపి ఎయిడ్స్‌ నియంత్రణ ( బ్లడ్‌ సేఫ్టీ ) జాయింట్‌ డైరక్టర్‌ ఎం.ఎన్‌ కిషోర్‌ చెప్పారు.

శరీరం లో చాలినంత రక్తం లేకపోతే ఏం జరుగుతుందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు . శరీరం లొ 5 - 6 లీటర్ల రక్తం ఉంటుంది . అంటే శారీకక బరువులో ఇది 8 శాతము . ఒక కిలో శరీరము బరువుకు 80 ఎం.ఎల్ . చొప్పున్న ఉంటుందన్నమాట . శరీరం లోని అవయవాలు సక్రమం గా పనిచేయడానికి సరిపడ రక్తం అవసరము .

రక్తం లో ఏమి ఉంటాయి :
55 శాతము ప్లాస్మా ,
45 శాతము సెల్స్ .... ఉంటాయి .
ప్లాస్మాలో 91% నీరే , 8% ఆర్గానిక్ మాలిక్యూల్స్ , 1% ఇనర్గానిక్ మాలిక్యూల్స్ ఉంటాయి .
సెల్స లో ఎర్రరక్తకణాలు (RBC),తెల్లరక్తకణాలు(WBC) , ప్లేట్ లెట్స్(platlets) ఉంటాయి .
ఒక లీటరు రక్తం లో --- ఎర్ర రక్తకణాలు =5-6 మిలియన్లు -ఆక్షిజన్ సరఫరా కు తోడ్పడతాయి ,
--------------------తెల్లరక్త కణాలు =4-11 మిలియన్లు ,--శరీరం లొ ఇంఫెక్షన్ పై దాడి చేసి రక్షణ కల్పిస్తాయి .
-------------------ప్లేట్ లెట్స్ కణాలు=1.5 - 4 మిలియన్లు ఉంటాయి -- రక్తం గడ్డ కట్టడానికి సహకరిస్తాయి .

ఎర్రరక్త కణాలు తగ్గితే అనీమియా అంటారు . ఎర్ర కణాలు శరీరము లో ఆక్షిజన్ సరఫరాకు ఉపయోగ పడతాయి . ఐరన్ , ఫోలిక్ ఆసిడ్ , విటమిను బి12 , విటమిను సి , తగినంత పోటీన్లు లేకపోవడం వలన రక్తహీనత ఏర్పడుతుంది .

రక్తహీనత ఏర్పడినపుడు , యాక్షిడెంట్స్ వలన గాని , కొన్ని వ్యాధుల వలన గాని అధిక రక్తాన్ని కోల్పోతున్నపుడు , కొన్ని అత్యవసర ఆపరేషన్లు కు .. రక్తాన్ని ఎక్కించాలి . ప్రాణం కాపాడడానికి బ్లడ్ ట్రాన్స్ ఫూజన్ ఎంతో అవసరము . రక్త దాతల వలనే ఇది సాధ్యమవుతుంది . అవసరానికి సరిపడ రక్తం దొరకడం లేదు , రోజు రోజుకీ డిమాండ్ పెరుగు తూ ఉన్నది . కారణము రహదారి ప్రమాదాలు ఎక్కువడడమే .

అర్హతలు -- జాగ్రత్తలు :
  • రక్తదాతలు సంపూర్ణ ఆరోగ్యము కలిగిఉండాలి ,
  • 18 నుండి 60 యేళ్ళ చధ్య స్త్రీ ,పురుషులు ఎవరైనా రక్తదానము చేయవచ్చును ,
  • రక్తదాత 45 కేజీ ల బరువు పబడి ఉండాలి .
  • సాదారణ స్థాయిలొ బి.పి , సుగరు ఉండాలి ,
  • మూడు నెలల వ్యవధి లో యేడాదికి నాలుగు సార్లు రక్తదానము చేయవచ్చు ,
  • రక్తదానము చేయడానికి 12 గంటలు ముందు , తరువాత ఆల్కహాల్ తీసుకోకూడదు ,
  • స్త్రీలు రుతుక్రమము లోను , గర్భము దరించిన నుండి , బిడ్డకు పాలు ఇవ్వడం ఆపేంత వరకూ రక్తదానం చేయరాదు .

గ్లోబల్ థీం లొ అనేక దేశాలు సబ్యులు గా చేరాయి . బ్లడ్ డోనార్ డే ను సంయుక్తం గా 4 ప్రధాన ఏజెన్సీలు స్పాన్సర్ చేస్తున్నాయి . ఇవి " 1.వరల్డ్ హెల్త్ ఆర్గనైనేషన్(WHO), 2.ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్క్రాస్ , 3.రెడ్ క్రిసెంట్ సొసైటీలు , 4.ఇంటర్నేషనల్ బ్లడ్ డోనార్ ఆర్గనైజేషన్లు ,
ప్రతియేటా ఈ భాగస్వామ్య సంస్థలు గ్లోబల్ వరల్డ్ బ్లడ్ డొనార్ డె కు ఆతిధ్యమివ్వడానికి ఒక దేశాన్ని గుర్తిస్తాయి . జాతీయ ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థల్లో స్వచ్చంద , ఆర్ధికేతర దాత పాత్ర ప్రాముఖ్యాన్ని తెలియజెప్పే అంతర్జాతీయ మీడియా ప్రచారాన్నిక్కడ బాగా ఫొకస్ చేస్తారు . బ్లడ్ ట్రాన్స్ ఫూజన్ సర్వీసెస్ , బ్లడ్ డోనార్ ఆర్గనైజేషన్లు , ఇతర సంస్థలను బలోపేతం చేయడం ద్వారా స్వచ్చంద రక్తదాతల కార్యక్రమాలను జాతీయ స్థాయిలో విసృతపరచి స్థానికం గా ప్రచారం చేస్తారు .

గరయేడాది వరల్డ్ బ్లడ్ డోనార్ డే గ్లోబల్ ఈవెంట్ ను ఆస్ట్రేలియా లో ఆ దేశ ప్రభుత్వం ఆస్ట్రేలియన్ రెడ్క్రాస్ , ఆస్ట్రేలియన్ రెడ్ క్రాస్ బ్లడ్ సర్వీసెస్ సహకారం తో నిర్వహించ గా ,... ఈ యేడాది జూన్ 14 న " న్యూ బ్లడ్ ఫర్ ది వరల్డ్ " అన్న ధీము తో స్పెయిన్ లోని బార్సెలోనా లో ఈ ఉత్సవాలకు ఆతిద్యం ఇస్తున్నారు .

అపోహలు
* రక్తదానం చేస్తే ఇన్‌ఫెక్షన్లు వస్తాయని చాలామంది భయపడుతుంటారు. కానీ శుభ్రమైన (స్టెరైల్‌) పరికరాలు వాడితే ఇన్‌ఫెక్షన్లు దరిజేరవు.
* ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని మరికొందరి భావన. దీంతో ఎలాంటి అనారోగ్యమూ తలెత్తదు. రక్తదానం తర్వాత కొన్ని గంటలు విశ్రాంతి తీసుకుంటే చాలు.
* రక్తదానానికి ఎక్కువ సమయం పడుతుందని కొందరు వెనకంజ వేస్తుంటారు. ఒకసారి రక్తదానం చేయటానికి గంట కన్నా ఎక్కువ సమయం పట్టదు.
* రక్తదానం చేసిన తర్వాత హిమోగ్లోబిన్‌ పడిపోతుందనేది కొందరి అపోహ. ఒకసారి 400 మి.లీ. కంటే తక్కువే తీసుకుంటారు. మన శరీరం దీనిని చాలా త్వరగానే భర్తీ చేసుకుంటుంది.

  • ======================================================

Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .